breaking news
ZPTC
-
ఇంతకంటే దారుణం ఉంటుందా?: సతీష్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ప్రతి పౌరుడికి ఉన్న ఆస్తి ఓటు.. నిజమైన స్వాతంత్ర్యం అంటే నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడమేనన్నారు. ఎల్లో మీడియా నీచమైన వార్తలు రాస్తోందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘పులివెందులలో టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసి దాడులకు తెగబడ్డారు. మరణాయుధాలతో దాడులు చేసి చాలామందిని గాయపరిచారు. ఎస్పీని కలిసి పులివెందుల వచ్చే లోపే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాముపై దాడి చేశారు. వారు ఉన్న కారుపై పెట్రోల్ పోసి చంపడానికి యత్నించారు. ఇప్పటికీ వేల్పుల రాము ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. తిరిగి మా వాళ్లపైనే ఎస్సీ,ఎస్టీ కేసులు పెట్టారు’’ అంటూ సతీష్‌రెడ్డి నిప్పులు చెరిగారు.‘‘గ్రామాల్లో ఉన్న వైఎస్సార్సీపీ నేతలపై కూడా తప్పుడు కేసులు పెట్టారు. 11న అర్ధరాత్రి ఎంపీ అవినాష్‌రెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారు. వందల కిలోమీటర్లు తిప్పుతూ అవినాష్‌రెడ్డిని వేధించారు. నన్ను కూడా అక్రమంగా నిర్బంధించారు. జడ్పీటీసీ ఎన్నిక కోసం 700 మంది పోలీసులను పెట్టారు. 3 వేల మందికిపైగా టీడీపీ గూండాలను పులివెందులలో దింపారు. టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ము కాశారు. పోలింగ్ బూతులకు ఓటర్లను రాకుండా అడ్డుకున్నారు. వచ్చిన ఓటర్లను బెదిరించి స్లిప్పులు లాక్కున్నారు. 13 బూత్‌ల్లోకి మీడియాను కూడా అనుమతించలేదు’’ అంటూ సతీష్‌రెడ్డి దుయ్యబట్టారు.‘‘పులివెందుల్లో స్వేచ్ఛగా ఎన్నిక జరిగిందని ఎల్లో మీడియా రాయడం విడ్డూరం. ఈ దిగజారిన వార్తలు చూసి సిగ్గుపడే పరిస్థితి. వైఎస్ జగన్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి పులివెందుల్లో ఏనాడు ఎన్నికల్లో అక్రమాలు జరగలేదు. టీడీపీ ఏనాడు ఎన్నికల్లో పులివెందుల్లో అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదు చేయలేదు. అలాంటప్పుడు 30 ఏళ్లుగా పులివెందుల్లో ప్రజాస్వామ్యం లేదని ఎలా వార్తలు రాస్తారు..?. గతంలో మేం టీడీపీలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గెలవడం నిజం కాదా..?పులివెందుల్లో కూటమి ప్రభుత్వం కొత్త సంప్రదాయాన్ని తీసుకుచ్చింది. టీడీపీ అధికారిక సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోల్లోనే దొంగ ఓటర్లు ఉన్నారు. వారు దొంగ ఓటర్లు కాదు అని నిరూపించగలరా..?. జిల్లా కలెక్టర్ తను ఉన్న ఫోటోలో దొంగ ఓటర్ ఉన్నాడని గ్రహించి ఫోటోను డిలీట్ చేయలేదా..?. 700 మంది పోలీసులు బూత్‌లను స్వాధీనం చేసుకుని దొంగ ఓటర్లతో పోలింగ్ చేయించారు. దొంగ ఓట్లతో గెలిచిన వ్యక్తిని సీఎం సతీమణి అభినందించడం దారుణం’’ అని సతీష్‌రెడ్డి మండిపడ్డారు. -
YSRCP ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల వద్దకు రానివ్వకుండా బెదిరింపులు
-
జెడ్పీటీసీ అభ్యర్థి ఇంటిని చుట్టుముట్టిన టీడీపీ మూకలు
సాక్షి టాస్‌్కఫోర్స్: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్‌రెడ్డిని బయటకు రాకుండా అడ్డుకునేందుకు టీడీపీ మూకలు ఆయన ఇంటిని చుట్టుముట్టాయి. ఆయన ఇంటిపక్కనే షామియానాలు ఏర్పాటు చేసి టీడీపీ, బయటి ప్రాంతాల నుంచి వచ్చిన రౌడీలు కర్రలు చేతబూని ఓటర్లను యథేచ్ఛగా భయబ్రాంతులకు గురి చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదు. ఒకవేళ అటువైపు పోలీసులు వెళ్లినా టీడీపీ కార్యకర్తలు వారిని లెక్క చేయలేదు. కాగా.. తుమ్మలపల్లె పోలింగ్ బూత్ సమీపంలోనే టీడీపీ నేతలు షామియానాలు వేసి వందలాది మందికి టిఫిన్, భోజనాలు పెట్టారు. -
టీడీపీ గూండాగిరీకి పోలీసుల గులాంగిరీ
జెడ్పీటీసీ ఉప ఎన్నిక సాక్షిగా పులివెందులలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. ఖాకీలే పచ్చరౌడీల్లా తెగబడ్డారు. పోలీసు పహారాలోనే అధికారిక రిగ్గింగ్ యథేచ్ఛగా సాగిపోయింది. టీడీపీ కూటమి కుతంత్రాన్ని పచ్చ ఖాకీలు అంతా తామై అమలు చేశారు. రాజ్యాంగాన్ని నిర్భీతిగా కాలరాశారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఎన్నడూలేని రీతిలో పోలీసులు సర్వం తామై ఎన్నికల అక్రమాలకు బరితెగించారు. ఓటు వేసే ప్రజల రాజ్యాంగ హక్కును అడ్డుకున్నారు. దాడులతో తెగబడి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. సామాన్యులు కనీసం పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. టీడీపీ గూండాలు దాడులకు తెగిస్తూ బీభత్సం సృష్టిస్తున్నా చోద్యం చూశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ రౌడీలు దొంగ ఓట్లు వేసేందుకు రాచబాట పరిచారు. సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప: జెడ్పీటీసీ ఉప ఎన్నికలో చంద్రబాబు ప్రభుత్వ అరాచకానికి వత్తాసు పలకడమే విద్యుక్త ధర్మం అంటూ పోలీసులు కొత్త మాన్యువల్‌ను అమల్లోకి తెచ్చారు. పత్తేపారం చేస్తున్నారా అనే దిగజారుడు భాషతో పచ్చ ఖాకీల అధికారిక రౌడీయిజానికి డీఐజీ కోయ ప్రవీణ్ రింగ్ మాస్టర్‌గా వ్యవహరించారు. ఈయన ఓ టీడీపీ మాజీ ఎంపీ అల్లుడే కావడం గమనార్హం. లాఠీచార్జితో వైఎస్సార్సీపీ కార్యకర్తలను చెల్లాచెదురు చేయమని పచ్చ పైత్యం ప్రదర్శించారు. ఇక, కాల్చిపారేస్తా.. నా కొడకా అంటూ డీఎస్పీ మురళీనాయక్ పచ్చిరౌడీలా చెలరేగిపోయారు. ఎస్పీ అశోక్‌కుమార్ నుంచి డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు మొత్తం పోలీసు వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కుట్రలో భాగస్వామిగా మారింది. ఓటర్లను అడ్డుకునేందుకు పక్కా స్కెచ్ జెడ్పీటీసీ ఉప ఎన్నికలో అక్రమాలు, టీడీపీ రిగ్గింగ్‌కు అడ్డుఅదుపు లేకుండా చేసేందుకు పోలీసులు పక్కా స్కెచ్ వేశారు. రెక్కీ నిర్వహించి హత్యలు చేసే కిరాయి మూకల్లా ఖాకీలు పులివెందులపై పడ్డారు. వెయ్యిమందికిపైగా పోలీసులు మండలాన్ని అష్ట దిగ్బంధం చేశారు. వారం రోజులుగా పులివెందులలో పోలీసు మార్క్ రౌడీయిజంతో అందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. టీడీపీ ప్రభుత్వ కుతంత్రంతో ఓ గ్రామంలోని ఓటర్లకు వేరే గ్రామంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి వద్దకు వైఎస్సార్సీపీ సానుభూతిపరులు వెళ్లకుండా పోలీసులు రంగంలోకి దిగారు. ఎక్కడపడితే అక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఇక మంగళవారం పోలింగ్ సందర్భంగా పోలీసులు పూర్తిగా బరితెగించేశారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ఓటర్లను లాఠీలు ఝళిపిస్తూ బూతులు తిడుతూ వెనక్కి పంపించేశారు. అయినా సరే తాము ఓట్లు వేస్తామని పట్టుబట్టినవారిపై విరుచుకుపడ్డారు. అనుమతించాలని కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. ఓటర్ల చేతుల్లోని స్లిప్‌లను గుంజుకున్నారు. ‘‘మీ దగ్గర ఓటరు స్లిప్పులు లేవు కాబట్టి అనుమతించం’’ అని తర్వాత చెప్పడం గమనార్హం. ఓ విధంగా చెప్పాలంటే ఖాకీ గూండాగిరీ రాజ్యమేలింది. పోలీసు పహారాలోనే టీడీపీ రిగ్గింగ్ టీడీపీ రిగ్గింగ్‌కు పోలీసులు రక్షాకవచంగా నిలిచారు. పులివెందులలోని అన్ని పోలింగ్ బూత్‌లలోని వైఎస్సార్సీపీ ఏజెంట్లపై టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. పోలీసుల సమక్షంలోనే వారిని బలవంతంగా బయటకు గెంటేశారు. అనంతరం ఏకపక్షంగా రిగ్గింగ్ చేసుకున్నారు. కాగా, జమ్మలమడుగు, కమలాపురం నుంచి టీడీపీ కూటమి గూండాలను కూడా రప్పించారు. వాస్తవానికి ఇతర ప్రాంతాల వారిని పోలింగ్ రోజున అనుమతించకూడదు. పోలీసులు అవేమీ పట్టించుకోకుండా కూటమి గూండాలకు రాచబాట పరిచారు. దీంతో పచ్చ గూండాలు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. భారీగా ఓటర్లు ఉన్న గ్రామాలను లక్ష్యంగా చేసుకుని మరీ విధ్వంసానికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, సామాన్యులు ఓటు వేసేందుకు వెళ్లకుండా నిరోధించారు. స్లిప్పులను తీసుకుని చింపివేశారు. ఇక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ వర్గీయులు, గూండాలు పోలింగ్ కేంద్రాల్లోకి దూసుకెళ్లి యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశారు. పోలీసులే వారిని దగ్గరుండి తీసుకువెళ్లి మరీ దొంగ ఓట్లు వేయించడం గమనార్హం. సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ముగిసేవరకు పోలీసుల పహారాలోనే టీడీపీ రిగ్గింగ్ యథేచ్ఛగా కొనసాగింది. వైఎస్సార్సీపీ కార్యాలయంపై ఖాకీల దండయాత్ర డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ ఆశోక్‌కుమార్, ఏఎస్పీ ప్రకాష్ బాబు, డీఎస్పీ మురళీనాయక్, మరో ఆరుగురు సీఐలు, 10 మంది ఎస్ఐలు, వందలమంది పోలీసులతో వైఎస్సార్సీపీ కార్యాలయంలోకి చొచ్చుకువచ్చారు. వారికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు నినాదాలు చేయగా లాఠీచార్జితో చెదరగొట్టాలని డీఐజీ ఆదేశించారు. దాంతో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. తమను ఓట్లు వే సేందుకు అనుమతించాలని ఓటర్లు కాళ్లా వేళ్లా పడినా పోలీసులు ఏమాత్రం కనికరించలేదు. ఇదే అదనుగా వైఎస్సార్సీపీ కార్యాలయం గేటుకు తాళం వేసి సాయంత్రం 5 గంటల వరకు ఎంపీ అవినాశ్‌రెడ్డిని నిర్బంధంలోనే ఉంచారు. డీఐజీ కోయ ప్రవీణ్ ఆయన పక్కనే కూర్చుని మరీ ఈ కుతంత్రాన్ని పకడ్బందీగా పర్యవేక్షించారు. రిగ్గింగ్ ఆధారాలు ఉంటే ఇవ్వండి: డీఐజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ముందస్తు అరెస్టు చేసి సాయంత్రం వరకు గృహ నిర్బంధంలో ఉంచామని డీఐజీ కోయ ప్రవీణ్ మీడియాకు తెలిపారు. తాము బందోబస్తు కోసమే వచ్చామని చెప్పుకొచ్చారు. రిగ్గింగ్ జరిగినట్లు ఆధారాలుంటే ఇవ్వాలని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. రిగ్గింగ్‌కు సంబంధించిన ఆధారాలు ఉంటే ఎన్నికల సంఘం, కోర్టుకు ఇస్తారు కానీ డీఐజీకి ఎందుకు ఇస్తారని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.కాల్చిపడేస్తా నా కొడకా.. అంటూ డీఎస్పీ రౌడీయిజంపులివెందుల డీఎస్పీ మురళీనాయక్ అయితే వైఎస్సార్సీపీ కార్యాలయంలో వీరంగం సృష్టించారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తమను ఓటు వేయనీయడం లేదని, రిగ్గింగ్‌ను ఆపాలంటూ ఓటర్లు పోలీసులకు విజ్ఞప్తి చేసే యత్నం చేశారు. అక్కడే ఉన్న డీఎస్పీ ఓటర్లపై చిందులు తొక్కారు. ‘కాల్చిపడేస్తా నా కొడకా.. ఏమనుకుంటున్నావ్, యూనిఫాం ఇక్కడ..’ అంటూ రౌడీ తరహాలో చెలరేగిపోయారు. పోలీసులు కుట్రపూర్వకంగానే వైఎస్సార్సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేందుకు యత్నించారు. లాఠీచార్జి చేసి చెదరగొట్టాలని డీఐజీ ఆదేశించడం.. పరుష వ్యాఖ్యలతో డీఎస్పీ మురళీనాయక్ చెలరేగిపోవడం.. ఇద్దరు, ముగ్గురు సీఐలు విరుచుకుపడడం అంతా పక్కా పన్నాగంతోనే సాగింది. కార్యకర్తలు ప్రతిఘటించి పరిస్థితి అదుపుతప్పితే.. అదే సాకుగా ‘తీవ్రమైన చర్యల’కు తెగించాలన్నది పోలీసుల కుతంత్రం. కాల్పులకూ తెగించేందుకు వారు సంసిద్ధంగా ఉన్నారని స్పష్టమైంది. పోలీసులు ఉద్దేశం గుర్తించిన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కార్యకర్తలను వారించారు. ‘ఎలాంటి ఉద్రిక్తతలు వద్దు. కార్యకర్తలు సంయమనం పాటించాలి’ అని హితవు పలికారు. రిగ్గింగ్ రింగ్ మాస్టర్ డీఐజీ కోయ ప్రవీణ్ మొన్న విపరీత వ్యాఖ్యలు.. నేడు అధికార దుర్వినియోగం పులివెందుల మండలంలో టీడీపీ అధికారిక రిగ్గింగ్‌కు రింగ్ మాస్టర్‌గా డీఐజీ కోయ ప్రవీణ్ వ్యవహరించారు. ఐపీఎస్ అధికారిగా తన చట్టబద్ధమైన అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ దిగజారుడుతనం ప్రదర్శించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు సృష్టించి కుతంత్రానికి బరితెగించారు. ఎస్పీ అశోక్ కుమార్‌తో పాటు యావత్ పోలీసు యంత్రాంగాన్ని తన కుట్రలో భాగస్వామిగా చేసుకుని చెలరేగిపోయారు. పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్, పార్టీ కీలక నేత వేల్పుల రాములపై హత్యాయత్నాన్ని డీఐజీ ప్రవీణ్ తక్కువ చేసి చూపించేందుకు యత్నించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలను ఉద్దేశించి ‘ఒక ఊరివారు మరో ఊరికి ఎందుకు వెళ్లారు? పత్తేపారం చేయడానికా’ అంటూ వెటకారం ఆడారు. తద్వారా ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు వత్తాసు పలకడమే తన ఉద్దేశం అని చాటారు. పోలింగ్ సందర్భంగా ప్రవీణ్ అధికార దుర్వినియోగం పతాక స్థాయికి చేరింది. ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి అక్రమ గృహ నిర్బంధం, వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి తరహాలో పోలీసులు చొచ్చుకుపోవడాన్ని ప్రవీణ్ స్వయంగా పర్యవేక్షించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై లాఠీచార్జికి స్వయంగా ఆదేశించడం గమనార్హం. ప్రవీణ్ ఆదేశాలతోనే ఎస్పీ అశోక్‌కుమార్, డీఎస్పీ మురళీనాయక్‌తో పాటు పోలీసులు అక్రమాలకు తెగబడ్డారు. తెల్లవారుజామునే పోలీసుమార్కు గూండాయిజం ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి అక్రమ నిర్బంధం పులివెందులలో మంగళవారం సూర్యోదయానికి ముందే పచ్చ ఖాకీలు గూండాగిరీకి తెరతీశారు. భారీగా పోలీసు అధికారులు, సిబ్బంది వేకువజామునే ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి నివాసంపై దండెత్తారు. దురాక్రమణదారుల మాదిరిగా ఇంట్లోకి దూసుకెళ్లారు. ఎంపీని అక్రమంగా అరెస్టు చేశారు. ఎంపీగా తన నియోజకవర్గ పరిధిలోని జెడ్పీటీసీ ఉప ఎన్నికలను పర్యవేక్షించడం ఆయన హక్కు, బాధ్యత. కానీ, దీన్ని పోలీసులు కాలరాశారు. ఆయనను అక్రమంగా అరెస్టు చేస్తున్నట్టు తెలిపారు. పోలీసుల దౌర్జన్యంపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరసన తెలపగా వారిని ఈడ్చి పడేశారు. ఎంపీని తమ వాహనంలో బలవంతంగా ఎక్కించుకుని ముద్దనూరు వైపు తీసుకువెళ్లారు. నిడిజివ్వి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సు«దీర్‌రెడ్డి ఇంటి వద్ద దింపి ఇక్కడే ఉండాలని ఆదేశించారు. అక్కడికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పోలీసుల అరాచకాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు యర్రగుంట్ల వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలిలో బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఎంపీ పులివెందులలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. -
‘కాల్చిపడేస్తా నా కొడకా.. ఏమనుకుంటున్నావ్’.. డీఎస్పీ వీరంగం
-
మా ఓట్లు లాగేసుకొని..! మెట్ నూతలపల్లి వాసుల ఆవేదన
-
Pulivendula: దొంగ ఓట్లు... ఇదే సాక్ష్యం
-
బై ఎలక్షన్ లో.. తండ్రి కొడుకుల డేంజర్ గేమ్
-
బాబుకు అవినాష్ రెడ్డి మాస్ వార్నింగ్.. ఇదిగో రిగ్గింగ్ ఫ్రూఫ్స్
-
పోలీసుల కాళ్లు పట్టుకున్న పులివెందుల ఓటర్లు
-
ఒక్కొక్క ఏజెంట్ ఇంటి చుట్టూ 50 మంది పోలీసులు.. చిన్న ఎలక్షన్ కి ఎందుకంత భయం
-
Police attack: వీడియోలు తీస్తే మీ అంతు చూస్తాం
-
Pulivendula: ఎక్కడికక్కడ పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకున్న టీడీపీ మూకలు
-
Pulivendula: అవినాష్ రెడ్డిని ఇంట్లో నుంచి లాక్కొస్తున్న దృశ్యాలు
-
టీడీపీ గూండాలు ఓటర్లను భయపెడుతున్నారు: హేమంత్‌రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: టీడీపీ గూండాలు ఓటర్లను భయపెడుతున్నారంటూ పులివెందుల వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లపై టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నా కానీ పోలీసులు చోద్యం చూస్తున్నారంటూ మండిపడ్డారు. ‘‘నా ఇంటి చుట్టూ టీడీపీ గూండాలు మోహరించారు. కర్రలు, రాడ్లతో ఓటర్లను భయపెడుతున్నారు. ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లనీయడం లేదు’’ అంటూ హేమంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు.ఆర్.తుమ్మలపల్లిలో టీడీపీ మూకలు అరాచకం సృష్టిస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్‌ని కూడా ఓటు వేయనివ్వని టీడీపీ గూండాలు.. ఇప్పటికే గ్రామంలోని రెండు పోలింగ్ బూత్‌లను స్వాధీనం చేసుకున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్‌ని బూత్ దగ్గరకు కూడా వెళ్లనివ్వకుండా కాపలా కాస్తున్నారు. ఎస్ఫీకి కాల్ చేసినా ఫలితం కనిపించలేదు. హేమంత్ గన్‌మెన్‌ని ఉన్నపళంగా అధికారులు మార్చేశారు. నిన్నటి వరకు ఉన్న గన్‌మెన్‌ను తొలగించి మరొకరిని పంపించారు. బయటి నుండి వచ్చిన వ్యక్తులతో ఓట్లేయిస్తున్న టీడీపీ గూండాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు.నల్లపురెడ్డిపల్లిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. స్వయం ప్రతిపత్తి ఎలక్షన్ కమిషన్ చెప్పే మాటలన్నీ నీట మూటలయ్యాయి. వైఎస్సార్సీపీ ఏజెంట్లను, ఓటర్లను టీడీపీ గుండాలు నిర్భందించారు. ఏజెంట్‌గా ఉన్న మాజీ ఎంపీపీ బలరాంరెడ్డిని బూత్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఓటేసేందుకు అడ్డుకుంటున్నారని సామాన్య ఓటర్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులే టీడీపీ అరాచక శక్తులకు అండగా ఉన్నారని మాజీ ఎంపీపీ బలరాం రెడ్డి మండిపడ్డారు. మాపై దాడులు చేసేందుకు టీడీపీ గుండాలు ప్రయత్నిస్తున్నారు. జమ్మలమడుగు నుంచి టీడీపీ గుండాలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఓటేసేందుకు వెళ్తే ఓటర్ స్లిప్పులను చించేశారంటూ ఓటర్ల ఆవేదన వ్యక్తం చేశారు. -
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో సీఎం చంద్రబాబు కుతంత్రం...
-
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు నేడు పోలింగ్
సాక్షి, అమరావతి /సాక్షి ప్రతినిధి, కడప: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలుపు కోసం వైఎస్సార్సీపీ నేతలపై హత్యాయత్నాలు, దాడులు, అక్రమ కేసుల బనాయింపు మొదలు.. ఎన్ని అడ్డదారులు తొక్కినప్పటికీ టీడీపీ అభ్యర్థికి ఘోర పరాజయం తప్పదని అంతర్గత సర్వేల్లో స్పష్టమవడంతో పెదబాబు, చినబాబు ఇద్దరూ బరితెగించారు. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి జెడ్పీటీసీ ఉప ఎన్నికల గండం నుంచి గట్టెక్కేందుకు పథక రచన చేశారు. మంగళవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సోమవారం కొత్త కుట్రకు తెరతీశారు.ఇప్పటికే అధికారులు పంపిణీ చేసిన ఓటరు స్లిప్పుల్లో తప్పులు ఉన్నాయని అబద్ధం చెబుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తల ద్వారా వాటిని సేకరిస్తున్నారు. ఇవ్వని వారి నుంచి బలవంతంగా లాక్కున్నారు. సోమవారం సాయంత్రం వరకు పంపిణీ చేయని ఓటరు స్లిప్పులను అధికారుల నుంచి గంపగుత్తగా టీడీపీ నాయకులు తీసేసుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు, కమలాపురంతోపాటు.. సరిహద్దు జిల్లాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలను భారీ ఎత్తున రప్పించి పులివెందుల మండలంలో పోలింగ్ బూత్‌లు ఉన్న గ్రామాల్లో తిష్ట వేయించారు.ఈ ఓటరు స్లిప్పులను టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఇచ్చి దొంగ ఓట్లు వేయించుకోవడానికి కుట్ర చేస్తున్నారు. ఒక గ్రామం పోలింగ్ బూత్‌ను పక్క గ్రామంలోకి మార్చిన నేపథ్యంలో ఓట్లు వేయడానికి 2 నుంచి 4 కిలోమీటర్ల దూరానికి పలు గ్రామాల ఓటర్లు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నల్లపురెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లె, యర్రబల్లె ఓటర్లను మార్గం మధ్యలో పోలీసుల ద్వారా ఆపేసి.. పోలింగ్ బూత్ వద్ద టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారని, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని చెప్పి అడ్డుకోవాలనే ఎత్తు వేశారు. తద్వారా వారి ఓట్లను కూడా ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలతో దొంగ ఓట్లు వేయించుకోవాలన్నది టీడీపీ నేతల పన్నాగం.ఏజెంట్లపై దాడి చేసి వెళ్లగొట్టే కుట్ర మంగళవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన వెంటనే పోలింగ్ బూత్ నుంచి వైఎస్సార్సీపీ ఏజెంట్లపై దాడి చేసి, పోలీసుల ద్వారా వారిని వెళ్లగొట్టేందుకు టీడీపీ నేతలు కుట్ర చేశారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లను బూత్ నుంచి వెళ్లగొట్టడం ద్వారా తమ అడుగులకు మడుగులొత్తే పోలీసులు, అధికారుల సహకారంతో పోలింగ్ బూత్‌ను పూర్తిగా తమ అ«దీనంలోకి తీసుకుని యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకోవాలన్నది టీడీపీ నేతల ఎత్తుగడ. ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన టీడీపీ శ్రేణులను ప్రతి పోలింగ్ బూత్ వద్ద కనీసం వంద మంది చొప్పున ఇప్పటికే మోహరించారు. పోలింగ్ ప్రారంభం కాక ముందే పోలింగ్ బూత్ వద్ద వారితో యథేచ్ఛగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేయించి, ఉద్రిక్త పరిస్థితులకు దారితీసేలా చేసి.. పోలీసులతో లాఠీఛార్జ్ చేయించి.. పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకోవడానికి మరో కుట్ర చేస్తున్నారు. తద్వారా రిగ్గింగ్ చేసుకోవాలన్నది టీడీపీ నేతల ఎత్తుగడ. ఎస్ఈసీ, పోలీసులు ప్రేక్షకపాత్ర ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే పులివెందుల మండల స్థానికులు మినహా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు వెనక్కు వెళ్లిపోవాలి. ప్రచారం ముగిసిన తర్వాత ఇతర ప్రాంతాల వారు ఎన్నిక జరిగే ప్రాంతంలో ఉండటం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా బస చేస్తే వారిపై ఎస్ఈసీ (రాష్ట్ర ఎన్నికల కమిషన్) అధికారులు, పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ.. ఇతర ప్రాంతాల నుంచి వందలాది వాహనాల్లో వచి్చన టీడీపీ శ్రేణులు పులివెందుల మండలంలోని గ్రామాలకు చేరుకుంటున్నప్పటికీ.. వారిని అడ్డుకోకుండా ఎస్ఈసీ, పోలీసు అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. పులివెందుల మండలంలోనే కాదు.. ఒంటిమిట్ట మండలంలోనూ ఇదే దుస్థితి నెలకొంది. అంతులేని అక్రమాలు ⇒ పులివెందుల మండలంలో ఇటు అధికారులు, అటు పోలీసులు అందరూ ఏకమై వైఎస్సార్సీపీపై కుయుక్తులకు పాల్పడుతున్నారు. పులివెందులకు విలన్లా మారిన మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు కుట్రలను అమలు చేస్తున్నారు. ఎలాగైనా సరే గెలిచి.. వైఎస్ జగన్ అడ్డాలో పాగా వేశామని చెప్పుకునేందుకు పులివెందులను రణరంగంగా మార్చేందుకు సిద్ధమయ్యారు. ⇒ కూటమి నేతల అరాచకంపై ఎన్నికల కమిషన్‌కు ఎన్నిమార్లు విన్నవించినా స్పందనే లేదు. మరోవైపు ఆయా కేసుల్లో అరెస్ట్ చేయొద్దని హైకోర్టు తీర్పు ఇచి్చనప్పటికీ మోట్నూతలపల్లె గ్రామానికి చెందిన అర్జున్, గంగన్న, చంద్రగిరికి చెందిన మస్తాన్‌వల్లి, మల్లికార్జునపురానికి చెందిన హరి, రచ్చుమర్రిపల్లె మైసూరారెడ్డి, లోపట్నూతల ప్రకాష్‌రెడ్డి, కారంపల్లె మహేష్‌నాయక్, బాలాజీ నాయక్, సర్పంచ్ రామాంజనేయులు, కోరా కిరణ్‌కుమార్‌రెడ్డి, రవిప్రకాష్రెడ్డిలను ఇప్పటికే పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. మరోవైపు ప్రలోభాలకు గురిచేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు.⇒ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ సోమవారం పులివెందుల మండలంలోని నల్లపురెడ్డిపల్లె, ఎర్రిపల్లె, కొత్తపల్లె, కనంపల్లె, యర్రబల్లె గ్రామాల్లో ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, కృష్ణచైతన్యరెడ్డి, టీడీపీ జమ్మలమడుగు ఇన్చార్జి భూషేష్రెడ్డిలు రౌడీïÙటర్లను వెంటబెట్టుకుని హల్చల్ చేశారు. పోలింగ్ ప్రారంభం కాకముందే కొన్ని ఓట్లు వేసుకునేలా సరికొత్త కుట్రకు పదును పెట్టినట్లు తెలిసింది. ⇒ పోలింగ్ పారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు టీడీపీ నేతల మాట మాత్రమే వినాలని పోలీసులకు ఓ ఉన్నతాధికారి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.నేడు పోలింగ్∙ 14వ తేదీన ఓట్ల లెక్కింపు వైఎస్సార్ జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో ఉప ఎన్నికలకు సంబంధించి మంగళవారం పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహణకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది. 14వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోవివిధ కారణాలతో 28 జెడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉండగా, కోర్టులో కేసుల పేరుతో కేవలం పులివెందుల, ఒంటిమిట్ట స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. -
YSR జిల్లా ఒంటిమిట్టలో టీడీపీ నేతల అరాచకం
-
పులివెందులలో 10,601, ఒంటిమిట్టలో 24,600 ఓట్లు
-
కాసేపట్లో AP హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్ విచారణ
-
రక్తపాతం సృష్టిస్తున్నారు
పులివెందుల: ప్రశాంతంగా ఉన్న పులివెందులలో రక్తపాతం సృష్టిస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల పట్టణంలోని భాకరాపురంలో ఉన్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వేల్పుల రాముపై హత్యాయత్నం చేసి అతడితోపాటు మరో 50 మందిపై రివర్స్‌లో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారంటే పోలీసువ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇస్తే భవిష్యత్ అరాచకమేనని చెప్పారు.పులివెందుల బ్రాండ్, ఖ్యాతిని మండల ప్రజలు నిలబెట్టాలని కోరారు. పులివెందుల, ఒంటిమిట్ట ప్రజలు వాస్తవాలను గ్రహించాలన్నారు. పదిరోజులుగా పులివెందులలో జరుగుతున్న సంఘటనలను పరిశీలించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వ యంత్రాంగం విచ్చలవిడిగా అధికార దురి్వనియోగానికి పాల్పడుతున్నట్లు చెప్పారు. ఈ నెల 5న ఇండిపెండెంట్ అభ్యర్థి సురేష్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు అమరేశ్వరెడ్డిలతోపాటు 30 మందిపై రాడ్లు, రాళ్లతో దాడిచేశారన్నారు. మరుసటిరోజు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాములపై హత్యాయత్నం చేశారని తెలిపారు. దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్న కూటమి నాయకులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ధనుంజయ అనే వ్యక్తిపై రాము, హేమాద్రి దాడిచేసి దుర్భాషలాడినట్లు కట్టుకథలు సృష్టించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి 307 సెక్షన్ యాక్ట్ పెట్టారని చెప్పారు. పులివెందుల మండలంలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలందరిపై కేసులు నమోదు చేసి, పార్టీని బలహీనపర్చడానికి కుట్రలు చేస్తున్నారన్నారు. పోలీసులు చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఊరి పక్కనే ఉన్న పోలింగ్ కేంద్రంలో కాకుండా నాలుగు కిలోమీటర్లు వెళ్లి నల్లపురెడ్డిపల్లెలో ఓట్లు వేయాల్సిన పరిస్థితి కల్పించారని నల్లగొండువారిపల్లి ప్రజలు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. టీడీపీ నాయకుల చర్యలతో పోలింగ్ శాతం తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. వైఎస్సార్సీపీని గెలిపించాలి ఈ ప్రాంతం ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోను, తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోను అభివృద్ధి చెందిందని చెప్పారు. వైఎస్సార్ తెచ్చిన కృష్ణాజలాలను జగనన్న పొలాల్లోకి పారించారని తెలిపారు. ఈ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ వల్ల ఎలాంటి ప్రయోజనం జరగలేదని విమర్శించారు. గ్రామాల్లో అల్లర్లు, అలజడులు సృష్టించడానికి టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని, వారికి పోలీసులు సహకరిస్తున్నారని చెప్పారు.టీడీపీ నాయకుల బెదిరింపులు, పోలీసుల వేధింపులకు ఏమాత్రం బెదరకుండా వైఎస్సార్సీపీ గెలుపుకోసం నాయకులు, కార్యకర్తలు కృషిచేస్తున్నారని తెలిపారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ఓటర్లు వైఎస్సార్సీపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అవసరమైతే మహిళలు ఏజెంట్లుగా కూర్చొని ఎన్నికలు నిర్వహించాలన్నారు. ప్రజలు టీడీపీ నాయకుల దాడులను సహించరని, వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
రౌడీయిజం వికటాట్టహాసం
సాక్షి, అమరావతి/ సాక్షి ప్రతినిధి, కడప: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యయుతంగా గెలవడం అసాధ్యమని ఆదిలోనే గ్రహించిన సీఎం చంద్రబాబు తొక్కని అడ్డదారులు లేవు.. సామ దాన భేద దండోపాయాలను వాడిగా ప్రయోగించినా విజయం దరిదాపుల్లోకి కూడా చేరుకోలేకపోయామనే దుగ్ధతో అరాచకాలకు మరింతగా పదును పెట్టారు. కాలకేయులు.. పిండారీలు.. బందిపోట్లను మరిపించే గూండాలతో కూడిన టీడీపీ మూక, రౌడీ గ్యాంగ్‌కు కొమ్ముకాసే కొంత మంది పోలీసు అధికారులను ముఠాగా ఏర్పాటు చేసి, పోలింగ్ ప్రక్రియను హైజాక్ చేసే కుట్రకు తెర తీశారు.వైఎస్సార్సీపీ శ్రేణులు, సానుభూతిపరులపై అత్యంత కిరాతకంగా పాశవికంగా దాడులు చేసి, దౌర్జన్యం చేసి పోలింగ్ శాతాన్ని తగ్గించడం– పోలింగ్ బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్ చేసుకోవడం, ఈ అరాచకకాండ బయటకు తెలియ నీయకుండా చేసేందుకు మీడియాను కూడా పోలీసులతోనే కట్టడి చేయిస్తున్నారు. దేశ చరిత్రలో ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ఈ స్థాయిలో వికృత దాడులు, దౌర్జన్యాలు.. అధికార దుర్వినియోగానికి పాల్పడిన దాఖలాలు లేవంటూ సీనియర్ రాజకీయ నేతలు నివ్వెరపోతున్నారు.14 నెలల్లోనే టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతుండటం సీఎం చంద్రబాబును ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్సార్ కడప జిల్లాలో పులివెందుల, అన్నమయ్య జిల్లాలో ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడం.. ఆ రెండు స్థానాల్లో టీడీపీ ఘోర పరాజయం పొందడం ఖాయమని తాను నిర్వహించిన అంతర్గత సర్వేల్లో తేలి పోవడంతో సీఎం చంద్రబాబు విద్యార్థి దశ నుంచే అలవర్చుకున్న రౌడీ రాజకీయానికి మరింత పదునుపెట్టారు.అధికార దుర్వినియోగానికి పరాకాష్ట పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఆ మండలాల్లోనే వైఎస్సార్సీపీ కీలక నాయకులు, క్రియాశీలక కార్యకర్తలపై సీఎం చంద్రబాబు పోలీసులను ఉసిగొలిపి బైండోవర్ కేసులు పెట్టించారు. వందల కొద్దీ నాయకులు, కార్యకర్తలపై బైండోవర్ కేసులు పెట్టినా వైఎస్సార్సీపీ శ్రేణులు వెరకపోవడంతో.. కోట్ల కట్టలను వెదజల్లి ప్రలోభపెట్టి లొంగదీసుకోవడానికి ప్రయత్నించారు. ప్రలోభపర్వం కూడా బెడిసికొట్టడంతో దౌర్జన్యకాండకు తెరతీశారు. సీఎం చంద్రబాబు రచించిన పథకం మేరకు.. ఆగస్టు 5న పులివెందులలో ఓ పెళ్లికి హాజరైన వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ గూండాలు వికృతంగా దాడి చేశారు.ఆగస్టు 6న నల్లగొండువారిపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, బీసీ నేత రమేష్ యాదవ్, పార్టీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిలపై హత్యాయత్నం చేయించారు. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు ఈ దాడి కళ్లెదుటే జరుగుతున్నప్పటికీ ప్రేక్షక ప్రాత వహించారు. పోలీసులు అధికార టీడీపీకి ఏకపక్షంగా వత్తాసు పలుకుతుండటం అడుగడుగునా కనిపిస్తోంది. ఏకంగా డీజీపీ కనుసన్నల్లోనే పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. అరాచకం, రౌడీయిజం, పోలింగ్ బూత్‌ల మార్పిడిపై వైఎస్సార్సీపీ నేతలు ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిద్ర నటిస్తుండటం దుర్మార్గం. ఓటింగ్ క్యాప్చర్ లక్ష్యం⇒ అధికార టీడీపీ అడుగులకు మడుగులొత్తే అధికారులు వైఎస్సార్సీపీ ఓట్లను తగ్గించేందుకు గ్రామాల పోలింగ్ బూత్‌లను ఆ గ్రామాల్లో కాకుండా పక్క గ్రామాలకు మార్చారు. ఒక ఊరిలోని ఓటర్లు మరో ఊరికి వెళ్లి ఓటు వేసేలా సరికొత్తగా ‘జంబ్లింగ్’ విధానాన్ని తీసుకొచ్చి లబ్ధి పొందాలని కుట్ర చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ గ్రామాల ప్రజలు ఓటేయడానికి వెళ్లనివ్వకుండా బెదిరించడం, భౌతికదాడులకు పాల్పడి భయపెట్టడం, తద్వారా పోలింగ్ శాతాన్ని తగ్గించడం, రిగ్గింగ్‌కు పాల్పడేందుకు పన్నాగం పన్నారు.⇒ మరోవైపు ప్రచారం ముగియడంతో టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడంపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు గుంపగుత్తగా ఓట్లు కొనేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారు. ఇంత దారుణం జరుగుతుంటే సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహిస్తామని వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్, ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్‌లు ప్రకటించారు. ఇప్పటికే ఓటర్లు స్లిప్పులు 95 శాతం పంపిణీ చేశామని చెప్పారు. వాస్తవానికి స్లిప్పులు ఓటర్లకు చేరలేదు. ⇒ ఎన్ని అక్రమాలు చేసినా విజయ సూచనలు ఏమాత్రం కనిపించక పోవడంతో అరెస్టులు, దౌర్జన్యాలపై టీడీపీ పెద్దలు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా తప్పుడు ఫిర్యాదుతో నల్లగొండుగారిపల్లిలో జరిగిన దాడిలో బాధితులపైనే వేల్పుల రాము సహా 50 మందిపై రివర్స్‌లో ఏకంగా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. ఈ కేసును అడ్డుపెట్టుకుని.. పోలింగ్ రోజున వారంతా ఉండకుండా అరెస్టులకు ఉపక్రమించారు. తద్వారా పోలింగ్ ప్రక్రియను టీడీపీ గూండాలు హైజాక్ చేసేందుకు అనువైన పరిస్థితులను కల్పించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారు. ⇒ టీడీపీ నేతల దాడులకు నిరసనగా పులివెందులలో వైఎస్సార్సీపీ చేసిన శాంతి ర్యాలీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనంటూ మరో 150 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ గోటూరు చిన్నప్పలకు నోటీసు జారీ చేశారు. ఇంకా వైఎస్సార్సీపీ నేతల వేట కొనసాగుతూనే ఉంది.సోమవారం రాత్రి లోగా టీడీపీ పెద్దలు ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేసి స్వామిభక్తి చాటుకునే పనిలో కొంత మంది అధికారులు నిమగ్నమై ఉన్నారు. పోలింగ్ నాటికి వైఎస్సార్సీపీ క్రియాశీలక నేతలెవ్వరు బయట ఉండకుండా చేయాలనే లక్ష్యం మేరకు ఏకపక్ష చర్యలు తీవ్రతరమయ్యాయి. తద్వారా పూర్తిగా టీడీపీ అనుకూల ఓటింగ్‌కు రంగం సిద్ధం చేస్తున్నారు. పులివెందులలో ప్రజాస్వామ్యం ఇంతగా ఖూనీ కావడంపై.. వ్యవస్థలు నిర్వీర్యం కావడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పరిశీలకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కూటమి ప్రభుత్వం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): వైఎస్సార్ జిల్లా పులివెందుల రూరల్ మండల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే ఎన్నికల కమిషన్ చేష్టలుడిగి చూస్తుండటం దారుణమని వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క జెడ్పీటీసీ స్థానంలో ఎన్నికలు నిర్వహించడంలో యంత్రాంగం ఘోర వైఫల్యం చెందిందని మండి పడింది. దౌర్జన్యాలు, దాడులపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోరా? అని నిలదీసింది. పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఉప ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించాలని కోరుతూ ఆ పార్టీ ప్రతినిధి బృందం శనివారం ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు పేర్ని నాని, మేరుగ నాగార్జున, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, రమేష్‌కుమార్ యాదవ్, సూర్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్యేలు కైలే అనిల్‌కుమార్, సుధాకర్‌బాబు, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ తదితరులను పోలీసులు బయటే ఆపేయడంతో తోపులాట జరిగింది. దీంతో వారంతా కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఇంత దుర్మార్గం ఎక్కడా చూడలేదని నిప్పులు చెరుగుతూ వాగ్వాదానికి దిగారు.‘ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి.. పోలీసుల దౌర్జన్యం నశించాలి.. ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణి విడనాడాలి..’ అని నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో వారిని వినతిపత్రం అందజేసేందుకు పోలీసులు అనుమతించారు. పోలింగ్ బూత్‌లు మార్చడానికి వీల్లేదని, బైండోవర్ కేసులు పెట్టి కనిపించకుండా దాచిన వైఎస్సార్సీపీ నాయకులను విడుదల చేయాలని, సీసీ కెమెరాలు, వెబ్ క్యాస్టింగ్ చేయాలని వారు ఎన్నికల కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దయనీయం.. ఘోరం రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరుగుతున్న తీరు అత్యంత జుగుప్సాకరంగా, దయనీయంగా, ఘోరంగా ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతుంటే కళ్లు, చెవులు మూసుకొని కమిషన్ ఏమీ పట్టనట్లు కళ్లు మూసుకుని నిద్ర నటిస్తోంది. ఎన్నికల కమిషన్ ఓటు హక్కును ప్రోత్సహించడం కోసం, ఓటింగ్ శాతం పెంచడానికి వ్యవస్థను ఓటర్ల వద్దకు తీసుకెళ్లాల్సింది పోయి.. పులివెందులలో అందుకు విరుద్ధంగా ఓటర్లకు దూరంగా పోలింగ్ కేంద్రాలను తీసుకెళుతుండటం దారుణం. – పేర్ని నాని, మాజీ మంత్రి దేవుని దయవల్ల బతికి బయట పడ్డానుబీసీ సామాజిక వర్గానికి చెందిన నాపై అతి ఘోరంగా బండరాళ్లు, సుత్తులతో దాడి చేశారు. పెట్రోలు పోసి నన్ను చంపేందుకు ప్రయతి్నంచారు. దేవుని దయతో బతికి బట్ట కట్టాను. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తామే గెలవాలనే ఉద్దేశంతోనే టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రాలను ఒక ఊరి నుంచి మరో ఊరికి మార్చారు. – రమేష్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ ఈ అధికారం శాశ్వతమా? పులివెందులలో ఒక జెడ్పీటీసీ సెగ్మెంట్ ఎన్నికల కోసం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి అక్రమాలకు తెరలేపారు. ఎన్నికలు నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వమా? ఎన్నికల కమిషనా? వినతి పత్రం ఇచ్చేందుకు వస్తే ఇక్కడ మమ్మల్ని పోలీసుల చేత నెట్టించే ప్రయత్నం చేయడం దారుణం. ఎందుకంత కండకావరం? ఈ అధికారం శాశ్వతమా? – టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే పులివెందులలో రాజ్యాంగం అమలులో లేదు పులివెందులలో రాజ్యాంగం అమలులో లేదు. అధికారులు వైఎస్సార్సీపీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారు. ఎన్నికల కమిషనర్ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. – దేవినేని అవినాష్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు -
ఓటు వేసేందుకు ఎక్కువ మంది వెళ్లకూడదని కూటమి ఎత్తుగడ
-
ఇష్టానుసారం పోలింగ్ బూత్‌లను మార్చేయొచ్చా?
ఎన్నికల సంఘం వ్యవహార శైలిపై గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఏకపక్షంగా వ్యవహరిస్తూ అధికార పార్టీకి ఈసీ కొమ్ము కాస్తోందని, అందుకు ఆధారాలూ ఉన్నాయని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మీడియా ముందుకు రావడం తెలిసిందే. ఈ తరుణంలో.. ఆంధ్రప్రదేశ్ పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నిక కోసం ఎన్నికల అధికారులు ఉన్నపళంగా పోలింగ్ బూత్‌లను మార్చేయడం(జంబ్లింగ్) విమర్శలకు దారి తీసింది. ఇంతకీ ఇలా ఇష్టానుసారం మార్చేయొచ్చా?.. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మునుపెన్నడూ లేని సంస్కృతికి అధికారులు తెర లేపారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల కోసం మొత్తం 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే వీటిల్లో దాదాపు ఆరు(6, 7, 8 ,9 ,10 ,11) పోలింగ్ కేంద్రాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్పు చేశారు. అదీ రాజకీయ పార్టీలకు ఎలాంటి సమాచారం అందించకుండానే. ఓటర్ల పరిశీలన (వెరిఫికేషన్) సందర్భంగా ఈ విషయం బహిర్గతం కావడంతో అవాక్కు కావడం అందరి వంతు అయ్యింది. ఈ నిర్ణయంతో.. ఇంటి ప్రక్కనే పోలింగ్ కేంద్రం ఉన్న ఆ ఓటర్ మాత్రం తన ఓటును నాలుగు కిలోమీటర్ల వెళ్లి వేసుకోవాల్సిన దుస్థితి ఇక్కడ నెలకొంది. అదే సమయంలో రాజకీయ దుమారమూ చెలరేగింది.రాజ్యాంగం ఏం చెబుతోందంటే.. రాజకీయ పార్టీలకు ఎలాంటి సమాచారం అందించకుండా ఇలా పోలింగ్ బూత్‌లను మార్చేయడం తీవ్రమైన చర్యనే. తద్వారా పారదర్శకత, నిష్పాక్షికత రెండూ దెబ్బతింటాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం..కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల పర్యవేక్షణ, దిశానిర్దేశం, నియంత్రణ (ఓటర్ల జాబితాల తయారీ సహా) అప్పగించబడ్డాయి. ఇందులో ఓటర్ల జాబితాల తయారీ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో పోలింగ్ బూత్‌లను ఒకచోటు నుంచి మరో చోటుకు మార్చొచ్చు. ఈ మార్పుల గురించి రాజకీయ పార్టీలకు ముందుగా సమాచారం ఇవ్వాలనే నిబంధన ఏదీ లేదు. కానీ అదే సమయంలో.. ఒత్తిళ్లకు తలొగ్గకుండా స్వేచ్ఛగా, ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా ఎన్నికల నిర్వహణ చేపట్టాలన్న అంశం మాత్రం నొక్కి చెబుతోంది. పులివెందుల పోలింగ్ బూత్‌ల మార్పు నిర్ణయం ఎన్నికల పారదర్శకత, నిష్పాక్షికత ఈ రెండింటినీ దెబ్బ తీసే అంశాలేనన్న చర్చ నడుస్తోంది.వైఎస్సార్సీపీ అభ్యంతరాలుపులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో 10,601 ఓట్లు ఉన్నాయి. అయితే ఇందులో 4,000 ఓట్లు ఉన్న ఆరు పోలింగ్ కేంద్రాలను ఆ ప్రాంతాలలో కాకుండా మరో ప్రాంతానికి మార్చడమే అసలు సమస్యగా మారింది. మొత్తం ఓట్లలో 65 శాతం ఓట్లున్న కణంపల్లె, కొత్తపల్లె, నల్లపురెడ్డిపల్లె పంచాయతీల్లోనే తమ పార్టీకి పట్టుందని, ఉద్దేశపూర్వకంగానే పోలింగ్ బూత్‌ల మార్పు జరిగిందని, అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి అధికారులు పోలింగ్ కేంద్రాలను మార్చారని వైఎస్సార్సీపీ అంటోంది. స్వల్ప వివాదాలు తలెత్తినా.. అంత దూరం వెళ్లి ఓటు వేసేందుకు ఓటర్లు స్వతహాగా నిరాసక్తత చూపుతారన్నది అధికార పార్టీ టీడీపీ ఎత్తుగడగా కనిపిస్తోందని చెబుతోంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు రాకుండా చేయడం వల్ల పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకొని సైక్లింగ్ లేదంటే రిగ్గింగ్ చేసుకోవాలని టీడీపీ కుట్రలు చేస్తోందని మండిపడుతోంది. ఈ విషయమై ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. కోర్టులు ఏం చెబుతున్నాయంటే..1951 ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం.. ఎన్నికల సంఘానికి పోలింగ్ ఏర్పాట్లు నిర్వహించేందుకు, బూత్‌ల స్థానాలను నిర్ణయించేందుకు విస్తృత అధికారాలు ఉన్నాయి. అయితే 2018లో కమల్ నాథ్ వర్సెస్ భారత ఎన్నికల సంఘం కేసులో పార్టీలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈసీ ఈ తరహా చర్యలు తీసుకోవడం నిషేధించాలంటూ దిశానిర్దేశాలు కోరారు. ఈ క్రమంలో ఈసీ వ్యవహరిస్తున్న తీరు పట్ల రాజకీయ పార్టీల ఆందోళనలను సుప్రీం కోర్టు నిశితంగా పరిశీలించడం గమనార్హం. అంతేకాదు కోర్టులు గతంలో ఎన్నికల సంబంధిత నిర్ణయాల్లో పారదర్శకత, ప్రక్రియాత్మక న్యాయత అవసరాన్ని స్పష్టంగా హైలైట్ చేసిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. ఎన్నికల సంఘానికి పరిపాలనా స్వేచ్ఛ ఉన్నప్పటికీ.. పోలింగ్ బూత్ మార్పుల గురించి రాజకీయ పార్టీలకు సమాచారం ఇవ్వకపోవడం, సహజ న్యాయం, ఎన్నికల న్యాయత సూత్రాలకు విరుద్ధమే. ఈ అభ్యంతరాలతో పార్టీలు న్యాయస్థానాలనూ ఆశ్రయించవచ్చు. -
పోలింగ్ బూత్‌ల మార్పుతో ప్రభుత్వం కుట్ర
పులివెందుల: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల రూరల్ మండలం జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ బూత్‌ల మార్పుతో ప్రభుత్వం కుట్ర చేస్తోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం పులివెందులలోని భాకరాపురంలో ఉన్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 12న జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా ఎన్నికల కమిషన్ పోలింగ్ బూత్‌లను మార్చడం దారుణమన్నారు. ఎర్రబల్లె గ్రామానికి చెందిన పోలింగ్ బూత్‌ను నల్లపురెడ్డిపల్లె గ్రామానికి, నల్లపురెడ్డిపల్లె పోలింగ్ బూత్‌ను ఎర్రబల్లెకు, నల్లగొండువారిపల్లెకు చెందిన పోలింగ్ బూత్‌ను నల్లపురెడ్డిపల్లెకు మార్చారన్నారు. ఈ విధంగా చేయడంవల్ల ఎర్రబల్లె ప్రజలు నల్లపురెడ్డిపల్లెకు వెళ్లి ఓటు వేయాలి, నల్లపురెడ్డిపల్లె ప్రజలు ఎర్రబల్లెకు వెళ్లి ఓటు వేయాలని, అలాగే నల్లగొండువారిపల్లె ప్రజలు నల్లపురెడ్డిపల్లెకు వెళ్లి ఓటు వేయాల్సి వస్తుందన్నారు. నల్లగొండువారిపల్లెలో దాదాపు 632 ఓట్లు ఉన్నాయని, వీరందరూ 4 కి.మీ. దూరంలోని నల్లపురెడ్డిపల్లెకు వెళ్లి ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నల్లపురెడ్డిపల్లె ప్రజలందరూ నల్లగొండువారిపల్లెకు వెళ్లి ఓటు వేయాల్సిన పరిస్థితి ఉందని, ఇలా ఎందుకు చేశారో తెలియడం లేదన్నారు. అదే 2021లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినప్పుడు ఏ గ్రామంలోని ఓట్లు ఆ గ్రామంలోనే వేసేలా బూత్‌లు ఏర్పాటు చేయడంతో పోలింగ్ శాతం పెరిగిందన్నారు. కానీ ఇప్పుడు పోలింగ్ శాతం భారీగా తగ్గే అవకాశం ఉందన్నారు. నల్లగొండువారిపల్లెలో హత్యాయత్నం ఏ స్థాయిలో జరిగిందో, కార్లను ఎలా ధ్వంసం చేశారో, పెట్రోలు క్యాన్లు తెచ్చి కార్లను తగలబెట్టే ప్రయత్నం చేశారో, మనుషుల తలలను పగులగొట్టే ప్రయత్నం ఎలా జరిగిందో, ఇనుప రాడ్లు, కర్రలు ఎలా వాడారో చూసిన తర్వాత ఓటర్లు ఏ ధైర్యంతో 4కి.మీ. ప్రయాణం చేసి నల్లపురెడ్డిపల్లెకు వెళ్లి ఓటు ఎలా వేయగలరో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలా ఎందుకు చేశారనేది ఆలోచిస్తే కేవలం పోలింగ్ శాతం తగ్గించడానికి, పోలింగ్ బూత్‌లలో పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ ఏమైనా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేసేందుకా అనిపిస్తోందన్నారు. అధికార పార్టీ ప్రభావంతోనే..ప్రతి ఒక్కరు ఓటు వేసే సౌలభ్యం కల్పించాల్సిన ఎలక్షన్ కమిషన్, ఇవాళ రూలింగ్ పార్టీ ప్రభావంతో పనిచేస్తోందన్నారు. ఈ ఓటర్ల మార్పు ఆరు పోలింగ్ కేంద్రాలపై ఉందని...అంటే 3,900 ఓట్ల మీద ఉందని, ఈ ఎలెక్షన్ 10,600 ఓట్లకు కాగా, 36 శాతం ఓటర్లకు ఈ సమస్య ఉంటుందన్నారు. ఇప్పటికే ఇష్టమొచి్చనట్లు తమ కార్యకర్తలపై బైండోవర్, తప్పుడు కేసులు పెడుతున్నారని, ఇవన్నీ సరిపోవన్నట్లు ఇంకో ఘనకార్యం చేశారని.. బూత్‌లు షిఫ్ట్ కాకుండా ఓటర్లనే వేరే ఊరికి షిఫ్ట్ చేశారని చెప్పారు. విషయం తమకు తెలిసిన వెంటనే ఎన్నికల కమిషన్, కలెక్టర్, ఎన్నికల అధికారి తదితరుల దృష్టికి తీసుకెళ్లామని, తమ నాయకులు కూడా వాళ్లను కలుస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో దీనిని సరిదిద్ది ఏ ఊరి ఓటరు ఆ ఊరిలోనే స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కల్పించాలన్నారు. ఎన్నికల కమిషన్ టీడీపీ ప్రభావం నుంచి బయటకు రావాలన్నారు. ఎన్నికల కమిషన్‌కు చాలా వినతులు చేశామని, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలెక్షన్ కోసం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద, పరిసరాలలో కూడా సీసీ కెమెరాలను అమర్చాలని అడిగామన్నారు. ముఖ్యంగా సైక్లింగ్, రిగ్గింగ్ జరగకుండా ఉండాలంటే కంప్లీట్ సీసీ ఫుటేజీ ఎన్నికల కమిషన్ వద్ద ఉండాలన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కోర్టుకు కూడా వెళతామన్నారు. -
పోలింగ్ కేంద్రాలను మార్చొద్దు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా కొన్ని పోలింగ్ కేంద్రాలను మార్చాలన్న ఎన్నికల అధికారి (ఈవో) నిర్ణయంపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓటర్లను అసౌకర్యానికి గురిచేసే ఈ నిర్ణయాన్ని వెంటనే మార్చేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను (ఎస్ఈసీ) కోరింది. ఈ మేరకు శుక్రవారం శాసన మండలి మాజీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ రాజగొల్ల రమేష్ యాదవ్‌లు ఎన్నికల కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీ మూర్తిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. విపరీత పోకడలకు పోకుండా ప్రజస్వామ్య పద్ధతిలో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిపిస్తే, ప్రజలే తగిన తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అప్పిరెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే.. ‘‘పులివెందుల జెడ్పీటీపీ ఉప ఎన్నికలో ఎర్రబల్లి మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్లోని రెండు సెంటర్లను నల్లపురెడ్డిపల్లిలోని జెడ్పీహెచ్‌ఎస్‌కు, నల్లగొండువారిపల్లిలోని మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్ సెంటర్‌ను నల్లపురెడ్డిపల్లిలోని జెడ్పీహెచ్‌ఎస్‌కు, నల్లపురెడ్డిపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లోని రెండు సెంటర్లను ఎర్రబల్లి మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్‌కు, నల్లపురెడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్లో ఉన్న మరో సెంటర్‌ను నల్లగొండువారిపల్లిలోని మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్‌కు మార్చాలని ఎన్నికల అధికారి నిర్ణయించారు. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారు. ఈ నిర్ణయంతో ఓటర్లు చాలా ఇబ్బందిపడతారు. ఈ ఆరు పోలింగ్ కేంద్రాలను మార్చాలన్న ఎన్నికల అధికారి నిర్ణయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని ఎస్ఈసీని కోరాం. ప్రతి ఓటరు తమ హక్కును వినియోగించుకునే పరిస్థితులను ప్రభుత్వం కల్పించాలి. మార్చిన పోలింగ్ కేంద్రాలను చూస్తే... ప్రజలు ఓటు వేయాలని కోరుకుంటున్నారా? మీరెవరూ ఓటు వేయొద్దు. మేమే వేసుకుంటాం. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం మాకు వర్తించదు అని చెప్పదల్చుకున్నారా? ఇక్కడున్నదల్లా రెడ్ బుక్ రాజ్యాంగం, దాని ద్వారానే ఇష్టం వచి్చనట్లు చేస్తాం? అనే ఉద్దేశంలో ఉన్నారా?. దగ్గరగా ఉన్న పోలింగ్ కేంద్రాలను ఎత్తేసిఎన్నికల ప్రక్రియలో పోలింగ్ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. నిర్భయంగా ఓటు వేసే పరిస్థితులను అధికారులు కల్పించాలి. కానీ, ఎర్రబల్లి నుంచి నల్లపురెడ్డిపల్లి 2 కి.మీ., నల్లగొండువారిపల్లి నుంచి నల్లపురెడ్డిపల్లి 4 కి.మీ. దూరం. గతంలో పోలింగ్ కేంద్రాలు ఓటర్లకు దగ్గరగా ఉండేవి. ప్రజలు ఇబ్బంది లేకుండా ఓటు వేసేవారు. దూరంగా తరలించడం వల్ల ఓటర్లు ఇబ్బంది పడతారు. దూరంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లేటప్పుడు వారంతా వైఎస్సార్సీపీ సానుభూతిపరులని చెప్పి, ఓటు వేయనీయకుండా టీడీపీ నిరోధించే ప్రమాదం ఉంది. ఉప ఎన్నిక ప్రచారంలో ఈ నెల 6న మా పార్టీ నాయకులపై ఏ స్థాయిలో భౌతిక దాడి జరిగిందో అందరూ చూశారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి, వారు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోకుండా చేయాలన్న కుట్రతోనే అధికార పార్టీ వారు ఈ దాడికి పాల్పడ్డారు. అందుకని పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా 6 పోలింగ్ కేంద్రాలను (6వ నంబరు నుంచి 11 వరకు) ఏ మార్పు లేకుండా యథాతథంగా కొనసాగేలా చూడాలి. ఎలాగైనా గెలవాలని టీడీపీ దుశ్చర్యలు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ వారు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు ఖాకీ చొక్కాలను పక్కనపెట్టి పచ్చ చొక్కాలను ధరించి వైఎస్సార్సీపీ నాయకులను అడుగడుగునా భయపెడుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అయినా, ప్రజలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారన్న ఆలోచనతో ఏదో ఒకలా వారిని ఎన్నికల్లో పాల్గొనకుండా చేయాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. దాడులకు దిగుతున్నారు. చివరికి బీసీ నాయకుడు, ఎమ్మెల్సీ రాజగొల్ల రమేష్ యాదవ్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డారు. రెవెన్యూ యంత్రాంగం.. ఎలాగైనా టీడీపీని గెలిపించాలని పైనుంచి ఒత్తిళ్లు ఉన్నాయి. వాటికి అనుగుణంగా పనిచేస్తున్నామని నిస్సిగ్గుగా చెబుతోంది. 20 ఏళ్ల క్రితం బిహార్ లో ఉన్న పరిస్థితులను టీడీపీ ఇప్పుడు ఏపీలో తీసుకొస్తోంది. హైకోర్టు తీర్పును గౌరవించండి సీసీ కెమెరాల ఏర్పాటు, వెబ్ కాస్టింగ్, మానిటరింగ్, అభ్యర్థులకు రక్షణ, ఓటర్లు నిర్భయంగా ఓటు వేయడానికి చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. వాటిని అమలు చేయాలి. వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రజల కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మేం ఏనాడూ తప్పుడు పనులు చేయలేదు. ప్రజాస్వామ్యవాదులంతా రాష్ట్రంలోని అప్రజాస్వామ్యిక పాలనను గమనించాలి. -
టీడీపీ తొండాట!
సాక్షి ప్రతినిధి, కడప: ‘ఏం చేస్తారో చేయండి.. అక్కడ మనం బలం చాటుకోవాలి.. ఎప్పటికప్పుడు మీకు ఏ సహాయం కావాలో చెబితే వెంటనే అందే ఏర్పాటు చేస్తాం.. అధికారులంతా మీకు సహకరిస్తారు.. రాష్ట్రంలో అందరి దృష్టీ ఆ ఎన్నికపైనే ఉండాలి’ అని ‘ముఖ్య’ నేత కొందరు టీడీపీ నేతలకు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై దిశా నిర్దేశం చేయడం వల్లే కొద్ది రోజులుగా ఇక్కడ అరాచకం రాజ్యమేలుతోంది. స్థానిక టీడీపీ నేత బీటెక్ రవి, మరికొందరు నేతలు రెచ్చిపోతున్నారని స్పష్టమవుతోంది. ఈ క్రమంలో చోటు చేసుకున్న వైఎస్సార్సీపీ నేతలపై దాడులు, తప్పుడు కేసులు, భయభ్రాంతులకు గురి చేయడాలు, ప్రలోభాలు.. ఇలా ఏవీ ఫలితమివ్వక పోవడంతో తాజాగా మరో కుట్రకు తెరలేపారు. ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం తగ్గించి, అధికార టీడీపీకి మేలు చేకూర్చాలన్న కుట్రలకు పదును పెడుతున్నారు. ఏ గ్రామంలోని ఓటర్లు ఆ గ్రామంలోనే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేకుండా అక్కడి ఓట్లు ఇక్కడికి, ఇక్కడి ఓట్లు అక్కడికి మార్చేస్తున్నారు. పులివెందుల మండలంలోని ఎర్రబల్లె కొత్తపల్లె పంచాయతీలో 6, 7 నంబర్ల పోలింగ్ బూత్‌లు, నల్లగొండువారిపల్లెలో పోలింగ్ బూత్ 8, నల్లపురెడ్డిపల్లెలో 9, 10, 11 బూత్‌లు ఉన్నాయి. ఇది వరకు ఏ గ్రామానికి చెందిన ఓటర్లు ఆ గ్రామంలోని పోలింగ్ బూత్‌లలో ఓటు హక్కు వినియోగించుకునే వారు. తాజాగా ఎర్రబల్లె కొత్తపల్లె ఓటర్లు నల్లపురెడ్డిపల్లె బూత్‌లలో, నల్లపురెడ్డిపల్లె ఓటర్లు ఎర్రబల్లె కొత్తపల్లె బూత్‌ల పరిధిలోకి వచ్చేలా అధికారులు మార్పిడి చేశారు. ఓటర్ల పరిశీలన (వెరిఫికేషన్) సందర్భంగా ఈ విషయం బహిర్గతం కావడంతో పలువురు అవాక్కవుతున్నారు. ఇలాగైతే తాము మూకుమ్మడిగా పోలింగ్ బహిష్కరిస్తామని నల్లగొండువారిపల్లె గ్రామస్తులు అధికారులకు తేల్చి చెప్పారు. ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు ఇలా మార్చారని ఆరా తీస్తే.. టీడీపీ నేతల కుట్రను అధికారులు అమలు చేస్తున్నారని స్పష్టమైంది. పోలింగ్ శాతం తగ్గించడమే లక్ష్యం పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలో మొత్తం 10,601 ఓట్లు ఉన్నాయి. అందులో కణంపల్లె, కొత్తపల్లె, నల్లపురెడ్డిపల్లె పంచాయతీల్లో 65 శాతం ఓటర్లు ఉన్నారు. ఆయా పంచాయతీల్లో వైఎస్సార్సీపీకి గట్టి పట్టు ఉంది. ఈ పరిస్థితిలో అక్కడి ఓటర్లు ఓట్లు వేస్తే వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపు సునాయాసం. ఈ క్రమంలో ఓటర్ల బూత్‌లను తారుమారు చేశారు. దీంతో స్వల్ప వివాదాలు తలెత్తినా.. అంత దూరం వెళ్లి ఓటు వేసేందుకు ఓటర్లు స్వతహాగా నిరాసక్తత చూపుతారన్నది అధికార పార్టీ నేతల ఎత్తుగడ. పైగా ఓటింగ్ వెళ్లే దారిలో ప్రలోభ పెట్టేందుకు, భయభ్రాంతులకు గురిచేసేందుకు అవకాశం ఉంటుందని కూడా ఎత్తు వేసినట్తు తెలుస్తోంది. దీంతోపాటు ఓటర్లను పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేయడం మొదలెట్టారు. ఇంకోవైపు వైఎస్సార్సీపీ అభ్యర్థికి పడిన ఓట్లు ఎక్కువగా చెల్లనివిగా చేసేందుకు బ్యాలెట్ పేపర్ ముద్రించడంలో కూడా ఎత్తుగడలు వేశారని తెలుస్తోంది. 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున ఒక్క పేజీలో బ్యాలెట్ పేపర్ ముద్రిస్తే సరిపోతుంది. అలా కాకుండా డబుల్ సైడ్ గుర్తులు ఇస్తూ బ్యాలెట్ ముద్రించేందుకు అధికారులు సిద్ధమైనట్లు సమాచారం. తద్వారా ఒకటవ గడిలో ఉన్న వైఎస్సార్సీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్‌రెడ్డి గుర్తుపై ఓటు వేయడం ద్వారా ఆ ఓటు చెల్లకుండా పోవాలనే కుట్ర దాగి ఉంది. ‘ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. మెరుగైన సమాజం కోసం ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగించండి. ప్రతి ఒక్కరూ పోలింగ్‌లో పాల్గొనండి.. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి’ అన్న ప్రచారానికి భిన్నంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఎలాగైనా సరే గెలవడానికి ఓటర్లను గందరగోళానికి గురి చేసి, పోలింగ్ కేంద్రం వద్దకు రాకుండా చేయాలన్న ప్రభుత్వ పెద్దల కుతంత్రానికి అధికారులు వత్తాసు పలుకుతున్నారు. రోజుకో దాడితో భయభ్రాంతులకు గురిచేసే ఎత్తుగడవైఎస్సార్ కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ చంద్రబాబు అండ్ గ్యాంగ్ బరితెగించి కుట్రలు, కుతంత్రాలకు తెర లేపింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే గెలుపు దరిదాపులకు వెళ్లడం అటుంచి.. డిపాజిట్ కూడా దక్కదనే విషయం తెలిసి రౌడీయిజంతో బందిపోట్ల తరహాలో వైఎస్సార్సీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేసేందుకు దాడులకు తెగబడింది. ఇందులో భాగంగా మంగళవారం పులివెందుల శ్రీకర్ ఫంక్షన్ హాల్లో వివాహానికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు సైదాపురం సురేష్‌కుమార్‌రెడ్డి (చంటి), అమరేష్‌రెడ్డి, నాగేష్, శ్రీకాంత్, తన్మోహన్రెడ్డిలపై టీడీపీ రౌడీ మూకలు హత్యాయత్నం చేశాయి. ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ఏమాత్రం పట్టించుకోలేదు. బుధవారం నల్లగొండువారిపల్లెలో ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై బందిపోటు దొంగల ముఠా తరహాలో టీడీపీ రౌడీ మూకలు మెరుపు దాడి చేశాయి.ఒక్కసారిగా దాదాపు 100 మంది రాడ్లు, కర్రలు, ఇతర మారుణాయుధాలతో వారిని చుట్టుముట్టి మట్టు బెట్టేందుకు యత్నించారు. వేల్పుల రామలింగారెడ్డి తలపై రాడ్డుతో కొట్టారు. దీంతో తల పగిలి ఆయన కింద పడిపోయారు. పక్కనే ఉన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పైనా అదే స్థాయిలో దాడి చేశారు. రమేష్ యాదవ్ తల తిప్పడంతో భుజంపై రాడ్ల దెబ్బలు పడ్డాయి. ఎమ్మెల్సీ రేంజ్ రోవర్, వేల్పుల రామలింగారెడ్డికి చెందిన ఫార్చ్యునర్, స్కార్పియో వాహనాలనూ సమ్మెటలతో ధ్వంసం చేశారు. రామలింగారెడ్డి ఉన్న ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించబోయారు. గ్రామస్తులు ప్రతిఘటించేందుకు సిద్ధమవడంతో రౌడీ మూకలు పారిపోయాయి. ఈ ఘటన చోటుచేసుకున్న ప్రాంతానికి సమీపంలోనే పోలీసు క్యాంప్ ఉన్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోక పోవడం గమనార్హం. ఫ్లెక్సీని వారే చింపేసుకుని వైఎస్సార్సీపీ నేతలపై కేసు సాక్షి, టాస్క్ ఫోర్స్: పులివెందులలో కూటమి నాయకులు, పోలీసుల అరాచకాలకు అంతులేకుండా పోతోంది. రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న ఓబుల్ రెడ్డి పేరుతో జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా పులివెందుల మండలం కొత్తపల్లి గ్రామంలో టీడీపీ నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ విషయంపై పులివెందుల పోలీసులు అదే గ్రామంలోని వైఎస్సార్సీపీ నాయకుడు శంకర్ నారాయణకు ఫోన్ చేసి, అక్కడ టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించాలని సూచించారు. దీనిపై శంకర్ నారాయణ స్పందిస్తూ.. ఆ ఫ్లెక్సీని తొలగించాల్సిన అవసరం తనకు లేదని బదులిచ్చారు. అనంతరం కొద్ది గంటల్లోనే శంకర్ నారాయణతో పాటు మరో ముగ్గురిని పులివెందుల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ధ్వంసం చేశారంటూ వారిపై కేసు నమోదు చేశారు. కూటమి నాయకుల ఆదేశాలతో పోలీసులు ముందస్తు వ్యూహంలో భాగంగా ఈ అక్రమ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. -
అవినాష్ రెడ్డి సమక్షంలో YSRCPలో చేరిన 40 మంది TDP కార్యకర్తలు
-
చంద్రబాబు ఏరోజూ నిజాయితీగా రాజకీయాలు చేయలేదు: మేరుగు నాగార్జున
-
క్లబ్ లో పేకాట.. పబ్ లో డ్యాన్సులు వేసినంత ఈజీ కాదు పులివెందులలో గెలవడం
-
పులివెందుల ZPTC ఉపఎన్నికలో అధికారుల అత్యుత్సాహం
-
ఇది YSR అడ్డా.. పులివెందుల ప్రచారంలో పెద్దారెడ్డి
-
ఓటమి భయం.. పులివెందులలో కూటమి కుతంత్రాలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కూటమి ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ శ్రేణుల్ని లక్ష్యంగా చేసుకుని గత కొన్నిరోజులుగా అక్కడ జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. ప్రశాంత వాతావరణంలో గనుక పోలింగ్ జరిగితే ఓటమి ఖాయమని భావిస్తున్న అధికార టీడీపీ.. ఎప్పటికప్పుడు కుట్రలకు, కుతంత్రాలకు తెరతీస్తోంది. తాజాగా..పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక భాగం ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లను ఉన్నపళంగా అధికారులు మార్చేశారు. ఇందులో అధికంగా ఓట్లు ఉన్న నల్లపురెడ్డిపల్లి, ఎర్రిబల్లి, నల్లగొండువారిపల్లి పోలింగ్ బూత్‌లనే జబ్లింగ్ చేయడం గమనార్హం. ఎర్రిబల్లి ఓటర్లకు నల్లపురెడ్డిపల్లెలో పోలింగ్ బూత్, నల్లపురెడ్డిపల్లి ఓటర్లకు ఎర్రిబల్లిలో పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. దాదాపు 7 వేల ఓట్లు ఈ నిర్ణయంతో ప్రభావితం కానున్నాయి. అయితే.. ఓటర్లను పోలింగ్ బూత్‌ల వద్దకు రాకుండా చేసేందుకే టీడీపీ నేతలు ఈ కుట్ర పన్నారంటున్న వైఎస్సార్సీపీ అంటోంది. ఎటువంటి సంప్రదింపులు లేకుండా నామినేషన్ల సందర్భంగా ఇచ్చిన పోలింగ్ బూత్‌ల లిస్టును మళ్లీ ఎలా మారుస్తారని ప్రశ్నిస్తోంది. బూత్‌లు మార్చేప్పుడు రాజకీయ పార్టీలతో సంప్రదించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌కి ఉంటుందని.. కేవలం అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే ఇలా బూత్‌లను మార్చారంటూ మండిపడుతున్నారు. ఎలాంటి సమాచారం లేకుండా పోలింగ్ బూత్‌లను జంబ్లింగ్ చేయడంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు సిద్ధమయ్యారు. -
సేమ్ సీన్ రిపీట్.. పులివెందులలో వైఎస్సార్సీపీదే విజయం
-
పులివెందుల ZPTC ఉప ఎన్నిక లో YSRCP ఘన విజయం
-
Pulivendula: బరితెగిస్తున్న చంద్రబాబు దొంగల ముఠా
-
టీడీపీ రౌడీల దాడి పై కర్నూల్ DIG వ్యాఖ్యలు ఏకిపారేసిన పేర్ని నాని
-
పులివెందులలో ఎగిరేది వైఎస్ఆర్సీపీ జెండానే
-
By election Campaign: వైఎస్ఆర్ జిల్లా పులివెందులతో టీడీపీ మూకల బరితెగింపు
-
పులివెందులలో పచ్చనేతల అరాచకం
పులివెందుల: ఏదైనా ఎన్నిక వస్తే ప్రజలకు తాము చేసిన మంచిని చెప్పుకొని ఓట్లు అడగడం రాజకీయ పార్టీలు పాటించే పద్ధతి. అనుకోని పరిస్థితుల్లో పదవిలో ఉన్న నాయకుడు చనిపోతే ఉప ఎన్నిక లేకుండా వారి కుటుంబానికి చెందిన వ్యక్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చేయడం గౌరవ సంప్రదాయం...! అయితే, తాము చేసింది ఏమీ లేక, రాజకీయాల్లో హుందాతనమూ మరిచిన టీడీపీ నేతలు వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో బరితెగించారు. ఈ నెల 12న జరగనున్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక ముంగిట పచ్చ పార్టీ మూకలు చెలరేగాయి. పులివెందుల జెడ్పీటీసీ సభ్యుడు మహేశ్వరరెడ్డి అకాల మరణంతో ఉప ఎన్నిక నిర్వహిస్తుండగా టీడీపీ తమ అభ్యరి్థని నిలిపింది. తీవ్ర అనైతిక కార్యకలాపాలకు తెరలేపింది. చివరకు వైఎస్సార్సీపీ నాయకులపై దాడులకు కూడా తెగిస్తోంది. ఇదంతా పోలీసుల అండతోనే జరుగుతోందని స్పష్టంగా తెలుస్తోంది. జైడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నాయకుడు సైదాపురం సురేష్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో సురేష్‌రెడ్డిపై టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సురేష్‌రెడ్డి మంగళవారం ∙బంధువు అమరేశ్వరరెడ్డితో కలిసి పులివెందులలో టీడీపీ కార్యాలయ సమీపంలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో వివాహ వేడుకకు హాజరయ్యారు. వారు కురీ్చల్లో కూర్చుని ఉండగా టీడీపీ కార్యాలయం నుంచి 30 మందిపైగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కర్రలు, రాళ్లతో వచ్చి హత్యాయత్నానికి పాల్పడ్డారు. సురేష్‌కు సంబంధించిన వాహనాన్ని ధ్వంసం చేశారు. దాడిలో అమరేశ్వరరెడ్డి తలకు బలమైన గాయమైంది. సురేష్ రెడ్డికి కమిలిన గాయాలయ్యాయి. చేయి విరిగింది. వీరిని పులివెందులలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెంటనే ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఓటమి ఖాయమై అసహనంతోనే దాడులు: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బాధితులను పరామర్శించిన అనంతరం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీడీపీ వారికి ఎక్కడా గెలుపు ఆశ కనిపించలేదని దీంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేసి ఉప ఎన్నికను కంట్రోల్లోకి తెచ్చుకోవాలని కుటిల పన్నాగం పన్నారని పేర్కొన్నారు. అమరే‹Ù, జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న సురేష్ రెడ్డి ఓ పెళ్లికి వెళ్లగా ఐదు వాహనాల్లో అక్కెళ్ల విజయ్‌కుమార్‌రెడ్డి, కిరికిరి బాషా, 30 మందిపైగా టీడీపీ కార్యకర్తలు కర్రలతో, రాడ్లతో దాడి చేశారని తెలిపారు. కేవలం ఈ ఎన్నిక కోసం భయభ్రాంతులకు గురిచేయడానికి, హత్యలకు సైతం వెనుకాడడం లేదని మండిపడ్డారు. స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఇన్చార్జి, చంద్రబాబుకు నిజంగా వారి పాలనపై నమ్మకం ఉంటే, సూపర్ సిక్స్ అమలు చేశామన్న ధీమా ఉంటే, ఉప ఎన్నికను పారదర్శకంగా జరపాలని డిమాండ్ చేశారు. అంతేగాని తమ కార్యకర్తలు, ఇతరుల మీద తీవ్ర దాడులు చేసి ప్రజ లను, భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికలను నియంత్రించాలని అనుకోవడం పిరికిపంద చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం అడ్డుపెట్టుకుని, పోలీసులు తొత్తులుగా ఉండడంతో తప్పుడు పనులు చేస్తున్నారని... చంద్రబాబు తప్పుడు సంస్కృతికి బీజం వేస్తున్నారని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న పులివెందులలో రెచ్చగొట్టేలా దాడులు చేస్తే ఎవరూ భయపడరని తేల్చిచెప్పారు. దాడులు తక్షణమే మానుకోవాలని టీడీపీ నేతలను హెచ్చరించారు. లేదంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్నారు. తాము కూడా కోర్టుల దృష్టికి తీసుకెళ్తామని ఎంపీ తెలిపారు. ప్రతి గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను కేసులున్నా, లేకపోయినా బైండోవర్ చేస్తున్నారని, మంగళవారం ఒక చిన్న మండలంలో వందమందిని బైండోవర్ చేశారని పేర్కొన్నారు. దీన్నిబట్టే వైఎస్సార్సీపీని ఎదుర్కొనడానికి చంద్రబాబు ఎంతగా భయపడుతున్నారో తెలుస్తోందని చెప్పారు. ఉప ఎన్నిక సజావుగా జరిగేలా ఎన్నికల కమిషన్‌కు మనవి చేస్తున్నామని, మీడియా కూడా ఫెయిర్ పోలింగ్‌కు చొరవ తీసుకోవాలని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు. -
Rachamallu Siva: గత సాంప్రదాయాలను టీడీపీ తుంగలో తొక్కింది
-
పులివెందుల ZPTC ఉపఎన్నికకు YSRCP అభ్యర్థి ఖరారు
-
‘స్థానిక’ స్థానాలు ఖరారు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్రంలో జెడ్పీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ స్థానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. రాష్ట్రంలో జిల్లా ప్రజా పరిషత్‌లు 31, జెడ్పీటీసీ స్థానాలు 566, మండల ప్రజా పరిషత్‌లు 566, ఎంపీటీసీ స్థానాలు 5,773, గ్రామపంచాయతీలు 12,778, వార్డులు 1,12,694 ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2019లో పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.అప్పుడు 32 జెడ్పీపీలు, ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు 570 చొప్పున, ఎంపీటీసీలు 5,817, గ్రామ పంచాయతీలు 12,848 ఉన్నాయి. దీనిని బట్టి చూస్తే ఇప్పుడు 1 జెడ్పీపీ, నాలుగు జెడ్పీటీసీ, నాలుగు ఎంపీపీలు, 44 ఎంపీటీసీ స్థానాలు, 70 గ్రామపంచాయతీలు తగ్గాయి. మేడ్చల్–మల్కాజిగిరిలోని మెజారిటీ గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో ఈ గ్రామీణ జిల్లా ఉనికి లేకుండా పోయింది. దీనివల్లే ఒక జెడ్పీపీ, 4 జెడ్పీటీసీల సంఖ్య తగ్గింది.మరికొన్ని జిల్లాల్లోనూ పంచాయతీలు సమీప మున్సిపాలిటీల్లో విలీనం కావడం, ఇతర కారణాలతో గ్రామ పంచాయతీల సంఖ్య తగ్గింది. సంఖ్యాపరంగా చూస్తే...నల్లగొండ జిల్లా 33 జడ్పీటీసీలు, 33 ఎంపీపీలు, 353 ఎంపీటీసీ స్థానాలతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇక ములుగు జిల్లా 10 జడ్పీటీసీలు, 10 ఎంపీపీలు, 83 ఎంపీటీసీ స్థానాలతో అత్యల్ప స్థానాలున్న జిల్లాగా నిలిచింది. టాప్–5, లాస్ట్–5 జిల్లాల్లోని స్థానాలు ఇలా.. టాప్–5 జిల్లాలు... నల్లగొండ: 1 జడ్పీ, 33 జడ్పీటీసీలు, 33 ఎంపీపీలు, 353 ఎంపీటీసీ స్థానాలు నిజామాబాద్: 1 జడ్పీ, 31 జడ్పీటీసీలు, 31 ఎంపీపీలు, 307 ఎంపీటీసీ స్థానాలు ఖమ్మం: 1 జడ్పీ, 20 జడ్పీటీసీలు, 20 ఎంపీపీలు, 283 ఎంపీటీసీ స్థానాలు సంగారెడ్డి: 1 జడ్పీ, 26 జడ్పీటీసీలు, 26 ఎంపీపీలు, 271 ఎంపీటీసీ స్థానాలు సూర్యాపేట: 1 జడ్పీ, 23 జడ్పీటీసీలు, 23 ఎంపీపీలు, 235 ఎంపీటీసీ స్థానాలు లాస్ట్–5 జిల్లాలు... ములుగు: 1 జడ్పీ, 10 జడ్పీటీసీలు, 10 ఎంపీపీలు, 83 ఎంపీటీసీ స్థానాలు వరంగల్: 1 జడ్పీ, 11 జడ్పీటీసీలు, 11 ఎంపీపీలు, 130 ఎంపీటీసీ స్థానాలు రాజన్న సిరిసిల్ల: 1 జడ్పీ, 12 జడ్పీటీసీలు, 12 ఎంపీపీలు, 123 ఎంపీటీసీ స్థానాలు వనపర్తి: 1 జడ్పీ, 15 జడ్పీటీసీలు, 15 ఎంపీపీలు, 133 ఎంపీటీసీ స్థానాలు మంచిర్యాల: 1 జడ్పీ, 16 జడ్పీటీసీలు, 16 ఎంపీపీలు, 129 ఎంపీటీసీ స్థానాలు -
125 వంసతాల సంబరం : పూర్వ విద్యార్థుల ఘనత
ఆ బడి రాజుల పాలన చూసింది. స్వాతంత్య్ర సంగ్రామ నినాదాలు విన్నది. భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చిన సందర్భానికి సాక్షిగా నిలిచింది. ప్రజాస్వామ్య యుగంలో తొలిసారి ఓటరుగా మారిన మందస వాసులకు వేదికనిచ్చింది. ఇన్నేళ్ల ప్రస్థానంలో వేలాది మంది మేధావులకు పురుడు పోసింది. 125 ఏళ్లుగా విజ్ఞాన కాంతులు వెదజల్లుతూనే ఉంది. మందసలోని శ్రీరాజా శ్రీనివాస మెమోరియల్ జెడ్పీ ఉన్నత పాఠశాల వైభవమిది. మందస రాజుల సుందర స్వప్నంగా ప్రారంభమైన పాఠశాల పూర్వ విద్యార్థుల సంకల్ప బలంతో పూర్వ వైభవం సాధించింది. మందస: మందసలోని ఎస్‌ఆర్‌ఎస్‌ఎం జెడ్పీ ఉన్న త పాఠశాల 125 ఏళ్ల వేడుకకు ముస్తాబవుతోంది. జమీందారుల పాలనలో పురుడు పోసుకున్న ఈ బడి ఈనాటికీ పచ్చగా విరాజిల్లుతోంది. 1901 మే 16న ఆనాటి గంజాం కలెక్టర్ హెచ్డీ టేలర్, మందస జమీందారు వాసుదేవ రాజమణిదేవ్ ఈ పాఠశాలకు పునాది వేశారు. నాటి శిలాఫలకం నేటికీ ఈ బడిలో భద్రంగా ఉంది. వాసుదేవ రాజమణిదేవ్ తర్వాత శ్రీనివాస రాజమణి దేవ్ పాలన సాగించా రు. ఆయన 30 ఏళ్ల పాటు ఈ బడిని బ్రిటిష్ పరం కాకుండా కాపాడారు. 1930లో ఆయన చనిపోయాక.. 1932 సెపె్టంబర్ 21న స్కూల్‌ను ప్రభుత్వ పాఠశాలగా గుర్తించి శ్రీ రాజా స్కూలును శ్రీ రాజా శ్రీనివాస రాజమణిదేవ్ మెమోరియల్ బోర్డు హైసూ్కల్‌గా మార్చారు. నాటి గంజాం జిల్లాలో ఇది రెండో హైస్కూల్ కావడం విశేషం. ఎన్నెన్నో అనుభవాలు.. వందేళ్లకుపైబడిన ప్రస్థానంలో మందస హౌస్కూల్ ఎన్నో అనుభవాలు మిగిల్చింది. ప్రధానంగా ఈ పాఠశాల ముందరి భవనం ఓ జ్ఞాపికగా మారింది. వందలాది తుఫాన్లను తట్టుకుని ఈ భవనం నిలబడింది. రాజులు కట్టించిన భవంతుల్లో ఇది మాత్ర మే మిగిలింది. ఇక్కడ చదువుకున్న వారు దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. మండల వ్యాప్తంగా దశాబ్దాల పాటు ఈ పాఠశాల పెద్ద దిక్కుగా ఉండేది. బడి వదిలితే సాయంత్రం పూట మందస పట్టణమంతా కళకళలాడేది. పూర్వ విద్యార్థుల ఔదార్యం కాలక్రమేణా పెంకులు ఊడిపోయిన దశలో ఐకానిక్ భవనం అందవిహీనంగా మారడం పూర్వ విద్యార్థులను కలిచివేసింది. ఎంతో వైభవం కలిగిన ఈ భవనాన్ని ఆ దశలో చూసి విద్యార్థుల గుండెలు చివుక్కుమన్నాయి. అంతే.. అంతా కలిశారు. ప్రభుత్వ సాయం కోరకుండా, అధికారుల కోసం ఎదురు చూడకుండా ఎవరికి తోచినంత డబ్బు వారు విరాళాల రూపంలో పోగు చేసుకున్నారు. బ్యాచ్‌ల వారీ గా పోటీ పడి మరీ స్కూలు కోసం పూర్వ విద్యార్థులు విరాళాలు ఇచ్చారు. ఎక్కడెక్కడి వారో వా ట్సాప్ వేదికగా ఒక్కటయ్యారు. దాదాపు రూ.27 లక్షలు సేకరించి ఐకానిక్ భవనానికి మళ్లీ కొత్త ఊపిరి పోశారు. అ‘పూర్వ’ సమ్మేళనానికి సై.. భవన పునరి్నర్మాణం పూర్తి కావడంతో ఈ నెల 19, 20 తేదీల్లో భవనాన్ని పునఃప్రారంభిస్తూ 125 ఏళ్ల వేడుక సందర్భంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆహ్వాన పత్రాలు కూడా పంపిణీ చేయడం మొదలుపెట్టామని నిర్వాహకులు తెలిపారు. ఉన్నత పాఠశా ల భవనాన్ని 19వ తేదీ ఉదయం 10 గంటలకు పునఃప్రారంభిస్తామని, మరుసటి రోజు ఆదివారం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామన్నారు. -
కృష్ణా జిల్లా ఎస్పీని కలిసిన జడ్పీటీసీలు
సాక్షి, కృష్ణా జిల్లా: జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీకి కృష్ణా జిల్లా జడ్పీటీసీలు ఫిర్యాదు చేశారు. గుడివాడలో జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడి సమాజం తలదించుకునేలా ఉందని జడ్పీటీసీలు అన్నారు. హారికపై దాడిని తీవ్రంగా ఖండించారు.కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదు, గౌరవం లేదు. ఉన్నత పదవిలో ఉన్న ఒక మహిళకు రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం.. సామాన్య ప్రజలకు, మహిళలకు ఎలాంటి భద్రత కల్పిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీని కోరామని జడ్పీటీసీలు తెలిపారు.ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం బదులు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని జడ్పీటీసీలు మండిపడ్డారు. జడ్పీ చైర్పర్సన్ పదవిలో ఉన్న మహిళకే రక్షణ లేకుండా పోయింది. జిల్లా ప్రథమ పౌరురాలికే ఇలా జరిగితే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి?. ఆడపిల్లకు కష్టం కలిగితే తాట తీస్తామని చంద్రబాబు, పవన్ కబుర్లు చెబుతున్నారు. అయ్యా పవన్ ఎక్కడున్నావ్?. గుడివాడలో ఇంత జరిగితే ఏం చేస్తున్నావ్? ఎందుకు తాట తీయడం లేదు?’’ అంటూ జడ్పీటీసీలు ప్రశ్నించారు.గుడివాడలో ఉప్పాల హారిక కారు పై దాడి చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలి. రక్షించాల్సిన పోలీసులు టీడీపీ భటుల్లా మారారు. గంటన్నర పాటు టీడీపీ, జనసేన గూండాలు హారిక కారును నిర్భంధిస్తే పోలీసులు చోద్యం చూశారు. కృష్ణాజిల్లా ఎస్పీ తక్షణమే స్పందించాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని జడ్పీటీసీలు డిమాండ్ చేశారు. -
బలవంతంగా టీడీపీ కండువా వేశారు..!
-
ఉపఎన్నికల్లో మీరు చూపిన తెగువకు, ధైర్యానికి హ్యాట్సాఫ్: జగన్
-
ఎంపీటీసీ, జడ్పీటీసీలతో వైఎస్ జగన్ భేటీ
-
Appi Reddy: ఏపీలో బీహార్ తరహా పరిస్థితులు
-
వైఎస్సార్ జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవి వైఎస్సార్సీపీ కైవసం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవి వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. వైఎస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ జడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకే ఒక్క నామినేషన్ రావడంతో ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అనంతరం రామగోవిందరెడ్డి జడ్పీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.కాగా, బ్రహ్మంగారిమఠం మండల జెడ్పీటీసీ సభ్యుడు ముత్యాల రామగోవిందురెడ్డిని వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యర్థిగా ఆపార్టీ ప్రకటించింది. రెండు పర్యాయాలుగా బి.మఠం జెడ్పీటీసీగా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమై రామగోవిందురెడ్డి అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేశారు.కాగా, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ ద్వంద్వనీతి ప్రదర్శించింది. సంఖ్యాబలం లేని కారణంగా ప్రజాతీర్పుకు గౌరవించి చైర్మన్ ఎన్నికలో పోటీలో లేమంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి ప్రకటించారు. వాస్తవాలు పరిశీలిస్తే అందుకు విరుద్ధమైన సంకేతాలు తెరపైకి వచ్చాయి. జిల్లా అధ్యక్షుడు పోటీలో లేమంటూనే మరోవైపు టీడీపీ జెడ్పీటీసీ జయరామిరెడ్డి ద్వారా ఎన్నికలను నిలుపుదల చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.బరిలో నిలిచే శక్తి లేకపోవడంతో చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు కుట్రలు పన్నారు. టీడీపీ జెడ్పీటీసీతోపాటు మరో 7మంది తెలుగుదేశం పార్టీ వర్గీయులు హైకోర్టును ఆశ్రయించారు. చైర్మన్ ఎన్నిక అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. స్టేటస్ కో తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నం చేశారు. చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు, స్టేటస్కో ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడం విశేషం. సమయం లభిస్తే జెడ్పీటీసీ సభ్యులను వశపర్చుకోవాలనే దుర్భుద్ధితోనే హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.కాగా, చైర్మన్ ఎన్నికకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించుకోవాలని హైకోర్టు ఆదేశిస్తూనే తుది ఫలితం హైకోర్టు ఉత్తర్వులకు లోబడి ఉండాలని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ జరిగిన ఎన్నికలో వైఎస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ జడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికల అధికారి అయినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. -
వైఎస్సార్సీపీ మహిళా జెడ్పీటీసీపై దాడికి యత్నం
సాక్షి, పల్నాడు జిల్లా: పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ నేతలు రౌడీయిజం ప్రదర్శించారు. పెదకూరపాడు మండలం గార్లపాడులో వైఎస్సార్సీపీ జడ్పీటీసీ స్వర్ణకుమారి దంపతులు ఆంజనేయస్వామి గుడికి వెళ్లగా.. వారిపై దాడి చేయడానికి టీడీపీ గూండాలు ఆలయాన్ని చుట్టుముట్టారు. గుడి నుంచి బయటికి వస్తే చంపేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. రెండు గంటల పాటు జడ్పీటీసీ దంపతులు గుళ్లోనే ఉండిపోయారు. మరోవైపు, పిడుగురాళ్లలో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. పోలీసులతో కుమ్మక్కై అరాచకం సృష్టిస్తున్నారు. ఈ నెల 17వ తేదీన పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ ఇవ్వగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను టీడీపీ నేతలు, పోలీసులు బెదిరించి భయపెడుతున్నారు. 14వ వార్డు కౌన్సిలర్ పులి బాల కాశీని రాత్రి పోలీసులు తీసుకువెళ్లారు. పోలీసుల చెరలో ఉన్న తన భర్తను విడిపించాలని కాశీ భార్య రమణ వేడుకుంటోంది.టీడీపీ నేతలు, పోలీసుల వేధింపులు భరించలేక 29వ వార్డు కౌన్సిలర్ షేక్ మునిరా దంపతులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రెండు రోజుల క్రితం 23వ వార్డు కౌన్సిలర్ జూలకంటి శ్రీరంగ రజిని భర్తను జూలకంటి శ్రీనివాసరెడ్డిని పోలీసులు పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. పార్టీ మారాలంటూ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను పోలీసులు వేధిస్తున్నారు. -
జడ్పీటీసీ రమాదేవి ఇంటిని ధ్వంసం చేసిన టీడీపీ గూండాలు
-
మహిళా జెడ్పీటీసీ ఇంటిపై టీడీపీ మూకల దాడి
లక్కిరెడ్డిపల్లె: వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు అంబాబత్తిన రమాదేవి, మాజీ ఎంపీపీ రెడ్డయ్య దంపతుల ఇంటిపై టీడీపీ మూకలు కత్తులు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం దప్పేపల్లి గ్రామం పరిధిలోని జాండ్రపల్లెలో ఆదివారం రాత్రి జరిగింది. దాడి జరగక ముందే మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. లక్కిరెడ్డిపల్లె టీడీపీ నేత మదన్మోహన్ సెల్ ద్వారా వాట్సాప్ కాల్ చేసి ‘నిన్ను చంపేస్తాం’ అని బెదిరించాడని మాజీ ఎంపీపీ రెడ్డయ్య ఆరోపించారు. రెండు సుమోలు, మరో మూడు వాహనాలలో 60 మందికి పైగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు మంకీ క్యాపులు పెట్టుకుని మచ్చు కత్తులు, ఇనుప రాడ్లతో తమ ఇంటిపై దాడికి తెగబడ్డారని రమాదేవి కన్నీటి పర్యంతమయ్యారు.తన భర్త రెడ్డయ్య, కుమారుడు రమేష్‌ను కాపాడుకునేందుకు ఇంటి వెనక డోర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తుండగా, ఆడవాళ్లు అని కూడా చూడకుండా తమపై దాడి చేశారని వాపోయారు. తమ కోడలు ఆరు నెలల గర్భిణి అని, ఆమె జోలికి వెళ్లొద్దని ప్రాథేయపడినా వినకుండా దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. తమ ఇంటి బయట ఉన్న బుల్లెట్ వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారని, మరో బుల్లెట్ వాహనాన్ని ధ్వంసం చేశారని తెలిపారు. అంతలో గ్రామస్తులు అక్కడికి చేరుకుని దాడిని అడ్డుకోబోగా, జగన్మోహన్ ప్రసాద్ అనే వ్యక్తిపై ఇనుప రాడ్డుతో దాడి చేసి గాయపరిచారన్నారు.ఇంట్లోకి దూరి తలుపులు, కిటికీల అద్దాలు, సామాన్లు, ఫర్నీచర్, టీవీలు, సోఫా సెట్లను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు బయట నిద్రిస్తున్న రెడ్డయ్య తల్లి లేవలేని స్థితిలో మంచానపడి ఉన్నా కూడా కనికరించలేదని, ఆమెపై కూడా దాడి చేశారన్నారు. 40 ఏళ్ల రాజకీయంలో తాము ఇలాంటి పరిస్థితులను ఎప్పుడూ చూడలేదని తెలిపారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి రమేష్ కుమార్ రెడ్డి, ఎంపీపీ మద్దిరేవుల సుదర్శన్‌రెడ్డిలు రమాదేవికి ధైర్యం చెప్పారు. -
సూపర్ సిక్స్ హామీలపై నిలదీసిన YSRCP సభ్యులు
-
నేడు ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశం
-
మహిళా జెడ్పీటీసీపై టీడీపీ గూండాల దాడి
-
మహిళా జెడ్పీటీసీపై టీడీపీ గూండాల దాడి
పెదకూరపాడు: అధికారమే అండగా టీడీపీ ముష్కర మూకలు యథేచ్ఛగా దౌర్జన్యకాండ సాగిస్తూనే ఉన్నాయి. తాజాగా పల్నాడు జిల్లా పెదకూరపాడు వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ కంకణాల స్వర్ణకుమారి ఇంటిపై ఆదివారం తెల్లవారుజామున టీడీపీ గూండాలు దాడికి దిగారు. ఒక్కసారిగా 15 మంది టీడీపీ రౌడీలు పెదకూరపాడు మండలం గారపాడులోని జెడ్పీటీసీ ఇంటిలోకి ప్రవేశించి ఆమె సెల్‌ఫోన్ లాక్కొని పగలకొట్టారు. వృద్ధురాలన్న కనికరం కూడా లేకుండా స్వర్ణకుమారి తల్లి గణేశ్ శివమ్మని కింద పడేశారు. దీంతో ఆమె కాళ్లకు గాయాలయ్యాయి. టీడీపీ గూండాలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన జెడ్పీటీసీ స్వర్ణకుమారిని, ఆమె పెద్ద కుమార్తెను పక్కకు తోసేశారు. ‘నీ భర్తను పిలువు.. మాకు అప్పగించు’ అంటూ దౌర్జన్యం చేశారు. తన భర్త ఇక్కడ లేరని చెప్పినా వినిపించుకోకుండా భయోత్పాతం సృష్టించారు. రెక్కీ నిర్వహించి మరీ.. వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా నాయకుడైన కంకణాల శివాజీ తెలంగాణలో కాంట్రాక్టులు చేస్తుంటారు. గత ఎన్నికల్లో పెదకూరపాడు జెడ్పీటీసీ అభ్యరి్థగా తన భార్య స్వర్ణకుమారిని పోటీ చేయించి గెలిపించుకున్నారు. స్వర్ణకుమారి, శివాజీ దంపతుల ఇద్దరు కుమార్తెలు హైదరాబాద్‌లో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. దీంతో ఆ దంపతులు కొద్ది రోజులు హైదరాబాద్‌లో, మరికొద్దిరోజులు స్వగ్రామం గారపాడులో ఉంటున్నారు. మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న తన భర్త తల్లిని స్వగ్రామంలో వదిలిపెట్టడానికి జెడ్పీటీసీ స్వర్ణకుమారి, తన కుమార్తెలతో కలిసి కారులో శనివారం రాత్రి హైదరాబాద్‌లో బయలుదేరారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో గారపాడుకు వచి్చన వెంటనే శివారులో గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఉట్లపల్లి శ్రీనివాసరావు కారులో మాటు వేశాడు. జెడ్పీటీసీ తన అత్తను వారి ఇంటి వద్ద దించి, ఆమె బాగోగులు చూసుకోవడానికి చిన్న కుమార్తెను ఉంచారు. పెద్ద కుమార్తెను తీసుకుని తన తల్లి గణేశ్ శివమ్మ ఇంటికి జెడ్పీటీసీ వెళ్లారు. సెల్‌ఫోన్ పగులకొట్టి జెడ్పీటీసీ తల్లిపై దాడి ఈ క్రమంలో ఉట్లపల్లి శ్రీనివాసరావు తనతోపాటు నెల్లూరి వెంకటేశ్వర్లు, ఉట్లపల్లి కోటేశ్వరరావు, మక్కెన ప్రభాకరరావు, కొంకా శౌరీలు, మక్కెన పవన్, ఉట్లపల్లి శ్రీనివాసరావు, బండారు మాధవరావు, పొదిలె కోటేశ్వరరావు, మక్కెన అప్పారావు, పెనుముచ్చు రమేశ్లతోపాటు మరో ఐదుగురిని తీసుకుని ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు స్వర్ణకుమారి ఇంటికి వచ్చి తలుపు కొట్టారు. ఆమె తలుపులు తీయగానే ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించిన టీడీపీ గూండాలు ‘నీ భర్త శివాజీ గాడు ఎక్కడ.. వాడి అంతుచూస్తాం.. బయటకు రమ్మను’ అంటూ బిగ్గరగా కేకలు వేసి భయభ్రాంతులకు గురి చేశారు. ఎస్ఐకి ముందుగానే సమాచారమిచ్చినా.. తమపై టీడీపీ గూండాలు దాడికి దిగనున్నారని ముందుగానే తెలుసుకున్న జెడ్పీటీసీ స్వర్ణకుమారి భర్త శివాజీ పెదకూరపాడు ఎస్ఐ విపర్ల వెంకట్రావుకు ముందుగానే సమాచారం ఇచ్చారు. ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ లేదు.. రెండు వేల ఓట్లు ఉన్న గారపాడులో గతంలో ఇలాంటి సంస్కృతి ఎన్నడూ లేదు. ఇళ్లపైకి వచ్చి దాడి చేయడం ఏమిటి? మీ నేత చంద్రబాబు ఇదేనా మీకు నేరి్పంది? మా గ్రామంలోకి మేము రాకూడదా? మా ఇంటిపైకి బీభత్సం సృష్టించిన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి.–స్వర్ణకుమారి, జెడ్పీటీసీ -
పెద్దపల్లి: పుట్టామధుకు అవిశ్వాస గండం?
సాక్షి, పెద్దపల్లి: మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా పరిషత్ ప్రస్తుత ఛైర్మన్ పుట్టామధుపై అవిశ్వాసం కత్తి వేలాడుతోంది. ఆయనపై అవిశ్వాసం పెట్టడానికి జెడ్పీటీసీలు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో ఉత్కంఠ నెలకొంది. జెడ్పీటీసీ సభ్యులు రహస్యంగా మంతనాలు సాగిస్తున్నారు. 2,3 రోజుల్లో అవిశ్వాస తీర్మానానికి జడ్పీటీసీలు సిద్ధమవుతున్నారు. మెజార్టీ సభ్యుల అసమ్మతితో అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. కాగా, బుధవారం స్టాండింగ్కమిటీ సమావేశం ఉన్నప్పటికీ ఇద్దరు సభ్యులు మినహా మెజారిటీ జడ్పీటీసీలు కాకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తుంది. అసంతృప్త జడ్పీటీసీలు వేర్వేరు చోట్ల క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. గత నెల 28న జరగాల్సిన జడ్పీ జనరల్ బాడీ సమావేశం వాయిదా పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే మెజారిటీ బీఆర్ఎస్ సభ్యులు అవిశ్వాసానికి రంగం సిద్దం చేసుకున్నట్లు సమాచారం. ఈ రోజు ఎన్టీపీసీలో జరగాల్సిన జెడ్పీ సర్వ సభ్య సమావేశం కూడా కోరం లేక వాయిదా పడింది. జిల్లాలోని 13 మంది జెడ్పీటీసీలకు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 11 మంది జెడ్పీటీసీలు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు గెలుపొందారు. ఇటీవలే బీఆర్ఎస్ను వీడిన పాలకుర్తి జెడ్పీటీసి కందుల సంధ్యారాణి బీజేపీలో చేరారు. ఓదెల జెడ్పీటీసి గంటా రాములు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మెజారిటీ సభ్యుల అసమ్మతి నేపథ్యంలో అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. ఇదీ చదవండి: ముఖేష్ గౌడ్ కొడుకు దారెటు.? -
జనసేన జయప్రకాశ్‌కు 14 రోజుల రిమాండ్
సాక్షి, క్రైమ్: ఎన్నికల్లో డబ్బులు పంచిన కేసులో.. జనసేన ముఖ్యనేత గుండా జయప్రకాశ్ నాయుడికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. జయప్రకాశ్ వీరవాసరం మండల జెడ్పీటీసీ కాగా.. సదరు కేసుకు సంబంధించి ఆయన్ని హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. వీరవాసరం జెడ్పీటీసీ అయిన గుండా జయప్రకాశ్.. 2019 ఎన్నికల్లో పాలకోడేరు మండలం శృంగ వృక్షం గ్రామంలో ఓటర్లకు డబ్బులు పంచుతూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. దీనిపై స్థానిక పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. చివరకు జయప్రకాశ్‌ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన శృంగవృక్షం పోలీసులు.. ఏలూరు స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం.. కోర్టుల జయప్రకాశ్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో.. జనసేన జెడ్పీటీసీ గుండా జయప్రకాశ్ నాయుడ్ని ఏలూరు జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. -
పొంగులేటి ఎఫెక్ట్.. బీఆర్ఎస్కు బిగ్ షాక్
సాక్షి, గార్ల: తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా గార్ల జెడ్పీటీసీ సభ్యురాలు జాటోత్ ఝాన్సీలక్ష్మి బుధవారం ప్రకటించారు. ఈ సందర్బంగానే ఆమెతోపాటు మరో 30 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గార్లలోని పొంగులేటి, కోరం కనకయ్య క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నాయకుడైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి బీఆర్ఎస్లో సముచిత స్థానం లభించలేదన్నారు. ఆయన వెంట తిరుగుతున్న జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్యకు సైతం ప్రభుత్వం భద్రతను తొలగించడం కక్షపూరిత చర్యగా ఆమె అభివర్ణించారు. ఇది కూడా చదవండి: భారత్ పరివర్తన్ మిషన్‌గా బీఆర్ఎస్ -
శ్రీనివాస్ అనే వ్యక్తిపై జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు దాడి
-
గుండెపోటుతో పర్చూరు జెడ్పీటీసీ మృతి
సాక్షి, ప్రకాశం(పర్చూరు): గుండెపోటుతో పర్చూరు జెడ్పీటీసీ సభ్యురాలు కొల్లా గంగాభవాని (56) సోమవారం మృతి చెందారు. ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో ఇంటి వద్దనే తుదిశ్వాస విడిచినట్లు భర్త మాజీ జెడ్పీటీసీ కొల్లా సుభాష్‌బాబు తెలిపారు. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆమె నాగులపాలెం సర్పంచ్‌గా పనిచేశారు. భర్త కొల్లా సుభాష్‌బాబు సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీగా పనిచేశారు. మామ కొల్లా రామయ్య పర్చూరు తొలి ఎమ్మెల్యేగా పనిచేశారు. కొల్లా సుభాష్‌బాబుకి స్వాతంత్య్ర సమరయోధులు మాజీ మంత్రి దివి కొండయ్య చౌదరి స్వయానా బావ కావడంతో వీరి కుటుంబానికి రాజకీయంగా ప్రాధాన్యత ఉంది. ఆమె మృతి పలువురు రాజకీయ ప్రముఖులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పలువురు నాయకులు విచారం వ్యక్తం చేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె మృతదేహాన్ని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, రాష్ట్ర మార్కెటింగ్, సహకార శాఖ ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ శాసనసభ్యుడు మర్రి రాజశేఖర్, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త రావి రామనాథంబాబు సందర్శించి నివాళులర్పించారు. -
మేమే చంపేశాం..
సిద్దిపేటకమాన్: జెడ్పీటీసీ శెట్టే మల్లేశం హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత తెలిపారు. కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. ’’ హత్య జరిగిన తర్వాత మంగళవారం చేర్యాల మండలం గుర్జకుంట ఉపసర్పంచ్ నంగి సత్యనారాయణ (32), అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న బస్వరాజు సంపత్‌కుమార్ (24) పోలీస్ స్టేషన్‌కొచ్చి లొంగిపోయారు. తాము నేరాన్ని చేసినట్టు ఒప్పుకున్నారు. కుల సంఘం, గ్రామ రాజకీయంలో మల్లేశం తన ఎదుగుదలకు అడ్డు వస్తున్నాడన్న కక్షతో అడ్డు తొలగించుకోవాలని సత్యనారాయణ పథకం వేసుకున్నాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం సోమవారం తెల్లవారుజామున ఇద్దరు నిందితులు కారులో గ్రామ శివారులో ఉన్న వాటర్ ప్లాంట్ వద్ద వేచి ఉన్నారు. మల్లేశం ఉదయం వాకింగ్ చేసుకుంటూ నిందితులు ఉన్న కారు ముందు నుంచి వెళ్తుండగా.. సత్యనారాయణ కారును వేగంగా నడిపి మల్లేశంను వెనుక నుంచి ఢీకొట్టారు. కిందపడిపోయిన మల్లేశం తలపై.. సత్యనారాయణ కత్తితో బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై కిందపడిపోయాడు. అనంతరం ఇద్దరు నిందితులు కారులో ఘటనా స్థలం నుంచి పారిపోయారు. నిందితుల నుంచి హత్య చేయడానికి ఉపయోగించిన కత్తిని, కారును స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించాం’’ అని సీపీ తెలిపారు. కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎవరి పాత్రనైనా ఉందా? అనే విషయాలపై విచారణ కొనసాగిస్తామని చెప్పారు. కేసు ట్రయల్ తొందరగా జరిగేలా చూస్తామన్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, ఎస్బి సీఐ రఘుపతిరెడ్డి పాల్గొన్నారు. -
చేర్యాల జెడ్పీటీసీ హత్య: భూముల అమ్మకాలా.. బీరప్పగుడి వ్యవహారమా?
సాక్షి, సిద్దిపేట, చేర్యాల: అధికార పార్టీ బీఆర్ఎస్కి చెందిన చేర్యాల జెడ్పీటీసీ సభ్యుడు మల్లేశంను హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంది..? ఆస్తి వివాదాలా.. కుల సంబంధమైన పంచాయితీనా.. లేదా ఇతరత్రా ఏమైనా కారణాలున్నాయా అనే వాటిపై పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం గుర్జకుంటలో కుల సంఘానికి చెందిన స్థలంలోని కొంత భాగాన్ని బీరప్ప గుడి కోసం వదిలి మిగిలిన భూమిని ఆరేళ్ల కిందట హైదరాబాద్‌కు చెందిన వారికి విక్రయించారు. వచ్చిన డబ్బును కుల సభ్యులు పంచుకున్నారు. అదే భూమిని తిరిగి గ్రామంలో కులసంఘం పెద్దగా వ్యవహరిస్తున్న జెడ్పీటీసీ మల్లేశం మనుషులే కొనుగోలు చేశారనే ప్రచారం ఉంది. ఈ వ్యవహారంలో పెద్దమొత్తంలో డబ్బులు చేతులు మారాయంటూ ఆ గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఆరోపణలు చేయడంతో గతంలో గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఆ ప్రజాప్రతినిధికి మరో విషయంలోనూ మల్లేశంతో వివాదం నడిచింది. సదరు ప్రజాప్రతినిధికి, అన్నదమ్ముల ఆస్తి పంపకాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఆస్తి వివాదం కోర్టులో కూడా ఉంది. అయినా ఎకరం పొలాన్ని సదరు ప్రజాప్రతినిధి సాగు చేస్తుండటంతో విషయాన్ని కుల పెద్ద మల్లేశం దృష్టికి అతని సోదరులు తీసుకెళ్లారు. భూ వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున సాగు చేయొద్దంటూ ఆ ప్రజాప్రతినిధికి కుల పంచాయితీలో ఆదేశించారని తెలిసింది. ఈ పరిణామాలతో సదరు ప్రజా ప్రతినిధి పగ పెంచుకున్నాడని అంటున్నారు. ఇదిలా ఉంటే మల్లేశం హయాంలో బీరప్ప దేవాలయ నిర్మాణ పనులు శర వేగంగా జరిపిస్తున్నారు. వచ్చే ఫిబ్రవరి 16వ తేదీన పండగ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పండగ వరకు మల్లేశం బతుకుతాడా... చంపేస్తాం అని పలు మార్లు సదరు ప్రజా ప్రతినిధి హెచ్చరించినట్టు విశ్వసనీయ సమాచారం. గ్రామంలో ఆధిపత్య పోరునా? ఇక గుర్జకుంట గ్రామ పంచాయతీలో అవకతవకలు జరిగాయని స్థానికులు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తు చేసిన యువకులు మల్లేశం అనుచరులనే అనుమానం సైతం గ్రామపంచాయతీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధుల్లో ఉంది. స.హ చట్టం ప్రకారం వివరాలు బయటకు వచ్చి తాము అవకతవకలకు పాల్పడినట్లు తేలితే చెక్‌పవర్ రద్దవుతుందనే భయంతో మల్లేశంపై కక్ష పెంచుకుని ఉంటారని గ్రామంలో చర్చ సాగుతోంది. వాకింగ్‌కు వెళ్లింది ఎవరు ? ప్రతి రోజూ ఉదయం వాకింగ్‌కు జెడ్పీటీసీ మల్లేశంతోపాటు ఎవరెవరు వెళ్తుంటారు అని పోలీసులు ఆరా తీస్తున్నారు. సోమవారం ఉదయం ఎవరెవరు వెళ్లారు అని వివరాలు తెలుసుకుంటున్నారు. కాగా హత్య చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత చెప్పారు. ఉద్రిక్తంగా అంతిమ యాత్ర.. మల్లేశం అంతిమయాత్ర మంగళవారం ఉద్రిక్తతల నడుమ సాగింది. యాత్ర సాగుతుండగానే హత్యకు కారకులని అనుమానిస్తున్న గుర్జకుంట గ్రామంలోని పలువురు ఇళ్లపై మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు దాడి చేశారు. నంగి చంద్రకాంత్ ఇంటిపై దాడిచేసి అద్దాలు పగలగొట్టడంతో పాటు కారు, ట్రాక్టర్ ధ్వంసం చేశారు. నంగి అనిల్‌కు చెందిన కారును ధ్వంసం చేశారు. గ్రామ ఉపసర్పంచ్ నంగి సత్తయ్య ఇంటిపై దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అంతిమ యాత్రలో మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజాశర్మ, జనగామ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
సిద్ధిపేట జిల్లాలో జెడ్పీటీసీ మల్లేశం దారుణ హత్య
-
సిద్ధిపేట జిల్లాలో జెడ్పీటీసీ శెట్టె మల్లేశంపై గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం
-
వాకింగ్‌కు వెళ్లిన చేర్యాల జెడ్పీటీసీ దారుణ హత్య
చేర్యాల (సిద్దిపేట): అధికార బీఆర్ఎస్కు చెందిన సిద్దిపేట జిల్లా చేర్యాల జెడ్పీటీసీ సభ్యు డు శెట్టె మల్లేశం (43) దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. చేర్యాల మండలంలోని స్వగ్రామమైన గుర్జకుంటలో మల్లేశం సోమవారం ఉదయం 6 గంటలకు రోజు మాదిరిగా మార్నింగ్ వాకింగ్‌కు బయలుదేరారు. గుర్జకుంట క్రాస్ రోడ్డు వైపునకు వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయగా, తలకు తీవ్ర గాయాలై కింద పడిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్సులో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు తదుపరి చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని చెప్పగా, సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా మల్లేశం మృతి చెందారు. ఆయనకు ఏదైనా ప్రమాదంలో గాయాలయ్యాయా? లేదా ఎవరైనా దాడి చేశారా? అన్న అనుమానాలు తొలుత వ్యక్తమయ్యాయి. తర్వాత పోలీసులు హత్యగా నిర్ధారించారు. మల్లేశంపై దాడికి కారణమైన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దాడి విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేర్యాల పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. మృతదేహాన్ని త్వరగా గ్రామానికి తెచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత.. అడిషనల్ డీసీపీ మహేందర్, హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, చేర్యాల సీఐ శ్రీనివాస్, ఎస్ఐ భాస్కర్‌రెడ్డితో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించామని 24 గంటల్లోపు నిందితులను పట్టుకుని హత్యకు గల కారణాలను వెల్లడిస్తామని చెప్పారు. మల్లేశానికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మంత్రి, ఎమ్మెల్యే దిగ్భ్రాంతి ప్రజాసేవ కోసం పరితపించే శెట్టె మల్లేశం మృతి చాలా బాధాకరమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు. మృతికి కారణ మైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గజ్వేల్ ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ మృతి
సాక్షి, తిరుపతి: పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి మర్రిగుంట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వెంకటగిరి జెడ్పీటీసీ, వైఎస్సార్సీపీ నాయకులు కోలా వెంకటేశ్వర్లు(45) మృతి చెందారు. ఆయన కారు ఇనుప లోడు లారీని ఢీకొట్టింది. వెంకటేశ్వర్లు తిరుపతి నుంచి వెంకటగిరి వెళ్తుండగా రేణిగుంట యోగానంద కాలేజి సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందగా.. అదే కారులో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాజుల మండ్యం పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో తిరుపతికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: అనంతలో విషాదం: కరెంట్ తీగలు తెగి కూలీల దుర్మరణం -
జగన్ బొమ్మ చూపించు నాయనా.. బామ్మ ఆప్యాయత
శ్రీకాకుళం : పోలాకి మండలం ప్రియాగ్రహారంలో జెడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్యకు శుక్రవారం ఓ హృద్యమైన అనుభవం ఎదురైంది. పార్టీ నేతలతో కలిసి ఇంటింటికీ వెళ్తూ కోరాడ అమ్మాయమ్మ(84) ఇంటికి వెళ్లారు. బామ్మా నీకు పింఛన్ వస్తుందా.. అని అడిగితే.. ‘ఆ వస్తుంది గానీ నాకు జగన్ బొమ్మ చూపించు నాయనా..!’ అని ఆప్యాయంగా అడి గింది ఆ బామ్మ. దీంతో కృష్ణచైతన్య సీఎం చిత్రాన్ని బామ్మకు చూపించగా ఆమె మురిసిపోయారు. వేలిముద్ర పడకపోయినా సచివాలయం నుంచి ఒక వ్యక్తి వచ్చి పింఛను ఇస్తున్నారని ఆమె చెప్పి దీవించారు. -
ఇంటింటికీ మొక్కల పంపిణీ
చింతకొమ్మదిన్నె: స్థానికంగా ఏపీఎస్‌బీబీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమం జెడ్పీటీసీ సభ్యుడు పి.నరేన్ రామాంజులరెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 12 పంచాయతీల పరిధిలో గల వివిధ గ్రామాలకు మొక్కలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద మొక్కలు పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రవికుమార్‌రెడ్డి, గంగాదేవి, రమేష్, మండల కన్వీనర్ గూడ ప్రభాకర్‌రెడ్డి, కో–కన్వీనర్ కళాయాదవ్, మండల ఉపాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీపై విమర్శలకే మహానాడు పరిమితం ఒంగోలులో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు కేవలం వైఎస్సార్సీపీపై విమర్శలకే పరిమితమైందని జెడ్పీటీసీ నరేన్ రామాంజులరెడ్డి అన్నారు. సీకేదిన్నె ఎంపీడీవో కార్యాలయంలోని చాంబర్లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గతంలో వాగ్దానాలు ఏవీ నెరవేర్చకపోగా.. ప్రస్తుతం ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాన్ని పనిగా పెట్టుకున్నారని తెలిపారు. -
జెడ్పీటీసీ హత్యాయత్నానికి కుట్ర.. గుట్టు రట్టుచేసిన పోలీసులు! ప్లాన్ ఇదీ..
సూర్యాపేట క్రైం : జాజిరెడ్డిగూడెం జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌ను మట్టుబెట్టుందుకు సుపారీ తీసుకున్న ఓ ముఠాను ముందస్తుగా అరెస్టు చేసినట్లు హత్యాయత్నాన్ని భగ్నం చేసినట్లు సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. వ్యక్తిగత కక్షలు, భూ వివాదాలతోనే జెడ్పీటీసీని సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించేందుకు ఇద్దరు సమీప బంధువులతో పాటు మరొకరు కుట్ర చేసినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. సూత్ర, పాత్రధారుల్లో నలుగురిని అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నారన్నారు. బుధవారం సూర్యాపేట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కేసు వివరాలు వెల్లడించారు. జాజిరెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన దావుల వీరప్రసాద్ యాదవ్, ముదిరాజ్ కులానికి చెందిన లింగంపల్లి జగన్నాథం రెండో భార్య కూతురు మనీషాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొద్దిరోజుల క్రితం జగన్నాథం అనారోగ్యంతో చనిపోగా తలగొరివి పెట్టే విషయంలో గొడవ జరిగింది. జగన్నాథం పెద్ద భార్య కుమార్తె కవితతో తలగొరివి పెట్టించాలని అనుకోగా రెండవ భార్య కుమార్తె శ్వేతతో తలగొరివి పెట్టించారు. అప్పటి నుంచి జగన్నాధం అన్న కొడుకు లింగంపల్లి సుధాకర్, అతడి బంధువులు, వీరప్రసాద్‌కు మనస్పర్థలు వచ్చి గొడవలు జరుగుతున్నాయి. కుటుంబ విషయాల్లో తలదూరుస్తూ.. దావుల వీరప్రసాద్ తరచూ జగన్నాథం కుటుంబ విషయాల్లో తలదూరుస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే వీరప్రసాద్ కొద్దిరోజుల క్రితం తోడల్లుడు జిన్నే శ్రీను, అతడి కుమారుడు అశ్విన్‌లపై అర్వపల్లి కి చెందిన మేకల సంతోష్‌పై జరిగిన దాడి విషయంలో తప్పుడు కేసులు పెట్టించాడు. దీంతో వారు జెడ్పీటీసీపై కోపం పెంచుకున్నారు. దీంతో పాటు ఇదే గ్రామానికి చెందిన లింగంపల్లి సంజయ్ 3 గుంటల భూమి పంచాయితీలో దావుల వీరప్రసాద్ తలదూర్చి భూమి రాకుండా అడ్డుపడినట్లు అనుమానం పెంచుకున్నారు. మూసీ మాజీ చైర్మన్ అలువాల వెంకటస్వామి ఇంటిపై కూడా బండి సంజయ్ గ్రామానికి వచ్చిన సమయంలో దావుల వీరప్రసాద్ అనుచరులు గొడవ చేశారని కక్ష పెంచుకున్నారు. అడ్డు తొలగించుకోవాలని.. ప్రతి విషయంలో అడ్డుతగులుతున్న వీరప్రసాద్ మట్టుబెట్టాలని లింగంపల్లి సుధాకర్, జిన్నే శ్రీను, అలువాల వెంకట స్వామి నిర్ణయించుకున్నారు. అందుకు కిరాయి హంతకుడు ప్రస్తుతం పూణేలో ఉంటున్న బంధువు లింగంపల్లి సంజయ్‌ను సంప్రదించారు. అతడి ద్వారా రౌడీ షీటర్ పోతురాజు సైదులుతో ఒప్పందం చేసుకున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 22న జనగాం క్రాస్ రోడ్డులోని ఓ బార్లో జిన్నా శ్రీను మినహా మిగిలిన నలుగురు కలిసి హత్యకు ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగా పట్టణంలోనే మారణాయుధాలు కొనుగోలు చేశారు. గంజాయి విక్రయిస్తున్నారని.. పట్టణంలోని సీతారాంపురం కాలనీలోని రౌడీ షీటర్ పోతరాజు సైదులు ఇంట్లో గంజాయి కలి గిన ముగ్గురు వ్యక్తులు ఉన్నారన్న సమాచారంపై బుధవారం సీఐ అర్కపల్లి ఆంజనేయులు సిబ్బందితో కలిసి దాడి చేశారు. అక్కడ లింగంపల్లి సుధాకర్, లింగంపల్లి సంజయ్, పోతరాజు సైదులును అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు కేజీల గంజాయి, రెండు వేట కొడవళ్లు, కంకి కొడవలి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అక్కడే ఉండగా అలువాల వెంకట స్వామి మారుతీవ్యాన్‌లో రావడంతో అతడిని కూడా అరెస్ట్ చేశారు. వ్యాన్‌ను సోదా చేయగా కత్తి లభించింది. వ్యాన్‌తో పాటు మారణాయుధాలు, గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిని విచారించగా హత్యకుట్ర విషయం బయటపడిందని తెలిపారు. కాగా, ఈ కేసులో జిన్నా శ్రీను పరారీలో ఉన్నాడని ఎస్పీ తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించిన టౌన్ సీఐ అర్వపల్లి ఆంజనేయులు , ఎస్ఐ శ్రీనివాస్, చివ్వెంల ఎస్ఐ విష్ణు, ఐటీ కోర్ ఎస్ఐ శివ కుమార్, క్రైం సిబ్బంది గొర్ల కృష్ణ, గోదేషి కరుణాకర్, సైదులు, శ్రవణ్, మల్లేశ్‌లను ఎస్పీ అభినందించారు. చదవండి: ‘ఇప్పటికే ఇద్దరాడపిల్లల్ని కన్నాను’..! రోజుల పసికందును చంపిన తల్లి.. -
AP MPTC And ZPTC Elections 2021: ముగిసిన పోలింగ్
-
జెడ్పీటీసీకి అమ్మాణీ రాజీనామా.. జనసేనకు ఉన్న ఏకైక జెడ్పీటీసీ లేనట్టే..
సాక్షి, తూర్పుగోదావరి(కడియం): స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలి పదవికి మార్గాని అమ్మాణీ (జనసేన) రాజీనామా చేశారు. ఈ మేరకు కలెక్టర్ సి.హరికిరణ్‌కు సోమవారం రాజీనామా లేఖ అందజేసినట్లు ఆమె తెలిపారు. భర్త ఏడుకొండలుతో కలిసిన ఆమె మీడియాతో మాట్లాడుతూ గతేడాది నామినేషన్ వేసినా ఎన్నిక వాయిదా పడడంతో కడియపులంక సర్పంచ్ పదవికి పోటీ చేసి గెలిచానన్నారు. ఇటీవల జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా గెలిచానన్నారు. గ్రామస్తులకు ఇచ్చిన మాట మేరకు సర్పంచ్‌గానే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దీంతో జిల్లాలో జనసేనకు ఉన్న ఏకైక జెడ్పీటీసీ లేనట్టే. -
13 జెడ్పీ పీఠాలను వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవంగా కైవసం
-
AP: చంటిబిడ్డలతో ప్రమాణ స్వీకారానికి..
నెల్లూరు (పొగతోట) : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లు, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక, ప్రమాణ స్వీకారానికి ఇద్దరు సభ్యులు తమ చంటిబిడ్డలతో హాజరయ్యారు. నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం జెడ్పీ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాపూరు జెడ్పీటీసీ సభ్యురాలు చిగురుపాటి లక్ష్మీప్రసన్న, తడ జెడ్పీటీసీ సభ్యురాలు ఇందుమతి రోజుల బిడ్డలతో హాజరయ్యారు. వీరిని సహాయకుల వద్ద ఉంచి వారు ప్రమాణ స్వీకారం చేశారు. రాపూరు జెడ్పీటీసీ సభ్యురాలు చిగురుపాటి లక్ష్మీప్రసన్న జెడ్పీ వైస్ చైర్‌పర్సన్‌గా ఎంపికయ్యారు. -
కాసేపట్లో జెడ్పీ ప్రత్యేక సమావేశం
-
AP: జెడ్పీ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ
అనంతపురం: నూతనంగా ఎన్నికైన 62 జడ్పీటీసీల ప్రమాణస్వీకారం పూర్తి అయింది. జడ్పీ కో-ఆప్షన్ సభ్యులుగా ఫయాజ్ వలి, అహ్మద్ బాషా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ, ప్రభుత్వ విప్ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనంతవెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, డాక్టర్ సిద్ధారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఏపీ ఉర్ధూ అకాడమీ ఛైర్మన్ నదీం అహ్మద్, ఏపీ నాటక అకాడమీ ఛైర్ పర్సన్ హరిత పాల్గొన్నారు. ► విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా పరిషత్ వద్ద వైఎస్సార్సీపీ అభ్యర్థుల కోలాహలం నెలకొంది. మొత్తం 38 స్థానాలకు గాను 36 మంది జడ్పీటీసీ అభ్యర్థులు వైఎస్సార్సీపీ తరఫున విజయం సాధించారు. జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌తో పాటు వైస్ చైర్మన్ పదవులు కూడా వైఎస్సార్సీపీ దక్కించుకుంది. ఈ సందర్భంగా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. ఇదంతా సీఎం జగన్మోహన్రెడ్డి సంక్షేమ ఫలాలు అందించిన విజయంగా పేర్కొన్నారు. ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు మాట్లాడుతూ.. ముఖ్యంగా ఈ సారి జడ్పీ చైర్ పర్సన్ పదవి గిరిజన ప్రాంతానికి దక్కడంతో సంతోషంగా ఉందన్నారు. ► వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ కో అప్షన్ సభ్యులుగా ఇద్దరు మైనారిటీలకు అవకాశం. ► కరీముల్లా, షేక్ అన్వర్ బాష లను కో అప్షన్ మెంబర్లుగా ఏకగ్రీవ ఎన్నిక. ప్రకటించిన జిల్లా కలెక్టర్ విజయరామ రాజు. జిల్లాల వారీగా జడ్పీ ఛైర్మన్‌గా ఎన్నిక కానున్నది వీరే.. ► అనంతపురం జిల్లా: బోయ గిరిజమ్మ (బీసీ) ► చిత్తూరు జిల్లా: శ్రీనివాసులు ( బీసీ) ► తూర్పు గోదావరి జిల్లా: వేణుగోపాల్ రావు (ఎస్సీ) ► పశ్చిమ గోదావరి జిల్లా: కవురు శ్రీనివాస్ (బీసీ) ► గుంటూరు జిల్లా: హెనీ క్రిస్టినా( ఎస్సీ) ► కర్నూలు జిల్లా: వెంకట సుబ్బారెడ్డి( ఓసీ) ► కృష్ణా జిల్లా: ఉప్పాళ్ల హారిక( బీసీ) ► నెల్లూరు జిల్లా: ఆనం అరుణమ్మ( ఓసీ) ► ప్రకాశం జిల్లా: వెంకాయమ్మ (ఓసీ) ► వైఎస్సార్ కడప జిల్లా: ఆకేపాటి అమర్నాథ్రెడ్డి (ఓసీ) ► విశాఖపట్నం జిల్లా: జల్లిపల్లి సుభద్ర (ఎస్టీ) ► విజయనగరం జిల్లా: మజ్జి శ్రీనివాసరావు (బీసీ) ► శ్రీకాకుళం జిల్లా: విజయ( సూర్య బలిజ) మధ్యాహ్నం 3 గంటకు జడ్పీ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. జడ్పీ ఎన్నికలకు ప్రిసైడింగ్ అధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తారు. కలెక్టర్లు జడ్పీ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్‌తో ప్రమాణం చేయుంచనున్నారు. ► కడప నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి జడ్పీ కార్యాలయం వరకు వైఎస్సార్సీపీ నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నిక కానున్న ఆకెపాటి అమర్నాథ్రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. అంతకుముందు మహానేత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ర్యాలీలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి సీఎం అంజాద్ బాష, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, మేడా మల్లికార్జున్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ పాల్గొన్నారు. ► కోఆప్షన్ సభ్యుల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జెడ్పీ చైర్మన్ల ఎన్నిక శనివారం మధ్యాహ్నం జరగనుంది. అందులో భాగంగా ముందుగా కోఆప్షన్ సభ్యుల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు జడ్పీటీసీలు, కోఆప్షన్ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. చిత్తూరు జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా శ్రీనివాసులు( వి.కోట జడ్పిటీసీ), తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా విపర్తి వేణుగోపాల రావు(పి.గన్నవరం జడ్పీటీసీ), అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌గా బోయ గిరిజమ్మ (ఆత్మకూరు జెడ్పీటీసీ), వైఎస్సార్ కడప జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా ఆకెపాటి అమర్నాథ్రెడ్డి ఎన్నిక కానున్నారు. కృష్ణా జిల్లాలో జడ్పీ ఛైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. బీసీ మహిళ జడ్పీ పీఠాన్ని అధిష్టించనున్నారు. 13 జిల్లాల్లో చైర పర్సన్, ప్రతి జిల్లాకు ఇద్దరు వైస్ చైర్ పర్సన్లకు ఎన్నిక జరగనుంది.13 జిల్లా పరిషత్‌లు వైఎస్సార్సీపీ ఖాతాలోనే పడనున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 శాతానికిపైగా పదవులు దక్కనున్నాయి. నూరుశాతం జడ్పీ పీఠాలను కైవసం చేసుకోవడం దేశంలోనే ఇదే ప్రథమం. -
నేడు జెడ్పీ చైర్మన్ల ఎన్నిక
-
ఏపీ: నేడు జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జెడ్పీ చైర్మన్ల ఎన్నిక శనివారం జరగనుంది. ఆయా జిల్లాల కలెక్టర్లు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 660 జెడ్పీటీసీ స్థానాలకు గాను 640 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. కొత్తగా ఎన్నికైన సభ్యులు చేతులు ఎత్తే విధానంలో ఆయా జిల్లాల జెడ్పీ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. అన్ని జిల్లాల్లో నేటి ఉదయం 10 గంటలకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రిసైడింగ్ అధికారి.. కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం ఒక్కో జిల్లాలో ఇద్దరు కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక, మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీ చైర్మన్, జిల్లాకు ఇద్దరు చొప్పున వైస్ చైర్మన్ల ఎన్నికను నిర్వహించనున్నారు. -
సంక్షేమ పథకాల వల్లే పరిషత్ ఎన్నికల్లో విజయం
-
ఈ ఫలితాలు నా బాధ్యతను మరింత పెంచాయి: సీఎం జగన్
-
కుప్పంలో దిమ్మతిరిగిపోయే ఫలితాలు
-
40 ఏళ్ల ఇండస్ట్రీ కుట్రలు ఫలించలేదు
-
తాడేపల్లి : YSRCP పార్టీ కార్యాలయంలో సంబరాలు
-
జనతంత్రం : గొప్ప కార్యక్రమం జరిగినప్పుడల్లా టీడీపీది ఇదే తీరు
-
జగన్ పాలన వల్లే ఈ ఫలితాలు
-
తెలుగుదేశం పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయింది : జూపూడి
-
‘‘చంద్రగిరిలో చంద్రబాబు శంకరగిరి మాన్యాలు పట్టారు’’
-
పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్న కలెక్టర్
-
ప్రకాశం జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్
-
పూర్తి ప్రజామోదంతో మెరుగైన పరిపాలన చేస్తాం: మంత్రి కురసాల
-
చంద్రబాబు ఇలాకలో ఫ్యాన్ హవా
-
నారావారిపల్లెలో TDP ఘోర పరాజయం
-
అయ్యన్నకు బుద్ధి చెప్పిన ప్రజలు
-
శ్రీకాకుళంలో కొనసాగుతున్న ఎన్నికల కౌంటింగ్
-
జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై కెఎస్ఆర్ స్పెషల్ షో
-
ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల హవా
-
కుప్పంలో టీడీపీపై వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి విజయం
-
రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది
-
విశాఖలో కొనసాగుతున్న ఎన్నికల కౌంటింగ్
-
ప్రకాశం జిల్లాలో కౌంటింగ్ కేంద్రాలవద్ద పటిష్ట భద్రత
-
కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
-
రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఎన్నికల కౌంటింగ్
-
అనంతపురంలో పరిషత్ ఎన్నికల ఓట్లలెక్కింపునకు ఏర్పాట్లు
-
కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన గిరిజశంకర్
-
కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం: ఎస్పీ విజయరావు
-
రేపు ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్
-
206 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 206 కేంద్రాల్లో ఆదివారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీన పోలింగ్ జరిగిన నాటి నుంచి గత ఐదున్నర నెలలుగా బ్యాలెట్ బాక్స్‌లను భద్రపరిచిన చోట కౌంటింగ్ నిర్వహించేందుకు కలెక్టర్ల నేతృత్వంలో అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. ఒక్కొక్క కేంద్రంలో మండలాల వారీగా వేర్వేరుగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అభ్యర్థులందరికీ కౌంటింగ్ కేంద్రాల వివరాలతో రిటర్నింగ్ అధికారులు శుక్రవారం సమాచారం అందించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పెద్ద ఎత్తున బ్యాలెట్ పత్రాలను లెక్కించాల్సి రావడం, రాత్రి వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నందున జనరేటర్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్లోకి బ్యాలెట్ బాక్సులను తరలించే సమయంలో సీసీటీవీ కవరేజ్ చేయనున్నారు. ఏకకాలంలో రెండింటి లెక్కింపు.. ఒక్కో మండలానికి సంబంధించి ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు జరిగే చోటే జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కూడా చేపడతారు. ఏకకాలంలో రెండింటి ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. సగం టేబుళ్లలో ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు, మరో సగం టేబుళ్లలో జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని కమిషన్ వర్గాలు తెలిపాయి. ఎంపీటీసీ పరిధిలోని ఓట్లన్నింటినీ ఒక డ్రమ్‌లో, మండలంలోని మొత్తం జడ్పీటీసీ ఓట్లన్నింటినీ మరో డ్రమ్‌లో వేసి కలగలపి తర్వాత 25 ఓట్ల చొప్పున కట్టలు కడతారు. ఆ తర్వాత జడ్పీటీసీ ఓట్లను వెయ్యి చొప్పున ఒక్కో టేబుల్‌కు పంపిణీ చేసి లెక్కిస్తారు. ఎంపీటీసీ స్థానాల వారీగా అక్కడి ఓట్లన్నింటినీ ఒకే టేబుల్‌పై ఒకేవిడతలో లెక్కిస్తారు. ఒక్కో టేబుల్ వద్ద ఒక్కో ఏజెంట్ చొప్పున నియమించుకునేందుకు అభ్యర్థులను అనుమతించారు. లెక్కింపులో 42,360 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపులో మొత్తం 42,360 మంది సిబ్బంది పాల్గొంటారు. 11,227 మంది కౌంటింగ్ సూపర్వైజర్లుగా, 31,133 మంది కౌంటింగ్ అసిస్టెంట్లుగా వ్యవహరిస్తారు. వీరు కాకుండా 89 మందిని అదనపు అబ్జర్వర్లుగా ఆయా జిల్లా కలెక్టర్లు నియమించారు. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి తరువాత బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్ల లెక్కింపు చేపడతారు. బ్యాలెట్ పేపరు రంగు ఆధారంగా రెండు రకాల ఓట్లను వర్గీకరిస్తారు. కౌంటింగ్ సమయంలో సిబ్బంది సందేహాల నివృత్తి కోసం కమాండ్ కంట్రోలు రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అభ్యంతరాలు వ్యక్తమయ్యే చోట ఒక్కసారి మాత్రమే రీ కౌంటింగ్‌కు అనుమతిస్తారు. మరోవైపు కౌంటింగ్ పర్యవేక్షణ కోసం జిల్లాకో ఐఏఎస్ అధికారిని పరిశీలకులుగా నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి: సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ ఓట్ల లెక్కింపు సజావుగా పూర్తయ్యేలా పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సిబ్బంది, ఏజెంట్లు తప్పనిసరిగా టీకాలు తీసుకుని ఉండాలని స్పష్టం చేశారు. ఆయా కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించి గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 24 గంటలు కంట్రోల్ రూం: ద్వివేది కౌంటింగ్ అధికారుల సందేహాలను నివృత్తి చేసేందుకు 24 గంటలూ పని చేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని శాంతి భద్రతల అదనపు డీజీపీ రవిశంకర్ చెప్పారు. కేంద్రాల వద్ద శానిటేషన్ చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ కలెక్టర్లకు సూచించారు. సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి కె.కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ లో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైందన్న అధికారులు
-
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
-
ఏపీ: సర్వత్రా ఉత్కంఠ.. ‘పరిషత్’ ఎన్నికలపై నేడే తీర్పు
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది. ఉదయం 10.30 గంటలకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు గతంలో ఏ దశలో అయితే నిలిచిపోయాయో అక్కడి నుంచి తిరిగి నిర్వహించేందుకు వీలుగా మళ్లీ తాజా నోటిఫికేషన్ జారీచేయాలని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇటీవల తీర్పు ఇచ్చారు. (చదవండి: సీఎం జగన్ లేఖపై తక్షణం స్పందించిన విదేశాంగ శాఖ) ఈ తీర్పును రద్దుచేయాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దాఖలు చేసిన అప్పీలుపై ఆగస్టు 5న విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా తాజా నోటిఫికేషన్ ఇవ్వాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను ధర్మాసనం సమర్థిస్తుందా? లేక పూర్తయిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు చేయాలని ఆదేశిస్తుందా? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.(చదవండి: జేసీ బ్రదర్స్‌కు టీడీపీ ఝలక్) -
మల్లన్నసాగర్లో చిక్కుకున్న పశువులు
మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో పశువులు చిక్కుకుపోయాయి. సిద్దిపేట జిల్లా తుక్కాపూర్ గ్రామానికి చెందిన బర్రెంకల చిన చంద్రయ్యకు 40 వరకు ఎడ్లు, ఆవులు ఉన్నాయి. శనివారం ఉదయం ఆయన పశువులను మేతకోసం అడవిలోకి వదిలిపెట్టాడు. ఆ రోజు సాయంత్రం మల్లన్నసాగర్ చుట్టూ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో చంద్రయ్య పశువుల వద్దకు వెళ్లలేకపోయాడు. ఆదివారం తెల్లవారు జామున మల్లన్నసాగర్‌లోకి గోదావరి జలాలను వదలడంతో పశువులు పక్కనే ఉన్న బ్రాహ్మణ బంజేరుపల్లి శివారులోని గుట్ట సమీపంలోకి వెళ్లాయి. మరొక పక్కన గతంలో కొండపోచమ్మసాగర్‌కు నీటిని తరలించిన కాల్వ ఉంది. ప్రస్తుతం ఈ కాలువ ద్వారా నీరు మల్లన్నసాగర్‌లోకి వెళుతోంది. కాగా తుక్కాపూర్‌కు చెందిన మరో రైతుకు చెందిన నాలుగు గేదెలు కూడా చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.– తొగుట (దుబ్బాక) అక్కడే నిరసన..అక్కడే నిద్ర వీరంతా జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలానికి చెందిన ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు. రెవెన్యూ అధికారుల తప్పిదంతో తొమ్మిది గ్రామాలకు చెందిన వేలాది మంది రైతుల పట్టాభూములు అసైన్డ్ భూములుగా నమోదయ్యాయి. ఈ తప్పును సరిదిద్దాలంటూ బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో నిరసన దీక్షను ప్రారంభించి.. రాత్రంతా సమావేశపు గదిలోనే పడుకున్నారు. గురువారం కూడా నిరసన కొనసాగించారు. మరోపక్క వీరికి మద్దతుగా రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి.. విధులకు హాజరయ్యేందుకు వచి్చన తహసీల్దార్ స్వప్న, రెవెన్యూ సిబ్బందిని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. 15 రోజుల్లో రికార్డులు సరిచేసి న్యాయం చేస్తామని అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌రావు ప్రజాప్రతినిధులకు, రైతులకు హామీనివ్వడంతో ఆందోళనకు తెరపడింది.– జఫర్‌గఢ్ -
ఎస్ఐ చెబితే పంపాలా?.. కానిస్టేబుల్ దురుసు ప్రవర్తన
సాక్షి, సిరిసిల్ల (కరీంనగర్): వేములవాడ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేసే మహేందర్ మంత్రి కేటీఆర్ పర్యటన బందోబస్తులో భాగంగా సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రి వద్ద విధులకు వచ్చారు. మంత్రి ప్రభుత్వ ఆస్పత్రిలో సమావేశం జరుగుతుండగా ముస్తాబాద్ జెడ్పీటీసీ శరత్‌రావు కారులో ఆ సమావేశానికి వచ్చారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఆస్పత్రికి వెళ్లడానికి వీలులేదని తెలిపారు. తాను ప్రజాప్రతినిధినని సమావేశానికి వెళ్లాల్సిన అవసరం ఉందని అక్కడే విధుల్లో ఉన్న సిరిసిల్ల టౌన్ ఎస్ఐ అపూర్వరెడ్డికి జెడ్పీటీసీ తెలిపారు. వెంటనే కారును లోనికి పంపించాలని ఎస్ఐ తెలుపగా నేను మీరు చెబితే వినాల్సిన అవసరం లేదని వాగ్వాదానికి దిగాడు. అంతేకాకుండా కోవిడ్ నిబంధనలను బేఖాతర్ చేస్తున్నారు కాస్త మాస్కు ధరించడని చెబితే నా ఇష్టం అనే రీతిలో మాటలు వదిలిపెట్టారు. అక్కడనున్న స్థానికులు మిగతా పోలీసులు కలుగచేసుకుని కానిస్టేబుల్ విధానం సరికాదని తెలిపి గొడవ సద్దుమణిగేలా చేసి ప్రజాప్రతినిధిని సమావేశానికి అనుమతించారు. -
పల్లెప్రగతికి ఆహ్వానం అందలేదని జెడ్పీటీసీ మనస్తాపం, దాంతో
చిలప్‌చెడ్(నర్సాపూర్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడత పల్లెప్రగతి కార్యక్రమాలు చిలప్‌చెడ్ మండలోని గ్రామాల్లో ముమ్మరంగా కొనసాగిన్పప్పటికీ ఏ ఒక్క రోజు, ఏ కార్యక్రమానికి స్థానిక జెడ్పీటీసీ చిలుముల శేషసాయిరెడ్డికి ఆధికారిక ఆహ్వానం అందలేదు. దీంతో మనస్థాపానికి గురైన శేషసాయిరెడ్డి శనివారం టీఅర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. తన రాజీనామా లేఖను టీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఅర్‌కు పంపించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శేషసాయిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ జరిగిన పది రోజుల పల్లెప్రగతి కార్యక్రమాలకు మండల పర్యటనకు నాలుగు సార్లు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి వచ్చారు. మండలంలోని అన్ని గ్రామాలు, తండాల్లో హరితహారం కార్యక్రమం, రైతు వేదికలు, పల్లెప్రకృతి వనాలకు ప్రారంభోత్సవాలు చేశారు. కానీ ప్రోటోకాల్ ప్రకారం తనకు అధికారికంగా ఎలాంటి ఆహ్వానం అందకపోవడంతోనే హాజరు కాలేదని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటైన చిలప్‌చెడ్ మండల జెడ్పీటీసీగా భారీ మెజార్టీతో గెలిచి, మండల అభివృద్ధిలో తనవంతు కృషి చేస్తున్నప్పటికీ, ఈ కార్యక్రమాలకు తనను అధికారులు మరచిపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.