చిల్లంగి నెపంతో భార్యాభర్తల హత్య | srikakulam wife and husband incident | Sakshi
Sakshi News home page

చిల్లంగి నెపంతో భార్యాభర్తల హత్య

Apr 29 2026 10:01 AM | Updated on Apr 29 2026 10:03 AM

srikakulam wife and husband incident

శ్రీకాకుళం క్రైమ్: జిల్లాలోని కొత్తూరు మండలం గొట్టిపల్లి పంచాయతీ గిరిజన తండా గ్రామమైన చినరాజపురంలో చిల్లంగి నెపంతో భార్యాభర్తలను అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి గొడ్డలితో నరికి చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. కొండ ఎగువన ఉండే చినరాజపురం గ్రామంలో మంగళవారం వేకువజామున సవర కోటయ్య అనే వ్యక్తి అదే గ్రామా నికి చెందిన సవర ఎల్లంగి (50)ని గొడ్డలిలో నరకబోయాడు. సమీపంలో ఉన్న ఎల్లంగి భార్య గయాని (40) అడ్డుకోబోవడంతో ఆమెపై కూడా నిర్దాక్షిణ్యంగా గొడ్డలితో వేటువేశాడు. ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశారు. 

చిల్లంగి పెడుతున్నారనే అనుమానంతోనే కోటయ్య ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. వేకువజామునే హత్య జరిగిన ఊరుఊరంతా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది. దీంతో మంగళవారం రాత్రి వరకు పోలీసులకు సమాచారం అందలేదు. రాత్రి ఎలాగోలా సమాచారం అందుకు న్న కొత్తూరు సీఐ చింతాడ ప్రసాదరావు, తమ సిబ్బందితో కలసి కొండపైనున్న చినరాజపురం గ్రామంలోని ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. సవర ఎల్లంగి తన కుటుంబ సభ్యులకు చిల్లంగి పెట్టాడన్న అనుమానంతోనే కోటయ్య ఈ హత్య లు చేశాడని, ప్రస్తుతం నిందితుని కోసం గాలిస్తున్నామని సీఐ తెలిపారు.      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement