బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో విశాఖపట్నంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
కుండపోత వర్షాల కారణంగా విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనజీవనం స్తంభించింది.
ఈదురుగాలుల బీభత్సానికి పలు ప్రాంతాల్లో భారీ చెట్లు నేలకూలాయి.
రోడ్లపై చెట్లు, విద్యుత్ తీగలు పడిపోవడంతో పలుచోట్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.
లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు.


