టెక్కలి రైలు ప్రమాద ఘటనపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి | YS Jagan Expresses Deep Shock Over Tekkali Train Accident | Sakshi
Sakshi News home page

టెక్కలి రైలు ప్రమాద ఘటనపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

Sep 23 2026 5:28 PM | Updated on Sep 23 2026 6:01 PM

YS Jagan Expresses Deep Shock Over Tekkali Train Accident

సాక్షి,తాడేపల్లి: టెక్కలి రైలు ప్రమాద ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ ప్రమాదంలో విద్యార్థులు విశాఖరావు, దిలీప్‌కుమార్‌, శివ, శరత్‌కుమార్‌ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. చేతికందివచ్చిన పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతమని, ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థించారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

అలాగే, ఈ ప్రమాదంలో గాయపడిన మరో విద్యార్థి సాల్మన్‌రాజ్‌కు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైఎస్‌ జగన్ డిమాండ్ చేశారు. కష్టకాలంలో ఉన్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement