
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడపలో చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు.. అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే మాధవి రెడ్డి ప్రోద్బలంతో వైఎస్సార్‌సీపీ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పీఏ ఖాజాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల సమయంలో మాధవిరెడ్డిపై టీడీపీ సీనియర్ మహిళలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అదే వీడియో ప్రస్తుతం నెట్‌లో వైరల్ అవుతోంది.
అయితే, అంజాద్ బాషా పీఏ ఖాజా వైరల్ చేశాడంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లో ఉన్న ఖాజాను అరెస్ట్ చేసిన పోలీసులు తెల్లవారుజామున కడపకు తీసుకొచ్చారు. కడప శివారులోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో ఉంచారు.