ఇబ్రహీంపట్నం: బ్యాలెట్‌ బాక్స్‌లో ఓట్లు మాయం | Irregularities In Vote Counting In Ibrahimpatnam Ntr District | Sakshi
Sakshi News home page

ఇబ్రహీంపట్నం: బ్యాలెట్‌ బాక్స్‌లో ఓట్లు మాయం

Nov 7 2026 11:03 AM | Updated on Nov 7 2026 11:14 AM

Irregularities In Vote Counting In Ibrahimpatnam Ntr District

సాక్షి, ఎన్టీఆర్‌ జిల్లా: ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓట్ల లెక్కింపులో అక్రమాలు చోటుచేసుకున్నాయి. పోలైన ఓట్లకు బ్యాలెట్‌ బాక్స్‌లో ఉన్న ఓట్లకు తేడాపై వైఎస్సార్‌సీపీ నేతలు నిలదీశారు. కొటికలపూడి ఎంపీటీసీ స్థానంలో ఓట్ల తేడాతో గందరగోళం నెలకొంది. 2432  ఓట్లు పోల్‌  కాగా, బ్యాలెట్‌ బాక్స్‌లో 2427 ఉన్నట్లు గుర్తించారు. ఓట్లు మాయం చేశారంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళనకు దిగారు. ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నేతలను సీఐ సుబ్రమణ్యం అడ్డుకున్నారు.

ఎన్టీఆర్‌ జిల్లాలోని 16 మండలాల జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు 9 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 18 కౌంటింగ్‌ హాల్స్, 281 కౌంటింగ్‌ టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. ఏ.కొండూరు, విస్సన్నపేట, తిరువూరు, గంపలగూడెం మండలాల సెగ్మెంట్లు  తిరువూరులోని శ్రీవాహిని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాల కేంద్రం, విజయవాడ రూరల్‌ మండలానికి సంబంధించి విజయవాడ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం, ఓల్డ్‌ మాంటిస్సోరి కళాశాల, జి.కొండూరు మండలం ఓట్లు లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో

..మైలవరం, రెడ్డిగూడెం మండలాల ఓట్ల లెక్కింపు లకిరెడ్డి హనిమిరెడ్డి ఇండోర్‌ స్టేడియం(మైలవరం), ఇబ్రహీంపట్నం ఓట్ల లెక్కింపు జెడ్పీ బాలికల హైస్కూల్‌(కొండపల్లి), జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల ఓట్ల లెక్కింపు ఎస్‌జీఎస్‌ కళాశాల(జగ్గయ్యపేట), నందిగామ ఓట్లు జిల్లా పరిషత్‌ హై స్కూల్‌(నందిగామ), చందర్లపాడు ఓట్ల లెక్కింపు కేవీఆర్‌ డిగ్రీ కళాశాల(నందిగామ), కంచికచర్ల, వీరులపాడు మండలాల ఓట్ల లెక్కింపు వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌(కంచికచర్ల)లో  నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి: కౌంటింగ్‌ కేంద్రంలో బాలకృష్ణ పీఏలు తిష్ట
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement