పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు నేడు పోలింగ్‌ | Chandrababu Conspiracy On Pulivendula ZPTC By Election | Sakshi
Sakshi News home page

పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు నేడు పోలింగ్‌

Aug 12 2025 2:53 AM | Updated on Aug 12 2025 6:13 AM

Chandrababu Conspiracy On Pulivendula ZPTC By Election

పులివెందులలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయం వద్ద పోలీసుల హడావుడి

నిస్సిగ్గుగా టీడీపీ బరితెగింపు

పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో సీఎం చంద్రబాబు కుతంత్రం 

ఎన్ని అడ్డదారులు తొక్కినా ఘోర పరాజయం తప్పదని కుట్రలకు తెరతీసిన వైనం

పంపిణీ చేసిన స్లిప్పులను బలవంతంగా వెనక్కు తీసుకుంటున్న టీడీపీ నేతలు 

పంపిణీ కానివి గంపగుత్తగా స్వాదీనం  

భారీ సంఖ్యలో స్థానికేతర టీడీపీ నేతలు పోలింగ్‌ కేంద్రాల వద్ద తిష్ట 

ఒక్కో పోలింగ్‌ బూత్‌ వద్ద కనీసం వంద మంది మోహరింపు 

వారికి ఓటరు స్లిప్పులు ఇచ్చి దొంగ ఓట్లు వేయించుకునే ఎత్తుగడ

పోలింగ్‌ ప్రారంభమైన వెంటనే వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను వెళ్లగొట్టేలా స్కెచ్‌ 

పోలీసుల ద్వారా పోలింగ్‌ బూత్‌ను స్వాదీనం చేసుకుని రిగ్గింగ్‌కు ప్లాన్‌   

ఒక గ్రామంలోని పోలింగ్‌ బూత్‌లు మరో గ్రామానికి మార్పు  

తద్వారా ఓటు వేసేందుకు వెళ్లే ఓటర్లను పోలీసుల ద్వారా అడ్డుకునేలా ఎత్తు

పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని భయపెట్టేలా వ్యూహం.. అలా చేసి వారి ఓట్లను టీడీపీ శ్రేణుల ద్వారా వేయించుకునే కుట్ర 

ఎలాగైనా సరే.. అంటూ పులివెందులలో విలన్‌ పాత్ర పోషిస్తున్న లోకేశ్‌ 

పోలింగ్‌ ప్రారంభం నుంచి ముగిసే వరకు టీడీపీ నేతల మాటే వినాలని పోలీసులకు ఓ ఉన్నతాధికారి మౌఖిక ఆదేశం

ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు  

గురువారం ఓట్ల లెక్కింపు 

సాక్షి, అమరావతి /సాక్షి ప్రతినిధి, కడప: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలుపు కోసం వైఎస్సార్‌సీపీ నేతలపై హత్యాయత్నాలు, దాడులు, అక్రమ కేసుల బనాయింపు మొదలు.. ఎన్ని అడ్డదారులు తొక్కినప్పటికీ టీడీపీ అభ్యర్థికి ఘోర పరాజయం తప్పదని అంతర్గత సర్వేల్లో స్పష్టమవడంతో పెదబాబు, చినబాబు ఇద్దరూ  బరితెగించారు. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి జెడ్పీటీసీ ఉప ఎన్నికల గండం నుంచి గట్టెక్కేందుకు పథక రచన చేశారు. మంగళవారం పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో సోమవారం కొత్త కుట్రకు తెరతీశారు.

ఇప్పటికే అధికారులు పంపిణీ చేసిన ఓటరు స్లిప్పుల్లో తప్పులు ఉన్నాయని అబద్ధం చెబుతూ టీడీపీ నాయ­కులు, కార్యకర్తల ద్వారా వాటిని సేకరిస్తున్నారు. ఇవ్వని వారి నుంచి బలవంతంగా లాక్కున్నారు. సోమవారం సాయంత్రం వరకు పంపిణీ చేయని ఓటరు స్లిప్పులను అధికారుల నుంచి గంపగుత్తగా టీడీపీ నాయకులు తీసేసుకున్నారు. వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు, కమలాపురంతోపాటు.. సరిహద్దు జిల్లాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలను భారీ ఎత్తున రప్పించి పులివెందుల మండలంలో పోలింగ్‌ బూత్‌లు ఉన్న గ్రామాల్లో తిష్ట వేయించారు.

ఈ ఓటరు స్లిప్పులను టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఇచ్చి దొంగ ఓట్లు వేయించుకోవడానికి కుట్ర చేస్తున్నారు. ఒక గ్రామం పోలింగ్‌ బూత్‌ను పక్క గ్రామంలోకి మార్చిన నేపథ్యంలో ఓట్లు వేయడానికి 2 నుంచి 4 కిలోమీటర్ల దూరానికి పలు గ్రామాల ఓటర్లు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నల్లపురెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లె, యర్రబల్లె ఓటర్లను మార్గం మధ్యలో పోలీసుల ద్వారా ఆపేసి.. పోలింగ్‌ బూత్‌ వద్ద టీడీపీ, వైఎస్సార్‌సీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారని, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని చెప్పి అడ్డుకోవాలనే ఎత్తు వేశారు. తద్వారా వారి ఓట్లను కూడా ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలతో దొంగ ఓట్లు వేయించుకోవాలన్నది టీడీపీ నేతల పన్నాగం.

ఏజెంట్లపై దాడి చేసి వెళ్లగొట్టే కుట్ర  
మంగళవారం ఉదయం పోలింగ్‌ ప్రారంభమైన వెంటనే పోలింగ్‌ బూత్‌ నుంచి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై దాడి చేసి, పోలీసుల ద్వారా వారిని వెళ్లగొట్టేందుకు టీడీపీ నేతలు కుట్ర చేశారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బూత్‌ నుంచి వెళ్లగొట్టడం ద్వారా తమ అడుగులకు మడుగులొత్తే పోలీసులు, అధికారుల సహకారంతో పోలింగ్‌ బూత్‌ను పూర్తిగా తమ అ«దీనంలోకి తీసుకుని యథేచ్ఛగా రిగ్గింగ్‌ చేసుకోవాలన్నది టీడీపీ నేతల ఎత్తుగడ. ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన టీడీపీ శ్రేణులను ప్రతి పోలింగ్‌ బూత్‌ వద్ద కనీసం వంద మంది చొప్పున ఇప్పటికే మోహరించారు. పోలింగ్‌ ప్రారంభం కాక ముందే పోలింగ్‌ బూత్‌ వద్ద వారితో యథేచ్ఛగా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేయించి, ఉద్రిక్త పరిస్థితులకు దారితీసేలా చేసి.. పోలీసులతో లాఠీఛార్జ్‌ చేయించి.. పోలింగ్‌ బూత్‌లను ఆక్రమించుకోవడానికి మరో కుట్ర చేస్తున్నారు. తద్వారా రిగ్గింగ్‌ చేసుకోవాలన్నది టీడీపీ నేతల ఎత్తుగడ.   

ఎస్‌ఈసీ, పోలీసులు ప్రేక్షకపాత్ర  
ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే పులివెందుల మండల స్థానికులు మినహా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు వెనక్కు వెళ్లిపోవాలి. ప్రచారం ముగిసిన తర్వాత ఇతర ప్రాంతాల వారు ఎన్నిక జరిగే ప్రాంతంలో ఉండటం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా బస చేస్తే వారిపై ఎస్‌ఈసీ (రాష్ట్ర ఎన్నికల కమిషన్‌) అధికారులు, పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ.. ఇతర ప్రాంతాల నుంచి వందలాది వాహనాల్లో వచి్చన టీడీపీ శ్రేణులు పులివెందుల మండలంలోని గ్రామాలకు చేరుకుంటున్నప్పటికీ.. వారిని అడ్డుకోకుండా ఎస్‌ఈసీ, పోలీసు అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. పులివెందుల మండలంలోనే కాదు.. ఒంటిమిట్ట మండలంలోనూ ఇదే దుస్థితి నెలకొంది.  

అంతులేని అక్రమాలు 
పులివెందుల మండలంలో ఇటు అధికారులు, అటు పోలీసులు అందరూ ఏకమై వైఎస్సార్‌సీపీపై కుయుక్తులకు పాల్పడుతున్నారు. పులివెందులకు విలన్‌లా మారిన మంత్రి నారా లోకేశ్‌ ఆదేశాల మేరకు కుట్రలను అమలు చేస్తున్నారు. ఎలాగైనా సరే గెలిచి.. వైఎస్‌ జగన్‌ అడ్డాలో పాగా వేశామని చెప్పుకునేందుకు పులివెందులను రణరంగంగా మార్చేందుకు సిద్ధమయ్యారు.  

⇒  కూటమి నేతల అరాచకంపై ఎన్నికల కమిషన్‌కు ఎన్నిమార్లు విన్నవించినా స్పందనే లేదు. మరోవైపు ఆయా కేసుల్లో అరెస్ట్‌ చేయొద్దని హైకోర్టు తీర్పు ఇచి్చనప్పటికీ మోట్నూతలపల్లె గ్రామానికి చెందిన అర్జున్, గంగన్న, చంద్రగిరికి చెందిన మస్తాన్‌వల్లి, మల్లికార్జునపురానికి చెందిన హరి, రచ్చుమర్రిపల్లె మైసూరారెడ్డి, లోపట్నూతల ప్రకాష్రెడ్డి, కారంపల్లె మహేష్నాయక్, బాలాజీ నాయక్, సర్పంచ్‌ రామాంజనేయులు, కోరా కిరణ్‌కుమార్‌రెడ్డి, రవిప్రకాష్రెడ్డిలను ఇప్పటికే పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. మరోవైపు ప్రలోభాలకు గురిచేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు.

⇒ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ సోమవారం పులివెందుల మండలంలోని నల్లపురెడ్డిపల్లె, ఎర్రిపల్లె, కొత్తపల్లె, కనంపల్లె, యర్రబల్లె గ్రామాల్లో ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, కృష్ణచైతన్యరెడ్డి, టీడీపీ జమ్మలమడుగు ఇన్‌చార్జి భూషేష్రెడ్డిలు రౌడీïÙటర్లను వెంటబెట్టుకుని హల్‌చల్‌ చేశారు. పోలింగ్‌ ప్రారంభం కాకముందే కొన్ని ఓట్లు వేసుకునేలా సరికొత్త కుట్రకు పదును పెట్టినట్లు తెలిసింది. 
⇒ పోలింగ్‌ పారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు టీడీపీ నేతల మాట మాత్రమే  వినాలని పోలీసులకు ఓ ఉన్నతాధికారి మౌఖిక ఆదే­శాలు జారీ చేశారు.

నేడు పోలింగ్‌
∙ 14వ తేదీన ఓట్ల లెక్కింపు 
వైఎస్సార్‌ జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో ఉప ఎన్నికలకు సంబంధించి మంగళవారం పోలింగ్‌ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్‌ విధానంలో పోలింగ్‌ నిర్వహణకు ఎస్‌ఈసీ ఏర్పాట్లు చేసింది. 14వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోవివిధ కారణాలతో 28 జెడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉండగా, కోర్టులో కేసుల పేరుతో కేవలం పులివెందుల, ఒంటిమిట్ట స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement