సాక్షి, అమరావతి: జనాభా గణన–2027లో భాగంగా వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 24 వరకు ప్రజలు స్వయంగా జనాభా గణన వివరాలను నమోదు చేసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్‌ను రాష్ట్ర గెజిట్‌లో తిరిగి ప్రచురిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంటింటికి తిరిగి జనాభా గణన వివరాల నమోదు ప్రక్రియ జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు కొనసాగుతుంది. అంతకుముందు జనవరి 10 నుంచి జనవరి 24 వరకు ప్రజలు తమంతట తాముగా జనాభా గణన వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. జనాభా సవరణాత్మక దశ వచ్చే ఏడాది మార్చి 1 నుంచి 5 వరకు ఉంటుంది. జనాభా గణన నిర్ణీత ప్రామాణిక సమయం వచ్చే ఏడాది మార్చి ఒకటో తేదీ అర్ధరాత్రి 12 గంటలుగా నిర్ణయించారు.


