ఎన్నికల డ్యూటీ పేరుతో సచివాలయ ఉద్యోగులపై కక్ష
పోలింగ్‌కు ముందురోజు సాయంత్రం ఆర్డర్లు.. పోస్టల్ బ్యాలెట్‌కీ దారిలేదు
60 శాతం మంది సచివాలయ సిబ్బంది ఓటుకు దూరం
పనిచేయించుకుని పారితోషికం ఎగనామం
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఎన్నికల విధుల పేరుతో చంద్రబాబు సర్కారు ఓటుకు దూరం చేసింది. పనిచేయించుకుని పారితోషికం కూడా ఎగ్గొట్టింది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఓటుహక్కు కోల్పోకూడదనే పోస్టల్ బ్యాలెట్ విధానం పెట్టారు. అందుకోసం డ్యూటీ ఆర్డర్లు కనీసం వారం ముందు ఇవ్వాలి. కానీ ఈసారి సచివాలయ ఉద్యోగులకు ఆ అవకాశమే లేకుండా చేశారు. నవంబర్ 1న జరిగిన మున్సిపల్ పోలింగ్‌కు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో సచివాలయ ఉద్యోగులకు ముందురోజు సాయంత్రం డ్యూటీ ఆర్డర్లు ఇచ్చారు.
అనంతపురం జిల్లాల్లో 1,600 మందికి ముందురోజు డ్యూటీ ఆర్డర్లు ఇచ్చారు. పరిషత్ ఎన్నికల్లోను ఇదే తంతు జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 60 శాతం మంది సచివాలయ ఉద్యోగులకు చివరి నిమిషంలో డ్యూటీలు వేశారని ఉద్యోగులు చెబుతున్నారు. పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకునే సమయం కూడా ఇవ్వలేదు. డ్యూటీ కారణంగా సొంత ఊరికి వెళ్లి ఓటేసే అవకాశమూ దక్కలేదు. ఫలితంగా వేలాది మంది ఉద్యోగులు ఓటుహక్కు కోల్పోయారు.
ఎందుకీ కక్ష?
ఇది పొరపాటు కాదని, సర్కారు ఎత్తుగడ అని ఉద్యోగులు అనుమానిస్తున్నారు. సచివాలయ వ్యవస్థను తెచి్చంది గత వైఎస్ జగన్ ప్రభుత్వం. సచివాలయ ఉద్యోగులను చంద్రబాబు కూటమి ప్రభుత్వం మొదటి నుంచి అనుమానంగానే చూస్తోంది. ఈ క్రమంలోనే వారిని బానిసల కంటే హీనంగా చూస్తూ అన్ని పనులూ చేయిస్తోంది. ప్రశ్నిస్తే తీవ్ర అణచివేత సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అందుకే తమ ఓట్లు కూటమికి పడవని భావించి అనేకచోట్ల తమకు ఓటు వేసే అవకాశం లేకుండా చేశారని ఉద్యోగులు భావిస్తున్నారు. ఓటరు జాబితాలో పేరున్నా, పోలింగ్ రోజు 200 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో డ్యూటీలో ఉండడంతో వారు ఓటుహక్కు వినియోగించుకోలేకపోయారు.


