వైఎస్‌ జగన్‌ను కలిసిన అంబటి రాంబాబు | YSRCP Ambati Rambabu Meets YS Jagan At Tadepalli | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ను కలిసిన అంబటి రాంబాబు

Feb 20 2026 8:59 AM | Updated on Feb 20 2026 11:32 AM

YSRCP Ambati Rambabu Meets YS Jagan At Tadepalli

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని మాజీ మంత్రి అంబటి రాంబాబు కలిశారు. తాడేపల్లిలోని నివాసంలో వైఎస్‌ జగన్‌ను కలిసి అంబటి మాట్లాడారు. అయితే, అక్రమ కేసులో అరెస్ట్‌ అయిన అంబటి రాంబాబు.. గురువారం బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు.. తనపై టీడీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, టీడీపీ రౌడీ మూకలు తన ఇంటిని ధ్వంసం చేసిన తీరు, హత్యాయత్నం, పోలీసుల నిర్లిప్త వైఖరి, కొంతమంది పోలీసు అధికారుల ఓవర్‌ యాక్షన్‌ వంటి అంశాలను వైఎస్‌ జగన్‌కు వివరించారు.  ఈ క్రమంలో తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు.

అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసు అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజల పక్షాన, ప్రజల తరపున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులు ధీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుద్దామని, పార్టీ నాయకులు, కేడర్‌ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఈ భేటీలో అంబటితో పాటు ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మాజీ ఎంపీ నందిగం సురేష్‌, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్‌ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ ఉన్నారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement