సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలను హత్య చేసి చివరకు తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, మద్యం మత్తులను పిల్లలను తండ్రి హత్య చేసినట్టు తెలుస్తోంది.
వివరాల మేరకు.. ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నెలో విషాదం నెలకొంది. తండ్రి సురేంద్ర.. మద్యం మత్తులో తన ముగ్గురు పిల్లలను దారుణం హత్య చేశాడు. అనంతరం, సురేంద్ర ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన పిల్లలను కావ్య(7), రాజేశ్వరి(4), సూర్యగగన్(2)గా గుర్తించారు. అయితే, ఎనిమిది నెలల క్రితమే సురేంద్ర భార్య చనిపోయారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


