breaking news
Srikakulam
-
గంజాయి బ్యాచ్ భీభత్సం ఏకంగా కానిస్టేబుల్ ను ఏం చేశారు అంటే..?
-
ఎమ్మెల్యే గోవిందరావు కుమారుడి వ్యవహారంలో సంచలన విషయాలు
శ్రీకాకుళం: ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుమారుడు సాయి గణేశ్ కారు ప్రమాదం వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏడాది క్రితం ర్యాష్‌గా కారు నడుపుతూ ఆటోను ఢీకొట్టారు సాయి గణేశ్. ఈ ప్రమాదంలో చేపల భోగయ్య అనే వ్యక్తి మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో సాయి గణేశ్‌ను తప్పించి మరో వ్యక్తిని డ్రైవర్‌గా చూపించారు ఎమ్మెల్యే గోవిందరావు. మృతి చెందిన బాధితుడి కుటుంబానికి రూ.5 లక్షలు, ఉద్యోగం, పెన్షన్ ఇస్తానని చెప్పారు. ఏడాది గడిచినా బాధితులకు గోవిందరావు సాయం చేయలేదు. తనకు చెప్ప లాయర్లు తెలుసంటూ బాధితులను బెదిరించారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. బాధితులతో చర్చల సమయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బెదిరింపు వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. -
అర్ధరాత్రి వరకూ పోలీసుల అదుపులో ఇద్దరు వైఎస్సార్సీపీ నేతలు
శ్రీకాకుళం: ఆమదాలవలసలో అర్ధరాత్రి పోలీసుల చర్యలు కలకలం రేపాయి. వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌పై నమోదైన కేసులో భాగంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎఫ్ఐఆర్లో పేర్లు లేని వారిని కూడా విచారణ పేరుతో స్టేషన్‌కు పిలిపిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.చింతాడ రవికుమార్ తమ్ముడు చింతాడ కృష్ణ, బొడ్డేపల్లి రమేష్ కుమార్‌లను సాయంత్రం 5 గంటలకు విచారణకు పిలిచిన పోలీసులు, ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. రాత్రి 12 గంటలు కావస్తున్నా ఇద్దరినీ పోలీసులు విడిచిపెట్టలేదని, పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో పోలీస్ స్టేషన్లోకి స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాలు చేరుకున్నాయి.కృష్ణ, రమేష్ కుమార్‌లను వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు సమాచారం. వారిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే విషయంపై పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి సమయంలో వైఎస్సార్సీపీ నాయకులు పోలీస్ స్టేషన్ల వద్దకు చేరుకుంటున్నారు. -
మరో కుట్ర సాధింపు.. ఆవేదన వ్యక్తం చేస్తున్న సంజయ్ తల్లి
-
బీసీ నేతలపై ఆగని అక్రమ కేసులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం పర్యటన విజయవంతం కావడంతో తట్టుకోలేని చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెగబడుతోంది. వైఎస్సార్సీపీ నాయకులపై నిత్యం కేసులు బనాయిస్తోంది. పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకుని క్షుద్ర రాజకీయాలు చేస్తోంది. దీనివెనుక పోలీసులే ఫిర్యాదుదారులు కావడం, వారే చర్యలు తీసుకోవడం గమనార్హం. దీనికంతటికీ టీడీపీ పెద్దలే స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అందిస్తున్నారు. వారిచ్చే జాబితాల మేరకు పోలీసు అధికారులు కేసులు నమోదు చేస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. తొలుత చింతాడ రవికుమార్ తదితరులపై కేసులు నమోదు చేయగా, మొన్న గొర్లె కిరణ్‌కుమార్ తదితరులపై కేసులు నమోదు చేశారు. తాజాగా ధర్మాన కృష్ణదాస్, టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ తదితరులపై అక్రమ కేసులు పెట్టారు. రోడ్డు ప్రమాదాన్ని హత్యా నేరంగా చూపిస్తూ పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జూలై 30న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం వచ్చారు. దీంతో అభిమాన నేతను చూసేందుకు దారి పొడవునా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పోటెత్తారు. ఆ రోజు వచ్చిన జనప్రభంజనాన్ని చూసి తట్టుకోలేని చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెరతీసింది. పోలీసులను వాడుకుని వరుస కేసులు పెడుతోంది. తొలుత ఆమదాలవలస పోలీసు స్టేషన్ పరిధిలో చింతాడ రవికుమార్‌తో పాటు మరో 20 మందిపై అక్రమ కేసు బనాయించింది. ఆ తర్వాత జేఆర్‌పురం పోలీసు స్టేషన్ పరిధిలో ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌తో పాటు మరో 22మందిపై అక్రమ కేసులు నమోదు చేశారు. తాజాగా శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరి«ధిలో ధర్మాన కృష్ణదాస్, పేరాడ తిలక్ తదితరులపై అక్రమ కేసులు బనాయించారు. జూలై 30న జరిగిన ఘటన అని చెప్పి ఆగస్టు రెండో తేదీన శ్రీకాకుళం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వి.రామారావు ఫిర్యాదు చేసిన మేరకు వైఎస్సార్సీపీ నేతలుధర్మాన కృష్ణదాస్, పేరాడ తిలక్, గేదెల పురుషోత్తం, రౌతు శంకరరావు, అంబటి శ్రీనివాస్, గొండు రఘురాం, సాయి, తదితరులపై కేసులు నమోదు చేశారు. -
ఆ ఏముందిలే జగనే కదా అనుకున్నారు.. జగన్ పర్యటన సక్సెస్ పై ధర్మాన..
-
శ్రీకాకుళం టు సికింద్రాబాద్
శంషాబాద్: శ్రీకాకుళం నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి గ్రీన్ చానల్ ద్వారా ఊపిరితిత్తులను రవాణా చేశారు. ఆదివారం మధ్యాహ్న శ్రీకాకుళం నుంచి రోడ్డు మార్గం ద్వారా విశాఖపట్నం జెమ్స్ ఆస్పత్రికి చేరిన ఊపిరితిత్తులను అక్కడి నుంచి విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ఇండిగో 6ఈ– 783 విమానంలో.. అక్కడి నుంచి 4.12 గంటలకు బయలుదేరి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 5.11 గంటలకు చేరుకున్నాయి. సీఐఎస్ఎఫ్ అధికారులు, ఆర్జీఐఏ ట్రాఫిక్ పోలీసుల సహకారంతో ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లో వెంటనే తీసుకెళ్లి ఆర్గాన్స్‌ను ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తూ 30 నిమిషాల్లో సికింద్రాబాద్ కిమ్స్‌కు చేర్చారు. -
మహిళా SI వ్యవహారంపై చింతాడ రవికుమార్ క్లారిటీ
-
గిరిజన విద్యార్థిని బలవన్మరణం
శ్రీకాకుళం: స్థానిక కేజీబీవీ టైప్–4 వసతి గృహంలో గురువారం రాత్రి సవర పూజ (16) అనే ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం దేవనాపురం గిరిజన పంచాయతీ పరిధి లక్కయ్యగూడ గిరిజన గ్రామానికి చెందిన సవర బిడ్డికయ్య, తుప్పమ్మ దంపతుల మూడో కుమార్తె అయిన పూజ కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కాలేజి లో మొదటి సంవత్సరం బైపీసీ చదువుతోంది. ఈ నెల 16నే హాస్టల్లో చేరింది. శుక్రవారం వేకువజామున స్టడీ అవర్స్ కోసం విద్యార్థులను నైట్ టీచర్ నిద్ర లేపుతుండగా పక్క గదిలో పూజ ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే ఆమె మెట్రిన్ క్రాంతికి, హెచ్ఎం ఎ.గోవిందరావు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. విద్యారి్థని తల్లిదండ్రులతో పాటు పోలీసులకు విషయం తెలియడంతో ఎస్ఐ కె.వెంకటేష్ సంఘటన స్థలం వద్దకు చేరుకున్నారు. వివరాలు సేకరించి తండ్రి బిడ్డికయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఈ నెల 28న బిడ్డికయ్య హాస్టల్‌కు వచ్చి విద్యార్థినికి ఖర్చుల కోసం రూ.900 ఇచ్చారు. ఆ సందర్భంలో పూజ తనకు ఇంగ్లిష్ చదువులు అర్థం కావడం లేదని, హాస్టల్ నచ్చడం లేదని చెప్పింది. కానీ తండ్రి ఆమెకు నచ్చజెప్పి వచ్చేశారు. ఇప్పు డు విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో తమ బిడ్డ అంత పిరికిది కాదని కుటుంబ సభ్యు లు అంటున్నారు. మృతిపై సమగ్ర విచారణ జరిపించాల ని కోరుతున్నారు. గురువారం రాత్రి 9.30, అర్ధరాత్రి 12 గంటలు వరకు ఇద్దరు విద్యార్థినుల బర్త్‌డే జరుపుకున్నారని, పూజ అంతవరకు ఉందని అక్క డి వారు చెప్పారు. పూజ విజయనగరం జిల్లా రాజాంలో ఇదివరకు చదివింది. అక్కడ నీరు వల్ల దురదలు రావడంతో తండ్రి కొత్తూరులో జాయిన్ చేశారు. అయితే సంఘటన స్థలం వద్ద ఓ లేఖ దొరి కినట్లు సమాచారం. కలెక్టర్ ఆదేశాల మేరకు దహ న ఖర్చులను అలాగే హెచ్ఎం గోవిందరావు మరో రూ.ఐదు వేలును అందజేశారు. హాస్టల్ ఖాళీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో హాస్టల్లో ఉన్న విద్యార్థులంతా భయపడ్డారు. దాదాపు 90 మంది ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో హాస్టల్ ఖాళీ అయిపోయింది. టెక్కలి డిప్యూటీ డీఈఓ పి. విలయమ్, సర్వ శిక్ష అభియాన్‌కు చెందిన జీసీడీపీఓలు సందర్శించి విద్యార్థి మృతి పై వివరాలు తెలుసుకున్నారు. తల్లిదండ్రుల అనుమతితోనే విద్యార్థులను పంపించామని హెచ్ఎం తెలిపారు. -
KSR Full Show : బాబు-లోకేష్‌కు జగన్ భయమా..?
-
అడుగు బయటపెడితే చాలు.. నన్ను ఆపడం మీ తరం కాదు..
-
BIG Question: ఉప్పొంగిన ఉత్తరాంధ్ర.. జనసంద్రం పోటెత్తితే ఎలా ఉంటుందో తెలుసా?
-
పాతపట్నం MLA కారు యాక్సిడెంట్ కేసులో మీరు ఏం చేశారు..
-
YS జగన్ శ్రీకాకుళం టూర్ పై పబ్లిక్ రియాక్షన్
-
వెళ్తూ.. వెళ్తూ.. చంద్రబాబుకు జగన్ మాస్ వార్నింగ్
-
సీదిరి అప్పలరాజుని నాశనం చేయడం కోసం... జగన్ సంచలన కామెంట్స్
-
సీదిరి అక్రమ అరెస్ట్ పై YS జగన్ రియాక్షన్
-
జగన్ కీలక ప్రెస్ మీట్ @శ్రీకాకుళం
-
అంపోలు జైలు వద్ద YS జగన్ ప్రెస్ మీట్
-
జగన్ అభిమానులపై పోలీసులు లాఠీ ఛార్జ్
-
కూటమికి దిమ్మ తిరిగేలా.. జగన్ కు జన నీరాజనం
-
ఎమ్మెల్సీ వరుదు కల్యాణిని అడ్డుకున్న పోలీసులు
శ్రీకాకుళం: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన వేళ పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు. అంపోలు జంక్షన్ దగ్గర పోలీసులు అతి చేశారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణిని పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్ జగన్‌ను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతోంది. కాగా, వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి శ్రీకాకుళం చేరుకున్నారు. సీదిరి అప్పలరాజును ఆయన పరామర్శించనున్నారు. సీదిరి అప్పలరాజుపై చంద్రబాబు నాయుడు అక్రమ కేసు పెట్టించి అరెస్ట్ చేయించిన విషయం తెలిసిందే. రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును వైఎస్ జగన్ పరామర్శిస్తారు. వైఎస్ జగన్ పర్యటన వేళ కూటమి కుట్రలు పన్నుతోంది. వైఎస్ జగన్ పర్యటనపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టి, జనం వస్తే కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగింది. ప్రజలు రాకుండా పోలీసులను రంగంలోకి దించింది. జగన్ కాన్వాయ్‌కు కఠిన నిబంధనలు విధించింది. కేవలం 8 వాహనాలకే అనుమతి అంటూ పోలీసులు ప్రకటించారు. ములాఖత్‌కు మాత్రమే అనుమతి ఉందంటూ, ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసులు చెప్పారు. వైఎస్ జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణ చూసి కూటమి ప్రభుత్వం భయపడుతోంది. పోలీసు ఆంక్షలు తమను ఆపలేవంటూ వైఎస్ జగన్ కోసం జనం వచ్చారు. -
YS Jagan LIVE: జనసంద్రంగా ఉత్తరాంధ్ర...
-
Varudu Kalyani: జగన్ అంటే ఎందుకంత భయం ఇది శాంపిల్ మాత్రమే..
-
వైఎస్ జగన్ రాకకు శ్రీకాకుళం సిద్ధం.. కాసేపట్లో ఎంట్రీ!
-
వైఎస్ జగన్ రాకతో ఉత్తరాంధ్ర జనసంద్రం (ఫొటోలు)
-
YS Jagan Storm LIVE : దద్దరిల్లిన ఉత్తరాంధ్ర
-
శ్రీకాకుళంలో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
-
ఎన్ని ఆంక్షలు పెట్టినా జగన్‌ను ఆపలేరు.. నాగ మల్లీశ్వరి సంచలన వ్యాఖ్యలు!
-
YS Jagan LIVE: జగన్‌కు అడుగడుగునా జననీరాజనం..
-
కూటమికి దిమ్మతిరిగిపోయేలా.. ఉత్తరాంధ్రలో జనసంద్రం
సాక్షి, విశాఖపట్నం: జగన్ పర్యటనలో జనం లేరు అని చూపించడానికి చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రయత్నం మరోసారి ఘోరంగా విఫలమైంది. గురువారం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటనకు భారీ స్పందన లభించింది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు రోడ్డు మార్గంలో సాగిన జగన్ ప్రయాణంలో దారి పొడవునా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.జగన్ కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో అభిమానులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున చేరుకుని ఘన స్వాగతం పలికారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఇది మొదలైంది. పలుచోట్ల కాన్వాయ్ ఆగడంతో జగన్ వాహనం దిగి ప్రజలకు అభివాదం చేశారు. ఆప్యాయంగా వాళ్లను పలకరించి.. సమస్యలను విన్నారు. ఈ క్రమంలో ఆయన వాహనం నెమ్మదిగా ముందుకు కదలింది. జగన్ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నించింది. ఈ క్రమంలోనే పోలీసు వ్యవస్థను ప్రయోగించింది. గత రెండేళ్లలో ఏనాడూ లేని రీతిలో.. లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతాయంటూ పోలీసులు అటువైపు రావొద్దని జనాలను హెచ్చరించారు. కేవలం 8 వాహనాల కాన్వాయ్‌తో.. సీదిరి అప్పలరాజుతో ములాఖత్‌కు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ఉల్లంఘిస్తే కేసులు పెడతామని బెదరించారు. అయినప్పటికీ జనం తగ్గలేదు.ఈ క్రమంలో గురువారం ఉదయం అటు వైపు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు పెట్టి కాపలా కాశారు. కానీ, జనం మాత్రం ‘జగన్ వెంటే మేం’ అని కదిలారు. ఆంక్షలను దాటుకుని జగన్ దగ్గరకు చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో మొదలైన జన వాహిని.. శ్రీకాకుళం దారి పొడవునా కనిపించింది. మహిళలు, యువత, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని జగన్‌కు స్వాగతం పలికారు. ప్రజలకు అభివాదం చేస్తూ జగన్ తన పర్యటనను కొనసాగించారు. భారీగా తరలివచ్చిన జనసందోహంతో ‘కూటమి సర్కార్ మైండ్ బ్లాక్’ అయ్యిందనే కామెంట్లు ఇటు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు రహదారుల వెంట కనిపించిన ప్రజల తాకిడి.. జగన్‌పై ఉన్న అభిమానానికి నిదర్శనంగా కనిపించింది. కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. జగన్‌కి ఉన్న ప్రజాదరణను అడ్డుకోలేరని మరోసారి రుజువు చేసింది. -
మేం మీలా కాదు.. అంగళ్లు ఘటన మరిచిపోయారా?: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జగన్ ప్రజల్లోకి వెళ్లకుండా చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆంక్షలు విధిస్తోందని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. పోలీసులు ఏర్పాటు చేస్తున్న నిబంధనలు భద్రతా చర్యల పేరుతో రాజకీయ నిర్బంధంగా మారుతున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.జగన్ శ్రీకాకుళం పర్యటనకు సంబంధించి కాన్వాయ్‌ను పరిమితం చేయడం, రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేయడం, నాయకులు, కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించడం.. రాజకీయ నిర్బంధం కిందకే వస్తుందని, అది ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకోవడమేనని వైఎస్సార్సీపీ అంటోంది. "జగన్ ప్రజల్లోకి వెళ్తే వాస్తవాలు బయటపడతాయనే భయంతోనే ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది" అని పార్టీ నేతలు చెబుతున్నారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా వైఎస్ జగన్‌పై ఉన్న అభిమానాన్ని అడ్డుకోలేరన్నారు. జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారని, ఆ జనాదరణ చూసే ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. ఇటు.. సీదిరి అప్పలరాజు వ్యవహారంలో కూడా ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ అంటోంది. అలాగే ఒక ప్రజా ప్రతినిధితో ములాఖత్ కోసం వెళ్లే కార్యక్రమాన్ని కూడా రాజకీయ అంశంగా మార్చి ఆంక్షలు విధించడం సరికాదని పేర్కొంది. గత రెండేళ్లుగా వైఎస్సార్సీపీ నిర్వహించిన కార్యక్రమాలు ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరిగాయని, ఎక్కడా హింసాత్మక ఘటనలకు తమ పార్టీ కారణం కాలేదని నేతలు స్పష్టం చేశారు.అదే సమయంలో అధికార పార్టీ అధినేత చంద్రబాబు పర్యటన సమయంలో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ వైఎస్సార్సీపీ విమర్శలు గుప్పించింది. అంగళ్లు తరహా ఘటనల్లో పోలీసులపై దాడులు, వాహనాల ధ్వంసం వంటి ఘటనలు జరిగాయని గుర్తు చేసింది. తమ కార్యక్రమాలపై మాత్రమే ఆంక్షలు విధించడం వివక్షపూరిత వైఖరి అని ఆరోపించింది. "ప్రభుత్వానికి సహకరిస్తున్నప్పటికీ.. అధికార యంత్రాంగం అనవసర ఆంక్షలతో వ్యవహరిస్తోంది. ప్రజల మధ్యకు వెళ్లే హక్కును ఎవరూ అడ్డుకోలేరు" అని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు.చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండగా.. అంగళ్లు, పుంగనూరు ఘటనల్లో రాజకీయ ఘర్షణలు చోటుచేసుకుని రాళ్ల దాడులు జరిగాయి. టీడీపీ శ్రేణులు జరిపిన దాడుల్లో.. పలువురు పోలీసులు గాయపడగా, ఏఆర్ కానిస్టేబుల్ రణధీర్ ఒక కన్ను చూపు శాశ్వతంగా కోల్పోయారు. ఈ వ్యవహారంలో చంద్రబాబుపై అప్పట్లో కేసు కూడా నమోదు అయ్యింది. -
రోడ్డెక్కిన పోలీసులు.. జగన్ శ్రీకాకుళం పర్యటనపై ఆంక్షలు...
-
వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటన ప్రత్యక్షప్రసారం
-
చంద్రబాబూ.. మీ పార్టీ నేతలపై ఇలాంటి కేసులు ఎప్పుడైనా పెట్టారా?
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ వెళ్లనున్నారు. పోలీసుల ఆంక్షలు, రాజకీయ వేడెక్కిన నేపథ్యంలో ఈ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. తాజా పరిణామాలు ఎప్పటికప్పుడు ఇక్కడే.. -
YS జగన్ శ్రీకాకుళం పర్యటనను అడ్డుకునేందుకు కూటమి కుట్రలు
-
పోలీసుల ఆత్మస్థైర్యం సరే.. ప్రజల నమ్మకం మాటేంటి?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పోలీసుల ఆత్మస్థైర్యంపై తరచూ మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి.. అదే పోలీసుల్లో కొందరిపై ఆరోపణలు వస్తుండటంపై సమాధానం చెప్పకపోవడం విమర్శలకు తావిస్తోంది. నిందితులే వీడియో సందేశాలు విడుదల చేస్తుండటం.. ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చిన వారిపై స్టేషన్లో ప్రత్యర్థులు దాడులు చేస్తుండటం.. ఒక పత్రికా కార్యాలయంపై టీడీపీ నాయకులు దాడి చేసినా అరెస్టు చేయకపోవడం.. అధికార పార్టీకి అనుకూలంగా మారి శాంతిభద్రతలను గాలికి వదిలేయడం.. రోడ్డు ప్రమాద కేసుల్లో బాధితులు నోరు విప్పినా చర్యలు తీసుకోకపోవడం.. ఇలాంటి ఆరోపణలను పరిశీలిస్తే జిల్లాలో శాంతిభద్రతలే ప్రశ్నార్థకంగా మారాయన్నది ప్రజల మాట. అంతర్రాష్ట్ర గ్యాంగులు పెచ్చుమీరిపోతున్నా.. రోజురోజుకీ నేరాలు పెరిగిపోతున్నా పట్టించుకోకుండా.. పత్రికల్లో మీకు నచ్చని కథనాలు వస్తే మీడియాపై బెదిరింపులు దిగడం.. ఆధారాలుంటే చూపించండి లేదంటే కేసులు పెడతామనడం ఎంతవరకు సమంజసమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రశ్నలకు బదులేదీ? 2024 డిసెంబర్ 21న కొరసవాడ వద్ద పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తనయుడు సాయి గణేష్ కారు ఆటోను ఢీకొట్టడంతో, దాంట్లో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో భామిని మండలం లివిరి గ్రామానికి చెందిన చెప్పల బోగయ్య అనే వ్యక్తి పరిస్థితి విషమంగా మారి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇదే ఘటనలో ఈయన కోడలు చెప్పల సంతోష్ సవలాపురం నరేష్, గణేష్ ఆటో డ్రైవర్ కూర్మాన సునీల్‌కు గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి గల కారకులెవరో అందరికీ తెలిసిందే. ఆస్పత్రిలో దగ్గరుండి బాధితులు బయటకు రాకుండా జాగ్రత్త పడిందెవరో? ఇటీవల పలాస నియోజకవర్గం మందస మండలం పితాతొళి వద్ద మందస టీడీపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు గార కృష్ణారావు ఆటో ఢీకొట్టిన ప్రమాదంలో మృతి చెందిన నర్తు వెంకటరమణ కుటుంబీకుల ఆవేదన విన్నారా? మృతుడు భార్య, తల్లి, సోదరుడు మీడియాకు చెప్పింది నమ్మరా? వాళ్ల వేదన పట్టదా? ప్రమాద కారకులెవరో మండలమంతా తెలుసు. కాశీబుగ్గ పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చిన వారిపై పోలీసుల ముందే టీడీపీ నాయకులు దాడి చేస్తే ఏం చేశారు? చూస్తూ ఊరుకోవడం తప్ప వారిపైనా చర్యలు తీసుకున్నారా? పాతపట్నం పోలీసు స్టేషన్ సమీపంలోనే పేకాట ఆడుతున్న బాగోతాలు బయటపడ్డాయి. పలువురి పట్టుబడ్డ సంగతి తెలిసిందే. అంత ధైర్యంగా పోలీసు స్టేషన్‌కు సమీపంలో పేకాట ఆడుతున్నారంటే వారి వెనకున్నదెవరు? సహకరిస్తున్నదెవరో ? తేల్చారా? ∙మెళియాపుట్టిలో గంజాయి గుట్టు విప్పినందుకు ఓ యువకుడ్ని ఓ ఎస్ఐ చితక బాదడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బాధితుడు ఊరు వదిలి వెళ్లిపోయాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ యువకుడు, సంబంధీకులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదన్న విమర్శలకు మీ సమాధానం ఏమిటి..? హత్యాయత్నం కేసులో నిందితుడైన సొంఠ్యాన హరి నుంచి లంచం తీసుకుని పోలీసులే తనను తప్పించారని కొత్తూరు పోలీసులపై ఎస్పీకి వీడియో సందేశం పంపిన విషయం తాజాగా మరింత సంచలనమైంది. దీనికంటే దారుణం ఇంకేమైనా ఉందా? అంత ధైర్యంగా నిందితుడు చెబుతున్నాడంటే అక్కడేం జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. తనతోనే వదిలేయలేదు. వేరే వ్యక్తి నుంచి కూడా ఐఫోన్లు, సొమ్ములు వసూలు చేసిన విషయాలు కూడా చెప్పుకొచ్చాడు. ఈ అంశంపై మీ స్పందన ఏమిటి..? ఎచ్చెర్లలోని సాక్షి ప్రధాన కార్యాలయంపై టీడీపీ యువజన విభాగం నాయకుడు మెండ దాసునాయుడు మరికొందరు దాడి చేసి, విధ్వంసం సృష్టించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోలీసులకు సమర్పించారు. ఆ ఘటనకు సంబంధించి ఏం కేసులు పెట్టారు? ఎవర్ని అరెస్టు చేశారో చెప్పగలరా? ఇలా చెప్పుకుంటూపోతే అనేకం ఉన్నాయి. ఘోరాలెన్నో జరుగుతున్నాయి. వాటిపై చర్యలు లేవు. సమాధానాలు లేదు. కానీ, పత్రికల్లో వచ్చిన కథనాలు తమకు నచ్చకపోతే ఆధారాలు చూపించండి..లేకపోతే కేసులు పెడతామంటున్నారు. పత్రికల్లో వచ్చిన కథనాలను లోతుగా పరిశీలించాలే తప్ప కేసులు పెడతామని బెదిరిస్తే.. ప్రజలకు న్యాయం జరిగేలా మీడియా అండగా ఉండగలదా? అన్నది తమరే చెప్పాలి. రెచ్చిపోతున్న దొంగలు.. శ్రీకాకుళం క్రైమ్: జిల్లాలో కక్షా రాజకీయ కేసుల్లో పోలీసులు బిజీ అయ్యారు. ప్రాపర్టీ, గ్రేవ్, పెండింగ్ కేసులను వదిలేసి సివిల్ కేసుల్లో వచ్చే కాసులు, దానికి రాజకీయ కోణం జోడించి కేసులు కట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఇదే మంచి తరుణమని భావించి అంతర్రాష్ట్ర గ్యాంగులు జిల్లాలో చొరబబడేందుకు యత్నంస్తుండటం జిల్లావాసులను కలవరపరుస్తోంది. లెక్కకు మించి నేరాలు చేసిన ఉత్తరప్రదేశ్ నేరస్థుడొకడు జిల్లాకేంద్రంలోని బలిజేపల్లివారి వీధిలో ఓ వ్యక్తి ఇంట్లో తలదాచుకున్నట్లుగా తెలుసుకున్న అక్కడి పోలీసులు ఇటీవలే ఇక్కడికి వచ్చారు. వారొచ్చేసరికే నేరస్థుడు పరారయ్యాడు. ఆశ్రయమిచ్చిన వ్యక్తిని విచారించి పోలీసులు వెనుదిరిగారు. కాశీబుగ్గ వెంకటేశ్వర జ్యూయలెర్స్ దోపిడీకి యూపీ, ఒడిశా గ్యాంగులతో స్కెచ్ గీసిన వ్యక్తి కొన్నేళ్లపాటు బంగారం వ్యాపారం పేరిట తిష్ట వేశాడు. ఈయనది ఒడిశా. అక్కడి క్రైమ్ రికార్డుల్లోని పాత నిందితుడనేది చోరీ ఛేదించేవరకు పోలీసులకు తెలియకపోవడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటికీ యూపీ గ్యాంగు జాడ పోలీసులు కనిపెట్టలేదు. పూండి భారీ చోరీకి సంబంధించి అంతర్రాష్ట్ర ముఠా జాడ లేదు. టెక్కలి, కాశీబుగ్గ భారీ చోరీ కేసుల్లో ఇటీవల పట్టుబడిన ఇద్దరు నిందితుల సొంతరాష్ట్రం పశ్చిమబెంగాల్. ఒడిశా బరంపురంలో ఉంటూ వ్యాపారం పేరిట జిల్లాలో తిరిగి పగలు ఇళ్లను రెక్కీ చేసి రాత్రుళ్లు చోరీ చేశారు. -
సీదిరి అప్పలరాజుకు జగన్ పరామర్శ
-
మత్స్యకారులంటే ఎందుకంత మంట
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మత్స్యకారులంటే చిన్నచూపు చూడటం.. ఎదిగిన నేతలను అణగదొక్కడం, అక్రమ కేసులు బనాయించడం, పదవుల కేటయింపులో మొండిచెయ్యి చూపడం.. ఇవీ చంద్రబాబు తన పాలనలో మత్స్యకారుల పట్ల వ్యవహరిస్తున్నారు తీరుకు నిదర్శనాలు. అదే వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన ఇందుకు పూర్తి భిన్నం. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, విపత్కర పరిస్థితుల్లో ఆపన్న హస్తం అందించడం, పదవుల్లో పెద్దపీట వేయడం వంటి చర్యలతో మత్స్యకారులకు అండగా నిలిచారు.చంద్రబాబు పాలనలో..పాక్ జైల్లో మగ్గిన మత్స్యకారులు 2018 నవంబర్ 27న చంద్రబాబు ప్రభుత్వంలో గుజరాత్ రాష్ట్రంలో వీరావల్ నుంచి వేటకెళ్లిన ఎచ్చెర్ల మత్స్యకారులు సముద్రంలో దారి తప్పి పాకిస్తాన్ చెరలో చిక్కుకున్నారు. దారితప్పిన మత్స్యకారులపై పాకిస్తాన్.. దేశద్రోహం కేసులు పెట్టి సుదీర్ఘకాలం జైలులో పెట్టింది. 20మంది మత్స్యకారులు పాక్ జైల్లో మగ్గుతుంటే అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. పత్తా లేని టీడీపీ.. కోవిడ్ విజృంభణతో ఒకవైపు ప్రజలు ప్రాణాలు పోతున్నాయి. మరోవైపు బిక్కుబిక్కుమని ఇళ్లల్లో మత్స్యకార కుటుంబాలు బతుకుతున్నాయి. ఇంకో వైపు ఇంటి పెద్దలు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉండిపోయారు. ఆ సమయంలో టీడీపీ కనీసం పట్టించుకోలేదు. తమ ప్రాణాలే ముఖ్యమని పచ్చ నాయకులు ఎవరింట్లో వారు దాక్కున్నారు. ఇక, మత్స్యకారులను ఇంకేం ఆదుకుంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒక్క మేలూ జరగలేదు.. మత్స్యకారులను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ప్రభుత్వం ఒక్క మేలూ చేయలేదు. నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా వెలగబెట్టినా ఒక్క ప్రాజెక్టు తీసుకురాలేదు. ప్రతిసారి భావనపాడు పోర్టు అన్నారే తప్ప దాన్ని అమల్లోకి తేలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అత్యధిక పనులు పూర్తయినప్పటికీ మూలపేట పోర్టును గాలికొదిలేసింది. బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్‌ను పక్కన పెట్టేసింది. మత్స్యకారులకు ఇవ్వాల్సిన వేట విరామ భృతిలో అక్రమాలకు పాల్పడుతోంది. పదవుల్లోనూ దగా.. మత్స్యకార సామాజిక వర్గంలో ఎదుగుతున్న నాయకులను చంద్రబాబు అణగదొక్కుతున్నారు. బలహీన వర్గాలకు చెందిన బలమైన నాయకులను రాజకీయంగా వేధిస్తున్నారు. దానిలో భాగంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అక్రమ అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఓట్ల కోసం వాడుకోవడం తప్ప ఆ సామాజిక వర్గం అభివృద్ధి, సంక్షేమానికి పనిచేయలేదు. సరికదా ఎదుగుతున్న నాయకులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. వైఎస్ జగన్ హయాంలో..పాకిస్తాన్ నుంచి జిల్లాకు తీసుకొచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, విదేశాంగ మంత్రితో సంప్రదింపులు చేసి 2020 జనవరి 6న వారందరినీ విడుదల చేయించింది. స్వగ్రామాలకు క్షేమంగా తీసుకొచ్చింది. వారికి ఆర్థికంగా కూడా అండగా నిలిచింది. కోవిడ్‌లో అండగా.. కోవిడ్‌లో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేసినప్పుడు జిల్లాకు చెందిన మత్స్యకారులు గుజరాత్, చెన్నైతో పాటు ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్నారు. రూ.3కోట్లు ఖర్చు పెట్టి జిల్లాకు చెందిన 5,500 మంది మత్స్యకారులను బోట్లు, 46 బస్సుల ద్వారా తీసుకొచ్చారు. వారందరికీ ప్రత్యేక వసతులు కల్పించి, తక్షణ సాయం కింద రూ.2వేల ఆర్థిక సాయం చేశారు. అభివృద్ధిలో కీలక అడుగులు సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో రూ. 2,949.70కోట్లతో మూలపేట పోర్టు మంజూరు చేశారు. శంకుస్థాపన చేసి పనులు చకచకా సాగించారు. చివరి దశకు తీసుకొచ్చారు. బుడగట్లపాలెంలో రూ.366కోట్లతో ఫిషింగ్ హార్బర్ మంజూరు చేసి, పనులు ప్రారంభించారు. మంచినీళ్ల పేటలో జెట్టీ పనులకు శ్రీకారం చుట్టారు. వేట నిషేధ కాలంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పేరిట రూ.10వేలు చొప్పున ఇచ్చారు. బోట్ల కోసం లీటర్‌కి రూ.9 చొప్పున డీజిల్ సబ్సిడీ, మూడు చక్రాల మోటార్ సైకిళ్లు ఇచ్చారు. నియోజకవర్గానికొక ఆక్వా ల్యాబ్, 66 మంది సాగర మిత్ర ఉద్యోగులు, గ్రామ సచివాలయాల్లో ఫిషరీస్ అసిస్టెంట్ ఉద్యోగులను ఏర్పాటు చేశారు. పదవుల్లో పెద్దపీట.. మత్స్యకారులను రాజకీయంగా పైకి తీసుకొచ్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేయూతనిచ్చారు. ఆ సామాజిక వర్గానికి చెందిన జుత్తు జగన్నాయకులను ఎమ్మెల్యేను చేశారు. ఆ తర్వాత వైఎస్ జగన్.. ఆ సామాజిక వర్గానికి పెద్దపీట వేసి, వైద్యుడైన సీదిరి అప్పలరాజును ఎమ్మెల్యేగా చేయడమే కాకుండా మంత్రి పదవిలో కూర్చొబెట్టారు. మత్స్యకారుల కోసం వైఎస్సార్, వైఎస్ జగన్ అండగా నిలిచి, రాజకీయంగా చేయూతనిచ్చారు. -
వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్రలు
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటనపై కూటమి ప్రభుత్వ కుట్రకు దిగింది. వైఎస్ జగన్ పర్యటనకు వస్తే కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగింది. జనం రాకుండా అడ్డుకోవడానికి పోలీసులను రంగంలోకి దించింది. కేవలం 8 వాహనాలకు మాత్రమే అనుమతి ఉందని పోలీసులు ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాలతో శ్రీకాకుళం ఎస్పీ ఆంక్షలు విధించారు. వైఎస్ జగన్ రేపు (30.07.2026, గురువారం) శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. అక్రమ కేసులో అరెస్టై శ్రీకాకుళం సమీపంలోని అంపోలు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును ములాఖత్‌లో కలిసి పరామర్శించనున్నారు.వైఎస్ జగన్ గురువారం ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు శ్రీకాకుళం సమీపంలోని అంపోలు జిల్లా జైలుకు చేరుకుంటారు. జైలులో డాక్టర్ సీదిరి అప్పలరాజుతో ములాఖత్ అయి, ఆయనను పరామర్శిస్తారు. అక్రమ కేసులు, రాజకీయ వేధింపులకు గురవుతున్న పార్టీ నాయకులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్న భరోసాను ఇవ్వనున్నారు. అనంతరం వైఎస్ జగన్ తిరుగు ప్రయాణమవుతారు. -
సీదిరి అప్పలరాజుకు జగన్ పరామర్శ
-
ఈనెల 30న శ్రీకాకుళంలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం పర్యటనకు సిద్ధమయ్యారు. గురువారం (జులై30) శ్రీకాకుళం వెళ్లనున్న జగన్.. జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించనున్నారు.సీదిరి అప్పలరాజును కుట్ర పూరితంగా చంద్రబాబు ప్రభుత్వం అరెస్ట్ చేయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ అధినేతగా జగన్ ఆయనకు సంఘీభావం తెలిపేందుకు జైలుకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన ద్వారా పార్టీ శ్రేణులకు ధైర్యం, భరోసా కల్పించడంతో పాటు.. కార్యకర్తలకు తాము అండగా ఉన్నామనే సందేశాన్ని జగన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.అప్పలరాజు అరెస్టుపై వైఎస్సార్సీపీ ఆగ్రహంమాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై పెట్టిన కేసు రాజకీయ కక్షతోనేనని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న నేతలను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం కేసులు పెడుతోందని మండిపడుతున్నారు. యాక్సిడెంట్ కేసును.. హత్య కేసుగా మార్చడం, అందులో సీదిరిని ఏ3గా చేర్చడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం పర్యటనపై ఆసక్తిజగన్ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ మంత్రి అరెస్టు అంశంపై పార్టీ శ్రేణులకు భరోసా ఇవ్వడంతో పాటు.. ఉత్తరాంధ్రలో పార్టీ కార్యకర్తలతోనూ ఆయన సమావేశమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. -
శ్రీకాకుళంలో ఉద్రిక్తత.. చింతాడ రవి అరెస్ట్
-
జైల్లో సీదిరి అప్పలరాజును పరామర్శించిన YSRCP నేతలు
-
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు రిమాండ్
సాక్షి, శ్రీకాకుళం: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత సీదిరి అప్పలరాజు అరెస్ట్ వ్యవహారం శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసింది. యాక్సిడెంట్ సంబంధిత కేసులో ఆయన పేరును ఏ3గా చేర్చి.. సెక్షన్లను మార్చేసి మరీ అక్రమంగా అరెస్ట్ చేశారని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. మరోవైపు రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం బాగోలేదని, వైద్య చికిత్స అవసరమైన సమయంలోనే పోలీసులు అరెస్ట్ చేశారని అప్పలరాజు సతీమణి శ్రీదేవి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ కుటుంబాన్ని కేసుల పేరుతో వేధిస్తున్నారని భార్య శ్రీదేవి మండిపడ్డారు. యాక్సిడెంట్ కేసును హత్య కేసుగా మార్చడం బాధాకరమన్నారు. ఈ తరుణంలో ఆయన ఆరోగ్యం బాగోలేకపోవడంతో కుటుంబ సభ్యులు, ఇటు అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. పీఎస్‌లోనే సీదిరి అప్పలరాజుకు వైద్యపరీక్షలు నిర్వహించారు. సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మరోవైపు వైఎస్సార్సీపీ నేతలు ఆయన్ని కలవనీయకుండా పోలీసులు అడ్డుకుంటుండడంతో కాశీబుగ్గ పీఎస్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది.రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి నమోదైన కేసులో పోలీసులు అప్పలరాజును బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ సమయంలో ఆయన్ని చొక్కా పట్టుకుని లాక్కెల్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అలాగే రాత్రంత కాశీబుగ్గ స్టేషన్లోనే ఇబ్బందికర పరిస్థితుల్లో ఆయన్ని ఉంచినట్లు తెలుస్తోంది. దీంతో ఈ అరెస్ట్ రాజకీయ కక్షసాధింపులో భాగమని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.వైద్య పరీక్షల కోసం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి..మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును వైద్య పరీక్షల నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. భద్రతా ఏర్పాట్ల మధ్య సీదిరిని ఆస్పత్రికి తీసుకొచ్చారు పోలీస్ బృందం. వైద్య పరీక్షల తర్వాత సీదిరి అప్పలరాజును మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అప్పలరాజు తరలింపుతో పలాసలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ధర్మాన కృష్ణదాస్‌ను అడ్డుకున్న పోలీసులు..పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశీబుగ్గ పీఎస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ను అడ్డుకున్న పోలీసులు.. సీదిరి అప్పలరాజును కలిసేందుకు వైఎస్సార్సీపీ నేతలను అనుమతించలేదు.పలాసలో ఉద్రిక్తతఅప్పలరాజు అరెస్ట్ నేపథ్యంలో పలాసలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆయన అరెస్ట్‌కు నిరసనగా పలాసలో వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాయి. పోలీస్‌స్టేషన్ నుంచి మూడు రోడ్ల జంక్షన్ వరకు సాగిన ఆందోళనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఉదయం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పార్టీ కార్యకర్తలు పలాసకు చేరుకుంటున్నారు.‘వైద్యం అవసరమైన సమయంలో అరెస్ట్ చేశారు’‘‘రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం బాగోలేదు. వైద్య చికిత్స అవసరమైన సమయంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డు ప్రమాదం కేసును నేరపూరిత హత్య కేసుగా మార్చడం బాధాకరం. రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారు’’ అని అప్పలరాజు భార్య శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త, కుమారుడిపై కావాలనే అక్రమ కేసులు నమోదు చేశారని ఆమె పేర్కొన్నారు. న్యాయం జరుగుతుందనే నమ్మకంతో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.వైఎస్ జగన్ ఆగ్రహంమాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్‌పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ప్రశ్నించే నాయకుల గొంతు నొక్కేందుకు అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్ష సాధింపుల కోసం ఉపయోగిస్తున్నారని, అరెస్టులతో వైఎస్సార్సీపీని భయపెట్టలేరని జగన్ పేర్కొన్నారు. ప్రజల కోసం పోరాడే ప్రతి నాయకుడు, కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.కేసు విషయంలో రాజకీయ దుమారంరోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించిన కేసులోనే అప్పలరాజును అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతుండగా.. ఇది కక్షసాధింపు చర్యేనని వైఎస్సార్సీపీ అంటోంది. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అప్పలరాజు ఆరోగ్యం, అరెస్ట్ పరిణామాలు, పలాసలో కొనసాగుతున్న నిరసనలపై ఉత్కంఠ కొనసాగుతోంది. -
జీతం కావాలంటే ఇంటి వచ్చి నా కోరిక తీర్చు..!
‘సార్.. రెండు నెలల నుంచి జీతం ఇవ్వలేదు.. చిన్నపిల్లలతో ఉంటున్నాను..ఇల్లు గడవడం కష్టంగా ఉంది.. ఇప్పుడు అర్జంట్‌గా గ్యాస్ సిలిండర్ విడిపించాలి.. అడ్వాన్స్‌గా అయినా ఓ రెండు వేల రూపాయలు ఇవ్వండి..’ అంటూ శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగిని పారిశుద్ధ్య నిర్వహణ కాంట్రాక్టర్ వద్ద వేడుకుంది. ‘జీతం కావాలంటే ఇంటి వచ్చి నా కోరిక తీర్చు.. నిన్ను బాగా చూసుకుంటాను..’ అంటూ సదరు కాంట్రాక్టర్ లైంగిక వైధింపులకు దిగాడు.ఆలయం పారిశుద్ధ్య నిర్వహణ విభాగంలో ఇటీవల చోటుచేసుకున్న ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని కొద్ది రోజులుగా బయటకు రాకుండా ఉండేలా అటు కాంట్రాక్టర్ వర్గం, ఇటు కొందరు అధికార సిబ్బంది కూడా తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని నేరుగా ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ వద్ద ప్రస్తావించింది. అయినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోవడంతో తోటి ఉద్యోగుల మద్దతుతో శ్రీకాకుళం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే స్థానికంగా రాజకీయ ఒత్తిళ్లు కారణంగా చర్యలకు వెనుకాడుతున్నట్లు సమాచారం. ఏం జరిగిందంటే.. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో పారిశుద్ధ్య నిర్వహణ టెండర్‌ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక టీడీపీ నేతల జోక్యంతో గోవింద్ అనే వ్యక్తి టెండర్ దక్కించుకున్నాడు. ఆలయ సెక్యూరిటీ విభాగంతో పాటు పారిశుద్ధ్య సిబ్బంది వ్యవహారాలన్నీ ఈ టెండర్‌దారుని పరిధిలోకే వస్తాయి. రెండు నెలల నుంచి సెక్యూరిటీ సిబ్బందికి, పారిశుద్ధ్య నిర్వహణ సిబ్బంది (స్వీపర్లు)కి జీతాలు చెల్లించకుండా కాంట్రాక్టర్ బ్బందులు పెడుతున్నాడంటూ ఆలయ ఈవోకు ఫిర్యాదులు అందాయి. దీంతో సెక్యూరిటీ సిబ్బందికి మాత్రం ఒక నెల జీతం చెల్లించి మిన్నకుండిపోయాడు. దీంతో స్వీపర్లు మరోసారి ఈవోకు వినతిపత్రం అందజేశారు. అదే సందర్భంలో తాను అడ్వాన్స్ ఇవ్వాలని అడిగితే.. అసభ్యంగా మాట్లాడినట్లుగా బాధితురాలు ఈవోకు రికార్డెడ్ ఎవిడెన్స్‌గా తన బాధను వివరించింది. రాజకీయ జోక్యంతో చర్యలకు దూరం..! స్థానికంగా కూటమి ప్రభుత్వం మద్దతుదారులు, టీడీపీ ముఖ్య కార్యకర్తలు ఏడాది కాలంగా ఆదిత్యాలయ టెండర్లలో జోక్యం చేసుకుని తమ వారిని పెట్టుకుని మేనేజ్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణ సిబ్బంది టెండర్‌ను దక్కించుకున్న గోవింద్ ఔట్సోర్సింగ్ సిబ్బంది జీతాలతో పాటు పీఎఫ్ జమ విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్యంగా ఉంటున్నట్లు సమాచారం. సిబ్బందిపై లైంగిక వేధింపుల ఘటన చోటుచేసుకున్నాక ఉద్యోగులు ఈవోకు, పోలీస్ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోలేదు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చర్యలకు వెనక్కి తగ్గుతున్నట్లు సమాచారం. ఇలాంటి ఫిర్యాదులుంటే కచ్చితంగా కాంట్రాక్టర్ టెండర్‌ను రద్దు చేసే అధికారం ఈవోకు ఉన్నా తాత్సారం జరుగుతుండటంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసభ్యంగా మాట్లాడాడు... రెండు నెలల జీతం కావాలంటే ఇంటికి రా..కోరిక తీర్చు అంటూ కాంట్రాక్టర్ గోవింద్ అసభ్యంగా మాట్లాడారు. ఇదే విషయం ఆలయ ఈవోకు చెప్పాను. ఆయన కాంట్రాక్టర్‌ను పిలిపించి మందలించారు. న్యాయం కోసం తోటి ఉద్యోగులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాం. నాలాంటి బాధితులు ఇంకా ఉన్నారు. కానీ భయంతో నోరు మెదపలేకపోతున్నారు. – బాధితురాలు ఫిర్యాదు అందింది.. పారిశుద్ధ్య నిర్వహణ సిబ్బంది కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్న గోవింద్‌పై పెండింగ్ జీతాల విషయంతో పాటు ఓ ఉద్యోగినిపై అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఫిర్యాదులు వచ్చాయి. వెంటనే పిలిపించి కాంట్రాక్టర్‌ను గట్టిగా మందలించి పంపించాను. ఇలాంటి తప్పుడు పనులు చేసిన వారిని క్షమించేది లేదు. ఇప్పటికే పోలీసులకు బాధితులు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిసింది. – కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ఈవో శ్రీకాకుళం: -
శ్రీకాకుళం జనసేనకు బిగ్ షాక్.. YSRCPలోకి పవన్ వీరాభిమాని
-
నేతా.. ఇదేం రోత..?
శ్రీకాకుళం: ఆయన ఓ ఎమ్మెల్యే. ఎక్కడైనా తప్పు జరిగితే సరిదిద్దాల్సిన వ్యక్తి. ఎవరికైనా ఇబ్బంది కలిగితే పరిష్కరించాల్సిన నాయకుడు. అలాంటిది సాక్షాత్తు ఎమ్మెల్యేనే చిన్న పిల్లల ఆస్పత్రి పక్కన రాత్రిపూట బర్త్ డే పార్టీ అంటూ నానా హంగామా చేశారు. ఆస్పత్రిలో ఉన్న వారు కంగారు పడిపోయేంత శబ్దాలు చేస్తూ దగ్గరుండి నృత్యాలు నిర్వహించారు. పాతపట్నంలో జరిగిన ఈ సంఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది. పాతపట్నంలో బుధవారం రాత్రి స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పుట్టిన రోజు వేడుకలు పట్టణం మధ్యలో ఉన్న ఎరుకోల కాంప్లెక్స్‌లో జరిగాయి. చిన్నపిల్లల ఆస్పత్రి, పాఠశాలలు వంటివి ఉన్న ప్రదేశంలో రాత్రి సమయం అని కూడా చూడకుండా పెద్ద సౌండ్ సిస్టంతో బర్త్‌డే పార్టీ చేయడంతో రోగులు, ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈవెంట్ పేరుతో సున్నితమైన ప్రాంతాల్లో డాన్స్‌లు పెట్టడం సబబు కాదన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు, నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు. ఇబ్బంది పెట్టడం దారుణం ప్రశాంత వాతవరణంలో ఉండే పాతపట్నంలో ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకల్లో ఈవెంట్ల పేరుతో నృత్యాలు చేయడం దారుణం. ఈవెంట్ పక్కనే చిన్నపిల్లల ఆస్పత్రి ఉన్నప్పటికి ఈవెంట్లకు పోలీసులు, అధికారులు వత్తాసు పలకడం విడ్డురుంగా ఉంది. ఎమ్మెల్యే దగ్గర ఉండి నృత్యాలు చేయించడం దారుణం. ఆయన ఎమ్మెల్యేగా అనర్హుడు. – రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే పాతపట్నం -
ఒంటరితనం భరించలేక టీచర్..!
శ్రీకాకుళం: పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు జె.రోహిణి (39) అనారోగ్య కారణాల వల్ల తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మెళియాపుట్టి మండలం తూముకొండ గ్రామానికి చెందిన రోహిణి కాశీబుగ్గలోని మారుతీనగర్‌లో ఒంటరిగా ఉంటున్నారు. భర్త జీవనరావు విజయనగరంలోని జీఎస్టీ కార్యాలయంలో గుమస్తాగా పనిచేస్తున్నారు. ఇద్దరు కుమార్తెలు విశాఖపట్నం, ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్నారు. భర్త వారానికి ఒక రోజు వస్తుంటారు. ఎప్పటిలాగే శనివారం రాత్రి వచ్చేసరికి తలుపు మూసి ఉంది. పక్కింటి వారి సహకారంతో తలుపులు పగలు గొట్టి లోపలికి వెళ్లి చూసే సరికి రోహిణి ఉరికి వేలాడుతూ కనిపించారు. వెంటనే కాశీబుగ్గ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా వెంటనే శనివారం రాత్రి 10 గంటల సమయంలో సీఐ రామకృష్ణ వచ్చి పరిశీలించారు. ఆదివారం ఉదయం పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోహిణికి కొద్ది నెలలుగా అనారోగ్య సమస్యలు ఉన్నాయని, వాటిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని సీఐ చెప్పారు. -
ఈ ఏడు రోజులే అత్యంత బలమైన ముహూర్తాలు!
హిందూ సంప్రదాయంలో ఏ పని తలపెట్టిన శుభ ముహూర్తాలు చూసుకోవడం ఆనవాయితీ. కొత్త వస్తువులు, వాహనాలు కొనాలన్నా మంచి రోజులు ఉండాల్సిందే. అలాంటిది జీవితంలో అత్యంత ప్రధానమైన వివాహాలు, గృహప్రవేశాల విషయంలో నక్షత్ర, రాశి బలాలకు సరిపడా ముహుర్తాలపై ప్రజలకు అచంచల విశ్వాసం ఉంటుంది. అయితే గత మే 14న అధిక జ్యేష్టమాసం ప్రారంభం కావడంతో నెల రోజులుగా శుభకార్యాలకు బ్రేక్ పడింది. తాళికట్టు శుభవేళ.. ఈ నెల 15తో శూన్యమాసం ముగిసింది. 16 నుంచి నిజ జ్యేష్టమాసం ప్రారంభమైంది. జూన్ 27, 28, జూలై 1, 2, 3, 4, 5, 8, 9 తేదీలలో అత్యంత బలమైన ముహూర్తాలు ఉన్నాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ మాసాల్లోనూ మంచి ముహుర్తాలు ఉన్నాయని అంటున్నారు. వ్యాపారాలు కళకళ.. నెలరోజులుగా ముహూర్తాలు లేకపోవడంతో కల్యాణ మండపాలు, కేటరింగ్, టెంట్ హౌస్‌లు, డెకరేషన్, పూల వ్యాపారులు, పురోహితులు, బంగారం షాపులు, వస్త్రవ్యాపారులు, ఫొటోగ్రాఫర్ల వ్యాపారాలు మందగించాయి. చాలా మంది కారి్మకులకు ఉపాధి కరువైంది. జూన్ 19 నుంచి మళ్లీ సీజన్ ప్రారంభం కానుండటంతో ఈ అనుబంధ వ్యాపారాలన్నీ ఊపందుకుంటాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండు వేల వరకు వివాహాలు నెల రోజుల తర్వాత ముహూర్తాలు మొదలవడంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 2వేల వరకు పెళ్లిళ్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో వధూవరులకు కావలసిన వస్త్రాలు, పట్టుచీరలు కొనేందుకు తల్లిదండ్రులు, బంధువులు షాపులకు క్యూ కడుతున్నారు. కిరాణా దుకాణాలలో కూడా వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. ‘బంగారం’ లాంటి చాన్స్ పెళ్లికి ముఖ్యమైనది బంగారం. దాని ఖరీదు పెరుగుతున్నా తప్పని సరిగా బంగారం పెట్టాల్సిందే. స్వర్ణాభరణాల ధరలు పెరుతున్నా పెళ్లికి అతిముఖ్యంగా కావలసిన తాళిబొట్టు, మట్టెలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో కొందరు బంగారం షాపుల వద్ద చేరి వీటిని ముందుగా ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటున్నారు. మరికొందరు బంగారం ముక్క కొనుగోలు చేసి తమకు తెలిసిన తయారీదారుని వద్ద వెళ్లి ఆర్డర్ ఇస్తున్నారు. జ్యేష్టమాసం విశేషమైంది జ్యేష్టమాసం అన్ని మాసాలలోకి విశేషమైంది. బ్రహ్మదేవునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. నిజ జ్యేష్ట మాసంలో వివాహాది శుభ కార్యక్రమాలు యధావిధిగా నిర్వహిస్తారు. చాలా మంది వివాహాలు చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. – తెన్నేటి విక్రమశర్మ, ప్రకాశరాయ జ్యోతిషాలయం ముహూర్తాల కోసం వస్తున్నారు.. నెలరోజులుగా ముహూర్తాలు లేక చేతిలో పనులు లేవు. ఎట్టకేలకు శుభ ముహూర్తాలు మొదలు కావడంతో వివాహాది శుభకార్యాలు చేయించుకునేందుకు మావద్దకు వస్తున్నారు. తేదీలు ముందుగా బుక్ చేసుకుంటున్నారు. – పి.నర్సింహమూర్తి, పురోహితులు, శ్రీకాకుళం -
చావును ముందే ఊహించిన హరిణి.. లవర్ కి సెల్ఫీ వీడియో
-
మాటలు జాగ్రత్త... సీదిరి అప్పల రాజు Vs SI
-
శ్రీకాకుళంలో సీన్ రివర్స్.. కింజరాపు గుత్తాధిపత్యానికి చెక్
-
ఆన్లైన్లో రూమ్‌ను బుక్ చేసుకుని..!
శ్రీకాకుళం క్రైమ్: ఆ యువతి మూర్ఛ వ్యాధితో కొంతకాలంగా బాధపడుతోంది. దాదాపు రూ.10 లక్షలు సమకూరితే గానీ ఆరోగ్యం మెరుగవ్వదని తెలుసుకుంది. తండ్రికి స్థోమత లేకపోవడం, కుటుంబానికి భారమనుకుందో ఏమో.. స్నేహితురాలికి వాట్సాప్ మెసేజ్ ద్వారా తన బాధ పంచుకుంది. శ్రీకాకుళం నగరానికి వచ్చి ఓ హోటల్లో ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించి రెండో పట్టణ ఈశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లా గుణుపూర్‌కు చెందిన అభిమన్యు బెహరాకు ఇద్దరు కుమారులు, కుమార్తె కసూర్తి కుమారి బెహరా (23) ఉన్నారు. నిరుపేద కుటుంబం. కస్తూరికి చిన్నప్పటి నుంచీ మూర్ఛవ్యాధి ఉండటంతో ఎప్పుడూ ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. పూర్తిగా నయం కావాలంటే రూ. లక్షలతో కూడుకున్న పని మదనపడేది. స్నేహితురాలి ఊరికని చెప్పి.. ఈ క్రమంలో గురువారం తన స్నేహితురాలి ఊరికి వెళ్తానని తండ్రితో చెప్పింది. ఉదయం 10 గంటలకు గుణుపూర్‌లో తండ్రి రైలు ఎక్కించారు. కస్తూరి తన స్నేహితురాలి ఇంటికి వెళ్లకుండా అప్పటికే ఆన్లైన్లో శ్రీకాకుళం విజేత హోటల్లోని రూమ్‌ను బుక్ చేసుకుని ఆమదాలవలసలో దిగి నగరంలోని హోటల్‌కు చేరింది. గురువారం మధ్యా హ్నం ఒంటి గంటకు తన స్నేహితురాలికి వాట్సాప్ మెసేజ్ చేసింది. తాను చనిపోతున్నానని, తన అనారోగ్యానికి తండ్రి రూ.10 లక్షలు ఖర్చు పెట్టడం సాధ్యం కాదన్నది ఆ మెసేజ్ సారాంశం. అదే విషయాన్ని కస్తూరి స్నేహితురాలు వెంటనే కస్తూరి తండ్రికి ఫోన్ చేసి చెప్పి మెసేజ్ ఫార్వర్డ్ చేసింది. అప్పటి నుంచి తండ్రి కస్తూరికి పలుమార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ రావడంతో స్థానికంగా ఉన్న స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళంలో లొకేషన్ చూపిండంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఈలోగా అక్కడి వారు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు రెండో పట్టణ పోలీసులకు ఫోన్ చేయడంతో హోటల్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్న సమాచారాన్ని చెప్పారు. హుటాహుటిన తల్లిదండ్రులు చేరుకుని బోరున విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఈశ్వరరావు తెలిపారు. -
ఇదేనా పొదుపు..చంద్రబాబు సభకు కూలీలు.. డబ్బులిచ్చి భారీగా తరలింపు
-
శ్రీకాకుళం : అంగరంగ వైభవంగా నీలమ్మ తల్లి పండుగ (ఫొటోలు)
-
నా అల్లుడు ఓ అమ్మాయిని నవ వధువు మృతి కేసులో ట్విస్ట్
-
‘బైక్ కావాలి’ అంటూ భార్యను వేధించిన ఇంజినీర్ భర్త!
శ్రీకాకుళం క్రైమ్/గార : వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైపోయింది. ఉరేసుకుని చనిపోయిందని భర్త చెబుతుండగా.. అల్లుడే తమ కుమార్తెను చంపేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గార మండలం శిమ్మపేటకు చెందిన శిమ్మ లక్ష్మీ నారాయణ, శారద దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి కుమారుడు గౌతమ్, డిగ్రీ బీఎస్సీ చదివిన కుమార్తె తేజశ్రీ(22) ఉన్నారు. తేజశ్రీకి శ్రీకాకుళం మండలం రాగోలు సమీప గూడెంకు చెందిన రుప్ప మల్లేషు కుమారుడు సోమేష్‌తో ఈ ఏడాది మార్చి 6న వివాహం జరిగింది. కట్నం కింద రూ. 20 లక్షల నగదు, 20 తులాల బంగారం చెల్లించారు. మొదటి రోజు నుంచే వేధింపులు.. విశాఖపట్నం ఎల్అండ్టీ కంపెనీలో ఇంజినీర్‌గా ఉన్న సోమేష్ నావల్ డాక్‌యార్డ్‌లో ప్రాజెక్టు డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. విశాఖ రామా టాకీస్ సమీపంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఇటీవల ఓ యువతిని సోమేష్ ఇంటికి తేవడంతో తేజశ్రీ భర్తను నిలదీసింది. అది సహించని సోమేష్ రూ.3 లక్షల విలువైన బైక్ కావాలని వేధించడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులకు తేజశ్రీ విషయం చెప్పడంతో నాలుగైదు రోజుల్లోనే బండి కొనిచ్చేశారు. వారం రోజుల తర్వాత పది సెంట్లు భూమి రాయాలని, తులం నల్లపూసలు చేయించాలని మళ్లీ వేధించడంతో పాటు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. పెళ్లి ఆల్బమ్‌లో సగం మొత్తం రూ. 1.50 లక్షలు అడగడంతో రూ.50 వేలు సైతం ఇచ్చారు. గొడవవుతుందని.. ఈనెల 7వ తేదీన ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య సోమేష్, తేజశ్రీల మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరూ తమకు ఫోన్ చేశారని, గొడవ మామూలేనని తేజశ్రీ తమతో చెప్పిందని, ఆ తర్వాత పలు దఫాలు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. 9.30 గంటలకు ఉరివేసుకుని మీ పాప చనిపోయిందని తన ఫ్రెండ్‌తో సోమేష్ ఫోన్ చేయించడంతో ఒక్కసారి హతాశులయ్యామని, వెంటనే విశాఖ బయల్దేరి వెళ్లామని పేర్కొన్నారు. అక్కడికి వెళ్లి చూసేసరికి కుమార్తె బెడ్ మీద విగతజీవిగా ఉందని, మెడ, కాళ్లపై వాతలున్నాయని, సోమేష్ స్నేహితులు ముగ్గురు అక్కడే ఉండటంతో ఆమెను చంపేసి వుంటారని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదే విషయమై విశాఖ పట్నం త్రీటౌన్‌లో కేసు పెట్టామని, సోమేష్‌ను అదే రోజు పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. తమ కుమార్తెకు తీరని అన్యాయం జరిగిందని.. అదనపు వరకట్నం కోసం వేధించడమే కాక హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని తల్లిదండ్రులు వాపోయారు. -
శ్రీకాకుళం : అంగరంగ వైభవంగా భద్రమహంకాళి అనుపు ఉత్సవం (ఫొటోలు)
-
రేపు ఇంటికి రా.. విద్యార్థినితో అసిస్టెంట్ ప్రొఫెసర్ అసభ్య సంభాషణ
-
ఆదుకోండయ్యా..!
శ్రీకాకుళం జిల్లా: మండలంలోని జీరుపాలేం గ్రామానికి చెందిన దుమ్ము దుర్గారావు, సుమలత దంపతుల కుమార్తె లోయిస్కు అనుకోని ఆపద వచ్చింది. దీంతో ఆ తల్లిదండ్రులు పాప పరిస్థితి చూసి తల్లడిల్లిపోతున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను ఆస్పత్రిలో అచేతన స్థితిలో చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మూడేళ్ల లోయిస్ బుధవారం ఇంటి డాబాపై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. వెంటనే పాప పరిస్థితి విషమంగా మారడంతో శ్రీకాకుళంలోని పలు ఆస్పత్రులకు తిప్పారు. చివరగా ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పాప తల లోపల రక్తస్రావమై నరం కట్ కావడంతో ఆపరేషన్ చేయాల్సి ఉందని, సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెబుతున్నారు.తల భాగంలో ఈ చికిత్సకు ఆరోగ్య శ్రీ లేదని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. తండ్రి దుర్గారావుకు చేపల వేటే ఆధారం. ఖాళీ సమయంలో ఆటో డ్రైవర్‌గా వెళ్తుంటాడు. ఆర్థికంగా అత్యంత దయనీయ స్థితిలో ఉన్న వీరు దాతల సాయం కోరుతున్నారు. దాతలు 96523 66174 నంబర్‌కు ఫోన్‌చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. -
చిల్లంగి నెపంతో భార్యాభర్తల హత్య
శ్రీకాకుళం క్రైమ్: జిల్లాలోని కొత్తూరు మండలం గొట్టిపల్లి పంచాయతీ గిరిజన తండా గ్రామమైన చినరాజపురంలో చిల్లంగి నెపంతో భార్యాభర్తలను అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి గొడ్డలితో నరికి చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. కొండ ఎగువన ఉండే చినరాజపురం గ్రామంలో మంగళవారం వేకువజామున సవర కోటయ్య అనే వ్యక్తి అదే గ్రామా నికి చెందిన సవర ఎల్లంగి (50)ని గొడ్డలిలో నరకబోయాడు. సమీపంలో ఉన్న ఎల్లంగి భార్య గయాని (40) అడ్డుకోబోవడంతో ఆమెపై కూడా నిర్దాక్షిణ్యంగా గొడ్డలితో వేటువేశాడు. ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశారు. చిల్లంగి పెడుతున్నారనే అనుమానంతోనే కోటయ్య ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. వేకువజామునే హత్య జరిగిన ఊరుఊరంతా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది. దీంతో మంగళవారం రాత్రి వరకు పోలీసులకు సమాచారం అందలేదు. రాత్రి ఎలాగోలా సమాచారం అందుకు న్న కొత్తూరు సీఐ చింతాడ ప్రసాదరావు, తమ సిబ్బందితో కలసి కొండపైనున్న చినరాజపురం గ్రామంలోని ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. సవర ఎల్లంగి తన కుటుంబ సభ్యులకు చిల్లంగి పెట్టాడన్న అనుమానంతోనే కోటయ్య ఈ హత్య లు చేశాడని, ప్రస్తుతం నిందితుని కోసం గాలిస్తున్నామని సీఐ తెలిపారు. -
కొంప ముంచిన బాదం పాలు
శ్రీకాకుళం రూరల్: సింగుపురం పంచాయతీ పరిధిలో గల పలు గ్రామాలకు చెందిన వారు జాతరలో బాదం పాలు తాగి శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. గురువారం హటకేశ్వరస్వామి, కొండమ్మ తల్లి యాత్ర ముగింపు జరిగింది. ఈ సందర్భంగా సింగుపురం సచివాలయం కేంద్రం వద్ద రాజస్థాన్‌కు చెందిన ఓ ట్రావెల్ బడ్డీ ద్వారా అమ్మిన బాదంపాలు, ఐస్‌క్రీమ్‌లను చాలా మంది ఆస్వాదించారు. రూ.40 విలువ గల బాదంపాలు సాయంత్రానికి రూ.10కే ఇవ్వడంతో మరింత మంది ఆ పాల కోసం క్యూ కట్టారు. శుక్రవారం ఉదయం నుంచి వీరిలో చాలా మందికి వాంతు లు, విరేచనాలు, జ్వరం రావడంతో వారంతా దగ్గరిలో గల ప్రైవేట్ క్లినిక్‌లకు పరుగులు పెట్టారు. బాదం పాలు తాగడం వల్లే వాంతులయ్యాయని వారంతా వైద్యుల వద్ద చెప్పడం గమనార్హం. సింగుపురం గ్రామంలోని పలు ప్రైవేటు క్లినిక్‌లలో సుమా రు 60 నుంచి 70 వరకూ మందులు తీసుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని సింగుపురం ప్రాధమిక వైద్యాధికారి వద్ద వెంకట్ వద్ద ప్రస్తావించగా బాదంపాలు తాగడంతో సింగుపురం చుట్టుపక్కల గ్రామాల్లో పలువురు అస్వస్థతకు గురైనట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. ప్రాథమిక వైద్య కేంద్రంలో అన్ని రకాల మందులు ఉన్నాయని ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. -
YSRCP చలో మూలపేట
-
మూలపేట పోర్ట్ వద్ద హైటెన్షన్
-
ఆంక్షలు వలయంలో మూలపేట పోర్టు..
‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ అప్డేట్స్.. వైఎస్సార్సీపీ భారీ బహిరంగ సభశ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని గల మూలపేట పోర్ట్ పనులు త్వరితగతన జరగాలని ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో నౌపాడలో జరిగిన భారీ బహిరంగ సభ. ఈ సభకు భారీగా తరలివచ్చిన ఉత్తరాంధ్ర వాసులు. ధర్మాన ప్రసాదరావు కామెంట్స్..చిత్తశుద్ధి లేని ప్రభుత్వం నోరులని ప్రాంతాలకు అన్యాయం చేస్తోంది.అన్ని ప్రాంతాలకు సంపద సమానంగా పంపిణీ చేయాలి.టీడీపీ ప్రభుత్వం ఏనాడైనా శ్రీకాకుళం జిల్లాకు శాశ్వతమైన పనిచేసిందా?.ఎల్లో పత్రికలు పెట్టిన హెడ్డింగ్స్ చూసి ప్రజలు మోసపోతున్నారు.తరిమికొట్టే రోజు వచ్చినప్పుడే భయపడి అభివృద్ధి చేస్తారు.దిగజారి మూలపేట పోర్టు మేమే తెచ్చామని కేంద్రమంత్రి చెప్తున్నారు.మనం మౌనంగా ఉంటే మన జిల్లా అభివృద్ధిని పట్టించుకోరు.టీడీపీ ఎమ్మెల్యేలే రాక్షసుల్లా దాడులు చేస్తున్నారు.కూటమి ఎమ్మెల్యే దుర్మార్గాలు చూస్తే సిగ్గేస్తోంది.వైఎస్సార్సీపీ హయాంలో 30 లక్షల ఇళ్లు కట్టించాం.వైఎస్ జగన్ గొప్ప నాయకుడు, విశాలమైన భావాలున్న నాయకుడు. బొత్స సత్యనారాయణ కామెంట్స్..మూలపేట ఈ ప్రాంత అభివృద్ధి కాదు రాష్ట్ర మొత్తం అభివృద్ధి.దూరదృష్టితో పోర్టును వైఎస్ జగన్ నిర్మించారు..కూటమి ప్రభుత్వం పోర్టును పట్టించుకోలేదు.ప్రజల కష్టాలను పట్టించుకోలేదు..కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి సభ పెట్టడానికి వచ్చామురామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్ పోర్టుకు వెళ్లి రీల్స్ తీసుకునేవారు.భోగాపురం ఎయిర్ పోర్టు వైఎస్ జగన్ కృషి కాదా?.కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం వైఎస్ జగన్ చేసిన మంచిని అచ్చెన్నాయుడు మర్చిపోయావా?.వైఎస్ జగన్ పనులను వారి మెప్పు కోసం ప్రచారం చేసుకుంటున్నారు..30 శాతం పనులను ఎందుకు పూర్తి చేయలేదు..కాంట్రాక్టర్‌కు మీకు సెట్టింగ్ కుదరలేదా?పోర్టును చూస్తే మీకు కలిగే ఇబ్బంది ఏమిటి?.వేరే వారికి పుట్టిన పిల్లలకు మీరు పెట్టవద్దు.రాజధాని అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం.అమరావతి కోసం ఎంత ఖర్చు చేశారు.రాష్ట్ర విభజనకు మేము వ్యతిరేకం కాదని ఎర్రం నాయుడు చెప్పారు.మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కామెంట్స్..చంద్రబాబు వలనే పోర్ట్ పనులు జరుగుతున్నాయనడం టీడీపీ నేతల సిగ్గుచేటు.ఇలా మాట్లాడం అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు దివాలకోరు రాజకీయానికి నిదర్శనం.పాదయాత్ర సందర్భంగా జగన్ పోర్ట్ నిర్మాణం గురించి హామీ ఇచ్చారు..అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు..నేను పుట్టక ముందు నుంచి పోర్ట్ అంటూ చెపుతున్నారు..ఏ నాయకుడు నిర్మించ లేకపోయారు.వైఎస్ జగన్ వలన పోర్ట్ నిర్మాణం పూర్తి అయింది.శ్రీకాకుళం జిల్లాకు తీసుకువచ్చిన ఒక ప్రాజెక్ట్ గురించి బాబాయి అబ్బాయి చెప్పాలి..చంద్రబాబుకు సవాల్ విసురుతున్నా.. శ్రీకాకుళానికి ఏం చేశారో చెప్పాలి?. శ్రీకాకుళం..ధర్మాన కృష్ణదాస్ కామెంట్స్..భావనపాడు పోర్టును నిర్మిస్తామని టీడీపీ నేతలు మోసం చేశారు..ఉత్తరాంధ్ర ప్రజలను ఓటు బ్యాంకుగా చంద్రబాబు చూశారు..దశాబ్దాల కలను వైఎస్ జగన్ నిజం చేశారుమూలపేట పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ వైఎస్ జగన్ నిర్మించారుచదువుకున్న యువతకు పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.. పాముల పుష్పశ్రీవాణి కామెంట్స్.. మూలపేట పోర్టు దశాబ్దల కల.ప్రజల కలను వైఎస్ జగన్ నిజం చేశారు..మూలపేట పోర్టు పనులను 70 శాతం పూర్తి చేశారు..30% పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం అధికారంలో ఉంది.వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుందని చెప్పి పోర్ట్ నిర్మాణం పూర్తి చేయలేదు..ఉత్తరాంధ్ర అభివృద్ధిలో పెద్దన్న పాత్ర వైఎస్ జగన్ పోషించారు.. పోలీసుల ఆంక్షలు..మూలపేట పోర్టును పరిశీలించవద్దంటూ పోలీసుల ఆంక్షలు.నౌపాడ జంక్షన్ వద్ద సభకు మాత్రమే అనుమతి.వైఎస్సార్సీపీ నేతల పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు.నౌపాడ జంక్షన్ వద్ద ముల్లకంచెలతో బారికేడ్లు ఏర్పాట్లు. మూలపేట పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం: ధర్మాన కృష్ణదాస్ఏడాది కాలంలోనే 70 శాతం పనులు పూర్తి చేశాం.కూటమి వచ్చిన తర్వాత 30 శాతం పనులను కూడా చేయలేకపోయింది.వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర. విశాఖ:కురసాల కన్నబాబు కామెంట్స్...క్రెడిట్ చోరీలో చంద్రబాబు స్థాయి పెరిగింది..ఇప్పుడు క్రెడిట్ దోపిడీ చేస్తున్నారు..బాబు ఏనాడైనా ఒక్క పోర్టు నిర్మాణం చేశాడా?చంద్రబాబు ఉత్తరాంధ్రకు చేసింది ఏమీ లేదు..వైఎస్ జగన్‌కు పేరు రాకూడదని కుట్ర చేస్తున్నారు..ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే మూలపేటకు వెళ్తున్నాం.రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ కామెంట్స్..ఉత్తరాంధ్రలో వలసలు అరికట్టాలని జగన్ సంకల్పించారు..వైఎస్ జగన్ ఉత్తరాంధ్రకు ఊపిరి పోశారు..ఉత్తరాంధ్ర అంటే ఉద్యమాల గడ్డ..మూలపేట పోర్టు కోసం పోరాటం చేస్తాం..అమరావతిపై పెట్టిన శ్రద్ద.. ఉత్తరాంధ్రపై ఎందుకు లేదు.. విశాఖ..ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కామెంట్స్..మూలపేట పోర్టు వైఎస్ జగన్ సంకల్పం..70 శాతం పనులు మా హయాంలో చేసాం..30 శాతం పనులు కూడా చేయకుండా క్రెడిట్ చోరీ చేస్తున్నారు..వెనకబడిన శ్రీకాకుళం అభివృద్ధి చెందడం చంద్రబాబుకి ఇష్టం లేదు..ఎన్ని కుట్రలు చేసినా.. మూలపేట పోర్టు ఘనత జగన్నదే.. మూలపేట పోర్టుకు ర్యాలీగా బయలుదేరిన వైఎస్సార్సీపీ నేతలు..జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు.. ఆంక్షలు వలయంలో మూలపేట పోర్టు..నౌపాడ జంక్షన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు..విశాఖ నుంచి మూలపేటకు బయలుదేరిన వైఎస్సార్సీపీ నేతలు. మన మూలపేటకు పోదాం అనే కార్యక్రమాన్ని విచ్చిన్నం చేసే కుట్రలో ప్రభుత్వంవైఎస్సార్సీపీ నేతలు మూలపేట పోర్టుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు సిద్ధమైన పోలీసులు.పార్టీ నేతలను అరెస్టు చేయడానికి సిద్ధమవుతున్న పోలీసులు..నౌపాడ జంక్షన్ వద్ద జంక్షన్ వద్ద ముల్లకంచెలతో బారీకేడ్లు ఏర్పాటు..మూలపేటకు వచ్చే అన్ని రోడ్లను బ్లాక్ చేస్తున్న పోలీసులు..రోడ్డును టిప్పర్లతో బ్లాక్ చేసిన పోలీసులు.మన మూలపేట పోర్టుకు పోదాం నేపథ్యంలో వందల సంఖ్యలో పోలీసుల మోహరింపు..ఎన్ని ఆంక్షలు పెట్టినా కార్యక్రమం విజయవంతం చేస్తానంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులు..నేడు ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ మూలపేట పోర్టు ఘనతను చోరీచేయడానికి టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించడానికి వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమయ్యారు.ఇందులో భాగంగా సోమవారం ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సంతబొమ్మాళి మండలం నౌపడ మూడురోడ్ల జంక్షన్ వద్ద భారీ బహిరంగసభ నిర్వహించేందుకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సీనియర్ నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 👉రాష్ట్రంలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి వైఎస్ జగన్ 2019లో ముఖ్యమంత్రిగా తన పాలన ప్రారంభమైన నాటి నుంచే శ్రీకారం చుట్టారు. సంతబొమ్మాళి మండలం మూలపేట సముద్రతీర ప్రాంతంలో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణం తలపెట్టారు. అంతకుముందు ప్రతి ఎన్నికలోనూ పోర్టు అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్ని మోసగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ తన పాలనలో సుమారు రూ.4,361.91 కోట్లతో మూలపేట తీరంలో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి 2023 ఏప్రిల్ 19న శంకుస్థాపన చేశారు.👉మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ.149 కోట్లు వ్యయం చేశారు. వీటితో పాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించారు. రైల్వే మార్గానికి అవసరమైన 100.71 ఎకరాలను కూడా సేకరించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు అన్ని రకాల అనుమతులతో పోర్టు నిర్మాణం ప్రారంభించారు. రెండుదశల్లో నిర్మించాలని తలపెట్టిన ఈ పోర్టు పనుల్లో ఏడాదిలోనే.. ఎన్నికల సమయానికే 70 శాతం పనులు పూర్తిచేశారు.👉అనంతరం వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా మిగిలిన 30 శాతం పోర్టు పనులను కూడా పూర్తిచేయలేకపోయింది. పనులు నిలిపేయడం కమీషన్ల కోసమేనన్న ఆరోపణలున్నాయి. అయినా పోర్టు క్రెడిట్ చోరీ చేసేందుకు టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పోర్టుకు అవసరమైన భూములను వైఎస్సార్సీపీ హయాంలోనే సేకరించినా మళ్లీ భూములు కావాలంటూ కూటమి నేతల డైరెక్షన్లో అధికారులు చెబుతుండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. -
ఎవరు ఆఫ్ నాలెడ్జ్ పీపులో చెప్పమంటారా.. టిడిపీ MLA అశోక్ వ్యాఖ్యలకు అదిరిపోయే కౌంటర్
-
గిరిజన బాలిక కేసులో నిందితుడిని తప్పించే యత్నం
-
శ్రీకాకుళం బాలిక కేసులో ట్విస్టులు.. నిందితుడి కూతురే డాక్టర్..
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలో గిరిజన బాలికపై అత్యాచారం చేసి హత్య కేసు సంచలన మలుపులు తీసుకుంటోంది. ఈ కేసులో ఒక్కొక్కటిగా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడి అరెస్ట్‌పై పోలీసులు ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల తీరుపై బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్రమైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరగాలిని బాధితురాలి తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అయితే, నిందితుడు సివిల్ ఇంజినీర్ వెంకటరమణకు భారీగా డబ్బు, రాజకీయ పలుకుబడి ఉందని బాధితులు చెబుతున్నారు. దీని ప్రభావంతో కేసు మలుపు తిరుగుతుందేమోనని భయం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలి విషయంలో కూడా జీజీహెచ్‌లో నిందితుడి కూతురు వైద్యురాలి ఉండటంతో పోస్టుమార్టం రిపోర్ట్ మార్పిడి ప్రయత్నాలపై వారు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్బంగా బాధితురాలి పేరెంట్స్ మాట్లాడుతూ..‘నా కూతురికి న్యాయం చేయాలి. న్యాయం జరగకపోతే భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. నిందితుడికి ఉరి శిక్ష లేదా ఎన్కౌంటర్ చేయాలి’ అని డిమాండ్ చేశారు.జరిగింది ఇది.. శ్రీకాకుళం జిల్లాలో హిరమండలంలో ఓ గ్రామానికి చెందిన దంపతుల ఏకైక కుమార్తె(17) విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇటీవల పరీక్షలు రాసి ఇంటికి వచ్చింది. స్థానికంగా సివిల్ ఇంజినీరుగా పని చేస్తున్న వెంకటరమణ.. ‘అమ్మాయికి పాఠాలు చెబుతాను.. నా వద్దకు పంపండి’ అని తల్లిదండ్రులను ఒప్పించాడు. కుమార్తె భవిష్యత్తు బాగుండాలని ఆశించిన వారు నమ్మకంతో అందుకు అంగీకరించారు. ఈ నెల 22న బాలికను శ్రీకాకుళం తీసుకురావాలని వెంకటరమణ సూచించడంతో తండ్రి స్వయంగా తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాక తాను శ్రీకూర్మంలో ఉన్నానని.. ఇక్కడికి రావాలని వెంకటరమణ ఫోన్లో చెప్పాడు. దీంతో ఇద్దరూ కలిసి శ్రీకూర్మం వెళ్లారు. బాలికను అక్కడే ఉంచిన వెంకటరమణ.. తండ్రిని వెనక్కి పంపేశాడు.అనంతరం, ఈ నెల 23న బాలికను విశాఖలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితుడు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి పైశాచికంగా దాడి చేశాడు. ‘మీ కుమార్తె అనారోగ్యానికి గురైంది’ అంటూ 24న తల్లిదండ్రులకు సమాచారమిచ్చాడు. వారికి బాలికను అప్పగించడంతో స్వస్థలానికి తీసుకెళ్లారు. అప్పటికీ ఆమె కొనఊపిరితో ఉన్నప్పటికీ... ‘మీ కుమార్తె చనిపోయింది. అందుకు నేనే కారణం. ఈ విషయం బయటకు చెప్పకుండా దహన సంస్కారాలు నిర్వహించండి. మీకు డబ్బు ఇస్తాను’ అని తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చాడు. కొనఊపిరితో ఉన్న కుమార్తెను వారు శ్రీకాకుళం గ్రామీణ మండలం రాగోలు వద్ద ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలిక మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రికి బుధవారం తీసుకొచ్చారు. ‘చదువు చెబుతానంటే నమ్మి పంపించాం. మా బిడ్డను చంపేశాడు. నిందితుడిని కఠినంగా శిక్షించండి. న్యాయం చేయండి’ అని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. -
చదువు చెప్తానని.. నమ్మిన బాలికపై అత్యాచారం
-
బ్లడీ బాస్టర్డ్.. సామాన్యుడిపై TDP ఎమ్మెల్యే బూతు పురాణం
-
దొరకాలి నా కొడుకు.. పెట్రోల్ పోసి తగలబెడతా
-
ట్యూషన్ చెబుతానని చెప్పి బాలికను
-
ఒకేసారి నాలుగు ఉద్యోగాలు సాధించిన గృహిణి
శ్రీకాకుళం: మండలంలోని పెంటూరుకు చెందిన పొందూరు కుమారి ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు ఎంపికైంది. బడబంద గ్రామానికి చెందిన పొందూరు వైకుంఠరావు, భారతమ్మల చిన్న కుమార్తె అయిన కుమారిని పెంటూరు చెందిన నడుపూరు హరీష్ కు 2022లో ఇచ్చి వివాహం చేశారు. భర్త ఏఆర్ కానిస్టేబుల్‌గా విజయవాడలో పనిచేస్తుండడంతో అక్కడే కోచింగ్ తీసుకొని ఈ ఉద్యోగాలు సాధించినట్లు ఆమె తెలిపారు. రీజనల్ రూరల్ బ్యాంక్(ఆర్ఆర్బీ) పీవో, ఆర్ఆర్బీ క్లర్క్, ఎస్బీఐ క్లర్క్, ఐబీపీఎస్ క్లర్క్(కెనరా బ్యాంకు)గా నాలుగు ఉద్యోగాలు పొందటమే, కాకుండా ఎల్ఐసీ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా మూడు విడత ఇంటర్వ్యూలు పూర్తి చేసుకొని చివరి విడత ఇంటర్వ్యూకు ఎదురు చూస్తోంది. అయితే వీటిలో రీజనల్ రూరల్ బ్యాంకు పీవోగా విధుల్లో చేరుతానని, తన భర్త హరీష ఇచ్చిన సహకారంతోనే ఈ ఉద్యోగాలు సాధించానని కుమారి తెలిపారు. -
‘గిట్టుబాటు ధర లేక రైతులు కన్నీరు పెడుతున్నారు’
శ్రీకాకుళం: పంట పండితే కనీసం ధర ఇప్పించలేని దిక్కుమాలిన స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. పంటకు పండించేందుకు కావాల్సిన ఎరువు ఇప్పించలేని దయనీయ స్థితి ఇవాళ మన రాష్ట్రంలో నెలకొనడం నిజంగా సిగ్గుచేటన్నారు. కష్టకాలంలో రైతులకు ఆపన్నహస్తం అందించి మానవతను చాటుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంపై ధర్మాన మీడియాతో మాట్లాడారు. ‘వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరిచి మొక్కజొన్న రైతును ఆదుకోండి. కనీస మద్దతు ధర చెల్లింపునకు వెంటనే చర్యలు చేపట్టండి. కష్టకాలంలో రైతులకు ఆపన్నహస్తం అందించి మానవతను చాటుకోండి. పంటకు అవసరం అయిన యూరియా అందించడంలోనూ కూటమి ప్రభుత్వం విఫలమైంది. రైతులు యూరియాను బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గిట్టుబాటు ధర లేక రైతులు కన్నీరు పెడుతున్నారు. ఎకరాకు 28 వేల రూపాయలు నష్టం వస్తుంది. దళారీల వల్ల మొక్కజొన్న రైతు దోపిడీ గురవుతున్నాడు. మొక్కజొన్న క్వింటాకు రెండు వేల 400 రూపాయలు చెప్పున ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మార్కెట్లో క్వింట 1500 రూపాయలకు దళారీలు కొనడంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. పంట పండితే కనీసం ధర ఇప్పించలేని దిక్కుమాలిన స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. పంటకు పండించేందుకు కావాల్సిన ఎరువు ఇప్పించలేని దయనీయ స్థితి ఇవాళ మన రాష్ట్రంలో నెలకొన్నాయి. వెంటనే కొనుగోలు కేంద్రాల ద్వారా మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని వైఎస్సార్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం’ అని అన్నారు. -
శ్రీకాకుళం గురజాడ గాయత్రి కాలేజీలో దారుణం
శ్రీకాకుళం: గురజాడ గాయత్రి కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. పలువురి విద్యార్థినుల ఫోటోలు మార్ఫింగ్ చేసిన ఘటన వెలుగుచూసింది. ఏఐ టెక్నాలజీ ద్వారా పలువురి విద్యార్థినుల ఫోటోలను మార్ఫింగ్‌కు పాల్పడ్డారు అక్కడే చదవుతున్న పలువురు విద్యార్థులు. ఈ విషయం బయటకు రావడంతో కాలేజ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు విద్యార్థినుల తల్లిదండ్రులు. తమ కుమార్తెల ఫోటోలను ఇలా మార్ఫింగ్ చేసి బయటకు అమ్మేశారంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన సదరు విద్యార్థులను టీసీలిచ్చి పంపించేశామని యాజమాన్యం అంటోంది. దీనిపై కాలేజ్ ప్రిన్సిపాల్ కేవీవి సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘ ఏఐ ద్వారా నిందితులు ఫోటోలు మార్ఫింగ్ చేశారు. ఫోటోలు మార్ఫింగ్‌కు సంబంధించి విద్యార్థిని తల్లిదండ్రుల కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే మాట్రిక్ పాల్పడిన ఐదుగురు విద్యార్థులకు టిసిలు ఇచ్చి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. వారిని గుర్తించి టీసీలిచ్చి పంపించేశాం’ అని పేర్కొన్నారు. -
టీడీపీ కీలక నేత.. నోరు విప్పితే బూతు పురాణం!
శ్రీకాకుళం కార్పొరేషన్లో మరో ఇంజనీరింగ్ అధికారి అవుట్. మున్సిపల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న పి.కమలాకర్ కీలక నేత టార్చర్ భరించలేక సెలవు పెట్టేసినట్టు తెలిసింది. చెప్పిన పనులన్నీ చేయలేక చేతులెత్తేశారు. అడ్డగోలుగా బిల్లులు చెల్లించలేక తప్పుకుంటున్నారు. కీలక నేత నోటి దురుసును తట్టుకోలేక వెళ్లిపోవడమే మంచిదంటూ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అనారోగ్య సమస్యలు చూపించి సెలవు కోసం దరఖాస్తు చేశారు. అంతకుముందే వీఆర్ కోసం కూడా దరఖాస్తు చేశారు. ఎంతవేగంగా తనను వదిలేస్తే అంత మంచిదని కోరుకుంటున్నారు. గార తహసీల్దార్‌గా పనిచేస్తున్న చక్రవర్తి కూడా సెలవుపై వెళ్లిపోయారు. ఈయన కూడా కీలక నేత, అనుచరుల సతాయింపు భరించలేక సెలవు పెట్టేసి ఆఫీసుకు రావడం మానేశారు. అంపోలులో వివాదాస్పద భూములను పచ్చ నేతలకు రాసిచ్చేయాలని ఒత్తిడి చేయడమే కాకుండా అందరి మధ్య నోటికొచ్చినట్టు బూతులు తిట్టడంతో మనస్థాపానికి గురై సెలవుపై వెళ్లిపోయినట్టు తెలిసింది. జిల్లా పౌరసరఫరాల అధికారులు సైతం ఇదే రకమైన సతాయింపునకు గురవుతున్నారు. కీలక నేత మాటలు తట్టుకోలేక, ఆయన చెప్పినదల్లా చేయలేక ఎంత వేగంగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలా? అని చూస్తున్నారు. గ్రామాల్లో ఉన్న రేషన్ డీలర్లను తీసేయమని, సస్పెండ్ చేయమని ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. ఆ నేత చెప్పినట్టు చర్యలు తీసుకుంటే సదరు డీలర్లు హైకోర్టుకు వెళ్లి అనుకూల ఆర్డర్లు తెచ్చుకోవడంతో తప్పని పరిస్థితుల్లో చర్యలు ఉపసంహరించుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దానికి కారణం అధికారులే అంటూ ఒంటికాలిపై లేచి వారిని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నట్టు సమాచారం. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం నియోజకవర్గంలో కీలక నేత టార్చర్ భరించలేక అధికారులు భయపడుతున్నారు. చెప్పినట్టు చేయాలని, సూచించినట్టు బిల్లులు చేయాలని, ఆదేశించిన వారిపై చర్యలు తీసుకోవాలని పీకమీద కత్తి మీద పెడుతుండటంతో హడలెత్తిపోతున్నారు. చర్యలు తీసుకోకపోతే కీలక నేత ఒత్తిడి.. చర్యలు తీసుకుంటే కోర్టుల నుంచి అక్షింతలు.. వెరసి ముందుకెళ్లితే నుయ్యి వెనక్కి వెళ్లితే గొయ్యి అన్న చందంగా అధికారుల పరిస్థితి తయారైంది. దీపం ఉండగా ఇళ్లు చక్క దిద్దుకోవాలన్న ఆలోచనతో సంపాదించడమే పనిగా పెట్టుకున్న సదరు కీలక నేత దాని కోసం అడ్డదారులు తొక్కుతూ అధికారులను ఒత్తిడికి గురి చేస్తున్నారు. నోరు విప్పితే బూతులే.. ఆ కీలక నేత నోరు విప్పితే చాలు బూతులే వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఏకంగా ఉద్యోగుల పైకే వచ్చేస్తూ పరుష పదజాలంతో దూషిస్తున్నారు. ఇలాగే, గతంలో ఓ జిల్లా అధికారిని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఆయన తిరగబడ్డాడు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అధికారి కావడంతో వ్యవహారం పెద్దదైపోతుందని రాజీ ధోరణికి వచ్చారు. ఆ తర్వాత కార్పొరేషన్లో దక్షిణామూర్తి అనే అధికారి కూడా కీలక నేత బూతులు భరించలేక వెళ్లిపోయారు. తాజాగా మరో ఇద్దరు బాధితులు.. డయేరియాకు ముందు కమిషనర్‌గా వచ్చిన హనుమంతు కూర్మారావు సస్పెన్షన్ వెనక కూడా కీలక నేత హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. చేసిందంతా చేసి తిరిగి ఇంటికి వెళ్లి పరామర్శించి, తనకేమి సంబంధం లేదన్నట్టుగా కలరింగ్ ఇచ్చుకున్నారు. తాజాగా మున్సిపల్ ఇంజనీర్ కమలాకర్ కూడా ఈయన బాధితుడయ్యారని అంటున్నారు. సతాయింపుతో పాటు అడ్డగోలుగా బిల్లులు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో రిటైర్మెంట్ దగ్గరకు వచ్చే వేళ తప్పు చేస్తే తనకు రావాల్సిన బెనిఫిట్స్‌కు గండి పడుతుందన్న ఉద్దేశంతో ముందస్తు అప్రమత్తతతో సెలవుపై వెళ్లేందుకు దరఖాస్తు పెట్టుకున్నట్టు చర్చ జరుగుతోంది. ఈయన్నే కాదు కార్పొరేషన్ పనిచేస్తున్న అనేక మంది అధికారులను కీలక నేత నోటికొచ్చినట్టు మాట్లాడటమే కాకుండా బూతు పురాణం విప్పుతున్నట్టు ఎప్పటి నుంచో విని్పస్తోంది. అన్నింటా అదే తీరు.. మున్సిపల్ కార్పొరేషన్, రిమ్స్, తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాలతో పాటు ఇతర కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులపైన సదరు కీలక నేత జులుం ప్రదర్శిస్తున్నారు. కొందరు అధికారులు జీ హుజూర్ అంటుండగా.. తమకు ఎప్పటికైనా ముప్పు తప్పదనే వారు సెలవుపై వెళ్లిపోతున్నారు. -
ఊరి దారి కోసం.. సర్కారుకు సర్పంచ్ బంపర్ ఆఫర్
శ్రీకాకుళం జిల్లా: ఓ సర్పంచ్ ఏకంగా సర్కారుకే ఆఫరిచ్చారు. ఎంత వేచి చూసినా గ్రామానికి రోడ్డు పడకపోవడం, ఉన్న దారులను బాగు చేయకపోవడంతో రోడ్డు వేస్తే తాను ఏం చేస్తానో చెబుతూ ప్రభుత్వానికి ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. కొత్తూరు మండలంలోని గురండి సర్పంచ్ బోర సింహాద్రి నాయుడు ఈ ప్రకటన చేశారు. గురండి గ్రామానికి వచ్చే నాలుగు రహదారులు పూర్తిగా పాడయ్యాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, నాయకులు స్పందించలేదు. దీంతో స్థానిక సర్పంచ్ ఓ ప్రకటన చేశారు. గురండి గ్రామానికి వచ్చే నాలుగు రహదారులను ప్రభుత్వం మంజూరు చేసి పనులు ప్రారంభిస్తే.. ఆ కాంట్రాక్టర్‌కు రూ.3 లక్షలు సాయం చేయడంతో పాటు రోడ్డు పనులు పూర్తయ్యే వరకు వాటర్ ట్యాంకుతో నీరు సరఫరా చేస్తానని ప్రకటించారు. ఏప్రిల్ రెండోతో సర్పంచ్ల పదవీ కాలం పూర్తవుతున్నందున ఏప్రిల్ రెండో తేదీ లోపు పనులు ప్రారంభిస్తేనే ఈ సాయం అందజేస్తానని తెలిపారు. దీనిపై సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్‌లోనూ విన్నవించారు. -
ఏబీసీడబ్ల్యూ పై ఏసీబీ దాడులు
శ్రీకాకుళం క్రైమ్: వెనుకబడిన తరగతుల సహాయ సంక్షేమ అధికారిగా (ఏబీసీడబ్ల్యూవో) శ్రీకాకుళం జిల్లా సోంపేటలో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న గడ్డి బాలముకుందరావు అవినీతిపై ఏసీబీ అధికారులు సోమవారం మరోమారు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న కారణంతోనే జిల్లా కేంద్రంలోని డీసీసీబీ కాలనీలో ఉన్న ఆయన నివాస గృహంతో పాటు చాపురం–3, ఇలిసిపురం–చినబజారు వద్దనున్న బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు జరిపారు. ఈ దాడులను జిల్లా ఏసీబీ డీఎస్పీ కెంబూరి సత్యనారాయణ తమ సిబ్బందితో ఉ.10 నుంచి రాత్రి 7.30 వరకు జరిపారు. సోదాల్లో సుమారు రూ.1.10 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి సంబంధిత పత్రాలను, విలువైన వస్తువులు, నగదును స్వా«దీనం చేసుకున్నారు. వివరాలివీ.. ముందుగా కంచిలిలో పట్టుబడి.. నరసన్నపేట ఏబీసీడబ్ల్యూగా ఉన్న బాలముకుందరావు సోంపేట ఏబీసీడబ్ల్యూ పాయింట్లో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. బాలముకుందరావు తన పరిధిలోని వసతిగృహ అధికారుల (వార్డెన్లు) నుంచి మెస్ బిల్లులు మంజూరు చేయించేందుకు ఒక్కో విద్యార్థి నుంచి రూ.15 చొప్పున తీసుకుంటున్నట్లు సమాచారం రావడంతో గత నెల 28న కంచిలి బీసీ వసతిగృహంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపారు.అందులో బాలముకుందరావుతో పాటు కార్యాలయ సహాయకుడు గుడ్ల రామకృష్ణల వద్ద లెక్కచూపని రూ.1,84,070 నగదును స్వా«దీనం చేసుకుని క్రిమినల్ కేసు నమోదుచేశారు. అయితే, అదే రోజు అన్ అకౌంట్బుల్, అనధికారికంగా మరికొంత సొమ్ము (రూ.1.50 లక్షలు) బాలముకుందరావు వద్ద ఉండటాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో ఆర్సీఓ (రిజిస్టర్డ్ కేస్ అదర్స్) కింద మారుస్తూ డీజీపీ అనుమతినివ్వడం, ఎస్సెట్స్ (ఆదాయానికి మించి ఆస్తులు)పై దృష్టిపెట్టాలని చెప్పడంతో సోమవారం ఈ దాడులు జరిపారు. సోదాల్లో గుర్తించినవి.. ∙రాజాం, శ్రీకాకుళం, కొత్తవలస సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో నాలుగు స్థిరాస్తులు (శ్రీకాకుళం పట్టణంలో భవనం సహా). ∙సుమారు 322 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.75 కిలోల వెండి, నగదు, ఒక మారుతీ సెలెరియా కారు, రెండు ద్విచక్రవాహనాలు, విలువైన గృహోపకరణాలు. డీబీసీడబ్ల్యూపైనా ఆరోపణలు..? మరోవైపు.. ఈ మొత్తం ఎపిసోడ్‌పై జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారిపైనా ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ ఏసీబీ అధికారులు మౌనంగా ఉండడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఏడాది మేలో ఉద్యోగ విరమణ చేయనున్న ఏబీసీడబ్ల్యూవో బాలగోవిందరావు జనవరి నుంచి ఏప్రిల్ వరకు సెలవు కోరుతూ జిల్లా అధికారికి దరఖాస్తు పెట్టుకున్నారు. పింఛన్‌కు సంబంధించి ప్రతిపాదనలను పూర్తిగాచేసి ఇవ్వాలంటే సోంపేట డివిజన్లోని మెస్ బిల్లులు మంజూరు చేసినందుకు బాలముకుందరావు మామూళ్లు వసూలుచేయాలంటూ ఆమె ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి.. జిల్లా వసతి గృహాలన్నింటిలో విద్యార్థుల మెస్ బిల్లులు మంజూరు చేసేందుకు డీబీసీడబ్ల్యూకి రూ.15లు, ఏబీసీడబ్ల్యూవోకి రూ.20లు, కార్యాలయ ఖర్చులకు వసతిగృహం నుంచి రూ.1,000లు ఇవ్వాలన్నది బహిరంగ రహస్యం. -
అతిసారం విషాదంపైనా అవే డ్రామాలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : శ్రీకాకుళంలో కలుషిత నీరే కాలకూట విషమై అతిసారం ప్రబలి నలుగురు మరణించినా చంద్రబాబు సర్కారులో పశ్చాత్తాపం కానరావడం లేదు. తక్షణం స్పందించి వ్యాధి వ్యాప్తిని అరికట్టి బాధితులకు సాంత్వన కల్పించాల్సిన సర్కారు ఆ పని చేయకుండా జరిగిన ఘటనలో తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు శతవిధాలా యత్నిస్తోంది. తీవ్రతను ఎలాగైనా నీరుగార్చి ప్రజాగ్రహం నుంచి తప్పించుకోవాలని కుట్రలు చేస్తోంది. దీనిలోభాగంగానే మరణాలను నిర్ధారించే విషయంలో అధికారులు దోబూచులాడారు. కేవలం ఒక్కరే మరణించినట్టు ప్రకటించారు. మిగతా వారి మరణాలపై విశ్లేషించాల్సి ఉందని చెబుతున్నారు. దీనిపై మృతుల కుటుంబీకుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన చేపడతామని వారు హెచ్చరిస్తున్నారు. సర్కారు నిర్లక్ష్యానికి కుటుంబ సభ్యులు బలై పుట్టెడు దుఃఖంలో ఉన్న తమను ఓదార్చి, అండగా ఉండాల్సింది పోయి ప్రభుత్వం కుంటిసాకులు వెతుక్కోవడంపై మండిపడుతున్నారు. అధికారం చేపట్టినప్పటి నుంచి రక్షిత మంచినీటి సరఫరాపై తీవ్ర అలసత్వం ప్రదర్శించిన సర్కారు ఇప్పుడు ఈ ఘటనకు 14 రోజుల కిందట బాధ్యతలు స్వీకరించిన కార్పొరేషన్ కమిషనర్‌ను బాధ్యుడిని చేస్తూ సస్పెన్షన్ వేటు వేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పెరుగుతున్న కేసులు మరోవైపు అతిసారాన్ని అదుపు చేసేందుకు సర్కారు సరైన చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా డయేరియా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారిక లెక్కల ప్రకారం మంగళవారం నాటికి 68 కేసులు నమోదైతే బుధవారానికి 102కి చేరుకున్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం 162 మందికిపైగా అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. చాలా మంది వేర్వేరు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నట్టు సమాచారం. మరికొందరు ఇళ్లల్లో ఉండే మందులు వాడుతున్నట్టు తెలుస్తోంది. ఆ బాధితుల లెక్క పరిగణనలోకి రాలేదని అధికారులు చెబుతున్నారు. కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్న డయేరియా శ్రీకాకుళంలో మిగతా ప్రాంతాలకూ డయేరియా విస్తరిస్తోంది. మంగళవారం నాటికే సగం నగరం అతిసారం బారిన పడింది. బుధవారం కొత్త ప్రాంతాల్లో కేసులు వెలుగులోకి వచ్చాయి. నగరంలోని 10 నెట్వర్క్ ఆస్పత్రులు ప్రస్తుతం డయేరియా రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 13 మంది మాత్రమే డిశ్చార్జి అయ్యారు. అసలైన బాధ్యులను వదిలి.. కమిషనర్ బలి కలుషిత నీటి సరఫరాకు కారణమైన ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులను వదిలేసిన ప్రభుత్వం.. 14 రోజుల కిందట కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన హనుమంతు కూర్మారావును బలి పశువును చేస్తూ నిర్ణయం తీసుకుంది. నగరంపైన, కార్పొరేషన్ పాలనపైన అవగాహన చేసుకునే లోపే డయేరియా ప్రబలడానికి బాధ్యుడిని చేస్తూ నెపం ఆయనపైకి నెట్టేసి సస్పెన్షన్ వేటు వేసింది. కాలవకూట విషమే కారణం !డయేరియా ప్రబలడానికి కారణాలను చంద్రబాబు ప్రభుత్వం బయటకు చెప్పలేకపోతోంది. శాంపిల్స్ పంపించాం, ఫలితాలు ఇదిగో వస్తాయి అదిగో వస్తాయి అని చెప్పడమే గానీ నాలుగు రోజులవుతున్నా అసలు కారణం వెల్లడించలేదు. వాస్తవానికి మురుగు కాలవల్లోని నీరు పైప్‌లైన్ ద్వారా తాగునీటితో కలుషితం కావడం వల్లే ప్రమాదకర పరిస్థితులు చోటు చేసుకున్నాయని అధికారులకు, పాలకులకు తెలుసు. కానీ నీరు కలుషితమైందని చెబితే ప్రభుత్వ వైఫల్యం బట్టబయలవుతుందని, కార్పొరేషన్ మంచినీళ్లు తాగి ప్రజలు చనిపోయారనే సంకేతాలు బలంగా ప్రజల్లోకి వెళ్తాయని వాస్తవాలను దాచేసేందుకు సర్కారు కుట్ర చేస్తోంది. ఇదిలా ఉంటే మంగళవారం సాయంత్రం వరకు క్షేత్రస్థాయిలో కనిపించని టీడీపీ నాయకులు ఆ తర్వాత హడావుడి చేయడం మొదలు పెట్టారు. ఎమ్మెల్యేతో సహా పలువురు నాయకులు ఆస్పత్రులు, వ్యాధి ప్రబలిన ప్రాంతాల బాట పట్టారు. అధికారులతో సమీక్షలంటూ అర్ధరాత్రి హడావుడి చేశారు. -
శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ కూర్మారావు సస్పెండ్
-
డయేరియా వ్యాప్తికి కారణం అదే దయచేసి చర్యలు తీసుకోండి
-
‘డయేరియాతో ప్రజలు చనిపోతే.. అమరావతిలో కబడ్డీ ఆడుతున్నారా?’
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలో డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతల బృందం పర్యటించింది. ఈ సందర్బంగా డయేరియా మరణాలను దాచాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ప్రజారోగ్యం కూటమి ప్రభుత్వానికి ప్రాధాన్యత కాదా? అని ప్రశ్నించారు. ప్రజలకు మంచి తాగు నీరు ఇవ్వలేరా? అని మండిపడ్డారు. శ్రీకాకుళంలో డయేరియా ప్రభావిత ప్రాంతం దమ్మల వీధిలో వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు.. బాధితులతో మాట్లాడారు. ఈ సందర్బంగా బాధిత కుటుంబాలు కన్నీటి పర్యంతం అవుతున్నాయి. కూటమి ప్రభుత్వంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అనంతరం, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ..‘డయేరియా మరణాలను ప్రజలకు తెలియకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. ఈ ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోంది. అన్ని రంగాలను వదిలేసి డబ్బులన్నీ రాజధాని పేరుతో అమరావతిలో పెడుతున్నారు. శ్రీకాకుళం ఆసుపత్రిలో ఒక్క ట్యాబ్లెట్ కూడా లేదు. ఏమీ లేకపోయినా ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు.రాష్ట్రంలో వెనకబడిన వర్గాలు ఏడుస్తున్నారు. రైతులను దళారీలు దో చేస్తున్నా అడిగేవాడే లేడు. గార మండలంలో ఇసుక తవ్వేస్తున్నారు. అక్కడ కూడా డయేరియా వచ్చే అవకాశం ఉంది. నీరు ఎర్రగా వస్తుంది.మున్సిపల్ కార్యాలయాన్ని ప్రైవేటు కార్యాలయంగా మార్చేశారు. మంచి ప్రభుత్వం అని స్టిక్కర్ డోర్‌కు అంటించడం కాదు ప్రజల హృదయాల్లో ఉండాలి. కింది స్థాయి పరిపాలనా వ్యవస్థను గాలికి వదిలేశారు. వెనుకబడిన ప్రాంతాల హక్కులని ఈ ప్రభుత్వం తొక్కేస్తుంది. ప్రజలు వెంటాడి మరీ ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తారు. ప్రజల ఆవేదన తీవ్ర రూపం దాల్చబోతుంది. నలుగురు చనిపోతే.. ఒక్కరే చనిపోయారని చెప్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మరణాలను దాస్తున్నారు. ప్రజల ఆగ్రహం చూడబోతున్నారు.. ఆరోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ ప్రభుత్వం మేల్కొవాలి’ అని హితవు పలికారు. మాజీ మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ..‘శ్రీకాకుళంలో డయేరియా ప్రబలడానికి కారణం ప్రభుత్వ వైఫల్యమే. నలుగురు చనిపోవడానికి కారణం ప్రభుత్వ నిర్లక్యం. డయేరియా ప్రబలిందని ఈ నెల 23వ తేదీన మీడియా చెబుతుంటే ఎమ్మెల్యేలు, మంత్రులు అమరావతిలో కబడ్డీ ఆడుకుంటున్నారు. నలుగురు చనిపోతే అది.. డయేరియా వలన కాదని ప్రభుత్వం తప్పించుకుంటుంది. మున్సిపల్ వాటర్ నీరా? విషమా? అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఓట్లు వేసిన పాపానికి ప్రజలకు మంచి నీళ్లు కూడా ఇవ్వని దుస్థితి ఏర్పడింది. ఇవి డయేరియా మరణాలు కాదు.. ప్రభుత్వం హత్యలుగా గుర్తించాలి. విజయనగరం, విజయవాడలో డయేరియా మరణాలు సంభవించాయి. ఇప్పుడు శ్రీకాకుళంలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి.మున్సిపాలిటీలో మెడికల్ ఆఫీసర్ ఎక్కడ?. అధికారులు అందుబాటులో లేకపోతే ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ పడకేసింది. తలుపు, తాళం వేసిన శాఖకు ఒక మంత్రి. ఇంటింటికి ఇంటర్నెట్ ఇస్తామని సీఎం చెబుతున్నారు. ముందు ఇంటింటికి మంచి నీళ్లు ఇవ్వండి. మృతుని కుటుంబ సభ్యులకి 25 లక్షల పరిహారం ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. -
పాలకుల పా‘పానీ’కి బలి
చంద్రబాబు సర్కారు కల్తీ, కలుషిత పాపానికి ప్రజల ప్రాణాలు బలైపోతున్నాయి. ఇప్పటికే నకిలీ మద్యం, కల్తీ పాలు అమాయకులను పొట్టనబెట్టుకున్నాయి. తాజాగా శ్రీకాకుళంలో కలుషిత నీరే కాలకూటమై కబళిస్తోంది. డయేరియా రూపంలో పంజా విసురుతోంది. ఇప్పటికే నలుగురిని మింగేసింది. మరో 68 మందిని తీవ్ర అస్వస్థత పాలుజేసింది. మంగళవారం ఒక్క రోజునే ఇద్దరు మృత్యువాత పడడం తీవ్ర కలకలం రేపింది. అయినా సర్కారులో చలనం లేదు. డయేరియా విజృంభణకు కారణాలు అన్వేషించి నియంత్రణ చర్యలు చేపట్టకుండా మరణాలకు వేరే కారణాలు ఉన్నాయని సాకులు వెతుక్కుంటోంది. దీంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లిప్తత వల్ల గత నాలుగు రోజుల నుంచి శ్రీకాకుళంలో డయేరియా విజృంభిస్తోంది. కలుషిత నీరు తాగి ప్రజలు వ్యాధి బారిన పడుతున్నారు. ఇప్పటివరకు అతిసారంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఇద్దరు మంగళవారం ఒక్కరోజునే మరణించడం వ్యాధి తీవ్రతకు అద్దంపడుతోంది. మరో 68 మంది తీవ్ర అస్వస్థతకు గురై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇవన్నీ అధికారిక లెక్కలే. వాస్తవానికి డయేరియా బాధితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని, నగరంలో సగం డయేరియా విషకోరల్లో చిక్కుకుందని సమాచారం. నిలువెత్తు నిర్లక్ష్యం నాలుగు రోజులుగా డయేరియా ప్రబలుతున్నా.. ప్రజలు మరణిస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోలేదు. సోమవారం మధ్యాహ్నం వరకు కేసుల వివరాలు బయట పెట్టలేదు. అయితే దమ్మల వీధికి చెందిన మడ్డు లక్ష్మణ(61) వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆదివారం చనిపోయాడు. మోణింగి సంతోష్(41) కూడా వాంతులు, విరేచనాలతో సోమవారం ఉదయం మరణించాడు. ఆస్పత్రికి వెళ్లే వరకైనా వీరి ప్రాణాలు నిలబడలేదు. ఆ తర్వాత ఒక్కసారిగా కేసులు పెరగడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మంగళవారం దమ్మల వీధికి చెందిన ఆటో డ్రైవర్ మండల సురేష్ (41) రిమ్స్‌లో చికిత్స పొందుతూ చనిపోగా, సదాశివుని నర్సింగరావు(62) ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే మార్గం మధ్యలో చనిపోయాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అంతవరకు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించిన యంత్రాంగం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మరణాలకు డయేరియా ఒక్కటే కారణం కాదని, వేరే కారణాలు ఉన్నాయని చెబుతోంది. శ్రీకాకుళం నగరంలోని మేదరవీధి మెయిన్‌రోడ్డులో కాలువలను పునర్నిర్మిస్తుండడంతో పైప్లైన్లోకి మురుగునీరు చేరి మంచినీరు కలుషితమవుతోందని తెలుస్తోంది. డయేరియాకు ఇదే కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా కార్పొరేషన్ కార్యాలయం సర్వీసు ట్యాంక్ నుంచి ఏయే ప్రాంతాలకైతే కుళాయిల ద్వారా నీరు సరఫరా అవుతోందో ఆ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా డయేరియా బారిన పడ్డారు. ఆస్పత్రులు కిటకిట శ్రీకాకుళం నగరంలో సగానికిపైగా ప్రాంతాలు డయేరియా బారిన పడ్డాయి. దమ్మల వీధి, కుమ్మరి వీధి, మేదరవీధి, కాకి వీధి, గుడి వీధి, మంగువారి తోట, గోల్కొండ రేవు, మొండేటి వీధి, వాంబే కాలనీ, అరసవల్లి, హౌసింగ్ బోర్డు కాలనీ, ఎల్బీఎస్ కాలనీల్లో అధికంగా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా శ్రీకాకుళం రిమ్స్, పట్టణ ఆరోగ్య కేంద్రాలతోపాటు జెమ్స్, కిమ్స్, మెడికవర్, సిందూర, అప్సర ఆస్పత్రులు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. కొందరు ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్నారు. వ్యాధి తీవ్రత దృష్ట్యా ఆరు యూపీహెచ్‌సీలు, జెమ్స్, కిమ్స్, మెడికవర్ ఆస్పత్రులతోపాటు శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రుల్లో అధికారులు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. డయేరియా ప్రబలడానికి గల పూర్తి కారణాలను తెలుసుకునేందుకు విశాఖపట్నం, శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రి నుంచి నలుగురితో కూడిన వైద్య బృందం నమూనాలు సేకరిస్తోంది. నగరంలో డయేరియాతో ప్రజలు చనిపోతుంటే అధికార పార్టీ నాయకులు పత్తా లేకుండాపోవడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
శ్రీకాకుళం డయేరియా ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం
సాక్షి,తాడేపల్లి: శ్రీకాకుళంలో డయేరియా వ్యాప్తి చెందడంతో పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.శ్రీకాకుళం డయేరియా ఘటనపై వైఎస్ జగన్ స్పందించారు. ‘తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి. ప్రజారోగ్య రక్షణలో వైఫల్యం ..ప్రభుత్వ పరిపాలనా లోపాలను బయటపెడుతోంది. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి. వెంటిలేటర్‌పై ఉన్న రోగుల ఆరోగ్యంపై ప్రత్యేక వైద్య బృందాలు పర్యవేక్షణ చేయాలి.ఈ ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజల ఆరోగ్యం కాపాడడంలో ప్రభుత్వం విఫలమైతే ప్రజలే తగిన బుద్ది చెబుతారు. మృతుల కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
శ్రీకాకుళం జిల్లాలో డయేరియా కలకలం, ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో డయేరియా విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధితో ఒకరు చనిపోగా సోమవారం మరొకరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య రెండుకు చేరింది. మృతులను నర్సింగ్‌రావు సురేష్‌లుగా గుర్తించారు. దాదాపు 75 మంది డయేరియా లక్షణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వాంతులు, విరోచనాలతో బాధితులు వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. గోల్కొండ రేవు, దమల వీధి, బొడ్డెమ్మకోవెల మరియు మంగువారితోట వంటి జనసాంద్రత కలిగిన ప్రాంతాల నుండి ఈ ఇన్ఫెక్షన్ సోకినట్టు తెలుస్తోంది.. పిల్లలు వృద్ధులు ప్రభావితమైన వారిలో ఉన్నారు. దీంతోఆందోళనకర పరిస్థితులునెలకొన్నాయి. డయేరియా అధికారులు ఆలస్యంగా స్పందించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వివిధ ప్రాంతాల నుండి నీటి నమూనాలను సేకరించి, ఆలస్యం లేకుండా ప్రయోగశాల పరీక్షలకు పంపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. -
శ్రీకాకుళంలో డయేరియా కలకలం
-
శవాల దగ్గర చిల్లర ఏరుకునే వెధవ.. బొత్స గొప్పతనం ఇదిరా..
-
Chintada: రీల్స్ చేయడానికి మంత్రి అయ్యావా..? నీ సొంత జిల్లాకు ఏం చేశావ్..?
-
ముగియనున్న మూడు నెలల మూఢం
శ్రీకాకుళం కల్చరల్/శ్రీకాకుళం: మూడు నెలల విరామం తర్వాత మంచి ముహూర్తాలు రావడంతో మళ్లీ వివాహాల సందడి మొదలైంది. గత ఏడాది నవంబరు 26 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 13 వరకు మూఢాలు కావడంతో చాలామంది వివాహాది శుభకార్యాలకు దూరంగా ఉన్నారు. మాఘ మాసం వివాహాలకు మంచిదైనప్పటికీ మూఢం కారణంగా ఫిబ్రవరి 18 వరకు సరైన ముహుర్తాలు లేకుండాపోయాయి. ఎట్టకేలకు ఫిబ్రవరి 19 నుంచి ఫాల్గుణ మాసం మొదలు కావడంతో వివాహాలకు సిద్ధమవుతున్నారు. అంతటా బిజీబిజీ.. ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది అపురూప ఘట్టం. వివాహ మధురానుభూతులను జీవితాంతం గుర్తుగా దాచుకోవాలనుకుంటారు. పెళ్లి ముహూర్తాలు మొదలుకావడంతో వివాహ సంబంధిత వ్యాపారాలైన భాజాభజంత్రీలు, డెకరేషన్ నిర్వాహకులు, కర్పూర దండల షాపులు, లైటింగ్, మైక్‌సెట్ నిర్వాహకులు, వస్త్ర వ్యాపారులు, బంగారం షాపుల వద్ద హడావిడి బాగా పెరిగింది. పెళ్లి మండపాలకు డిమాండు బాగానే ఉంది. ఇక, ముహుర్తాల కోసం జాతకాలు తీసుకొచ్చే వారితో జ్యోతిషాలయాల కిటకిటలాడుతున్నాయి. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 2వేల వరకు పెళ్లిళ్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. భోజనాల్లో తగ్గేదేలే.. వివాహ వేడుకల్లో భోజనాలదీ కీలక ఘట్టమే. దీనికోసం జిల్లాలో అనేక కేటరింగ్ సరీ్వసులు సిద్ధంగా ఉన్నాయి. వడ్డించే ఐటెమ్స్ బట్టి ధరలు ఉన్నాయి. ప్లేట్ రూ.150 నుంచి రూ.1000 వరకు ధరలు పలుకుతున్నాయి. కొందరు దూరప్రాంతాలైన విశాఖ, విజయవాడ, రాజమండ్రిల నుంచి సైతం కేటరింగ్ సర్వీసులను రప్పిస్తున్నారు. 19 నుంచి శుభముహూర్తాలు గత ఏడాది నవంబరు నెలాఖరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 18 వరకు మూఢాలు ఉండడంతో మంచి ముహూర్తాలు లేవు. ఫిబ్రవరి 19 నుంచి శుభముహుర్తాలు మొదలు కానున్నాయి. చాలా మంది వివాహాలకు సన్నద్ధమవుతున్నారు. – తెన్నేటి విక్రమశర్మ, పంచాంగకర్త మంచి ముహూర్తాలివే.. ఫిబ్రవరితో పాటు మార్చి, ఏప్రిల్, మే, జూన్, ఆగస్టు, నవంబరు, డిసెంబరు నెలల్లో ఎక్కువగా పెళ్లిళ్లు జరగనుట్లు పంచాంగకర్తలు చెపుతున్నారు. ఫిబ్రవరి: 19, 20, 21, 24, 25, 26 మార్చి : 4, 5, 6, 7, 8, 11, 12, 13, 14, 20, 21, 25, 29 ఏప్రిల్: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12, 21, 25, 26, 28, 29, 30 మే: 1, 3, 5, 6, 7, 8, 9, 10, 12, 13 జూన్: 19, 20, 21, 24, 25, 26, 27, 28, జూలై: 1, 2, 3, 4, 5, 8, 9 ఆగస్టు: 16, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30, సెపె్టంబరు : 1, 3, 4, 5 , అక్టోబరు : 11, 14, 29, 30 నవంబరు: 5, 11, 12, 13, 14, 15, 18, 19, 20, 21, 22, 24, 25, 26 ,డిసెంబరు : 2, 3, 4, 10, 11, 12, 13, 15, 16, 17, 18, 19, 22, 23, 27, 29, 30, 31అభిరుచికి తగ్గట్టు.. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా పెల్లి మండపాన్ని అలంకరిస్తుంటారు. కొందరు ప్లాస్టిక్ పూలతో సరిపెట్టుకోగా, మరికొంత మంది నిజమైన పూలతో మండపం సిద్ధం చేయమంటారు. వారి కోసం బెంగళూరు వంటి దూర ప్రాంతాల నుంచి సైతం పూలు, ఇతర సామగ్రి తెస్తుంటాం. – గోపి, క్లాత్ డెకరేషన్, శ్రీకాకుళం ముహూర్తాలు మళ్లీ మొదలుఏడాదిలో ఎన్ని పెళ్లి ముహుర్తాలు ఉంటే అంత ఆదాయం. ఈ ఏడాది మూడునెలలు మూఢాల వల్ల వివాహాది శుభకార్యాలు చాలా వరకు వాయిదాపడ్డాయి. మళ్లీ ముహుర్తాలు మొదలు కావడంతో వివాహాలు జరుపుకునేందుకు మా వద్దకు వస్తున్నారు. – పి.నర్సింహమూర్తి, పురోహితులు -
అరసవల్లిలో తొక్కిసలాట.. ప్రభుత్వంపై భక్తులు సీరియస్
-
అరసవల్లి రథసప్తమి వేడుకలు.. భక్తుల మధ్య స్వల్ప తోపులాట
సాక్షి,శ్రీకాకుళం: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామునే భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఉత్సవాల ప్రారంభంగా నిర్వహించిన క్షీరాభిషేకం సేవ వైభవంగా సాగింది.ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. దర్శనం కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సి రావడంతో భక్తుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు, ఆలయ సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.ఉత్సవాల కోసం ప్రత్యేకంగా జారీ చేసిన ఎంట్రీ పాస్‌లు, స్లాట్ పాస్‌లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘పేరుకే పాస్‌లు ఇస్తున్నారు కానీ లోపలికి అనుమతించడం లేదు. కనీసం దర్శనం కూడా కల్పించడం లేదు’ అంటూ భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తుల రద్దీ కారణంగా క్రమపద్ధతిలో దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆలయ అధికారులు తెలిపారు. పాస్‌లతో సంబంధం ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని, భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రథసప్తమి సందర్భంగా సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, సేవలు నిర్వహించబడుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం పొందుతున్నారు. -
శ్రీకాకుళం : ఉల్లాసంగా రథసప్తమి సప్తాహ్ (ఫోటోలు)
-
శ్రీకాకుళం : శోభా యాత్ర శోభాయమానం (ఫోటోలు)
-
కిందపడ్డ బాలుడికి రేబిస్ ఇంజెక్షన్.. రిమ్స్ సిబ్బంది నిర్వాకం
-
శ్రీకాకుళం : రథ సప్తమి వేడుకలు.. అదరహో (ఫొటోలు)
-
మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ మృతి
శ్రీకాకుళం: శ్రీకాకుళం టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ (77) సోమవారం మృతి చెందారు. ఆదివారం శ్రీకాకుళంలోని తన ఇంట్లో ప్రమాదవశాత్తు కిందపడ్డారు. తలకు తీవ్ర గాయం కావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనను చేర్చారు.అక్కడ సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన భౌతిక కాయాన్ని అరసవల్లిలోని స్వగృహానికి తరలించారు. కుమారులు అమెరికా నుంచి సోమవారం అర్ధరాత్రి రానున్నారు. మంగళవారం అంత్యక్రియలు జరVý నున్నాయి. ఆయన మృతిపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంతాపం వ్యక్తం చేశారు. -
బాదం–జీడిపప్పుతో పెరిగిన పుంజులు, పందాల్లో పంచ్‌లు
శ్రీకాకుళం జిల్లా: గోదారి గట్టంత కాకపోయినా సిక్కోలు తీరంలోనూ అక్కడక్కడా సంక్రాంతికి పందెం కోళ్లు తలపడుతుంటాయి. ఈ కోళ్ల పందాలే కాదు.. ఈ పుంజులను పెంచే తీరు కూడా చాలా ప్రత్యేకం. వేకువ జామున నది, కాలువల్లో ఈత కొట్టించి, ప్రత్యేక వ్యాయామం చేయించి, బాదం పిస్తా పెట్టి పెంచుతారు. సాధారణ దాణాతో పాటు బాదం, పిస్తా, జీడిపప్పు, ఖర్జూరం తప్పని సరి. రాగులు, బియ్యం, పాలిష్ తవుడు రెండుసార్లు, దినుసులు, నూకలు, అన్నం బాగా కలిపి గోధుమలతో సిద్ధం చేసి రోజుకు ఐదారుసార్లు తినిపిస్తారు. అలాగే దాణా పెట్టిన ప్రతిసారి బాదం, జీడి పప్పు పెడతారు. బొబ్బిలి సెంటిమెంట్ పౌరుషానికి ప్రతీకంగా భావించే బొబ్బిలిని ఇక్కడ పందెందార్లు సెంటిమెంట్‌గా భావిస్తారు. అక్కడ గుడ్లను తీసుకువచ్చి ఇక్కడ పొదిగిస్తారు. పండక్కి ఒక పది నెలలు ముందుగా పక్కా ప్రణాళిక ప్రకా రం చేస్తారు. పుట్టిన పుంజులను ఎంతో శ్రద్ధతో పెంచి పందెంకోళ్లుగా తీర్చి దిద్దుతారు. బలిష్టంగా తయారవ్వడాని వాటికి ప్రతి రోజూ వ్యాయామం తప్పనిసరి. ఈ జాతికే డిమాండ్.. కోడి పందాలను రెండు రకాలుగా పెడతారు. అందులో మొదటిది కాళ్లకు కత్తి కట్టి పందానికి దించితే పందెం ప్రారంభం నుంచి 20 నిమిషాలకు ముగు స్తుంది. రెండోది ‘డెంకీ’ ఈ పందెంలో కాళ్లకు కత్తి లేకుండా నేరుగా పుంజుకు పుంజుకు పోటీకి ఉసిగొల్పుతారు. ఇందులో రూ.లక్షలు పందెం కాసి, గంటలు కొద్దీ పందాలు జరుపుతారు. కాకి, డేగ, కాకి నెమలి, పింగళి, నెమలి, కాకిడేగ, కక్కిరి, పాసి వంటి జాతులకు డిమాండ్ బట్టి రూ.ఐదు వేలు నుంచి లక్ష వరకూ ఇస్తారు. నదీ తీర ప్రాంతాలతోపాటు కొండపక్కల ఉన్న గ్రామాల్లో పందెందార్లు ప్రస్తుత కోళ్లను సిద్ధం చేస్తున్నారు. నరసన్నపేట మండలం లుకులాం, అంబాజీపేట, జలుమూరు మండలం మాకివలస, పర్లాం, చెన్నా యవలస, సారవకోట మండలం బొంతు, పోలాకి మండలం గంగివలస, సరుబుజ్జిలి మండలం యరగాం, పెద్దసవలాపురం, తెలికిపెంట తదితర గ్రామాలలో ఈ కోళ్ల పెంపకం జరుగుతుంది. -
Srikakulam: మృత్యు వలయంలో తాబేళ్లు
-
కూతురి సర్జరీ కోసం వెళితే.. ఏపీ ప్రభుత్వ ఆస్పత్రిలో పరిస్థితి ఇది
-
అధర్మాస్పత్రిలో అరణ్యరోదన
శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో రోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, ఇక్కడి సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఆమదాలవలస మండలం కొర్లకోటకు చెందిన హేమలత అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి సిబ్బంది తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన కుమార్తె హైందవితో కలిసి బుధవారం ఉదయం రిమ్స్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆమె మాట్లాడుతూ తన కుమార్తెను రెండు రోజుల క్రితం రిమ్స్‌కు తీసుకురాగా వైద్యులు మంగళవారం ఉదయం శస్త్రచికిత్స(కొండనాలుక వ్యాధి) పూర్తయ్యాక ఐసీయూలో ఉంచారని తెలిపారు. అక్కడకు వెళ్లినప్పటి నుంచి ఆపరేషన్ థియేటర్ సిబ్బంది తరచూ వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. వార్డుకు తరలించిన వారు సైతం డబ్బులు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేవని, మరుగుదొడ్లలో నీరు రావడం లేదని చెబితే తనపై కేకలు వేశారని వాపోయారు. కొందరు సిబ్బంది, వైద్యులు వచ్చి బయటకు వెళ్లి చికిత్స చేయించుకోమన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త పోలీస్ శాఖలో పని చేస్తున్నారని చెప్పినా డబ్బులు అడుగుతున్నారని, తమ పరిస్థితే ఇలా ఉంటే ఇక పేదల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అధికారులు ఆలోచించాలని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రిమ్స్‌లో సిబ్బంది పనితీరు అసలు బాగలేదని, ప్రతిదానికీ లంచాలు ఇవ్వాల్సి వస్తోందని ఆరోపించారు. సుమారు అరగంటకు పైగా ఆమె ఆస్పత్రి వద్ద బైఠాయించగా.. సూపరింటెండెంట్ ప్రసన్నకుమార్ ఆమెకు నచ్చజెప్పి వార్డుకు తీసుకువెళ్లారు. సిబ్బందిని పిలిపించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై గురువారం విచారణ జరిపిస్తామని హేమలతకు హామీ ఇవ్వడంతో ఆమె ఆందోళన విరమించి తిరిగి తన కుమార్తెను ఐసీయూలోకి తీసుకెళ్లారు. నివేదిక అందాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ ‘సాక్షి’కి తెలిపారు. -
శ్రీకాకుళం ట్రిపుల్ ఐటి క్యాంపస్ లో లైంగిక వేధింపులు
-
శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో లైంగిక వేధింపుల కలకలం
ఎచ్చెర్ల : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం శ్రీకాకుళం ప్రాంగణం పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో కొంత మంది అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తమను వేధిస్తున్నారని ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థినులు ఆర్జీయూకేటీ వైస్ చాన్స్‌లర్, రిజి్రస్టార్, డైరెక్టర్లకు ఈ – మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. తమతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, పరీక్షల నిర్వహణ విభాగంలోని బోధనేతర సిబ్బంది పాస్ చేయిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని, లైంగికంగా వేధిస్తున్నారని మెయిల్లో ఆరోపించారు. స్కాలర్‌షిప్‌ల కోసం వేలి ముద్రలు వేసే సమయంలో కొందరు బోధనేతర సిబ్బంది అసభ్యకరంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినులు ఈ నెల 11న ఫిర్యాదు చేయడంతో అప్పటి నుంచి క్యాంపస్‌లో దీనిపైనే చర్చ జరుగుతోంది. అయితే ఇది అనాధారిత మెయిల్ అని అధికారులు చెబుతున్నప్పటికీ... తమ పేరు బయటకు రాకుండా ఉన్నతాధికారులకు సమస్యలు నివేదించడానికి విద్యార్థులు ఇలా చేసి ఉండొచ్చని కొందరంటున్నారు. మెయిల్ ఎవరు చేశారనే కోణంలో కాకుండా ఫిర్యాదులోని వాస్తవాలపై విచారణ నిర్వహించాలని కోరుతున్నారు. మరోవైపు బోధనా సిబ్బందిలో చాలా మంది పాఠాలు చెప్పకుండా యూట్యూబ్, చాట్ జీపీటీలో చూసుకోమని సూచిస్తున్నారని విద్యార్థి సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు నేపథ్యంలో విద్యార్థుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కేజీవీడీ బాలాజీ తెలిపారు. -
కారుకు అడ్డంగా బండి పెట్టి నడి రోడ్డుపై రౌడీయిజం.. సీదిరిని లాక్కెళ్లిన పోలీసులు
-
సీదిరి అప్పలరాజును అడ్డుకున్న పోలీసులు
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీలు చేపట్టింది. జిల్లా కేంద్రాల్లో కోటి సంతకాల ప్రతులతో వైఎస్సార్సీపీ శ్రేణులు ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. జిల్లా కేంద్రాల నుంచి భారీ ర్యాలీలతో తాడేపల్లికి వైఎస్సార్సీపీ నేతలు తరలివస్తున్నారు. వైఎస్సార్సీపీ ర్యాలీల్లో ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.పలు చోట్ల కోటి సంతకాల ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అన్యాయంగా అడ్డుకోవడంపై అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా అడ్డుకుంటున్నారని అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రాల్లో కోటి సంతకాల ప్రతులతో వైఎస్సార్సీపీ ర్యాలీలు చేపట్టింది. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ పూర్తి చేసింది.విజయనగరంలో కోటి సంతకాల ర్యాలీకి అనుమతి నిరాకరణవిజయనగరంలో కోటి సంతకాల ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీస్ యాక్ట్-1861 సెక్షన్ 30 అమలులో ఉందంటూ విజయనగరం ఇన్చార్జ్ డీఎస్పీగోవిందరావు అనుమతి నిరాకరించారు. వైఎస్సార్ జంక్షన్‌కు. వైఎస్సార్సీపీ శ్రేణులు, విద్యార్థులు భారీగా చేరుకున్నారుమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉద్యమ స్ఫూర్తితో కొనసాగింది. ఇది ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. లక్ష్యానికి మించి సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగింది. దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ నెల 10 న అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగిన కార్యక్రమానికి విపరీతమైన స్పందన లభించింది. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు చేరుకున్న సంతకాలు ఇవాళ (సోమవారం) అక్కడి నుంచి ప్రత్యేక వాహనాలలో తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు. -
కంఠం కొరికి చంపేశాడు..?
శ్రీకాకుళం జిల్లా: మండలంలోని బెలమర గ్రామంలో దండుపాటి అప్పమ్మ(68) అనే వృద్ధురాలు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలాకి పోలీసులు బుధవారం కేసు నమో దు చేశారు. వివరాల్లోకి వెళితే.. మృతురాలి కుమారుడు మద్యానికి బానిసగా మారి భార్యాపిల్లలకు దూరంగా తల్లి అప్పమ్మ వద్ద కొంతకాలంగా ఉంటున్నాడు. తల్లీకొడుకులపై కోడలు అనురాధ గతంలో వేధింపుల కేసు పెట్టడంతో ఆ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అప్పమ్మ కంఠంపై గాయంతో మృతిచెందటంతో కొడుకు వెంకటరమణ మద్యం మత్తులో తల్లి కంఠం కొరికి చంపినట్లు ప్రచారం జరిగింది. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ రంజిత్ సిబ్బందితో వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. మృతురాలు అప్పమ్మకు అనారోగ్య సమస్యలు సైతం ఉన్నాయని, దర్యాప్తు అనంతరం స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. -
ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పై గిరిజనుల తిరుగుబాటు
-
ఒంటరి మహిళపై ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యం
-
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం
సాక్షి,శ్రీకాకుళం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో తుపాన్ వాహనంలోని నలుగురు ప్రయాణికులు ఘటనా స్థలంలో మృతి చెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు,పోలీసులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం కోటబొమ్మాళి ఆస్పత్రికి తరలించారు. బాధితులు ఒరిస్సా నుంచి విశాఖకు వెళుతుండగా ఆదివారం తెల్లవారు జామున ఘటన జరిగినట్లు సమాచారం.మృతులు భోరోసింగ్ పవర్ (60), విజయ్ సింగ్ తోమర్ (65), ఉషీర్ సింగ్ (62), సంతోషి భాయ్ (62)లుగా పోలీసులు గుర్తించారు. -
అక్కడి అమ్మాయి.. ఇక్కడి అబ్బాయి
శ్రీకాకుళం కల్చరల్: వివాహాల విషయంలో దేశాల హద్దులు కూడా చెరిగిపోతున్నాయి. శ్రీకాకుళానికి చెందిన శ్రీరంగనాథ్ సాహిత్, బెల్జియంకు చెందిన కెమిలీ శనివారం బలగ రోడ్డులోగల శాంతి కన్వెన్షన్ హాల్లో హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. సాహిత్ శ్రీకాకుళంలో పుట్టి ఇక్కడే చదువుకొని కంప్యూటర్ ఇంజినీర్‌గా హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. తాను పనిచేస్తున్న కంపెనీ ద్వారా లండన్ దేశానికి వెళ్లగా అక్కడ బెల్జియంకు చెందిన కెమిలీ పరిచయమైంది. పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు తీసుకువచ్చింది. ఇరు కుటుంబాల వారు పెళ్లికి సమ్మతించడంతో ఈ అరుదైన పెళ్లికి శ్రీకాకుళం వేదికగా నిలిచింది. వరుడి తల్లి తిరునగరి పద్మావతి హిందీ టీచర్‌గా శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్నారు. నగరంలోని హయాతినగరంలోని సాయిభవానీ నగర్కాలని మొదటి లైన్లో నివాసం ఉంటున్నారు. -
ప్రతి 100 మందిలో 18 మందికి కిడ్నీ వ్యాధులు
సాక్షి, శ్రీకాకుళం: అక్కడ ప్రతి 100 మందిలో కనీసం 18 మందికి కిడ్నీ వ్యాదులతో బాధపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని తీరప్రాంత మండలాలలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అడుగడుగునా కనిపిస్తారు. ఆ ప్రాంతంలో ఎవరిని కదిపినా వారి కిడ్నీ బాధలు గురించే చెబుతారు.ఉద్ధానం అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నిలయంగా మారిపోయింది. ఆ ప్రాంతంలో ప్రతి నూటి మందిలో 18 మందికి కిడ్నీ వ్యాధులు ఉన్నట్టు పరిశోధకులు నిర్ధారించారు. దాంతో ఆ ప్రాంతంలో పుట్టడమే తాము చేసిన నేరమా అంటూ అక్కడి ప్రజలు బాధపడుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఎందుకు ఇలా కిడ్నీ వ్యాదులు వ్యాపిస్తున్నాయి. అసలు ఆ వ్యాధి రావడానికి గల కారణాలను పరిశోధించడానికి వెద్య నిపుణులు సిద్ధమయ్యారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, కవిటి, కంచిలి, పలాస, మందస, వజ్రపుకొత్తూరు ప్రాంతాలలో తమ పరిశోధనలు జరుగుతున్నాయని వెద్య నిపుణులు చెబుతున్నారు. సుమారు ఆరు కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టుపై పరిశోధనలు చేస్తున్నామని వారు పేర్కొన్నారు.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కిడ్నీ వ్యాధులపై పరిశోధనలకు రూ.6.01 కోట్లతో అనుమతి ఇచ్చిందన్నారు. మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందన్నారు. కిడ్నీ వ్యాధుల మూలాలు కనుగొనేందుకు తొలి విడతలో 5,500 మంది నుంచి నమూనాలు సేకరిస్తామని తెలిపారు. ఆర్ఎన్ఏ సీక్వెన్సింగ్ విధానంలో జన్యుపరమైన పరీక్షలు కూడా ఈ పరిశోధనలో భాగంగా చేస్తామన్నారు. ఉద్దానంలోని వేర్వేరు ప్రాంతాల్లో మట్టి, నీరు, గాలి, వరిచేను, చేపలు, కూరగాయల నమూనాలు సేకరించి కూడా పరీక్షించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో కేజీహెచ్ కిడ్నీ వ్యాధుల విభాగాధిపతి డాక్టర్ జి.ప్రసాద్, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. -
నా కొడుకును కొట్టి చంపేశారు!
