విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ఆదాయం మళ్లీ తగ్గింది. డిసెంబర్‌లో ఏపీ జీఎస్టీ ఆదాయం తగ్గిపోయింది. గతేడాది కంటే 5.37 శాతం తగ్గిపోయింది జీఎస్టీ ఆదాయం. ఫలితంగా చంద్రబాబు పాలనలో అత్యధిక కాలం .జీఎస్టీ తగ్గిపోయినట్లైంది. చంద్రబాబు పాలనలో అప్పుల్లో భారీ వృద్ధి ఉండగా, ఆదాయంలో మాత్రం పతనం కనబడుతోంది. దాంతో ఆర్థికశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు.. ఉన్న సంపదను కూడా నాశనం చేసే విధంగా అడుగులు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీఎస్టీ ఆదాయం మళ్లీ పడిపోవడంతో ఆంధ్రప్రదేశ్ తిరోగమనంలో పయనిస్తోంది. కూటమి సర్కారు అధికారం చేపట్టినప్పటి నుంచి జీఎస్టీ ఆదాయంలో క్షీణతలే నమోదవుతున్నాయి.
వరుసగా జీఎస్టీ ఆదాయం గణనీయంగా తగ్గిపోవడంతో బాబు పాలనలో అంతా నేలచూపులే కనిపిస్తున్నాయి. ఒకవైపు అప్పులు.. మరొకవైపు జీఎస్టీ ఆదాయం తగ్గిపోవడంతో ఏపీ ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగా మారింది.


