ఆంధ్రప్రదేశ్ : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్రను అతలాకుతలం చేస్తోంది.
గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతూ బుధవారం సాయంత్రానికి కళింగపట్నానికి 30 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 90 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 160 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది.
బుధవారం అర్ధరాత్రి విశాఖపట్నం–గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నం సమీపంలో తీరాన్ని దాటింది.
ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో ఎడతెగని వర్షాలు పడుతున్నాయి.


