రెయిన్‌ ఎఫెక్ట్‌: కూలిన వంతెన.. అటు వైపు వెళ్లొద్దు | Bridge Collapsed On Mulakalapalli Aswaraopeta Main Road | Sakshi
Sakshi News home page

రెయిన్‌ ఎఫెక్ట్‌: కూలిన వంతెన.. అటు వైపు వెళ్లొద్దు

Sep 24 2026 3:08 PM | Updated on Sep 24 2026 3:34 PM

Bridge Collapsed On Mulakalapalli Aswaraopeta Main Road

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ములకలపల్లి-అశ్వారావుపేట ప్రధాన రహదారిపై వంతెన కూలిపోయింది. భారీ వర్షాలు కారణంగా రాజుపేట పెట్రోల్ బంక్ సమీపంలో వంతెన ధ్వంసమైంది. వంతెన కూలిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వంతెనను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పరిశీలించారు.

42 ఏళ్ల క్రితం ఈ వంతెనను నిర్మించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. 5 కోట్ల వ్యయంతో నూతన వంతెన నిర్మాణం చేపడతామని.. ఐదు నెలల్లో కొత్త వంతెన పూర్తి చేసేలా కృషి చేస్తామని తెలిపారు. భారీ వాహనాలు ములకలపల్లి వైపు రావొద్దని ఆయన సూచించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాద ప్రాంతంలో బారిగేట్లు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

అశ్వారావుపేట నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలకు జలమయమయ్యాయి. నారాయణపురం గ్రామంలో ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దమ్మపేట మండలంలోని గురవాయిగూడెం గ్రామంలో టోర్నడోను తలపించిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం దాటికి భారీ వృక్షాలు నేలకొరిగాయి. జీడి మామిడి తోటలు, మామిడి తోటలు, పామాయిల్ చెట్లు వేళ్ళతో సహా నేలకొరకడంతో రైతాంగానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.

ఇదీ చదవండి: విషాదం.. పాపం ఎనిమిదేళ్ల బాలుడు

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement