breaking news
veldanda
-
విషాదం.. పాపం ఎనిమిదేళ్ల బాలుడు
సాక్షి, నాగర్ కర్నూల్ జిల్లా: వెల్దండ మండలం కొట్రలో విషాదం చోటుచేసుకుంది. నీటి సంపులో పడి బీహార్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు ఆర్యన్ మృతి చెందాడు. రెండు రోజులుగా బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆవుల షెడ్డులో పనిచేస్తూ తల్లిదండ్రులు జీవనం సాగిస్తున్నారు. పాఠశాలలో మొదటి తరగతి చదువుతున్న ఆర్యన్.. ఇంటికి వస్తున్న క్రమంలో నీటి సంపులో పడి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.మరో ఘటనలో..నీటి సంపులో పడిన మేకను రక్షించేందుకు వెళ్లిన బాలుడు మృతి చెందిన సంఘటన కొండారెడ్డిపల్లి గ్రామ శివారులో జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన హనుమంతు మండల పరిధిలోని కొండారెడ్డిపల్లిలో రైతు కృష్ణారెడ్డి వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని కుటుంబంతో కలిసి అక్కడే నివసిస్తున్నారు.మహబూబ్‌గనర్ జిల్లా భూత్పూర్ మండలం కొర్రవంపు తండాకు చెందిన కాట్రావత్ దేవి తన కుమారుడు హనుమంతు (13)ను సమీప బంధువైన హనుమంతు వద్దకు పంపించింది. మంగళవారం బాలుడు మేకలను మేపేందుకు వదిలాడు. మేత మేస్తూ ఓ మేక నీటిసంపులో పడిపోగా బాలుడు దానిని బయటికి తీసేందుకు సంపులోకి దిగి అందులో పడిపోయాడు. గమనించిన బంధువులు బాలుడిని నీటిసంపు నుంచి బయటికి తీసి చికిత్స నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు.ఇదీ చదవండి: మాదాపూర్ ఓయో.. నిఖిత మృతి కేసులో బిగ్ ట్విస్ట్ -
కేసీఆర్, చంద్రబాబు, మోదీకి చేరేదాకా షేర్ చేయండి!
సాక్షి, వెల్దండ (కల్వకుర్తి) : నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఎస్ఐ తనను కొట్టాడన్న అవమానభారంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్‌కు ముందు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ.. పోలీసుల తీరును ప్రశ్నిస్తూ తీసుకున్న సెల్ఫీ వీడియో కలకలం రేపింది. 'భార్య వాళ్ల గ్రామస్తులు కొట్టారు. ఆపై బట్టలిప్పి చచ్చేలా పోలీసులు నన్ను కొట్టారు. నా మృతికి ఎస్ఐ సైదాబాబు కారణం. కేసీఆర్, చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీకి చేరేంత వరకూ ఈ వీడియోను షేర్ చేయాలంటూ' బాధితుడు రాజు తీసుకున్న సెల్ఫీ వీడియోను పలువురు నెటిజన్లు షేర్ చేస్తున్నారు. దీంతో విషయం వెలుగుచూసింది. అసలేమైందంటే.. వెల్దండ మండల పరిధిలోని నారాయణపూర్ తాండకు చెందిన పాత్లవత్ రాజు (25)కు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గట్టిఇప్పలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కొరింతకుంట తండాకు చెందిన అంజలితో రాజుకు ఐదేళ్ల కిందట వివాహమైంది. వీరికి గతంలో ఓ కుమారుడు ఉండగా, వారం కిందట అంజలి ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది. అప్పటినుంచీ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 12న తలకొండపల్లి పోలీస్‌స్టేషన్‌లో అంజలి కుటుంబసభ్యులు ఫిర్యాదుచేయగా.. భర్త రాజును పిలిపించిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అయితే కౌన్సెలింగ్ పేరుతో పోలీసులు వేధించడంతో మనస్తాపానికి లోనైన రాజు తన తండాకు వచ్చి పురుగుల మందు తాగాడు. చుట్టుపక్కలవాళ్లు రాజు పరిస్థితిని గమనించి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకొచ్చారు. చికిత్స పొందుతూనే రాజు సోమవారం మృతిచెందగా.. ఎస్ఐ కొట్టడంతో అవమానభారంతో రాజు బలవన్మరణం చెందాడని తండా వాసులు చెబుతున్నారు. చేయి చేసుకోలేదు: ఎస్ఐ రాజు మద్యం మత్తులో భార్య అంజలిపైనే కాకుండా కుటుంబసభ్యులు, తండావాసులతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో తండావాసులే రాజుపై చేయి చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆరోజు రాత్రి ఇంటికివెళ్లి మరునాడు ఉదయం భార్యాభర్తలు స్టేషన్‌కు రాగా, పెద్దల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి పంపించాం. అంతేతప్ప నేను కానీ, పోలీస్ స్టేషన్‌లోని సిబ్బంది కానీ రాజుపై చేయి చేసుకోలేదని ఎస్ఐ సైదాబాబు తెలిపారు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో -
కల్వకుర్తి నియోజకవర్గంలో రీ పోలింగ్
-
కల్వకుర్తి నియోజకవర్గంలో రీ పోలింగ్
కల్వకుర్తి : మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండలం జూపల్లిలో సోమవారం రీపోలింగ్ ప్రారంభమైంది. 119వ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ సాయంత్రం ఆరు గంటలకు కొనసాగనుంది. మరోవైపు రీ పోలింగ్ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు. కాగా ఈ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో రీపోలింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.


