125 వంసతాల సంబరం : పూర్వ విద్యార్థుల ఘనత | 125 Years of school alumni celebration in mandasa srikakulam district | Sakshi
Sakshi News home page

125 వంసతాల సంబరం : పూర్వ విద్యార్థుల ఘనత

Jul 14 2025 2:40 PM | Updated on Jul 14 2025 3:18 PM

125 Years of school alumni celebration in mandasa srikakulam district

125వ వసంతంలోకి మందస ఎస్‌ఆర్‌ఎస్‌ఎం జెడ్పీ ఉన్నత పాఠశాల

ఐకానిక్‌ భవంతికి ఊపిరి పోసిన  పూర్వ విద్యార్థులు

125 ఏళ్ల వేడుకకు సన్నాహకాలు

ఆ బడి రాజుల పాలన చూసింది. స్వాతంత్య్ర సంగ్రామ నినాదాలు విన్నది. భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చిన సందర్భానికి సాక్షిగా నిలిచింది. ప్రజాస్వామ్య యుగంలో తొలిసారి ఓటరుగా మారిన మందస వాసులకు వేదికనిచ్చింది. ఇన్నేళ్ల ప్రస్థానంలో వేలాది మంది మేధావులకు పురుడు పోసింది. 125 ఏళ్లుగా విజ్ఞాన కాంతులు వెదజల్లుతూనే ఉంది. మందసలోని శ్రీరాజా శ్రీనివాస మెమోరియల్‌ జెడ్పీ ఉన్నత పాఠశాల వైభవమిది. మందస రాజుల సుందర స్వప్నంగా ప్రారంభమైన పాఠశాల పూర్వ విద్యార్థుల సంకల్ప బలంతో పూర్వ వైభవం సాధించింది.   

మందస: మందసలోని ఎస్‌ఆర్‌ఎస్‌ఎం జెడ్పీ ఉన్న త పాఠశాల 125 ఏళ్ల వేడుకకు ముస్తాబవుతోంది. జమీందారుల పాలనలో పురుడు పోసుకున్న ఈ బడి ఈనాటికీ పచ్చగా విరాజిల్లుతోంది. 1901 మే 16న ఆనాటి గంజాం కలెక్టర్‌ హెచ్‌డీ టేలర్, మందస జమీందారు వాసుదేవ రాజమణిదేవ్‌ ఈ పాఠశాలకు పునాది వేశారు. నాటి శిలాఫలకం నేటికీ ఈ బడిలో భద్రంగా ఉంది. వాసుదేవ రాజమణిదేవ్‌ తర్వాత శ్రీనివాస రాజమణి దేవ్‌ పాలన సాగించా రు. ఆయన 30 ఏళ్ల పాటు ఈ బడిని బ్రిటిష్‌ పరం కాకుండా కాపాడారు. 1930లో ఆయన చనిపోయాక.. 1932 సెపె్టంబర్‌ 21న స్కూల్‌ను ప్రభుత్వ పాఠశాలగా గుర్తించి శ్రీ రాజా స్కూలును శ్రీ రాజా శ్రీనివాస రాజమణిదేవ్‌ మెమోరియల్‌ బోర్డు హైసూ్కల్‌గా మార్చారు. నాటి గంజాం జిల్లాలో ఇది రెండో హైస్కూల్‌ కావడం విశేషం.   

ఎన్నెన్నో అనుభవాలు.. 
వందేళ్లకుపైబడిన ప్రస్థానంలో మందస  హౌస్కూల్‌ ఎన్నో అనుభవాలు మిగిల్చింది. ప్రధానంగా ఈ పాఠశాల ముందరి భవనం ఓ జ్ఞాపికగా మారింది. వందలాది తుఫాన్లను తట్టుకుని ఈ భవనం నిలబడింది. రాజులు కట్టించిన భవంతుల్లో ఇది మాత్ర మే మిగిలింది. ఇక్కడ చదువుకున్న వారు దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. మండల వ్యాప్తంగా దశాబ్దాల పాటు ఈ పాఠశాల పెద్ద దిక్కుగా ఉండేది. బడి వదిలితే సాయంత్రం పూట మందస పట్టణమంతా కళకళలాడేది.  

పూర్వ విద్యార్థుల ఔదార్యం 
కాలక్రమేణా పెంకులు ఊడిపోయిన దశలో ఐకానిక్‌ భవనం అందవిహీనంగా మారడం పూర్వ విద్యార్థులను కలిచివేసింది. ఎంతో వైభవం కలిగిన ఈ భవనాన్ని ఆ దశలో చూసి విద్యార్థుల గుండెలు చివుక్కుమన్నాయి. అంతే.. అంతా కలిశారు. ప్రభుత్వ సాయం కోరకుండా, అధికారుల కోసం ఎదురు చూడకుండా ఎవరికి తోచినంత డబ్బు వారు విరాళాల రూపంలో పోగు చేసుకున్నారు. బ్యాచ్‌ల వారీ గా పోటీ పడి మరీ స్కూలు కోసం పూర్వ విద్యార్థులు విరాళాలు ఇచ్చారు. ఎక్కడెక్కడి వారో వా ట్సాప్‌ వేదికగా ఒక్కటయ్యారు. దాదాపు రూ.27 లక్షలు సేకరించి ఐకానిక్‌ భవనానికి మళ్లీ కొత్త ఊపిరి పోశారు.  

అ‘పూర్వ’ సమ్మేళనానికి సై.. 
భవన పునరి్నర్మాణం పూర్తి కావడంతో ఈ నెల 19, 20 తేదీల్లో భవనాన్ని పునఃప్రారంభిస్తూ 125 ఏళ్ల వేడుక సందర్భంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆహ్వాన పత్రాలు కూడా పంపిణీ చేయడం మొదలుపెట్టామని నిర్వాహకులు తెలిపారు. ఉన్నత పాఠశా ల భవనాన్ని 19వ తేదీ ఉదయం 10 గంటలకు పునఃప్రారంభిస్తామని, మరుసటి రోజు ఆదివారం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామన్నారు.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement