సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: హిందూపురం కౌంటింగ్ కేంద్రంలో టీడీపీ నేతలు హల్‌చల్ చేశారు. కౌంటింగ్ కేంద్రంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు తిష్ట వేశారు. శ్రీనివాసరావు, బాలాజీ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కౌంటింగ్ కేంద్రంలోకి మీడియా ప్రతినిధులకు అనుమతి నిరాకరించిన పోలీసులు.. బాలకృష్ణ పీఏలను అనుమతించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పోలింగ్ వేళ కూడా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు గూండాల్లా వ్యవహరించిన సంగతి తెలిసిందే. పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు గెంటేసి యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. మరో గంటలో పోలింగ్ ముగుస్తుందనగా బాలకృష్ణ పీఏలు శ్రీనివాసరావు, బాలాజీ, సురేంద్ర చిలమత్తూరు పోలింగ్ కేంద్రాల్లో హల్‌చల్ చేశారు.
కౌంటింగ్ కేంద్రంలో అమిలినేని కుటుంబ సభ్యుల హల్‌చల్
ఇదిలా ఉండగా, అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని కుటుంబం సభ్యులు హల్‌చల్ చేశారు. కళ్యాణదుర్గం కౌంటింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే అమిలినేని కుటుంబ సభ్యులను పోలీసులు అనుమతించారు. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి: కూటమి కుట్రలు.. వైఎస్సార్‌సీపీ నేతల గృహ నిర్బంధం


