మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు.. వైఎస్సార్‌సీపీ నేతల హౌస్‌ అరెస్ట్‌ | AP ZPTC And MPTC Election Results 2026 Live Updates | Sakshi
Sakshi News home page

AP ZPTC And MPTC Election Results 2026: మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు.. వైఎస్సార్‌సీపీ నేతల హౌస్‌ అరెస్ట్‌

Nov 7 2026 7:11 AM | Updated on Nov 7 2026 7:16 AM

AP ZPTC And MPTC Election Results 2026 Live Updates

ఎన్నికల ఫలితాలు అప్‌డేట్స్‌..

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8 గంటలకు మొదలు కానుంది. ఏకగ్రీవాల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 7,767 ఎంపీటీసీ స్థానాలు, 582 జడ్పీటీసీ స్థానాలకు గురువారం, రీపోలింగ్‌ జరిగిన చోట్ల శుక్రవారాల్లో పోలింగ్‌ జరిగింది. మొత్తం 21,012 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఈ ఓట్ల లెక్కింపు కోసం 365 కేంద్రాల్లో సుమారు 9,062 బల్లలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) తెలిపింది. ఓట్ల లెక్కింపులో 11,002 మంది సూపర్‌వైజర్లు, 28,692 మంది సిబ్బంది పాల్గొంటారని పేర్కొంది.

కర్నూలు..

  • కర్నూలులో బైరెడ్డి సిద్దార్థ రెడ్డి హౌస్ అరెస్ట్
  • నందికొట్కూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంకి వెళ్తున్న బైరెడ్డి సిద్దార్థ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు,
  • జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో హౌస్‌ అరెస్ట్ చేసిన పోలీసులు..

నంద్యాల జిల్లా...

  • ఆత్మకూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డిని నిర్బంధించిన పోలీసులు..
  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు హాజరు కాకుండా కూటమి కుట్రలు.
  • ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అవకతవకలకు పాల్పడే అవకాశం ఉంటుందన్న భావంతో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.

తిరుపతి..

  • ఎస్.జీ.ఎస్. ఆర్ట్స్ కాలేజీ కౌంటింగ్ కేంద్రాలు వద్ద గందర గోళం
  • కౌంటింగ్ కేంద్రంలో రాజకీయ పార్టీలు ఏజెంట్స్ సెల్ ఫోన్ డిపాజిట్‌పై స్పష్టత కరువు.
  • అధికారులు, పోలీసుల మధ్య సమన్వయం కరువు
  • డైలమాలో కౌంటింగ్ సిబ్బంది
  • సెల్ ఫోన్లతో వచ్చిన కౌంటింగ్ సిబ్బందిని లోపలికి అనుమతించని పోలీసులు
  • విలువైన సెల్ ఫోన్లు ఎక్కడ డిపాజిట్ చేయాలంటూ కౌంటింగ్ సిబ్బంది ఆవేదన

కాసేపట్లో కౌంటింగ్‌ ప్రారంభం..

  • ఉదయం 8 గంటలకు ప్రారంభం
  • 365 కౌంటింగ్‌ కేంద్రాల ఏర్పాటు
  • 7,767 ఎంపీటీసీ, 582 జెడ్పీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు
  • పోటీలో మొత్తం 21,012 మంది అభ్యర్థులు
  • ఏకకాలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు
  • ప్రతి కౌంటింగ్‌ కేంద్రంలో రెండింటికీ బల్లలు కేటాయించినట్లు ఎస్‌ఈసీ వెల్లడి

మొత్తం 70.02 శాతం పోలింగ్‌ నమోదు

  • ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మొత్తంగా 70.72 శాతం పోలింగ్‌ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పేర్కొంది.
  • 2021 ఎన్నికల పోలింగ్‌ శాతం 60.91తో పోలిస్తే 9.81 శాతం ఎక్కువగా ఓటింగ్‌ జరిగినట్టు తెలిపింది.
  • కౌంటింగ్‌కు భారీ పోలీసు బందోబస్తు
  • ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు
  • మొత్తం 365 కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 19,885 మంది పోలీసు సిబ్బందితో మూడు అంచెల భద్రతా వ్యవస్థ
  • సీసీ టీవీ కెమెరాలు, డ్రోన్‌ సర్వైలెన్స్‌తో పాటు పోలీసు సిబ్బంది ధరించే బాడీ వోర్న్‌ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement