స్కూల్‌ యూనిఫాంలోనూ వీరులుంటారు | Anand Mahindra Backs Brave Raptadu Girl! | Sakshi
Sakshi News home page

స్కూల్‌ యూనిఫాంలోనూ వీరులుంటారు

Nov 7 2026 8:14 AM | Updated on Nov 7 2026 8:14 AM

 Anand Mahindra Backs Brave Raptadu Girl!

రాప్తాడు ఘటనలో బాలిక లక్ష్మి ధైర్యానికి ఆనంద్‌ మహీంద్రా ఫిదా 

అనంతపురం ఎడ్యుకేషన్‌: స్నేహితురాలిపై దాడి జరుగుతుంటే ప్రాణాలకు తెగించి అడ్డుకున్న చిన్నారి సాహసం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. రాప్తాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని గోపికపై హేమంత్‌ అనే వ్యక్తి రంపంతో దాడి చేసిన ఘటనలో.. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించి తీవ్రంగా గాయపడిన మరో విద్యార్థిని లక్ష్మికి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా అండగా నిలిచారు. 

స్నేహితురాలి ప్రాణాలు కాపాడేందుకు లక్ష్మి ప్రదర్శించిన ధైర్యసాహసాలను ఆనంద్‌ మహీంద్రా కొనియాడారు. ‘అన్ని వేళలా వీరులు ప్రత్యేక దుస్తుల్లో కనిపించరు.. కొన్నిసార్లు పాఠశాల యూనిఫాంలోనూ ఉంటారు’ అంటూ ఆమె తెగువను ప్రశంసించారు.  బాలిక చదువుకు పూర్తి ఆరి్థక సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement