దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో బిగ్‌ షాక్‌ | Supreme Court Key Comments On Danam Nagender Petition | Sakshi
Sakshi News home page

దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో బిగ్‌ షాక్‌

Sep 24 2026 12:07 PM | Updated on Sep 24 2026 2:21 PM

Supreme Court Key Comments On Danam Nagender Petition

సాక్షి, ఢిల్లీ: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో బిగ్‌ షాక్‌ తగిలింది. దానం నాగేందర్‌ను తెలంగాణ హైకోర్టు ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ క్రమంలో ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని దానంకు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. దీంతో, ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక జరగనుంది. 

కాగా, అనర్హత వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దానం నాగేందర్‌.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం.. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ.. అనర్హత పడింది.. మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సూచనలు చేసింది. ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉండి.. మరో పార్టీ నుంచి ఎన్నికలకు పోటీ చేయడమంటే తన సభ్యత్వాన్ని వదులుకోవడమేనని వ్యాఖ్యానించింది. ఇక, సుప్రీంకోర్టు తీర్పుతో త్వరలో ఖైరతాబాద్‌కు ఉప ఎన్నికలు జరగనున్నాయి.

బీఆర్‌ఎస్‌ టికెట్‌పై 2023లో ఖైరతాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్‌.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హతకు గురయ్యారు. తెలంగాణ హైకోర్టు ఆయన అనర్హతను 2024 ఏప్రిల్‌ 23 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంటూ ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానాన్ని ఖాళీగా ప్రకటించింది.

హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని దానం నాగేందర్‌ సుప్రీంకోర్టును కోరారు. కాంగ్రెస్‌ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినంత మాత్రాన తాను బీఆర్‌ఎస్‌ను వీడినట్లు కాదని, తాను బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయలేదని ఆయన తరఫు వాదనలు ఉన్నాయి. పార్టీ ఆదేశాల మేరకే తాను వ్యవహరించానని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: భూములపై రేవంత్‌ సర్కార్‌ బిగ్‌ యాక్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement