Srikakulam: ట్రైన్‌ ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం | A tragedy has occurred in Srikakulam distric | Sakshi
Sakshi News home page

Srikakulam: ట్రైన్‌ ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం

Sep 23 2026 2:38 PM | Updated on Sep 23 2026 4:47 PM

A tragedy has occurred in Srikakulam distric

సాక్షి,శ్రీకాకుళం : రాయవలస సమీపంలో సంభవించిన ఘోర రైలు ప్రమాదంలో నలుగురు యువకులు దుర్మరణం చెందారు. ట్రాక్ దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన రాజ్యా రాణి (18117) ఎక్స్‌ప్రెస్ రైలు వారిని ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో విశాఖరావు, శరత్, దిలీప్, శివ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు మరియు అధికారులు వెంటనే స్పందించి మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు మరియు రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారుల విచారణలో తెలియాల్సి ఉంది. ఒకే ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోవడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement