మరోసారి భారత్‌ను గెలికిన ట్రంప్‌.. నువ్వు మారవే! | Donald Trump's India-Pakistan war threat on tariff trade statement | Sakshi
Sakshi News home page

మరోసారి భారత్‌ను గెలికిన ట్రంప్‌.. నువ్వు మారవే!

Oct 24 2026 4:35 PM | Updated on Oct 24 2026 4:57 PM

Donald Trump's India-Pakistan war threat on tariff trade statement

కుక్క తోక వంకర అన్న సామెత మనకు తెలిసిందే. దాని అర్థం ఎన్ని సార్లు చెప్పినా తన తీరు మార్చుకోరని.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విషయంలో ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. భారత్‌-పాక్‌ యుద్ధం విషయంలో ఆయన వ్యాఖ్యలను పలు మార్లు భారత్‌ ఖండించినప్పటికీ ఆయన తీరు మార్చుకోవడం లేదు. తాజాగా మరోసారి ఇండియా-పాక్‌ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ప్రగల్భాలు పలికారు.  

అమెరికాలో  వచ్చే నెలలో జరగబోయే మధ్యంతర ఎన్నికల ప్రచార ర్యాలీలో భాగంగా ట్రంప్ ప్రసంగించారు. తాను గతంలో చేసిన అంతర్జాతీయ దౌత్య విజయాలు, అధిక పన్నుల బాదుడుని అక్కడి ప్రజలకు గొప్పగా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ" రెండు అణ్వాయుధ దేశాలైన భారత్, పాకిస్తాన్ మధ్య గతంలో సైనిక ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. ఆ సమయంలో నేను రెండు దేశాల నేతలతో మాట్లాడి... 'ఫ్రెండ్స్, మీరు గనుక ఇలాగే కొట్టుకుంటూ ఉంటే, అమెరికాతో వ్యాపారం చేయడం మర్చిపోండి. మీ రెండు దేశాల ఉత్పత్తులపై నేను 250% భారీ టారిఫ్‌లు (సుంకాలు) విధిస్తాను. ఇకపై మీరు మాతో ఎలాంటి బిజినెస్ చేయలేరు. అని గట్టిగా హెచ్చరించాను" అని సభలో చెప్పుకొచ్చారు.

దీంతో అమెరికా మార్కెట్‌ను కోల్పోతామనే భయంతో, కోట్లాది డాలర్ల నష్టం వస్తుందనే ఆందోళనతో ఇరు దేశాల నేతలు తీవ్ర కోపానికి, ఆగ్రహానికి గురయ్యారని, కానీ చివరికి నా హెచ్చరికతో కాల్పులు ఆపేయడంతో యుద్ధం ముగిసిందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఘర్షణల సమయంలో ఇరు దేశాలకు చెందిన 11 సైనిక విమానాలు) కూలిపోయాయని ట్రంప్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అంతే కాకుండా తన హయాంలో కేవలం భారత్-పాక్ మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా సుమారు 8 యుద్ధాలకు దారి తీసే పరిస్థితులను కేవలం ఆర్థిక ఒత్తిడి (టారిఫ్‌ల శక్తి) ద్వారానే పరిష్కరించానని ట్రంప్ ఈ ర్యాలీలో గర్వంగా ప్రకటించారు.

తాను ఇంతటి దౌత్య విజయాలు సాధించినప్పటికీ, తనకు తగిన గుర్తింపు లభించలేదని ట్రంప్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. "నేను 8 యుద్ధాలను చక్కదిద్దాను. మరి నాకు నోబెల్ శాంతి బహుమతి వచ్చిందా? రాలేదు!" అని సభలో ప్రశ్నించారు. గతంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం తనతో మాట్లాడుతూ "మీరు 2.5 కోట్ల నుండి 3 కోట్ల మంది ప్రజల ప్రాణాలను కాపాడారు" అని కొనియాడినట్లు ట్రంప్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

ఇదీ చదవండి: గాల్లోనే కూలిన రెండు విమానాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement