సాక్షి, అమరావతి: దీపావళి, ఛత్ పూజ పండుగల నేపథ్యంలో ప్రయాణికుల భద్రతపై విజయవాడ రైల్వే డివిజన్ ప్రత్యేక దృష్టి సారించినట్లు డీఆర్‌ఎం మోహిత్ సోనకియా శుక్రవారం తెలిపారు. విజయవాడ డివిజన్ పరిధిలో ధూమపానానికి సంబంధించి 23 కేసులు నమోదు చేయడంతోపాటు నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి రూ.46 వేల జరిమానా వసూలు చేసినట్లు పేర్కొన్నారు. పండుగల సమయంలో రద్దీ పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. టపాసులు, పేలుడు పదార్థాలు, ఇతర మండే వస్తువులను రైళ్లలో తీసుకెళ్లవద్దని ప్రయాణికులకు సూచించారు.


