చెన్నై: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ జార్జ్‌రెడ్డి కుమారుడు వైఎస్ అనిల్‌రెడ్డి, మాలిని దంపతుల కుమార్తె శ్రేయ వివాహం అంజన, గోవింద్ బిలానీ దంపతుల కుమారుడు ఉజ్వల్‌తో చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది.
శుక్రవారం ఈ వేడుకకు విచ్చేసిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి,ఆయన సతీమణి వైఎస్ భారతి వధూవరులను ఆశీర్వదించారు.
సినీ నటులు సూర్య, జ్యోతిక దంపతులు, నటి రాధిక, శరత్‌కుమార్ దంపతులు కూడా హాజరై నూతన దంపతులకు ఆశీస్సులు అందజేశారు.
వైఎస్సార్‌సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి,పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి,ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి హాజరయ్యారు.


