సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ శాసనమండలి సభ్యుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అక్రమ అరెస్టును, నిర్బంధాన్ని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు., ఎన్నికల అక్రమాలను ప్రశ్నిస్తూ పార్టీ అభ్యర్థులతో, ప్రజలతో కలిసి శాంతియుతంగా ఆందోళన చేస్తే, దానిపై తప్పుడు కేసులు పెట్టి, అడ్డగోలుగా అరెస్టు చేసి, నిర్బంధానికి గురిచేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎమర్జెన్సీని తలపించే ఈ పాలన అత్యంత హేయమంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ జగన్.. ఈ మేరకు ట్వీట్ చేశారు.
‘‘గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెంలో గురువారం పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత, నేరుగా నాగార్జున వర్శిటీకి చేరాల్సిన బ్యాలెట్ బాక్సులను మధ్యలో నల్లపాడు వద్ద ఎందుకు దింపారు? ఎవరి ఆదేశాలమేరకు ఆ బ్యాలెట్ బాక్సులను దింపారు? అసలు బ్యాలెట్ బాక్సులకు ఉండాల్సిన భద్రత ఏమైంది? స్ట్రాంగ్ రూంకు చేరాల్సిన బ్యాలెట్ బాక్సులు నడిరోడ్డుమీద కనిపిస్తే, కళ్లెదుటే వాటిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మా పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు, ప్రజలమీద లాఠీఛార్జి చేస్తారా? తప్పులు మీరుచేసి, ఏకంగా బ్యాలెట్ బాక్సులు మార్చే ప్రయత్నంచేసి, మళ్లీ మావాళ్లపై అక్రమకేసులా? చివరకు ఒక ఎమ్మెల్సీమీద డెకాయిటీ, దొంగతనం కేసులుకూడా పెడతారా? ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది’’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
ఎన్నికల అక్రమాలు దాచిపెట్టలేరు..
ఈ స్థానిక ఎన్నికల్లో… నామినేషన్లు రిగ్గింగ్, నామినేషన్ల స్క్రూట్నీ రిగ్గింగ్, పోలింగ్ బూత్‌ల రిగ్గింగ్, పోలింగ్ సైక్లింగ్, పోలింగ్ పర్సంటేజీల రిగ్గింగ్, చివరకు పోలింగ్ ముగిశాక ఇలా బ్యాలెట్ బాక్సులు కూడా రిగ్గింగ్? అని వైఎస్ జగన్ మండిపడ్డారు. ‘‘చంద్రబాబు.. ఈ స్థానిక ఎన్నికల్లో మీరు ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తుంటే, ఈ తప్పుల్ని ఎవరైనా ప్రశ్నిస్తే, వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతారా?
చంద్రబాబు మీ అధికార, పోలీసు బలాన్ని ప్రయోగించి కట్టడిచేయాలని అనుకున్నంత మాత్రాన, మీరు చేసిన ఎన్నికల అక్రమాలు దాచిపెట్టలేరు. మీ అప్రజాస్వామిక పద్ధతులను దేశమంతా చూస్తూనే ఉంది. ప్రజలు చూస్తూ ఊరుకోరు, ఇలాంటి దుర్మార్గాలను సహించరు, మీకు తగిన బుద్ధిచెబుతారు’’ అని హెచ్చరించారు.
వైయస్సార్సీపీ శాసనమండలి సభ్యుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అక్రమ అరెస్టు, నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్నికల అక్రమాలను ప్రశ్నిస్తూ పార్టీ అభ్యర్థులతో, ప్రజలతో కలిసి శాంతియుతంగా ఆందోళన చేస్తే, దానిపై తప్పుడు కేసులు పెట్టి, అడ్డగోలుగా అరెస్టు చేసి, నిర్బంధానికి గురిచేయడం దుర్మార్గం. ఎమర్జెన్సీని తలపించే ఈ పాలన అత్యంత హేయం. గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెంలో గురువారం పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత, నేరుగా నాగార్జున వర్శిటీకి చేరాల్సిన బ్యాలెట్ బాక్సులను మధ్యలో నల్లపాడు వద్ద ఎందుకు దింపారు? ఎవరి ఆదేశాలమేరకు ఆ బ్యాలెట్ బాక్సులను దింపారు? అసలు బ్యాలెట్ బాక్సులకు ఉండాల్సిన భద్రత ఏమైంది? స్ట్రాంగ్ రూంకు చేరాల్సిన బ్యాలెట్ బాక్సులు నడిరోడ్డుమీద కనిపిస్తే, కళ్లెదుటే వాటిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మా పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు, ప్రజలమీద లాఠీఛార్జి చేస్తారా? తప్పులు మీరుచేసి, ఏకంగా బ్యాలెట్ బాక్సులు మార్చే ప్రయత్నంచేసి, మళ్లీ మావాళ్లపై అక్రమకేసులా? చివరకు ఒక ఎమ్మెల్సీమీద డెకాయిటీ, దొంగతనం కేసులుకూడా పెడతారా? ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? ఈ స్థానిక ఎన్నికల్లో… నామినేషన్లు రిగ్గింగ్, నామినేషన్ల స్క్రూట్నీ రిగ్గింగ్, పోలింగ్ బూత్‌ల రిగ్గింగ్, పోలింగ్ సైక్లింగ్, పోలింగ్ పర్సంటేజీల రిగ్గింగ్, చివరకు పోలింగ్ ముగిశాక ఇలా బ్యాలెట్ బాక్సులు కూడా రిగ్గింగ్? చంద్రబాబుగారూ ఈ స్థానిక ఎన్నికల్లో మీరు ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తుంటే, ఈ తప్పుల్ని ఎవరైనా ప్రశ్నిస్తే, వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతారా? @ncbn గారూ మీ అధికార, పోలీసు బలాన్ని ప్రయోగించి కట్టడిచేయాలని అనుకున్నంత మాత్రాన, మీరు చేసిన ఎన్నికల అక్రమాలు దాచిపెట్టలేరు. మీ అప్రజాస్వామిక పద్ధతులను దేశమంతా చూస్తూనే ఉంది. ప్రజలు చూస్తూ ఊరుకోరు, ఇలాంటి దుర్మార్గాలను సహించరు, మీకు తగిన బుద్ధిచెప్తారు. #CBNJungleRaj #SaveDemocracyInAP
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 7, 2026


