విషాదం.. పాపం ఎనిమిదేళ్ల బాలుడు | Boy Dies After Falling Into Water Sump In Nagarkurnool | Sakshi
Sakshi News home page

విషాదం.. పాపం ఎనిమిదేళ్ల బాలుడు

Sep 24 2026 2:38 PM | Updated on Sep 24 2026 2:55 PM

Boy Dies After Falling Into Water Sump In Nagarkurnool

సాక్షి, నాగర్‌ కర్నూల్ జిల్లా: వెల్దండ మండలం కొట్రలో విషాదం చోటుచేసుకుంది. నీటి సంపులో పడి బీహార్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు ఆర్యన్ మృతి చెందాడు. రెండు రోజులుగా బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆవుల షెడ్డులో పనిచేస్తూ తల్లిదండ్రులు జీవనం సాగిస్తున్నారు. పాఠశాలలో మొదటి తరగతి చదువుతున్న ఆర్యన్.. ఇంటికి వస్తున్న క్రమంలో నీటి సంపులో పడి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరో ఘటనలో..
నీటి సంపులో పడిన మేకను రక్షించేందుకు వెళ్లిన బాలుడు మృతి చెందిన సంఘటన కొండారెడ్డిపల్లి గ్రామ శివారులో జరిగింది. మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన హనుమంతు మండల పరిధిలోని కొండారెడ్డిపల్లిలో రైతు కృష్ణారెడ్డి వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని కుటుంబంతో కలిసి అక్కడే నివసిస్తున్నారు.

మహబూబ్‌గనర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం కొర్రవంపు తండాకు చెందిన కాట్రావత్‌ దేవి తన కుమారుడు హనుమంతు (13)ను సమీప బంధువైన హనుమంతు వద్దకు పంపించింది. మంగళవారం బాలుడు మేకలను మేపేందుకు వదిలాడు. మేత మేస్తూ ఓ మేక నీటిసంపులో పడిపోగా బాలుడు దానిని బయటికి తీసేందుకు సంపులోకి దిగి అందులో పడిపోయాడు. గమనించిన బంధువులు బాలుడిని నీటిసంపు నుంచి బయటికి తీసి చికిత్స నిమిత్తం షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు.

ఇదీ చదవండి: మాదాపూర్‌ ఓయో.. నిఖిత మృతి కేసులో బిగ్‌ ట్విస్ట్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement