కూటమి కుట్రలు.. వైఎస్సార్‌సీపీ నేతల గృహ నిర్బంధం | Chandrababu Govt Conspiracy In AP Parishad Election Counting | Sakshi
Sakshi News home page

కూటమి కుట్రలు.. వైఎస్సార్‌సీపీ నేతల గృహ నిర్బంధం

Nov 7 2026 9:00 AM | Updated on Nov 7 2026 9:13 AM

Chandrababu Govt Conspiracy In AP Parishad Election Counting

సాక్షి, నంద్యాల/అనంతపురం: ఏపీ పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌లోనూ చంద్రబాబు సర్కార్‌ దౌర్జన్యాలకు తెరలేపింది. పలు జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌లు చేస్తున్నారు. కౌంటింగ్‌ కేంద్రాలకు వెళ్లకుండా వైఎస్సార్‌సీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. అనంతపురంలో మాజీ మంత్రి శైలజానాథ్‌, మాజీ ఎంపీ తలారీ రంగయ్యలను హౌస్‌ అరెస్ట్‌  చేసిన పోలీసులు.. కౌంటింగ్‌  కేంద్రానికి వెళ్లకుండా అడ్డుకున్నారు.

నంద్యాల జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేతలను హౌస్‌ అరెస్ట్‌లు చేసిన పోలీసులు.. శిల్పా చక్రపాణి, శిల్పారవిని పోలీసులు అడ్డుకున్నారు. కర్నూలులో బైరెడ్డి సిద్ధారెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. నందికొట్కూరు వెళ్లకుండా బైరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆత్మకూరులో శిల్పా భువనేశ్వర్‌రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. జడ్పీటీసీ కౌంటింగ్‌కు వెళ్లకుండా కూటమి కుట్రలకు తెరలేపింది. కౌంటింగ్‌ కేంద్రాలకు వెళ్లకుండా నేతలను అడ్డగించడంతో వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌంటింగ్‌లో కుట్రలు చేసేందుకే హౌస్‌ అరెస్ట్‌లంటూ వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది.

నంద్యాల జిల్లా నందికొట్కూరు కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం ప్రధాన గేటు వద్దనే మీడియా ప్రతినిధులను పోలీసులు నిలిపివేశారు. పోలింగ్ కేంద్రం దగ్గరకు మీడియాను అనుమతించకపోవడంతో   పోలీసుల తీరుపై పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇదీ చదవండి: ఓటుకు పోటు!

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement