కర్నూలు జిల్లా: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులో ప్రసూతి విభాగంలో కాన్పులను సురక్షితంగా నిర్వహించి గర్భిణులకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలందిస్తున్నామని ఆసుపత్రి సూపరిటెండెంట్ కల్పన తెలిపారు. మంగళవారం అమె మాట్లాడుతూ.. సోమవారం ప్రసవం కోసం ఆస్పరి మండలం జోహరపురం గ్రామానికి చెందిన బోయ విజయలక్ష్మి ఆసుపత్రికి వచ్చిందన్నారు. సాధారణ కాన్పు చేయగా.. 4.60 కిలోల బరువు శిశువు జన్మించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తల్లీ,బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


