ఒకప్పుడు భిక్షాటన..ఇవాళ బిలియనీర్‌గా ఏకంగా రూ. 40 కోట్ల..! | Renuka Aradhya: From begging on the streets to building a Rs 40 crore business | Sakshi
Sakshi News home page

ఒకప్పుడు భిక్షాటన..ఇవాళ బిలియనీర్‌గా ఏకంగా రూ. 40 కోట్ల..!

Dec 31 2025 1:29 PM | Updated on Dec 31 2025 1:44 PM

Renuka Aradhya: From begging on the streets to building a Rs 40 crore business

పేదవాడిగా పుట్టడం తప్పు కాదు..అలానే చనిపోవడం మాత్రం ముమ్మాటికీ నీ తప్పే అన్న కవి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి ఈ వ్యక్తిని చూస్తే. ఒకప్పుడు కడు దారుణమైన స్థితిలో ఉండేవాడు. తిండి కోసం అడుక్కోవాల్సిన దుర్భర పరిస్థితి. అలాంటి వ్యక్తి ఇవాళ్ల ఏకంగా కోట్ల వ్యాపారాన్ని నడుపుతూ బిలియనీర్‌గా అవతరించాడు. ఇవాళ యువత ఏవేవో చిన్న కష్టాలకు, అనుకున్న డ్రీమ్‌ నెరవేరలేదనో జీవితాన్ని అంతం చేసుకుంటున్నవాళ్లకు ఇతడి కథ ఓ కనువిప్పు. కష్టాలు కలకాలం కాదు.. సత్తా ఉన్నవాడిని కష్టపెట్టలేవు అనేందుకు అతడొక ఉదాహరణ. అలాంటి అసామాన్యుడి సక్సెస్‌ జర్నీ ఎలా మొదలైంది వంటి వాటి గురించి ఈ కథనంలో సవివరంగా తెలుసుకుందామా..!.

జీవితం ఎవ్వరికీ గోల్డెన్‌ స్పూన్‌తో ప్రారంభం కాదు. కొందరికి ఖాళీ గిన్నెలతో, కన్నీళ్లతో ప్రారంభమవుతుంది. అగమ్య గోచరం లాంటి దుర్భర జీవితం నుంచి ఒక్కోమెట్టు ఎక్కుతూ.. ఎదిగి.. బురద నుంచి పుట్టిన కలువ పువ్వుల్లా ప్రకాశవంతంగా వెలుగొందుతారు. ఇది కదా జీవితం అనిపించేలా ఉంటుంది వారి విజయ ప్రస్థానం. ఎక్కడి నుంచి వచ్చాం కాదు..ఎలా జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకున్నామ్‌ అన్నది ముఖ్యం అనే ఆర్యోక్తిలా ఉంటుంది వారి లైఫ్‌. 

అందుకు నిదర్శనమే బెంగళూరుకి చెందిన రేణుకా ఆరాధ్య.  కర్ణాటకలో ఓ చిన్నగ్రామంలో కటిక పేదరికంలో జన్మించాడు. తండ్రి కుటుంబాన్ని పోషించలేక బియ్యం గింజలు కోస యాచన చేసే పూజారి. రేణుకా తరుచుగా తండ్రి తోపాటు బెంగళూరులో సందడిగా ఉండే ఎలక్ట్రానిక్‌ సిటీ గుండా బిక్షాటన చేస్తూ తిరిగేవాడు. ఆరోతరగతి తర్వాత తండ్రి ఒక ఇంటికి పనిమనిషి పనికి కుదిర్చాడు. పాఠశాలల ఫీజులు ఉపాధ్యాయులు చెల్లిస్తే..అతడు పనిమనిషిగాఇంటి పనులు చేసి..స్కూల్‌కి వచ్చి చదువుకునేవాడు. 

ఆ తర్వాత ఒక చర్మవ్యాధితో బాధపడుతున్న వ్యక్తి సహాయకుడిగా కూడా పనిచేశాడు. ఇక అక్కడ నుంచి బాలుర హాస్టల్‌ జాయిన్‌ అయ్యాడు.అయితే అక్కడ ఆకలి అత్యంత ఘోరంగా ఉండేది. కడుపు నిండా భోజనం తినాలంటే..సంస్కృతం నేర్చుకుంటే కుదురుతుందని.. ఆ కోర్సులో జాయిన్‌ అయ్యాడు. అయితే పదిలో ఫెయిల్‌ అయ్యాడు. కానీ సంస్కృతంలో పాసవ్వడం విశేషం. ఇంతలో తండ్రి మరణం మొత్తం కుటుంబం బాధ్యతలు అతడిపై పడిపోయాయి. 

చిన్నచితక ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ముఖ్యంగా ఫ్యాక్టరీలో, ప్లాస్టిక్ యూనిట్‌లో, ఐస్ ప్లాంట్‌లో స్వీపర్‌గా, మండుతున్న ఎండలో సూట్‌కేసులతో నిండిన హ్యాండ్‌కార్ట్‌లను నెట్టడం, సెక్యూరిటీ గార్డుగా ఇలా రకరకాల పనులు చేస్తూ పొట్ట పోషించుకునేవాడు. ఇదేమంత సరిపోదు ఇంకా బాగా సంపాదించాలి కానీ అదెలా అనేది అర్థంకాక రకరకాల ఉద్యోగాలు చేస్తూనే ఉండేవాడు. 

అప్పుడే డ్రైవింగ్‌ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. కొంత డబ్బు అప్పుచేసి మరి డ్రైవింగ్‌ నేర్చుకున్నాడు. ఇంతలో అతడికి పెళ్లికూడా అయ్యింది. ఇప్పుడు మరిన్ని బాధ్యతలు అతడిపై పడ్డాయి. అయితే డ్రైవింగ్‌కే అప్పుచేయాల్సిన పరిస్థితి..ఇక లైసెన్స్‌ ఎలా అనే సమయంలో తన పెళ్లి ఉంగరాన్ని తాకట్టుపెట్టి పొందాడు. అలా కారు డ్రైవర్‌గా కొత్త ఉద్యోగంలో చేరాడు. అయితే తొలిరోజే కారుని ఢీ కొట్టాడు, దాంతో మళ్లీ ఇదివరకటిలా గార్డుగా పనిచేయమని సూచించడంతో అవమానంతో కుంగిపోయాడు. 

అయితే తన యజమానిని బతిమాలుకుని ఒక్క అవకాశం అంటూ ప్రాథేయపడటంతో..ఈసారి రాత్రిపూట డ్రైవింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. కొండలపై రాళ్లను అడ్డుపెట్టుకుంటూ..జాగ్రత్తగా డ్రైవ్‌ చేస్తూ నేర్చుకున్నాడు. అలా గోకర్ణకు సాగిన తొలి టూర్‌ ఒక విలువైన పాఠాన్ని నేర్పించింది. నెమ్మదిగా తక్కువ సయంలోనే మంచి డ్రైవర్‌గా పేరుతెచ్చుకున్నాడు. కేవలం పర్యాటకులను మాత్రమే కాదు, అంబులెన్స్‌ మాదిరిగా 300 మృతదేహాలను కూడా తరలించేవాడు. 

ఇలా రెండు రకాలుగా పని చేస్తూ..డబ్బులు గడించేవాడు. చివరకి విదేశీ పర్యాటకులను తీసుకువెళ్తు డాలర్లు టిప్‌లు అందుకునేవాడు. అలా పొదుపు చేసిన మొత్తంతో ఓ ట్రెవెల్‌ సంస్థను నడపాలన్నది తన ఆకాంక్ష. సరిగ్గా ఆటైంలోనే అమ్మకానికి సిద్ధంగా ఉన్న టాక్సీ వ్యాపారాన్ని రూ. 6.5 లక్షలకు కొనుగోలు చేశాడు. అందుకోసం తన సొంత కార్లను కూడా అమ్మక తప్పలేదు. దానికి 'ప్రవాసీ క్యాబ్స్‌' అని పేరు పెట్టాడు. ఈ వ్యాపారాన్ని రన్‌ చేయడానికి అప్పులు పొందాల్సి వచ్చేది, వాటికి అధిక రుణాలు చెల్లించాల్సి వచ్చినా..వెనక్కి తగ్గలేదు రేణుక. కేవలం తన సంస్థ టర్నోవర్‌పైనే ఫోకస్‌ పెట్టాడు. 

అలా అమెజాన్‌, వాల్‌మార్ట్‌, జీఎం వంటి దిగ్గజాలకు తన క్లయింట్లను విస్తరించాడు. అంతేగాదు తన కార్లను వెయ్యికి పైగా పెంచాడు. పర్యాటకులను తీసుకువెళ్లడం వల్ల వార్తపత్రికలు చదువుతూ ఇంగ్లీష్‌ నేర్చుకున్నాడు. తన నెట్‌వర్కింగ​ ఈవెంట్లకు హాజరవ్వుతూ వ్యాపారంలో మెళ్లుకువలు నేర్చుకున్నాడు. అంతేగాదు అందివచ్చిన టెక్నాలజీని కూడా స్వీకరించాడు. 

ప్రస్తుతం అతడి కంపెనీ మూడు నగరాల్లో విస్తరించింది. స్కూల్ బస్సులను నడుపుతూ.. అతడ సంస్థ దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది. ఇక్కడ రేణుకా ఆరాధ్య కథ గతం ఎప్పుడు మన భవిష్యత్తుని నిర్ణయించదు. దార్శినికత, కృషి, పట్టుదల, దృఢసంకల్పం, క్రమశిక్షణాయుతమైన జీవనం అసాధారణ విజయాలను సాధించేందుకు దారితీస్తుందనేందుకు రేణుకా ఆరాధ్యనే ఓ ఉదాహరణ.

(చదవండి: అక్కడ కాఫీ షాప్‌కి వెళ్లాలంటే హెల్మెట్‌ ధరించాల్సిందే..! ఎందుకో తెలుసా?)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement