నాదా రెస్పాన్సిబిలిటీ.. నేను వాటర్‌ మోయాలా? | Kakinada: Argument between ZP CEO Lakshman Rao and RDO Mallibabu | Sakshi
Sakshi News home page

నాదా రెస్పాన్సిబిలిటీ.. నేను వాటర్‌ మోయాలా?

Nov 7 2026 12:24 PM | Updated on Nov 7 2026 12:42 PM

Kakinada: Argument between ZP CEO Lakshman Rao and RDO Mallibabu

సాక్షి, కాకినాడ జిల్లా: కాకినాడ పీఆర్‌ కాలేజీ పోలింగ్‌ కేంద్రం దగ్గర జడ్పీ సీఈవో  లక్ష్మణరావు, ఆర్డీవో మల్లిబాబు రచ్చ రచ్చ లేపారు. ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదని ఒక ఎమ్మెల్యేకు ఏజెంట్లు ఫోన్‌ చేశారు. దీంతో​ సీఈవో లక్ష్మణరావుపై ఎమ్మెల్యే సీరియస్‌ అయ్యారు.

ఈ  క్రమంలో జడ్పీ సీఈవో, ఆర్డీవోకు మధ్య గొడవ మొదలైంది. ‘‘నాదా రెస్పాన్సిబిలిటీ.. నేను వాటర్‌ మోయాలా?’’ అంటూ జెడ్పీ సీఈవోపై ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ హరీంద్రప్రసాద్‌.. ఇద్దరిని వారించే  ప్రయత్నం చేశారు.

కృష్ణా జిల్లాలో..
కాగా, కృష్ణా జిల్లాలో కౌంటింగ్ కేంద్రాల్లో అధికారులు కనీస వసతులు కల్పించకపోవడంతో కౌంటింగ్‌ సిబ్బంది, ఏజెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. గుడివాడలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో కౌంటింగ్ ఏజెంట్లకు తిప్పలు తప్పలేదు. దీంతో అధికారుల తీరుపై ఏజెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెదపారుపూడి మండలం ఏజెంట్లు ఆర్డీవోను నిలదీశారు. నువ్వు ఏ పార్టీ అంటూ ఏజెంట్‌ని ఆర్డీవో ప్రశ్నించారు. కౌంటింగ్ కేంద్రాల్లో షుగర్ పేషెంట్లు ఉన్నారని ఏజెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: బ్యాలెట్‌ బాక్స్‌లో ఓట్లు మాయం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement