గాల్లోనే ఢీకొన్న రెండు సైనిక విమానాలు.. నలుగురు మృతి | Two military aircraft collide in midair in the Philippines four pilots killed | Sakshi
Sakshi News home page

గాల్లోనే ఢీకొన్న రెండు సైనిక విమానాలు.. నలుగురు మృతి

Oct 24 2026 2:35 PM | Updated on Oct 24 2026 3:12 PM

Two military aircraft collide in midair in the Philippines four pilots killed

మనీలా: ఫిలిప్పీన్స్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. వైమానిక దళ శిక్షణ సమయంలో రెండు యుద్ధ విమానాలు దురదృష్టవశాత్తు ఒకదానికొకటి ఢీకొని గాల్లోనే కూలిపోయాయు. ఈ ఘటనలో అందులో ఉన్న నలుగురు ఫైలట్లు ప్రాణాలు కోల్పోయారు.మనీలాకు దక్షిణంగా ఉన్న ఫెర్నాండో వైమానిక స్థావరం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 
   
ప్రమాదానికి గురైన విమానాలు ఎస్‌ఎఫ్‌-260 రకానికి చెందిన సింగిల్ ప్రొపెల్లర్ శిక్షణ విమానాలుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం జరగడానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు ఫిలిప్పీన్స్ వైమానిక దళం ప్రతినిధి కల్నల్ అల్విన్ కాపింగుయాన్ తెలిపారు.ప్రమాదం నేపథ్యంలో ఎస్‌ఎఫ్‌-260 రకానికి చెందిన అన్ని విమానాల వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

కాగా ఫిలిప్పీన్స్‌లో సైనిక విమానాలు ప్రమాదాలకు గురవడం ఇదే తొలిసారి కాదు.ఈ ఏడాది మేలో ఉత్తర ఫిలిప్పీన్స్‌లోని బెంగ్వెట్ ప్రావిన్స్‌లో శిక్షణ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు సైనిక పైలట్లు మరణించారు.అంతకుముందు 2023లోనూ ఎస్‌ఎఫ్‌-260 రకానికి చెందిన విమానం ప్రమాదానికి గురై ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో ప్రమాదం జరగడంతో సైనిక విమానాల శిక్షణలో భద్రతా ప్రమాణాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చదవండి: ఫ్రాన్స్‌లో నిరసన సెగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement