మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు.. వైఎస్సార్సీపీ నేతల హౌస్ అరెస్ట్
ఎన్నికల ఫలితాలు అప్డేట్స్..ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8 గంటలకు మొదలు కానుంది. ఏకగ్రీవాల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 7,767 ఎంపీటీసీ స్థానాలు, 582 జడ్పీటీసీ స్థానాలకు గురువారం, రీపోలింగ్ జరిగిన చోట్ల శుక్రవారాల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 21,012 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఈ ఓట్ల లెక్కింపు కోసం 365 కేంద్రాల్లో సుమారు 9,062 బల్లలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) తెలిపింది. ఓట్ల లెక్కింపులో 11,002 మంది సూపర్వైజర్లు, 28,692 మంది సిబ్బంది పాల్గొంటారని పేర్కొంది.కర్నూలు..కర్నూలులో బైరెడ్డి సిద్దార్థ రెడ్డి హౌస్ అరెస్ట్నందికొట్కూరు వైఎస్సార్సీపీ కార్యాలయంకి వెళ్తున్న బైరెడ్డి సిద్దార్థ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు,జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు..నంద్యాల జిల్లా...ఆత్మకూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డిని నిర్బంధించిన పోలీసులు..ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు హాజరు కాకుండా కూటమి కుట్రలు.ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అవకతవకలకు పాల్పడే అవకాశం ఉంటుందన్న భావంతో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.తిరుపతి..ఎస్.జీ.ఎస్. ఆర్ట్స్ కాలేజీ కౌంటింగ్ కేంద్రాలు వద్ద గందర గోళంకౌంటింగ్ కేంద్రంలో రాజకీయ పార్టీలు ఏజెంట్స్ సెల్ ఫోన్ డిపాజిట్‌పై స్పష్టత కరువు.అధికారులు, పోలీసుల మధ్య సమన్వయం కరువుడైలమాలో కౌంటింగ్ సిబ్బందిసెల్ ఫోన్లతో వచ్చిన కౌంటింగ్ సిబ్బందిని లోపలికి అనుమతించని పోలీసులువిలువైన సెల్ ఫోన్లు ఎక్కడ డిపాజిట్ చేయాలంటూ కౌంటింగ్ సిబ్బంది ఆవేదనకాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం..ఉదయం 8 గంటలకు ప్రారంభం365 కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు7,767 ఎంపీటీసీ, 582 జెడ్పీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపుపోటీలో మొత్తం 21,012 మంది అభ్యర్థులుఏకకాలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపుప్రతి కౌంటింగ్ కేంద్రంలో రెండింటికీ బల్లలు కేటాయించినట్లు ఎస్ఈసీ వెల్లడిమొత్తం 70.02 శాతం పోలింగ్ నమోదుఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మొత్తంగా 70.72 శాతం పోలింగ్ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది.2021 ఎన్నికల పోలింగ్ శాతం 60.91తో పోలిస్తే 9.81 శాతం ఎక్కువగా ఓటింగ్ జరిగినట్టు తెలిపింది.కౌంటింగ్‌కు భారీ పోలీసు బందోబస్తుఓట్ల లెక్కింపు ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుమొత్తం 365 కౌంటింగ్ కేంద్రాల వద్ద 19,885 మంది పోలీసు సిబ్బందితో మూడు అంచెల భద్రతా వ్యవస్థసీసీ టీవీ కెమెరాలు, డ్రోన్ సర్వైలెన్స్‌తో పాటు పోలీసు సిబ్బంది ధరించే బాడీ వోర్న్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