శ్రీకాకుళం క్రైమ్/ఎచ్చెర్ల: ట్రిపుల్ ఐటీ విద్యార్థి మరణంతో ఎచ్చెర్ల మండలంలోని ఎస్ఎంపురంలో ఉన్న ట్రిపుల్ ఐటీ కళాశాల ప్రాంగణంలో గురువారం తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సుమారు మూడు వేల మంది విద్యార్థుల ధర్నాలు, నినాదాలతో హోరెత్తింది. తోటి విద్యార్థి సృజన్ బుధవారం ఆత్మహత్య చేసుకోవడంతో ఇన్నాళ్లు వారిలో దాగి ఉన్న ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఓ మంచి విద్యార్థిని అన్యాయంగా చంపేశారనే భావన వారిని తీవ్రంగా కలచివేసింది. దీంతో కొన్నేళ్లుగా కళాశాలలో జూనియర్ విద్యార్థులపై సీనియర్లు చేస్తున్న ఆగడాలు బట్టబయలవ్వడమే కాక కళాశాలలో ఇన్నాళ్లు గుట్టుగా జరుగుతున్న అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏమీ తెలియదట.. విద్యార్థి సృజన్‌ను రాత్రంగా సీనియర్లు కొట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నా.. మరుసటి రోజు ఉదయం సృజన్ ఆత్మహత్య చేసుకున్నా అంబులెన్సు వస్తే గానీ తనకు తెలియదని క్యాంపస్ డైరెక్టర్ చెప్పడం అక్కడి యాజమాన్య నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. గతంలోనూ ఆత్మహత్య ఘటనలు జరగడంతో పోలీసుల సాయంతో ఈ సారి కూడా గొడవను సద్దుమణిగేలా చేద్దామని యాజమాన్యం తీవ్రంగా ప్రయతి్నంచింది. కానీ విద్యార్థుల ఆగ్రహం, ఆందోళనల ముందు ఇటు పోలీసులు, అటు కళాశాల యాజమాన్యం తలొగ్గక తప్పలేదు. కుటుంబసభ్యులు, విద్యార్థులు ఆ రాత్రి కొట్టింది తొమ్మిది మంది అని చెప్పినప్పటికీ పోలీసులు ఎట్టకేలకు 8 మందిని అదుపులోకి తీసుకోవడంతో కాస్త శాంతించి వెనుదిరిగారు. బుధవారం రాత్రే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లాకేంద్రంలోని రిమ్స్ ప్రభుత్వాసుపత్రికి తరలించినా.. శుక్రవారం విద్యార్థులు, సృజన్ కుటుంబీకుల ఆందోళనలు సద్దుమణిగాకే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఉత్తర్వుల మేరకు ఘటనకు బాధ్యులైన ఎనిమిది మంది విద్యార్థులు వై.అమిత్, ఎస్కే అనీష్ అహ్మద్, బి.అభిష్క్, జె.చిన్నబాబు, షేక్ అజీల్, ఎస్కే మస్తాన్, ఎస్కే సమీర్, ఎ.భానుప్రకాష్‌లను సస్పెండ్ చేశారు. తప్పుడు ప్రచారంపై మండిపాటు.. యాజమాన్యం పూర్తి నిర్లక్ష్య ధోరణి కనిపించడం.. మీడియా ముందు వాస్తవాలు చెప్పేందుకు కూడా ఆంక్షలు పెట్టడంతో విద్యార్థులు తట్టుకోలేకపోయారు. దీనికితోడు ‘సృజన్ బ్యాక్‌లాగ్స్ ఉంచేశాడు.. కళాశాలలో ఉన్న అమ్మాయితో చెడుగా ప్రవర్తించాడు.. అమ్మాయి సోదరుడు ఒక్కరే రెండు చెంపదెబ్బలు కొట్టాడు..’ వంటి తప్పుడు వదంతులు సృష్టించారంటూ మండిపడ్డారు. ఉదయం నుంచే ధర్నా.. సృజన్ తల్లిదండ్రులు, కుటుంబీకులు గురువారం ఉదయం 6 గంటలకు వచ్చారు. పరిస్థితి అదుపు తప్పక ముందే డీఎస్పీ సీహెచ్ వివేకానంద, సీఐ ఎం.అవతారం, ఎస్ఐ వి.సందీప్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో విద్యార్థులు రెండు బృందాలుగా విడిపోయి ధర్నాకు దిగారు. తమ బిడ్డను అన్యాయంగా చంపేశారని సృజన్ తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ లోగా కళాశాల యాజమాన్యం సమక్షంలో సృజన్ తల్లిదండ్రులతో డీస్పీ వివేకానంద, సీఐ అవతారంలు చర్చించారు. విద్యార్థుల ఆందోళనను విరమించేలా చొరవ తీసుకోవాలని కోరారు. అనంతరం పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకోవడం, సృజన్ తల్లిదండ్రులు సైతం విజ్ఞప్తి చేయడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.అవన్నీ అబద్ధాలే.. సృజన్ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. బ్యాక్‌లాగ్స్ ఉంచేశాడని, మంచివాడు కాడని, చదువు వల్ల చనిపోయాడన్నది నిజం కాదు. సీనియర్స్ దాడి చేశారన్నది నిజం. ముందు రోజు సృజన్‌పై దాడి ఎవరికీ తెలియదు. ఆత్మహత్య చేసుకున్నాక తప్పుగా పోలీసులకు వెళ్లింది. 11వ తేదీ రాత్రి 11 నుంచి 3 గంటల వరకు సీనియర్లు 9 మంది కొట్టి వేధించారు. తెల్లవారేసరికి అంతా పరీక్షలకు వెళ్లాం. సృజన్ రాలేదు. వచ్చేసరికి ఆత్మహత్య చేసుకున్నాడు. సృజన్ జూనియర్ విద్యారి్థనిని చెల్లి అని పిలుస్తాడు. అదే భావంతో ఉంటాడు. నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యారి్థని కజిన్‌కు ఈ విషయం నచ్చేది కాది. సృజన్‌ను హెచ్చరించాడు కూడా. అయినప్పటికీ సృజన్ చనిపోయే ముందు అమ్మాయి పిలిచి మాట్లాడటం వేరే వాళ్ల ద్వారా వారికి తెలిసింది. అందుకే ఇలా జరిగింది. – సృజన్ క్లాస్మేట్స్ ఏం ప్రయోజనం.. ఎంతమంది ధర్నాలు చేస్తే ఏంటి.? ఎంతమంది పోలీసులు వస్తే ఏంటి..? చెట్టంత కొడుకుపోయాడు. – జ్యోతి, సృజన్ తల్లి చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారు.. మా మేనల్లుడు సృజన్ కుర్చీ వేసుకుని ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడన్నారు. అది నిజం కాదు. వాడి ఎత్తు 5.9 అడుగులు. ఫ్యాన్ కూడా అందేస్తుంది. రాత్రి 11 నుంచి 3 వరకు హింసించి, కొట్టి చంపేశారు. అలా తెచ్చి ఫ్యాన్‌కు ఉరేసినట్లు కట్టారు. – చుక్కా శంకరరావు, మేనమామ కొట్టి చంపేశారు... నేను ఆటోడ్రైవర్‌ను. ఇంటర్ నుంచి ఇదే కళాశాలలో సృజన్‌ను చదివిస్తున్నాను. కుమారుడిని అన్యాయంగా కొట్టి చంపేశారు. కొట్టినవారిలో ఐదారుసార్లు డిబార్ అయినవారు కూడా ఉన్నారు. మీ సృజన్ అటువంటి వాడు కాదని, కావాలనే చెడు వ్యక్తిగా చిత్రీకరించారని 2వేల మందికి పైగా విద్యార్థులు అంటున్నారంటే మావాడు ఏమీ తప్పు చేయలేదని గ్రహించాలి. పోలీసులు న్యాయం చేయాలి. – శివకృష్ణ ప్రసాద్, సృజన్ తండ్రి -
సృజన్ ఆత్మహత్య వెనుక అసలు కారణం ఏమిటి?
శ్రీకాకుళం క్రైమ్/ఎచ్చెర్ల : జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీలో బుధవారం ఉదయం ప్రత్తిపాటి సృజన్ (21) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. తోటి విద్యార్థుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. విద్యార్థి మృతిపై స్థానికంగా విభిన్న కథనాలు వినిపిస్తుండగా పోలీసులు మాత్రం తల్లిదండ్రులు వస్తే కానీ ఏమీ చెప్పలేమని, ప్రస్తుతం విచారణ చేస్తున్నామని చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లాకు చెందిన సృజన్ ఎచ్చెర్ల ఎస్ఎంపురం సమీపంలోని ట్రిపుల్ ఐటీ ఇంజినీర్ విభాగంలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులందరితో సరదాగా ఉండే సృజన్ బుధవారం ఉదయం11 గంటలకు కళాశాలలోనే నిర్వహించే పరీక్ష రాయాల్సి ఉంది. ఈలోగా మొదటి అంతస్తులో ఉన్న ఈసీ డిపార్ట్మెంట్ విద్యార్థుల్లో ఒకరికి ఫోన్ చేసి రూంలో ఎవరైనా ఉన్నారా అని సృజన్ అడిగాడు. ఎవరూ లేరని చెప్పడంతో గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఎగ్జామ్ నుంచి వచ్చాక గది తలుపులు మూసి ఉండటంతో వెంటిలేటర్ నుంచి గమనించిన విద్యార్థులు ఏదో జరిగిందని అనుకుంటుండగా మెస్ ఆఫీసర్ రావడం.. అంతా చూసేసరికి ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించడంతో అవాక్కయ్యారు. వెంటనే కళాశాల యాజమాన్యం గుంటూరులో ఉన్న సృజన్ తల్లిదండ్రులకు సమాచారమివ్వడంతో వారు హుటాహుటిన బయల్దేరారు. ఎస్ఐ వి. సందీప్ తమ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు. విభిన్న కథనాలెన్నో.. కాగా సృజన్ ఆత్మహత్యపై అక్కడ విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. బ్యాక్‌లాగ్స్ 11 సబ్జెక్టులు ఉండటంతో ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడి వుంటాడని కొందరు అనుకుంటుండగా.. ఓ అమ్మాయితో స్నేహంగా ఉండటం.. ఆమె అన్నదమ్ములు అదే కళాశాలలో చదువుతుండటం.. వారు ఒకట్రెండు సార్లు సృజన్‌ను హెచ్చరించడం చేశారని తెలిసింది. అంతేకాక మంగళవారం రాత్రి పది మందివరకు కళాశాలలో ప్రవేశించారని, వారి వెనుక ఆ విద్యార్థులున్నారని, సృజన్‌ను కొట్టారని సమాచారం. ఎస్ఐ సందీప్ మాట్లాడుతూ అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని తల్లిదండ్రులు వచ్చేంతవరకు ఏమీ చెప్పలేమన్నారు. ఐదుగురితో పోలీస్ పికెట్ మృతిచెందిన విద్యార్థి దళిత సామాజికవర్గానికి చెందడంతో క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. నలుగురు కానిస్టేబుళ్లు, ఒక ఎస్ఐతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
శ్రీకాకుళం ఎచ్చెర్ల IIIT విద్యార్థుల ఆందోళన
-
ప్రిన్సిపాల్ వేధింపుల వల్లే... భవనంపై నుంచి దూకేశా
శ్రీకాకుళం క్రైమ్: ‘నేను బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి, రెండు కాళ్లు విరిగి నా చదువు అర్ధంతరంగా ఆగిపోవడానికి ప్రిన్సిపాల్ సీపాన లలిత కారణం’ అని శ్రీకాకుళం జిల్లా పొందూరు కసూ్తర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో రెండు నెలల కిందట ఆత్మహత్యకు ప్రయత్నించిన దళిత విద్యార్థిని తెలిపింది. కులం పేరుతో తనను, తన తల్లిని ప్రిన్సిపాల్ తీవ్రంగా దూషించడం వల్లే చనిపోవాలని ప్రయత్నించానని ఆమె వెల్లడించింది. ప్రస్తుతం శ్రీకాకుళం రిమ్స్‌లోని ఆర్థోపెడిక్ వార్డులో చికిత్స పొందుతున్న ఆ విద్యార్థిని గురువారం మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనను తెలియజేసింది. ‘మీరు ఎస్సీ వాళ్లు అసహ్యంగా ఉంటారు. మీ ఎస్సీ కాలనీలో నుంచి రావాలంటే చాలా చిరాకుగా ఉంటుంది.ఇప్పుడు మీరు మా హాస్టల్లో జాయిన్ అయ్యారు. మీ పక్కన నిల్చోవాలంటే చాలా అసహ్యం. మీ అమ్మ బ్యాండ్ మేళానికి వెళ్తుంది కదా? నీవు కూడా వెళ్తావా? మీరు ఎందుకింత మురికిగా ఉన్నారు. మీ అమ్మ తప్పుడు మనిషి కదా? నువ్వు అబ్బాయిలా బిహేవ్ చేస్తున్నావు. పీజీటీ మేడమ్స్ ఏమైనా నీకు తప్పుడు పనులు నేర్పిస్తున్నారా?’ అని ఎస్వో(ప్రిని్సపాల్) మేడమ్ తరచూ వేధించేవారు అని విద్యార్థిని ఆవేదన వ్యక్తంచేసింది. అంతేకాకుండా తనపై తన తల్లిపై పలు తప్పుడు వదంతులు వ్యాప్తిచేశారని తెలిపింది. ఏఎన్ఎం, అటెండర్, అకౌంటెంట్ సర్ కూడా వేధించారు.ఇలా తరచూ అసభ్య మాటలతో వేధించడం వల్లే అందరూ పడుకున్నాక బిల్డింగ్‌పై నుంచి దూకేశానని తెలిపింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఉన్న తనవద్దకు ఏపీసీ సర్, ప్రిని్సపాల్ మేడమ్ వచ్చి బెదిరించారని, అందువల్లే అప్పుడు కాలుజారి పడిపోయినట్లు పోలీసులకు తప్పుగా చెప్పానని వివరించింది. రెండు నెలలుగా రిమ్స్‌లో చికిత్స పొందుతున్నానని, కుడి కాలికి ఆరు ఆపరేషన్లు అయ్యాయని, ఎడమ కాలికి పిండికట్టు కట్టారని, పట్టించుకునే నాథుడే లేరని ఆ విద్యార్థిని వాపోయింది.న్యాయం చేస్తామని తప్పించుకున్నారు: విద్యార్థిని తల్లితన భర్త చనిపోయాక కూలి పనులు చేసుకుంటూ పిల్లలను చదివిస్తున్నానని బాలిక తల్లి లక్ష్మి తెలిపారు. తన కుమార్తెను ఆరో తరగతి నుంచి కేజీబీవీలోనే చదివించానని చెప్పారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఉన్న తన కుమార్తె వద్దకు తాను లేని సమయంలో ప్రిన్సిపాల్ లలిత, ఏపీసీ వచ్చి తప్పుగా స్టేట్మెంట్ ఇప్పించారని పేర్కొన్నారు. ఆ రోజు వారిని ప్రశ్నిస్తే న్యాయం చేస్తామని చెప్పి తప్పించుకున్నారని తెలిపారు.ఇప్పటి వరకు వారి నుంచి గానీ, ప్రభుత్వం నుంచి గానీ ఎలాంటి సాయం అందలేదన్నారు. తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై గత నెల 25న శక్తి యాప్‌లో, పది రోజుల క్రితం పొందూరు పోలీస్‌స్టేషన్‌లో, గత నెల 15న నేషనల్ చైల్డ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశామన్నారు. అయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికైనా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు. -
Srikakulam: టీచర్‌పై సస్పెన్షన్ వేటు
శ్రీకాకుళం జిల్లా: బందపల్లి బాలికల గిరిజన సంక్షేమ వసతి గృహంలో ఉపాధ్యాయిని యవ్వారం సుజాతపై సస్పెన్షన్ వేటు పడింది. ఈమె విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న వీడియో వైరల్ అయ్యింది. నిజానికి గత నెలే ఈ వీడియో అధికారులకు చేరింది. కానీ బయటకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ప్రస్తుతం ఆ వీడియో బయటపడి వైరల్ కావడంతో టీచర్‌ను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీడియోపై టీచర్‌ను వివరణ కోరడానికి ‘సాక్షి’ సంప్రదిస్తే ఆమె మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఎప్పడు జరిగిందో నాకు తెలియదుఇప్పటివరకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నాకు తెలియవు. సోషల్ మీడియా లో ఫొటో చూశాను అంతే. ఇది ఎప్పుడు జరిగిందో కూడా నాకు తెలియదు పై అధికారులకు తెలియజేశాను. – ఎస్.దేవేంద్రరావు ఎంఈఓ, మెళియాపుట్టివీడియో ఎవరు తీశారో తెలీదు వీడియో బయటకు రావడంతో పీఓ ఆమెకు నెల కిందటే షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దానికి ఆమె సమాధానం ఇ చ్చారు. ఏం వివరణ ఇచ్చారో నాకు తెలీదు. టీచర్‌ను వివరణ కోరగా.. ఆరోగ్యం బాగోక అలా చేశానని తెలిపా రు. – దార ప్రశాంతి కుమారి, ప్రధానోపాధ్యాయురాలు #Srikakulam —A teacher from Bandapalli Girls’ Tribal Ashram School has been suspended after a video showing her talking on the phone while students massaged her legs went viral on social media.The teacher, identified as Sujatha, was captured in the video sitting and speaking… pic.twitter.com/KoaUZikGSm— NewsMeter (@NewsMeter_In) November 4, 2025 rikakulam Teacher Viral Video -
శ్రీకాకుళం : దక్షిణ కాశీ అని పిలువబడే ఈ ఆలయాన్ని మీరు సందర్శించారా? (ఫొటోలు)
-
తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు జరపాల్సిందే
-
అందరూ బాగుండాలి అని గుడి కడితే నా మీద కేసులు పెడతారా..!
-
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట... తొమ్మిది మంది భక్తులు మృతి... 20 మందికి పైగా గాయాలు
-
ప్రచారమే ప్రాణం తీసింది.. కాశీబుగ్గ ఆలయ వివరాలు..
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని కాశీబుగ్గలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట కారణంగా పది మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఆలయానికి దాదాపు 25వేల మంది భక్తులు వచ్చినట్టు తెలిసింది. ప్రమాదం తర్వాత ఆలయం గుర్తించి పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 12 ఎకరాల్లో ఆలయం..కాశీబుగ్గ పదనాపురం నాలుగేళ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణాన్ని ధర్మకర్త హరిముకుంద్ పండా ప్రారంభించారు. 12 ఎకరాల సొంత భూమిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయం ఐదు ఎకరాల్లో ఉంది. సుమారు రూ.20 కోట్లతో దీనిని నిర్మించారు. కాగా, తనకు తిరుమల వెళ్లిన సమయంలో దర్శనం కాకపోవడంతోనే ఇక్కడ ఆలయం నిర్మించినట్టు తెలిసింది. ఇక, కొత్తగా నిర్మించిన ఆలయంలో మే నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. చిన్న తిరుపతిగా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి క్షేత్రం ప్రసిద్దిలోకి వచ్చింది. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం గురించి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కూడా చేశారు.గుడి నిర్మించిన హరి ముకుంద పాండా25వేల మంది భక్తులు.. దీంతో, ఆలయానికి ప్రతీరోజు దాదాపు 1000 మంది వరకు భక్తులు వస్తున్నారు. ప్రతి శనివారం ఈ ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తారు. ఆలయ సామర్థ్యం దాదాపు రెండు వేల నుంచి మూడు వేలుగా ఉందని పలువురు చెబుతున్నారు. అయితే, ఈరోజు ఏకాదశి నేపథ్యంలో ఆలయానికి దాదాపు 25వేల మంది భక్తులు వచ్చినట్టు సమాచారం. కాగా, భక్తుల రద్దీని పోలీస్ ఇంటలిజెన్స్ విభాగం, ఆలయ కమిటీ అంచనా వేయలేదు. ఆలయ కమిటీ సొంతగా భద్రతను సైతం ఏర్పాటు చేయలేదు. వేల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినప్పటికీ పోలీసు సిబ్బంది రాలేదు. గంట సమయం దాటినా ఘటనా స్థలానికి 108 అంబులెన్స్ చేరుకోలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. -
కాశీ బుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. ప్రమాదం ఎలా జరిగిందంటే ?
-
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. 9 మంది మృతి
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలో(Srikakulam Stampade) విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో(Kashibugga Temple) తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో పది మందికి గాయపడినట్టు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వివరాల ప్రకారం.. కార్తీక మాసం నేపథ్యంలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈరోజు ఏకాదశి కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ కారణంగా ఆలయంలో ఉన్న రెయిలింగ్ ఊడిపోయి భక్తులు కిందపడిపోయారు. అనంతరం, తొక్కిసలాట చోటుచేసుకుంది. ప్రమాదం కారణంగా 9 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు.అయితే, ఓ భక్తుడు.. తనకు తిరుమలలో దర్శనం కాలేదని సొంతంగా ఆలయాన్ని నిర్మించాడు. 12 ఎకరాల విస్తీర్ణంలో ఆలయం ఉంది. దీంతో, ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిలా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది. చిన్న తిరుపతిగా పేరు రావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఏకాదశి సందర్బంగా ఆలయ అధికారులు, ఆలయ సిబ్బంది.. భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. దీంతో, అధికారుల నిర్లక్క్ష్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ సిబ్బంది ఉదాసీనతే ప్రమాదానికి ముఖ్య కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు. మృతులు వీరే..ఇదురి చిన్నమ్మి(50),రామేశ్వరం, టెక్కలిరాపాక విజయ(48), టెక్కలిమురిపింటి నీలమ్మ(60), దుక్కవానిపేట, వజ్రపుకొత్తూరుదువ్వు రాజేశ్వరి(60), బెలుపటియ, మందసచిన్ని యశోదమ్మ(56), శివరాంపురం, రూప, గుడిభద్రలొట్ల నిఖిల్(13), బెంకిలి, సోంపేటడొక్కర అమ్ముడమ్మ, పలాసబృందావతి(62), మందస కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతికాశీబుగ్గ తొక్కిసలా ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు. మృతులకు రెండు లక్షలు, గాయాల పాలై వారికి 50 వేలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. -
బీల భూముల్లో.. మొగలి పరిమళాలు
కవిటి: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం బీలప్రాంతంలో పంట భూములకు రక్షణగా ఏర్పాటు చేసుకున్న మొగలిచెట్లు రైతులకు పెట్టుబడి లేని ఆదాయవనరుగా మారాయి. ఏడాదిలో ఆరు నెలలకు పైగా మంచి ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. పండగలు, ఇతర సీజన్లో ఒక్కో పువ్వు రూ.40 నుంచి రూ.42 వరకు అమ్ముడుపోతుంటాయి. ఇక్కడి రైతులు వేకువజామునే చేతిలో దొనికత్తి పట్టుకుని వెళ్లి మొగలిపూల సేకరణలో నిమగ్నమవుతుంటారు. అదృష్టం కలిసివస్తే ఒక్కోవ్యక్తి రోజుకు 20 పువ్వుల వరకు దొరుకుతాయి. ప్రభుత్వపోరంబోకు భూమిలోనివైతే ఎవరైనా కోసుకోవచ్చు. అదే రైతు తన తోటలో మొగలిచెట్లు నాట్లు వేస్తే వాటిని సదరు రైతు మాత్రమే కోయాల్సి ఉంటుంది. ప్రత్నామ్నాయ పంటగా.. ఇటీవల కాలంలో రైతులు తమ భూముల్లో వరి, చోడి తదితర పంటలకు ప్రత్యామ్నాయంగా మొగలిపంట సాగుకే మొగ్గు చూపుతున్నారు. వర్షాధారంగా కవిటి ఉద్దానం బీలలోని చిత్తడి నేలల్లో నీటి ఊ టలే పదునుగా మొగలి పంట వస్తోంది. ఇప్పటికే కొంతమంది రైతులు తమ భూముల్లో మొగలి డొంకల్ని పెంచుతున్నారు. వారి వద్ద నుంచి పంట కోసుకునేందుకు ఏడాదికి కొంత మొత్తం చెల్లించి కాంట్రాక్ట్ పొందుతారు. అలా రైతుల భూములు లీజుకు తీసుకున్న కొందరు ఇదే పంటపై మంచి ఆదాయం పొందుతున్నారు. స్వల్పవ్యవధిలో ఏపుగా పెరిగే మొక్కల కోసం పొరుగు రాష్ట్రం ఒడిశాకు వెళ్లి నాణ్యమైన మొగలి అంట్లను కూడా ఇక్క డికి తీసుకొస్తున్నారు. మన వద్ద లభించే మొగలి మొక్కల కన్నా ఒడిశా మొక్కల నుంచి వచ్చే పూల కు గిరాకీ ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. వీరంతా ఇక్కడి నుంచి ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో ఒడిశా వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. భలే ఆదాయం.. కపాసుకుద్థి రెవెన్యూలో రెండున్నర ఎకరాల పొలం ఉంది. ఇందులో రెండు ఎకరాలలో వరిసాగు చేస్తున్నాం. మిగిలిన 30 సెంట్ల భూమిలో గట్టు చుట్టూ మొగలి మొక్కలు నాటాం. ఏడాది కి రూ.40,000 లీజుకు కుదుర్చుకోవడం ద్వారా మొగలిపంట నుంచి ఆదాయం వస్తోంది. – ఆరంగి శివాజీ, చిక్కాఫ్ సంస్థ ఎండీ, ముత్యాలపేట ఒడిశా నుంచి మొక్కలు.. కొబ్బరి, వరికి ప్రత్యామ్నాయంగా ఒడిశా వెళ్లి మొగలి అంట్లు తెచ్చినాటాను. బాగా ఎదిగేందుకు ఆవుపేడ మొదళ్లలో వేశాను. మొక్కలు చక్కగా పెరిగాయి. బాగా కలిసి వస్తుందనే నమ్మకంతో మొగలిసాగు చేసేందుకు నిర్ణయం తీసుకున్నాను. – బంజు పాపారావు, మొగలిసాగుదారు, కె.కపాసుకుద్ధి -
సకలైశ్వర్య ప్రదం శ్రీముఖలింగ లింగేశ్వర దర్శనం
ఎక్కడైనా శివుడు లింగాకారంలో ఉంటాడు. ఈ క్షేత్రంలో మాత్రం ముఖం దాల్చి ఆవిర్భవించాడు. అందుకే ఈ క్షేత్రానికి శ్రీముఖలిగమని, ఇక్కడ కొలువైన శివుని ముఖలింగేశ్వరుడని పిలుస్తారు. స్వామివారి గర్భాలయంలో మూలవిరాట్టుకి వెనుక పెద్ద మట్టి గోలెం ఉన్నది. అది ఎంత పెద్ద గోలెమంటే గర్భాలయ ద్వారం పట్టనంత. స్థల పురాణం ప్రకారం ఆ కథ ఇలా ఉంది...శ్రీముఖలింగం గ్రామానికి చెందిన కుమ్మరి నాగన్నకు వివాహమై ఎంతో కాలం గడిచినా సంతానం లేదు. దాంతో సంతానం కోసం స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటాడు. తనకు కుమారుడు పుడితే ఓ పెద్ద మట్టి గోలెం చేసి దాని నిండా ఆవుపాలు పోసి అభిషేకం చేస్తానని మొక్కుకున్నాడు. కొన్నాళ్లకు ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో నాగన్నకు ఒక కొడుకు పుట్టాడు. మొక్కు చెల్లించుకోవడానికి ఓ పెద్ద మట్టి గోలెం చేసి దాని నిండా పాలుపోసి దానిని గర్భాలయంలోనికి తీసుకు పోవడానికి ప్రయత్నిస్తాడు. అది గర్భ గుడి ద్వారం పట్టనంత పెద్ద గోలెం అవడంతో గర్భాలయంలోనికి తీసుకవెళ్లలేక పోయాడు. దీంతో ఆ గోలేన్ని ఆలయ ముఖమంటపంలోనే విడిచి పెట్టి ఎంతో దుఃఖిస్తూ గోలెంతోపాటు తనకు ఆ పరమ శివుడు ప్రసాదించిన బిడ్డను కూడా అక్కడే వదిలి ఇంటికి వెల్లిపోతాడు. మర్నాడు స్వామి వారి నిత్యపూజలకై అర్చకులు గర్భగుడి తలుపులు తీసి చూడగా ఆ గోలెం మూలవిరాట్టు వెనకాల ఉన్నది. అలాగే నాగన్నకు పుట్టిన బిడ్డ కూడా గోలెం పక్కనే బోసినవ్వులతో ఆడుకుంటున్నాడు. ఇది చూసిన నాగన్నతో సహా గ్రామస్తులంతా ముఖలింగేశ్వరుని మహాత్యాన్ని వేనోళ్ల సుత్తించారు.న్యాయమైన కోర్కెలు తీర్చే నాగాభరణుడుఈ గోలెంలో పాలతోపాటు బియ్యం, వడ్లు (ధాన్యం) మంచినీరు, అన్నం, పండ్లు, బెల్లం ఇలా భక్తులు మొక్కులకు అనుగుణంగా ఆ గోలేం నిండుగా వేసి మొక్కులు తీర్చుకుంటారు. ఫలితంగా సంతాన యోగం, గ్రహాదోషాలు నివారణ, వివాహాలు, ఉద్యోగాలు, విదేశాలలో చదువులు, ఇతర న్యాయపరమైన కోర్కెలు తీరుతాయని స్థలపురాణంతోపాటు అర్చకులు చెబుతున్నారు. ఇలా తమ కోర్కెలను తలచుకొని ఆ గోలేన్ని ముట్టుకొని ఆ పరమేశ్వరుని నిండు మనస్సుతో ప్రార్థిస్తే కోరిన కోర్కెలు కొద్ది కాలంలో తీరుతాయన్నది భక్తుల నమ్మకం.కార్తీక మాసం ప్రత్యేక పూజలుమన రాష్ట్రంలో రాయలసీమతోపాటు ఒడిశా, చత్తీస్ ఘడ్ తదితర రాష్ట్రాల వారికి కార్తీక మాసంలో ఎక్కువగా దైవచింతన, గుడులు, తీర్ధయాత్రలు చేయడం సంప్రదాయం. ఇందులో భాగంగా శ్రీముఖలింగంలో ఈ నెల రోజులపాటు ఆయా రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ మాసంలో శ్రీ ముఖలింగేశ్వరుని దర్శించుకుని మొక్కులు మొక్కుకుని వెళుతుంటారు. కోర్కెలు తీరిన భక్తులు స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు విచ్చేస్తుంటారు. – సుంకరి శాంత భాస్కర్,సాక్షి, జలుమూరు, శ్రీకాకుళం జిల్లా (చదవండి: సర్వదోషాల నివారణకు నాగుల చవితి పూజ) -
Srikakulam: నాగబాబు పర్యటన కూటమి నేతలు ఫైర్
-
అకేషన్ ఏదైనా సరే.. బొమ్మలతో కళ
బొమ్మలు మాట్లాడవు.తమ గురించి మాట్లాడేలా చేస్తాయి.అలా మాట్లాడాలంటే ఆర్టిస్ట్‌లో అద్భుత సృజన ఉండాలి. అలాంటి ఒక ఆర్టిస్ట్ ఆమదాలవలసకు చెందిన ప్రియాంక.శుభకార్యాలకు తగ్గట్టు రకరకాల థీమ్స్‌తో బొమ్మల సిరీస్ రూపొందిస్తూ పాతకళకు కొత్త కళ తీసుకువస్తోంది ప్రియాంక...‘చిన్నప్పుడు ఆడుకున్న ఆటల్లో బొమ్మలే నా బతుకు బండిని నడిపిస్తాయని నేను అసలు ఊహించనే లేదు’ అంటుంది ప్రియాంక. బొమ్మల ద్వారా నేటి తరానికి సంప్రదాయ విలువలను వివరించడంలో ఆనందం ఉందంటారు ఆమె. తన మనసులో మెదిలిన ఊహకు సృజనాత్మకంగా ప్రాణం పోస్తూ, బొమ్మలను థీమ్‌కు తగ్గట్టు రూపొందిస్తూ వినియోగదారుల మనసు గెలుచుకుంటుంది ప్రియాంక. ఆ బొమ్మలు సనాతన సంప్రదాయాలకు ప్రతీకలుగా కనిపిస్తాయి. కనుమరుగ వుతున్న కళలు కళ్లముందు కనబడతాయి.అనుబంధాల రైలుబండికాంక్రీట్ జంగిల్లో న్యూక్లియిర్ ఫ్యామిలీల నడుమ దూరమవుతున్న అనుబంధాలు ప్రియాంక తయారుచేసే బొమ్మలతో గుర్తుకు వస్తాయి. ఆమదాలవలసకు చెందిన ఒక పెద్దాయన 60వ పుట్టిన రోజు వేడుకను భిన్నంగా చేయాలని కుటుంబ సభ్యులు ఆలోచించారు. ప్రియాంకకు విషయాన్ని వివరించారు. అరవై ఏళ్లలో జరిగిన ఘట్టాలను అద్భుతమైన రీతిలో బొమ్మల రూపంలో కళ్లకు కట్టేలా తీర్చిదిద్దింది ప్రియాంక. అన్నప్రాసన వేడుక నుంచి పదవీ విరమణ వేడుక వరకు... ఆ పెద్దాయన జీవితంలోని వివిద దశలను చిన్న రైలుబండి మాదిరిగా బొమ్మల్లో తయారు చేసి శభాష్ అనిపించుకుందిజచదవండి: మొరింగా సాగుతో.. రూ. 40 లక్షల టర్నోవర్తాళికట్టు శుభవేళపలాసకు చెందిన ఒక వ్యాపారి నూతన గృహ ప్రవేశ వేడుకను భిన్నంగా చేయాలనుకున్నాడు. కాన్సెప్ట్‌ను వివరించాడు. బిల్డింగ్ నమూనా నుంచి సత్యనారాయణ వ్రతం, గో మాత ప్రవేశంతో సహా అన్నింటిని చక్కని బొమ్మలతో కళ్లకు కట్టింది ప్రియాంక. శుభకార్యానికి వచ్చిన అతిథులంతా ఈ థీమ్‌ను చూసి భలే ముచ్చట పడ్డారు. శ్రీకాకుళం నగరంలోని ఒక కార్పొరేట్ బ్యాంక్‌లో నవరాత్రి పూజలు నిర్వహించాలని బ్యాంక్ సిబ్బంది భావించారు. రెండు రోజులు కష్టపడి నవరాత్రి వేడుకల థీమ్‌ను తయారు చేసి బ్యాంక్‌ను లక్ష్మీనిలయంగా మార్చింది ప్రియాంక. వివాహ వేడుకకు ప్రారంభ ఘట్టమైన గోధుమరాయి కార్యక్రమం నుంచి తాళికట్టు శుభవేళ వరకు తయారు చేసిన వెడ్డింగ్ సెట్ ప్రియాంక స్పెషల్. ఆ సెట్ చూస్తే మన కళ్లముందే పెళ్లి జరిగినంత సంబరం మన సొంతం అవుతుంది.చదవండి: అంబానీ వంటింట్లో పెత్తనం పెద్ద కోడలిదా? చిన్నకోడలిదా?ఇదే నా ప్రపంచంచిన్నప్పుడే కాదు పెద్దయ్యాక కూడా బొమ్మలను వదల్లేదు. అమ్మ సాయంతో వాటిని చక్కగా అలంకరించడం చిన్నప్పటి నుంచి నా అలవాటు. డిగ్రీ పూర్తయింది. ఉపాధి కోసం ఏదో ఒకటి చేయాలి అనుకున్నాను. బొమ్మలతోనే కొత్తగా ఏదైనా చేయాలనుకున్నాను. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. నా ఆలోచనలను నాన్నతో పంచుకున్నాను. ఆయన ప్రోత్సహించారు. వర్క్‌షాపులో కొంత భాగం నన్ను వినియోగించుకోమన్నారు. ఆర్టిస్టిక్‌గా షోరూమ్‌ను సిద్ధం చేశారు. విభిన్న రకాల థీమ్‌లను సిద్ధం చేశాను. సోషల్ మీడియా వేదికగా నేను తయారుచేసిన బొమ్మలను, ఫొటోలను షేర్ చేయడం మొదలుపెట్టాను. ఆర్డర్లు పెరిగాయి. బొమ్మల ద్వారా సంప్రదాయాల్ని వివరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. – ప్రియాంక– దువ్వూరి గోపాలరావు,సాక్షి, శ్రీకాకుళంఫొటోలు: జయశంకర్ కుప్పిల -
Diwali 2025: ఆ పండుగ పేరుతోనే రెండు గ్రామాలు..కానీ అక్కడ..
దీపావళి అనగానే టపాసులు, బాణ సంచాలతో సరదాగా సాగే పండుగ. పెద్దలు సైతం చిన్నపిల్లల్లా మారిపోయి ఎంజాయ్ చేసేలా చేసే వేడుక ఇది. ఈ పండుగ ఇంటే అందరికీ మహా ప్రీతి. అలాంటి పండుగ పేరుతోనే రెండు గ్రామాలు ఉన్నాయి. అది కూడా ఒకే జిల్లాలో రెండు గ్రామాల పేర్లు దీపావళి. అయితే ఒక చోట ఈ పండుగ ఐదు రోజులు పాటు ఘనంగా నిర్వహిస్తే..మరోచోట మాత్రం ఏ ఇంట్లో దీపమే వెలిగించరు. మరి ఆ పండుగ పేరుతో ఏర్పడిన ఆ రెండు గ్రామల వెనుక ఉన్న ఆసక్తికర కథేంటో తెలుసుకుందామా..!.. దీపాల కాంతితో కళకళలాడే ఈ దీపావళి పండుగ పేరుతో ఉన్న రెండు గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. ఒకటి శ్రీకాకుళం జిల్లాకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న గారమండలంలో ఉండగా, మరొకటి టెక్కలి మండలం అయోధ్యాపురం పంచాయతీ పరిధిలో మరో గ్రామం ఉంది. ఈ రెండు గ్రామాల పేర్లు 'దీపావళి'. వాటికి ఈ పండుగ పేరు ఎలా వచ్చిందంటే..గారమండలంలోని ఊరుకి ఆ పేరు ఎలా వచ్చిందంటే..శ్రీకాకుళం ప్రాంతాన్ని పరిపాలించిన కళింగరాజు కూర్మనాథాలయానికి వచ్చే వారట. స్వామి దర్శనం చేసుకుని తిరిగి వెళుతుండగా.. స్ప్రుహ తప్పి పడిపోయారు. అప్పుడు అక్కడ ఉండే స్థానికులు ఆ రాజుకి సపర్యలు చేశారు. కొద్దిపేపటికి మెలుకువ వచ్చిన తర్వాత రాజు తనకు సపర్యలు చేసిన వారిని ఈ గ్రామం పేరెంటని అడగగా..తమ ఊరికి పేరు లేదని చెప్పారట గ్రామస్తులు. దాంతో రాజుగారు తనకు దీపావళి నాడు ఇక్కడి ప్రజలు ప్రాణదానం చేసి సాయం చేశారు కాబట్టి ఈ ఊరు పేరు 'దీపావళి' అని నామకరణం చేశారని అక్కడ స్థానికులు చెబుతున్నారు. అధికారిక రికార్డుల్లో సైతం ఈ గ్రామానికి అదే పేరు స్థిరపడి ఉండటం విశేషం. ఆ పండుగ రాజుగారి రాజరికదర్పానికి తగ్గట్టుగా ..ఆ రేంజ్‌లోనే అక్కడి ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారట. మొత్తం ఐదు రోజుల పాటు ఘనంగా ఈ పండుగను నిర్వహిస్తారట. అంతేగాదు గ్రామం మొత్తం వేల దీపాలను వెలిగించి..నాటి చారిత్రక ఘటనకు గుర్తుగా తమ గ్రామం ప్రమిదల కాంతితో దేదీప్యమానంగా వెలిగిపోయాల వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ ఊరికి మాత్రం గమ్మత్తుగా వచ్చిందా పేరు..శ్రీకాకుళం జిల్లాలోనే టెక్కలి మండలం అయోధ్యాపురం పంచాయతిలో ఉన్న ఈ గ్రామం పేరు కూడా 'దీపావళినే'. అయితే దీన్ని మొదట్లో చుట్టుపక్కల గ్రామల ప్రజలు దీపాల పేటగా పిలిచేవారట. రానురాను వాడుకభాషలో దీపావళి ఊరుగా స్థిరపడిందట . అయితే ఇక్కడ ప్రజలెవ్వరూ దీపావళి పండుగను జరుపుకోరు. అక్కడ ఏ ఒక్క ఒక్క ఇంట్లో కూడా ప్రమిదలు వెలిగించరు. ఎందుకంటే..ఎలుక కారణంగా దూరమైన పండుగ..పూర్వం ఈ గ్రామంలో ప్రతి ఇల్లు తాటాకు గుడిసెలే. పైగా కరెంటు సదుపాయం కూడా ఉండేది కాదట. దీంతో ఇళ్లల్లో నూనె దీపాలు వెలిగించి ఉంచేవారట. దీపావళి పండుగ రోజు ఓ ఎలుక దీపాన్ని దొర్లించడంతో ఓ గుడిసెకు అంటుకున్న మంటలు ఊరంతో వ్యాపించి..మొత్తం గ్రామంలో విషాదం నెలకొందట. దాంతో అప్పటి నుంచి ఈ గ్రామంలో దీపావళి పండుగనే జరుపుకోవడం లేదట. అంతేగాదు ఇక్కడ నాగుల చవితిని కూడా జరుపుకోరట. ఒకవేళ ఎవ్వరైన చేస్తే..ఆ ఇంట్లో ఎవ్వరో ఒకరు చనిపోవడం జరుగుతుందట. దాంతో అక్కడి స్థానిక ప్రజలు ఈ రెండు పండుగలను ఎట్టిపరిస్థితుల్లోనూ జరుపుకోరని చెబుతున్నారు. ఈ మూఢనమ్మకాలకు తిలోదాకాలు ఇచ్చి..ఎలాగైనా ఈ పండుగను మిగతా గ్రామాల మాదిరిగానే చేసుకోవాలని అక్కడి యువత గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు పలువురు పెద్దలు చెబుతుండటం విశేషం.(చదవండి: చంద్రభాగ బీచ్..! సైకత శిల్ప వేదిక..) -
భార్యను చంపి ప్రమాదంగా చిత్రీకరించి..
కొరాపుట్(ఒడిషా): భార్యను చంపేసి.. ప్రమాదంగా చిత్రించాడో ప్రబుద్ధుడు. ఆయన పోలీసు కావడం విశేషం. కొరాపుట్ జిల్లా కేంద్రంలో ఓఎంపీ కాలనీలో ఐఆర్బీ జవాన్ శివ శంకర్ పాత్రో నివాసంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి అతని భార్య ప్రియాంక పండా మృతి చెందిన విషయం పాఠకులకు తెలిసిందే. అందరూ ఇది ప్రమాదమే అని అనుకున్నారు. కానీ ప్రియాంక తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి కొరాపుట్‌లో సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత కేసు మలుపు తిరిగింది. వారు తమ కుమార్తె మృతదేహం చూసి అనుమానం వ్యక్తం చేయడంతో అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం నిందితుడిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..శ్రీకాకుళం జిల్లా టెక్కలి పెద్ద బ్రాహ్మణ వీధికి చెందిన తరణి పండా తన కుమార్తె ప్రియాంకని నబరంగ్‌పూర్ జిల్లా డాబుగాంకి చెందిన ఐఆర్బీ కానిస్టేబుల్ శివ శంకర్ పాత్రోకి ఇచ్చి గత ఏడాది జులై 11న టెక్కలిలో వివాహం జరిపించారు. వివాహ సమయంలో 12 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు వరకట్నంగా ఇచ్చారు. నూతన దంపతులు కొరాపుట్ ఓఎంపీ కాలనీ నివాసం ఉండడంతో వారికి అవసరమైన సారె కింద ఇంటి సామగ్రి ఇచ్చారు. కానీ పెళ్లైన నాటి నుంచి అదనపు కట్నం కోసం ప్రియాంకపై భర్త భౌతిక దాడులు చేసేవాడు. ఇది తెలిసి కన్నవారు తమ శక్తి మేరకు అదనపు కట్నం పంపుతుండేవారు. భర్త వేధింపులతో ప్రియాంక పుట్టింటికి వెళ్లి సెప్టెంబర్ 4న తిరిగి కొరాపుట్ వచ్చింది. కానీ వేధింపులు ఆగలేదు. పుట్టింట తండ్రి ఆరోగ్య రీత్యా గత కొద్ది రోజులుగా వేధింపులు కన్నవారికి చెప్పలేదు. బుధవారం రాత్రి 8 గంటలకు వీడియో కాల్ ద్వారా ప్రియాంక తల్లిదండ్రులతో మాట్లాడింది. 9 గంటలకు శివ శంకర్ తన ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది వెంటనే రమ్మని టెక్కలికి ఫోన్ చేశాడు. వెంటనే వీరందరూ కొరాపుట్ చేరుకొని అనుమానంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా మృతురాలి తలపై ఇనుప రాడ్డుతో మోది చంపినట్లు తెలిసింది. దీంతో వెంటనే శివ శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక చనిపోయాక శివశంకర్ తన తల్లిని, ఏడు నెలల కుమార్తెను ఇంటి బయట కూర్చోబెట్టాడు. అనంతరం మృతదేహాన్ని దహనం చేసి ఇంటికి నిప్పంటించాడు. మొదటి అంతా ఇది అగ్ని ప్రమాదమే అనుకున్నారు. కానీ మృతురాలి తల్లిదండ్రులు రావడంతో అసలు విషయం బయటపడింది. పోలీసుల విచారణలో శివ శంకర్ తన నేరం అంగీకరించారు. -
కార్తీకం: కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీముఖలింగ క్షేత్రం!
జలుమూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగం. ఎక్కడైనా శివుడు లింగాకారంలో ఉంటాడు. ఈ క్షేత్రంలో మాత్రం ముఖందాల్చి ఆవిర్భవించాడు. అందుకే ఈ క్షేత్రానికి శ్రీముఖలింగమని, ఇక్కడ కొలువైన శివుడిని ముఖలింగేశ్వరుడని పిలుస్తారు. కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖరం, శ్రీముఖలింగంలో ముఖదర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మంగళవారం నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో కార్తీకమాసం పూజలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీముఖలింగేశ్వరున్ని దర్శించుకుంటారు. కోర్కెలు తీర్చే గోలెం..స్వామివారి గర్భాలయంలో మూలవిరాట్టు వెనుక కనిపించే పెద్ద మట్టి గోలెం ఎంతో శక్తివంతమైనదని భక్తుల విశ్వాసం. ఇందులో పాలు, బియ్యం, ధాన్యం, మంచినీరు, అన్నం, పండ్లు, బెల్లం.. ఇలా భక్తులు గోలెం నిండుగా వేసి మొక్కులు తీర్చుకుంటారు. దీని ఫలితంగా సంతాన యోగం, గ్రహదోషాలు నివారణ, వివాహాలు, ఉద్యోగాలు, విదేశాలలో చదువులు, ఇతర న్యాయపరమైన కోర్కెలు సిద్ధిస్తాయని స్థలపురాణంతోపాటు అర్చకులు చెబుతున్నారు. గోలెం పట్టుకుని పరమేశ్వరుని నిండు మనుసుతో ప్రార్థిస్తే కోరిన కోర్కెలు తీరుతాయన్నది భక్తుల నమ్మకం.ఆ భక్తులకు ప్రత్యేకం..మన రాష్ట్రంలో రాయలసీమతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల భక్తులు గురువారం నుంచే కార్తీకమాసం పాటిస్తారు. ఇదే నెలలో దైవ చింతన, తీర్ధయాత్రలు చేయడం వారి సంప్రదాయం. ఇందులో భాగంగా శ్రీముఖలింగం క్షేత్రానికి నెల రోజులపాటు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటారు.చదవండి: సర్పదోషాలను పరిహరించే పంచలింగాల క్షేత్రం గురించి తెలుసా?ఇదీ చదవండి: Mounjaro వెయిట్‌లాస్ మందు దూకుడు, డిమాండ్ మామూలుగా లేదు! -
అరసవిల్లి ఆలయంలో అద్భుత దృశ్యం
సాక్షి, శ్రీకాకుళం: అరసవిల్లి అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో(Arasavalli Temple) బుధవారం ఉదయం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యకిరణాలు(Sun Rays Arasavalli) స్వామివారి మూలవిరాట్‌ను తాకాయి. నాలుగు నిమిషాలపాటు కనువిందు చేసిన ఈ సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు పోటెత్తారు. రేపు కూడా ఇలాంటి దృశ్యం కనిపించే అవకాశం ఉందని పూజారులు చెబుతున్నారు.శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో సూర్య కిరణాలు స్వామివారి మూలవిరాట్‌ను తాకడం ఒక అద్భుతమైన, శాస్త్రీయమైన, ఆధ్యాత్మికంగానూ విశేషమైందిగా భావించబడుతోంది. ప్రతి సంవత్సరం మార్చి 9, 10.. అక్టోబర్ 1, 2 తేదీల్లో ఉదయం 6:05 గంటలకు సూర్య కిరణాలు ఆలయ ద్వారాల ద్వారా నేరుగా సూర్య భగవానుడి పాదాలను తాకుతాయి.ఈ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే ఆరోగ్య, శాంతి, శుభఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. భానుకిరణాల స్పర్శతో స్వామివారి విగ్రహం దేదీప్యమానంగా కనిపించడం భక్తులలో పులకింత కలిగిస్తుంది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించబడతాయి. ‘ఓం సూర్యనారాయణాయ నమః..’ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతుంది.ఆలయ నిర్మాణం అస్త్రోనామికల్ ప్రిసిషన్‌తో ఉంటుంది. ఇక్కడ సూర్య భగవానుని విగ్రహాన్ని శిల్పకళా నిపుణులు ఖగోళ శాస్త్రాన్ని ఆధారంగా తీసుకుని నిర్మించారు. పంచద్వారాలు, గాలిగోపురం ద్వారా కిరణాలు నేరుగా విగ్రహాన్ని తాకేలా నిర్మాణం చేయబడింది. అందుకే సూర్యుని కక్ష్య మార్పుల వల్ల కేవలం సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే జరుగుతుందని చెబుతుంటారు. ఇదీ చదవండి: కళారాల కళకళ -
స్నేక్హితుడు..!
శ్రీకాకుళం జిల్లా: ఆయన ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. ఓ వైపు సాగు చేస్తూనే.. మరోవైపు ఎల్రక్టీషియన్, మెకానిక్‌గా కూడా రాణిస్తున్నాడు. అన్నింటికీ మించి అలవోకగా పాముల ను పట్టే నేర్పరి. అలాగని ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. ఎవరి వద్ద శిష్యరికం చేయలేదు. కానీ బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు సాధించాడు హిరమండలం మండలం ఎం.అవలంగికి చెందిన లోలుగు వేణుగోపాలరావు. ఇప్పటివరకు 10 వేలకుపైగా పాములను పట్టి సురక్షిత ప్రాంతాల్లో విడిచిపెట్టిన ఘనత ఆయనది. ఆయనను ‘సాక్షి’ పలకరించగా ఆసక్తికర విషయా లను వెల్లడించారు. 20 ఏళ్ల వయస్సులోనే ఆసక్తి వేణుగోపాలరావుకు ప్రస్తుతం 55 ఏళ్ల వయస్సు. 20 ఏళ్లలోనే పాములు పట్టాలన్న ఆసక్తి పెరిగింది. చిన్నప్పుడు వ్యవసాయ పనుల్లో భాగంగా ఎంతోమంది పాముకాటుకు గురై అవస్థలు పడిన ఘటనలు చూసిన వేణుగోపాలరావుకు మనస్సు కలచివేసిందట. అదే సమయంలో పాములను చంపేస్తున్న ఘటనలు చూసి బాధపడేవాడు. దీంతో అప్పుడే పాములు పట్టాలన్న ప్రయత్నం మొదలుపెట్టారు. ఎక్కడైనా పాములు కనిపిస్తే పెద్ద సంచులు, గొట్టాలతో పట్టడం, వాటికి ఉరి వేసి బంధించడం క్రమేపీ అలవాటు చేసుకున్నాడు. అలా ఆయన ప్రస్థానం 35 ఏళ్ల కిందట ప్రారంభమైంది. అలాగే యూట్యూబ్, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక పాములు పట్టడంలో మరిన్ని మెలకువలు నేర్చుకున్నారు. క్రమేపీ చాకచక్యంగా పాములు పట్టడంలో సిద్ధహస్తుడిగా మారిపోయాడు. 2018 తితిలీ తుపాను సమయంలో ఏకంగా 1,500 పాములు పట్టి రికార్డు సృష్టించాడు. సాధారణంగా ఏడాదికి 500 వరకూ పాములు పడుతుంటాడు. శ్రీకాకుళం, విజయనగరంతో పాటు ఒడిశాలోని పర్లాకిమిడి, కాశీనగర్, గుణుపూర్‌కు సైతం వెళ్లి పాములు పడుతుంటారు. అందుకే తన నంబర్‌తో పాటు ప్రత్యేక యూట్యూబ్ చానల్ సైతం ఏర్పాటు చేశాడు. సోషల్ మీడియాలో తనను సంప్రదిస్తే వీలైనంత వేగంగా అక్కడకు వెళ్తుంటారు. అయితే పాములు పట్టడం అనేది తనకు ఉపాధి కాదని.. కేవలం మనుషుల ప్రా ణాలు పోకూడదని.. అలాగే జీవహింస లేకుండా చేయాలన్నదే తన ఉద్దేశమని వేణుగోపాలరావు చెబుతున్నాడు. పాములు ప డితే డబ్బులు డిమాండ్ ఉండదని.. వారి సంతోషంగా ఇచ్చిందే తీసుకుంటామని చెబుతున్నాడు. ఎక్కడైనా పాములు పట్టాలంటే 93951 42681 నంబర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నాడు. -
కూటమి ప్రభుత్వంపై తిరగబడిన ప్రభుత్వ ఉద్యోగులు
శ్రీకాకుళం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీరుతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సర్వేల పేరుతో తమను వేధిస్తున్నారని శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద సచివాలయ ఉద్యోగుల ఆందోళనకు దిగారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటలకు పని చేయాల్సి వస్తుందని, వాలంటీర్లు చేయాల్సిన పనులు కూడా తమతో చేయిస్తున్నారని నిరసన చేపట్టారు.పనిభారం పెరగడంతో మానసిక ఒత్తిడి అధికమవుతుందని సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మహిళా ఉద్యోగులు అని కూడా చూడకుండా రాత్రి పూట కూడా పని చేయిస్తున్నారని విమర్శించారు. అదే సమయంలో తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
భోజనం బిల్లు కట్టమంటే..ఇద్దరిపై లారీ ఎక్కించేశాడు!
శ్రీకాకుంళం జిల్లా, కంచిలిలో భోజనం బిల్లు చెల్లించాలని కోరిన హోటల్ యజమాని పట్ల ఓ లారీ డ్రైవర్ సైకోలా ప్రవర్తించాడు. లారీ ఎక్కించేసి దారుణంగా హతమార్చాడు. ఇదేంటని అడ్డుకున్న మరో వ్యక్తిని సైతం లారీతో తొక్కించి చంపేశాడు. ఈ ఘోరమైన ఘటన కంచిలి మండలం జలంత్రకోట గ్రామ కూడలి సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జాతీయ రహదారిపై సరుకులు రవాణా చేసే క్రమంలో జార్ఖండ్ నుంచి విశాఖపట్నంకు బయలుదేరిన కంటైనర్ లారీ బుధవారం రాత్రి కంచిలి మండలం జలంత్రకోట గ్రామ కూడలిలో జాతీయ రహదారి పక్కన దాబా హోటల్ వద్ద ఆగింది. డ్రైవర్ ఎబ్రార్ ఖాన్ భోజనం చేసి అక్కడే మద్యం తాగాడు. భోజనం బిల్లు రూ.200 చెల్లించాలని హోటల్ యజమాని ఎం.డి.అయూబ్(56) కోరగా అందుకు నిరాకరించాడు. గొడవపడి లారీ తీసుకొని వెళ్లిపోతుండగా యజమాని అడ్డుకున్నాడు. దీంతో అతన్ని ఢీకొట్టి పైనుంచి లారీ తీసుకెళ్లిపోయాడు. ఆ హోటల్‌కు రోజువారీ పాలు ఇచ్చి తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్న మధుపురం గ్రామానికి చెందిన పాల వ్యాపారి డొక్కర దండాసి(71) తాను నడుపుతున్న టీవీఎస్ ఎక్సెల్ వాహనంతో అడ్డుకున్నాడు. ఆయన్ను కూడా లారీతో తొక్కేసి పారి పోయాడు. ఈ ఘటనలో యజమాని, పాల వ్యాపారి అక్కడికక్కడే మృతిచెందారు. హోటల్ సిబ్బంది, స్థానికులు వెంబడించి బూరగాం వద్ద లారీని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మృతదేహాలకు సోంపేట ప్రభుత్వాసుపత్రిలో గురువారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించారు. వలస కుటుంబంలో విషాదం.. హోటల్ యజమాని ఎం.డి. అయూబ్ పదిహేనేళ్ల జార్ఖండ్ రాష్ట్రం చత్గల్ జిల్లా సత్గాం నుంచి 15 ఏళ్ల కిందట వలసవచ్చాడు. భార్య నసీమా బేగం, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
కొత్తమ్మకు చల్లదనం.... మురిసిన భక్తజనం!
కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి శతాబ్ది ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. ఈ నెల 23 నుంచి ఆరంభమైన ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, హెలికాప్టర్ రైడ్ వంటి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చివరి రోజున కమ్మకట్టు కుటుంబం ఇంటి వద్ద నుంచి అమ్మవారి జంగిడితో పాటు అధిక సంఖ్యలో మహిళలు ముర్రాటలు, ఘటాలతో ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. దారి పొడవునా కొత్తమ్మతల్లి నినాదాలతో కోట»ొమ్మాళి, పరిసర ప్రాంతాల్లో ఆధ్యాతి్మకత వెల్లివిరిసింది. ఊరేగింపులో పలువురు యువకులు కొట్లాటకు దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు. అనంతరం పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. –టెక్కలి -
‘నాపై సొంత కూటమి ఎమ్మెల్యే కుట్ర చేస్తున్నారు’
సాక్షి, అమరావతి: కూటమి ఎమ్మెల్యే అయిన తనను కూటమికే చెందిన పొరుగు ఎమ్మెల్యే రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం శాసనసభలో జీరో అవర్ సందర్భంగా తన దుస్థితిని చెప్పుకునే అవకాశం దొరికిందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులతో ఎంతైనా పోరాటం చేయొచ్చు గానీ, సొంత కూటమికే చెందిన తనపక్క నియోజవర్గ ఎమ్మెల్యే కుట్రకు కొమ్ముకాస్తుంటే ఎమ్మెల్యేగా ఎవరికి చెప్పుకోవాలని సభలో ప్రశ్నించారు.10 రోజులుగా తనపై తీవ్ర ఆరోపణలతో పత్రికలు, టీవీల్లో వార్తలు రాయిస్తూ తీవ్ర అవమానానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. ‘గతంలో క్వారీలు తీసుకున్న వారికి రూ.కోట్లు జరిమానాలు విధించారు. కానీ మళ్లీ కాంట్రాక్టులు ఇస్తున్నారు. నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. ప్రజా సమస్యలపై నా పని నేను చేస్తుంటే వ్యాపారాలు చేసుకోవడం కోసం నన్ను బలి చేయడం చాలా తప్పు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. -
38 మంది ఉపాధ్యాయుల అరెస్ట్
పలాస: ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలను పరిష్కరించాలని యూటీఎఫ్ చేపట్టిన రణభేరి ప్రచార జాత పోలీసుల ఆంక్షలతో ఉద్రిక్తంగా మారింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సోమవారం ర్యాలీ ప్రారంభమైంది. అప్పటికే కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు తన సిబ్బందితో అక్కడకు చేరుకొని ర్యాలీకి, నిరసన తెలపడానికి అనుమతి లేదని చెప్పడంతో ఉద్రిక్తత నెలకొంది. ఉపాధ్యాయులు ఆందోళన కొనసాగించడంతో పోలీసులు అరెస్టులకు తెగబడ్డారు.యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిశోర్‌కుమార్, కోశాధికారి రెడ్డి మోహనరావు, జిల్లా అధ్యక్షులు బాబూరావు, బి.శ్రీరామమూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజాన దమయంతి, జిల్లా అద్యక్షులు గిరిధర్, జిల్లా నాయకులు రవికుమార్, కోదండరావు, బల్ల చిట్టిబాబు, కంచరాన రమేష్, ఎల్వీ.చలం, గున్న రమేష్ తదితర ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు మొత్తం 38 మందిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.మిగతా ఉపాధ్యాయులు కాశీబుగ్గ జెడ్పీ ఉన్నత పాఠశాల వద్దకు చేరుకొని అక్కడ నిరసన తెలిపారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో చేపట్టిన రణభేరి జాతాను పోలీసులు అడ్డుకుని విఘాతం కలిగించడం సరికాదన్నారు. సోమవారం ప్రారంభమైన ఈ రణభేరి ప్రచార జాత కొనసాగుతోందని, సెపె్టంబరు 25న గుంటూరులో ముగుస్తుందని స్పష్టం చేశారు. -
ముప్పై నిమిషాలు ఉత్కంఠతో ఊపిరి బిగపట్టి..!
ముప్పై నిమిషాలు ఆమదాలవలస స్టేషన్ ఉత్కంఠతో ఊపిరి బిగపట్టి చూసింది. నిత్యం రైల్వే అనౌన్స్మెంట్లతో మార్మోగే ఆ ప్రాంగణం ఓ నిండు గర్భిణి పురిటి నొప్పులు గమనించింది. సమయానికే స్టేషన్‌కు వచ్చిన రైలు అక్కడే ఆగిపోవడం, నిమిషాలు గడిచిపోతున్నా కదలకపోవడం, ఓ గర్భిణికి రైలులోనే ప్రసవం జరుగుతోందని స్టేషన్ అంతా తెలియడం, పండంటి ఆడపిల్ల పుట్టిందని సమాచారం రావడం వంటి ఘటనలతో ముప్పై నిమిషాలు మూడు ఘడియల్లా గడిచిపోయాయి. కాసింత జాప్యానికే తిట్టుకునే ప్రయాణికులు తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని తెలియడంతో ఆలస్యాన్ని అంతగా పట్టించుకోలేదు. ఆమదాలవలస / శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్లో శుక్రవారం రాత్రి రైలులో ఓ గర్భిణి ప్రసవించారు. ఆర్పీఎఫ్ ఎస్ఐ అరుణ, రైల్వే ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ పల్ల కీర్తి తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. ఇచ్ఛాపురానికి చెందిన జి.భూలక్ష్మి అనే గర్భిణి తన భర్త జానకిరామ్‌తో కలిసి విశాఖ వెళ్లేందుకు కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కారు. దారిలో ఆమెకు పురిటి నొప్పులు రావడంతో శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్లో ఆమె భర్త రైల్వే ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రైలును స్టేషన్లో నిలుపుదల చేసి రైల్వే ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ కీర్తికి సమాచారం అందించారు. ఆమె హూటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అప్పటికే నొప్పులు అధికం కావడంతో రైలులోనే ప్రసవంచేశారు. ఆడబిడ్డ జన్మింగా తల్లి గర్భంలో మరో శిశువు ఉన్నట్లు వైద్యురాలు గుర్తించారు. దీంతో వారిని వెంటనే రాగోలు జెమ్స్‌కు తరలించారు. ఆస్పత్రిలో మరో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. సంఘటనను రైల్వేస్టేషన్లో ప్రయాణికులు అంతా వింతగా గమనించారు. దాదాపు 30 నిమిషాల పాటు రైలును ఆపేశారు. -
‘ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేసే నీచ చరిత్ర చంద్రబాబుది’
సాక్షి,శ్రీకాకుళం: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు సిద్ధమైన కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడారు.మెడికల్ కాలేజీను ప్రైవేట్‌పరం చేసే దౌర్భాగ్యపు చరిత్ర చంద్రబాబుది. చంద్రబాబుకు తోడు ఎల్లోమీడియా తప్పుడు కథనాలు రాస్తున్నాయి. ప్రజారోగ్యాన్ని చంద్రబాబు అమ్మకానికి పెట్టారు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన సంస్కరణలను చంద్రబాబు అమ్మేస్తున్నారు. మెడికల్ కాలేజీను చంద్రబాబు ప్రైవేట్‌పరం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే దరిద్రపు చరిత్ర చంద్రబాబుది. ప్రభుత్వ రంగ సంస్థల్ని మీ చేతిలో ఉంచుకుంటున్నారా? లేదంటే అమ్ముకుంటున్నారో చెప్పండి’అని ప్రశ్నించారు. -
రైతులకు ఎరువులు అందేవరకు మా పోరాటం ఆగదు
-
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంటి దగ్గర ఉద్రిక్తత
సాక్షి, శ్రీకాకుళం: రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని డిమాండ్ చేస్తూ.. ఆముదాలవలసలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆందోళనకు దిగారు. ఎరువులు అందించడంలో కూటమి సర్కార్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ్మినేని సీతారాంను అడ్డుకున్న పోలీసులు.. బలవంతంగా జీపులో ఎక్కించి ఆయన ఇంటికి తరలించారు. దీంతో పోలీసులు, తమ్మినేని సీతారాం మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ్మినేని సీతారాంను హౌస్ అరెస్ట్ చేశారు. భారీగా పోలీసులు మోహరించారు.కాగా, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలో ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలో ఎరువుల కొరతను దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి బస్తా రూ.400తో అమ్మకాలు చేస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న అరకొర ఎరువులు రైతు భరోసా కేంద్రాలకు కాకుండా కూటమి నాయకుల ఇళ్ల వద్ద ఉంచుకుని ఆ పార్టీ వర్గీయులకే అందిస్తున్నారు.ఓ వైపు తీవ్ర వర్షాభావం.. మరో వైపు అధిక వర్షాలు.. ఇలా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ప్రత్యక్ష నరకం చూపిస్తోంది. పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో లక్షలాది ఎకరాలు ముంపు బారిన పడ్డాయి. అధికారిక లెక్కల ప్రకారమే 2.5 లక్షల ఎకరాలు ముంపునకు గురైనట్టు చెబుతుండగా, వాస్తవానికి దాదాపు 4 లక్షల ఎకరాలకు పైగా ముంపునీటిలో చిక్కుకున్నాయి. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణ, గోదావరి జిల్లాలతో పాటు దాదాపు 14 జిల్లాల్లో ఎటు చూసినా ముంపునీటిలో చిక్కుకున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.ఈ పంటలు తిరిగి నిలదొక్కుకోవాలంటే బూస్టర్ డోస్ ఇవ్వాల్సిందే. లేకుంటే పంట పెరుగుదల లేక దిగుబడులు తగ్గి పంట నాణ్యత దెబ్బ తింటుంది. ప్రస్తుతం పిలక కట్టే దశలో వరి పైరు ఉంది. ఈ దశలో ఎకరాకు కనీసం 20 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్, పత్తికైతే 25–30 కిలోల యూరియా, 10–15 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ పైపాటుగా వేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.ప్రణాళికా బద్ధంగా ఎరువుల సరఫరాలో ప్రభుత్వం ఇప్పటికే చేతులెత్తేసింది. బఫర్ స్టాక్ నిర్వహణలో మార్క్‌ఫెడ్ విఫలమైంది. ఈసారి 2 లక్షల టన్నుల ఎరువులను నిల్వ చేయనున్నామని, రైతులకు కొరత లేకుండా సరఫరా చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఆచరణలో లక్ష టన్నులు కూడా సరఫరా చేయలేని దుస్థితిలో ఉన్నారు. కారణం బఫర్ స్టాక్ నిర్వహణకు అవసరమైన నిధులు విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడమే కారణం. మరో వైపు ఉన్న కొద్దిపాటి నిల్వలను టీడీపీ నేతలు దొడ్డిదారిన తమ గోదాములకు మళ్లిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. -
కూన రవి శారీరకంగా.. మానసికంగా వేధించాడు: ప్రిన్సిపాల్ సౌమ్య
సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ ఎమ్మెల్యే కూన రవి కుమార్ తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని కేజీబీవీ ప్రిన్సిపాల్ రెజిటీ సౌమ్య తెలిపారు. శనివారం ఆమె మీడియా ముందుకు వచ్చారు. కూన రవి వేధింపులకు సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఎమ్మెల్యే వేధింపులపై సిటింగ్ జడ్జితో ఎంక్వయిరీ చేయించాలని సౌమ్య డిమాండ్ చేశారు. 2013 నుంచి ప్రిన్సిపాల్‌గా తాను పనిచేస్తున్నానని ఇంతవరకు తనపై ఎలాంటి రిమార్క్ లేదన్నారు.‘‘రెండు నెలులుగా వేధింపులకు గురవుతున్నా.. వేధింపుల్లో భాగంగానే నన్ను బదిలీ చేశారు. ఎంత మానసిక ఒత్తిడి లేకపోతే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాను. నేను సాధారణ మహిళను.. నాకు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే నాపై చేసిన ఆరోపణలపై విచారణ చేయించాలి. ఎంక్వయిరీ చేయకుండా ఎలా నాపై ఆరోపణలు చేస్తారు?’’ అంటూ సౌమ్య ప్రశ్నించారు.‘‘నేను ఎలాంటి తప్పు చేయలేదు కనుకే విచారణ చేయించాలని ధైర్యంగా చెప్తున్నా. స్కూల్‌కు నేను సరిగా వెళ్ళననని ఎమ్మెల్యే కూన రవికుమార్ అబద్ధం చెబుతున్నారు. నా స్కూల్ అటెండెన్స్ సీఎస్ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేశానుఅదికూడా చూడండి. ప్రతీ రోజు పెట్టే ఫుడ్ కూడా మెనూ ప్రకారం పెడుతున్నా.. అది ప్రతి రోజు ఫొటోలు కూడా మాపై అధికారులకు పెట్టాను. పేరెంట్స్ నుంచి డబ్బులు వసూలు చేశానని నాపై ఎమ్మెల్యే తప్పుడు ఆరోపణలు చేయించారు. ఇంతవరకు నేను ఎవరి దగ్గర ఒక్క రూపాయి డబ్బులు తీసుకోలేదు. ఎస్ఎంసీ చైర్మన్ పరం నాయుడు అనే వ్యక్తి ఎప్పుడు స్కూల్‌కి వచ్చి క్లాస్ రూమ్‌ల్లోకి వెళ్ళి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు...ఎమ్మెల్యే నా ప్రొఫెషనల్ విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలపై తప్పుడు ఆరోపణలు చేశారు. నా వివాహం గురించి కూడా తప్పుగా మాట్లాడారు. నా భర్త వేరే మహిళను పెళ్లి చేసుకోవడానికి నన్ను మోసం చేశారు. అతను ఇప్పుడు వేరే మహిళను పెళ్లి కూడా చేసుకున్నారు. రాత్రిపూట ఒక ఎమ్మెల్యే మహిళలకు వీడియో కాల్ చేయాల్సిన అవసరం ఏంటి?. పొందూరులో ఓసారి రాత్రి 10 గంటల వరకు కూడా ఎమ్మెల్యే మీటింగ్ పెట్టారు. నా సర్వీస్‌లో ఇంతవరకు ఎలాంటి తప్పు చేయలేదు ఈ రెండు నెలల నుంచే నేను వేధింపులకు గురవుతున్నా. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడినా నాకు న్యాయం జరగలేదు. ఇంతవరకు పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు...కొన్ని కేజీబీవీ పాఠశాలల్లో అవినీతి అక్రమాలు జరిగాయి. అక్కడ పని చేస్తున్న వారు ఎమ్మెల్యే కూన రవికుమార్ సొంత సామాజిక వర్గం కావడంతో వారిపై చర్యలు తీసుకోవడం లేదు. ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా నేను స్కూల్‌కు వెళ్లాను. సెలవు రోజుల్లో (శనివారం రక్షా బంధన్) నాకు ట్రాన్స్ఫర్ లెటర్ పెట్టారు...rjd ఆర్ఐడీ విచారణ జరగకుండా నన్ను ఎందుకు బదిలీ చేశారు. నన్ను సపోర్ట్ చేసిన వారిపై దాడులు కూడా చేస్తున్నారు. ఆ రోజు కూడా ఎమ్మెల్యేకి రాత్రి కదా వీడియో కాల్ వద్దు.. ఆడియో కాల్ చేయమని అడిగాను. లేదు వీడియో కాల్లోకి రావాలని ఒత్తిడి చేశారు. నా కులం విషయంలో కూడా ఎమ్మెల్యే కార్యాలయంలో రవి కుమార్ నన్ను దూషించారు..సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ స్పందించి నాకు న్యాయం చేయాలి. ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎన్నో కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. కానీ నేను దాని గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. నాకు జరిగిన అన్యాయంపై మాత్రమే మాట్లాడాను.గ వేధింపులపై జిల్లా కలెక్టర్‌కు గతంలో ఫిర్యాదు చేశాను. కలెక్టర్‌ను ఎమ్మెల్యే ఒత్తిడి చేయడంతో నన్ను ట్రాన్స్ఫర్ చేశారు’’ అని సౌమ్య తెలిపారు. -
శ్రీకాకుళం జిల్లా పలాసలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరసనలు
-
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
-
గుండెపోటుతో హెచ్ఎం మృతి
శ్రీకాకుళం జిల్లా: మండలంలోని గోపీనగర్లో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్.స్వప్న (45) గుండెపోటుతో గురువారం మృతి చెందారు. పని ఒత్తిడితోనే ఆమె చనిపోయారని సహోద్యోగులు చర్చించుకుంటున్నారు. బుధవారం విధులకు హాజరైన ఆమెకు అదే రోజు రాత్రి తీవ్ర గుండె నొప్పి రావడంతో రాజాంలో ఉన్న తన కుటుంబ సభ్యులు శ్రీకాకుళం మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. స్వప్నకు భర్త నాగరాజు, కుమార్తె హనీ ఉన్నారు. భర్త నాగరాజు శ్రీకాకుళం ఎస్బీఐ ఏడీబీలో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తుండగా కుమార్తె ఇంటర్ చదువుతోంది. ఉపాధ్యాయురాలు 2023లో ఆమదాలవలస మండలానికి బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి ఆ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేవారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఒకరు వెళ్లిపోగా ఈమె ఒక్కరే పాఠశాలలో ఉన్నారు. పని ఒత్తిడి, యాప్‌లలో నిత్యం అప్లోడ్ చేయాల్సిన అంశాలు తదితర విషయాల్లో ఆమె ఒత్తిడికి గురైనట్లు తోటి ఉపాధ్యాయులు చర్చించుకుంటున్నారు. -
ప్రియుడితో సుఖం కోసం భర్తను దారుణంగా..
శ్రీకాకుళం జిల్లా: పాతపట్నం మేజర్ పంచాయతీ మొండిగల వీధికి చెందిన నల్లి రాజు (34) మృతి కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడు, మరొకరి సాయంతో భార్యే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో గుర్తించి ముగ్గురినీ అరెస్టు చేశారు. ఈ మేరకు గురువారం పాతపట్నం పోలీస్‌స్టేషన్‌లో టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు విలేకరులకు వివరాలు వెల్లడించారు. పాతపట్నం మొండిగలవీధికి చెందిన నల్లి రాజుకు మౌనికతో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. మౌనికకు పాతపట్నం మాదిగవీధికి చెందిన గుండు ఉదయ్‌కుమార్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాజును హత్య చేయాలని మౌనిక.. తన భార్యకు విడాకులు ఇవ్వాలని ఉదయ్‌కుమార్ నిర్ణయించుకున్నారు. తర్వాత ఎక్కడికై నా పారిపోయి వివాహం చేసుకోవాలని భావించారు.పక్కా పథకం ప్రకారం..మౌనిక, ఉదయ్‌కుమార్ కలిసి రాజు హత్యకు పథకం వేశారు. కొత్త ఫోన్ నంబరుతో అమ్మాయిలా చాటింగ్ చేసి ఉదయ్‌కుమార్‌ను ఎక్కడికైనా రప్పించి చంపాలని నిర్ణయించుకున్నా సాధ్యం కాలేదు. దీంతో నిద్రమాత్రలు ఇచ్చి చంపాలని కుట్ర పన్నారు. ఇందుకు ఉదయ్‌కుమార్ తన బావ మాదిగవీధికి చెందిన చౌదరి మల్లికార్జున్ అలియాస్ మల్లికార్జునరావు సహాయం కోరాడు. కుట్రలో భాగంగా ఉదయ్‌కుమార్ పర్లాకిమిడిలో ఆర్ఎంపీ వైద్యుడి వద్ద పది నిద్రమాత్రలు కొని మౌనికకు ఇచ్చాడు. మౌనిక ఈ నెల 5న రాత్రి భోజనంలో నాలుగు నిద్రమాత్రలు కలిపి పెట్టింది. భర్త వెంటనే నిద్రలోకి వెళ్లడం గమనించి చంపవచ్చని నిర్ధారణకొచ్చింది. ఈ నెల 6న రాత్రి భోజనంలో ఆరు మాత్రలను కలపడంతో రాజు గాఢ నిద్రలోకి వెళ్లిపోయాడు. మౌనిక వెంటనే ప్రియుడు ఉదయ్‌కుమార్, చౌదరి మల్లికార్జునరావులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. రాత్రి 11.30 సమయంలో ఇద్దరూ వీధి లైట్లు ఆపేసి మౌనిక ఇంటికి వెళ్లారు. రాజు కాళ్లు, చేతులను మౌనిక, మల్లికార్జునరావు పట్టుకోగా.. ఛాతి పై ఉదయ్‌కుమార్ కూర్చుని తలగడతో ఊపిరి ఆడకుండా చంపేశారు. అనంతరం రాజు మృతదేహంతో పాటు బైక్, చెప్పులు, మద్యం బాటిల్‌ను హరిజనవీధికి దిగువన పడేసి వెళ్లిపోయారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మౌనిక తన భర్త ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. మరుసటి రోజు ఉదయాన్నే మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మౌనిక ఏడుస్తున్నట్లు నటిస్తూ భర్త మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురినీ నిందితులుగా గుర్తించారు. దీంతో మౌనిక, ఉదయ్‌కుమార్, మల్లికార్జునరావులు రెవెన్యూ అధికారుల వద్ద లొంగిపోయారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి నరసన్నపేట జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు డీఎస్పీ తెలిపా రు. కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసిన సీఐ వి. రామారావు, ఎస్ఐ బి.లావణ్య, పీసీలు బి.జీవరత్నం, డి.గౌరీశంకర్రావు, పరమేష్‌లను అభినందించి, రివార్డులను అందజేశారు. -
'ఆ మట్టి'..మెళియాపుట్టి..!
ఆ మట్టికి సాష్టాంగ నమస్కారాలు పెడతారు. అదే మట్టిని మండపంలో పెట్టి పూజలు చేస్తారు. ఫల పుష్పాదులు సమర్పించి పండగ చేస్తారు. ఆ మట్టి.. మెళియాపుట్టి. ఇక్కడ ఇరవై ఏళ్లుగా మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నారు. వినాయక చవితి, దసరా సీజన్ వచ్చిందంటే ప్రతిమల కోసం అంతా ఈ ఊరికి క్యూ కడతారు. విగ్రహాలతో పాటు దీపాలు ఇతర మట్టి సామగ్రిని కూడా తయారు చేయడం వీరి ప్రత్యేకత. మెళియాపుట్టి: వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కా వడానికి ఇంకా కొద్దిరోజులే ఉంది. మెళియాపుట్టిలో అప్పుడే సందడి మొదలైపోయింది. ఇక్కడ మట్టితో విగ్రహాలు, పూజా సామగ్రి తయారుచేస్తూ కళాకారులు బిజీగా బిజీగా గడుపుతున్నారు. మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ ప్రాంతంలో నివాసముంటు న్న కొన్ని కుటుంబాలు మట్టి వినాయక విగ్రహాలు తయారు చేస్తాయి. ఏటా చిన్న విగ్రహాలతో పాటు పెద్ద పెద్ద విగ్రహాల తయారీలో వారికి మంచి పట్టుంది. వీరు తయారు చేసిన ప్రతిమలను చూస్తే ప్రతిభను కొనియాడకుండా ఉండలేం. చుట్టుపక్కల మండలాల నుంచి సైతం విగ్రహాలకు అడ్వాన్సులు ఇస్తూ విగ్రహాలు కొనుగోలు చేస్తుంటారు. ధరలు తక్కువగా ఉండడంతో పాటు విగ్రహాలు కూడా అందంగా..రంగురంగుల్లో ఆకర్షణీ యంగా తయారు చేయడంతో ఎక్కువగా మెళియాపుట్టిలోనే విగ్రహాలు కొనుగోలు చేస్తామని కొనుగోలు దారులు చెబుతున్నారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా మట్టి విగ్రహాలు తయా రు చేయడంతోనే వీరికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఎక్కువమంది కొనుగోలు చేస్తుంటారు. కొంత మంది యువత వారికి కావాల్సిన విధంగా గణపతి విగ్రహాలు తయారు చేయించుకుంటారని విక్రయదారులు చెబుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ను వినియోగించి తయారు చేసే విగ్రహాల వల్ల పర్యావరణ పరిరక్షణకు భంగం కలుగుతుందని, అందుకే మట్టితోనే చేస్తున్నామని వారు చెబుతున్నారు. విగ్రహ తయారీలో కర్రలు, మట్టి, వరిగడ్డి, కొన్ని తాళ్లను మాత్రమే వారు వాడుతారు. 20 ఏళ్లుగా వీరు వివిధ రూపాల్లో వినాయక విగ్రహాలను తయారు చేసి భక్తులకు అందిస్తున్నారు. ఏటా కొత్తదనాన్ని తీసుకొస్తున్నారు. ప్రభుత్వ సహకారం కావాలి మట్టితోనే విగ్రహాలు తయారు చేయడంతో సంతృప్తి చెందుతు న్నాం. మట్టితో విగ్రహాలు తయా రు చేయడం చాలా కష్టం. తయారు చేసిన తర్వాత చాలారోజులు ఉంచి అప్పుడు రంగులు వేయాలి. వాటిని భద్రపరచడారనికి స్థలం లేక ఇబ్బందులు పడుతున్నాం. రేకుల షెడ్లు వేసుకోవడానికి ప్రభుత్వం లోన్లు మంజూరు చేయాలి. – బూరగాన సవరయ్య, విగ్రహ తయారీ దారుడు, మెళియాపుట్టి గ్రామం మట్టి ప్రమిదలకు గిరాకీ ఎక్కువ మట్టి ప్రమిదలు నిత్యం తయా రుచేస్తూనే ఉంటాం. వినాయక ఉత్సవాలకు అత్యధిక మండపాల్లో దీపారాధన చేస్తారు. వేల సంఖ్యలో ప్రమిదలు కొనుగోలు చేస్తారు. వినాయక చవితి వస్తే ఇంటిల్లిపాదీ నిమగ్నమై పనులు చేస్తాం. – రేఖాన ఉమ, మెళియాపుట్టి గ్రామం (చదవండి: 'నాన్న' అని పిలవలేం ..! పాపం అంజలి, అవినాష్..) -
Srikakulam District: బావిలో పడ్డ వృద్ధురాలు
-
‘శ్రీకాకుళం’లో 40వేల బోగస్ ఓట్లు
శ్రీకాకుళం: ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం నియోజకవర్గంలో నలభై వేల బోగస్ ఓట్లు ఉన్నాయని టీడీపీ ఎమ్మెల్యే గొండు శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గురువారం సాయంత్రం బూత్ కమిటీ సభ్యులు, పార్టీ కమిటీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. నియోజకవర్గంలో 2.72 లక్షల ఓట్లు ఉన్నప్పటికీ వాటిలో దాదాపు 30 వేల నుంచి 40వేల వరకు బోగస్ ఓట్లు ఉంటాయని, వాటిని త్వరలోనే తొలగిస్తారని చెప్పారు.అవన్నీ పట్టించుకోకుండా బూత్ పరిధిలోని 60–70 శాతం ఓటర్లను కలవాలన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యల ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ‘తొలి అడుగు’లో ఎవ్వరూ చురుగ్గా పాల్గొనడంలేదని, ఇప్పటివరకు 35 వేల కుటుంబాలను మాత్రమే కలిశామని, మొత్తం 90 వేలు కుటుంబాలను కలవాల్సి ఉందని ఎమ్మెల్యే శంకర్ చెప్పారు. -
Srikakulam: తల్లికి వందనం నగదు కోసం మహిళల ఆందోళన


