మస్కట్: వర్క్ పర్మిట్లు, వృత్తిపరమైన లైసెన్స్, సర్టిఫికెట్లపై ఒమన్ దేశం కీలక హెచ్చరికలు జారీ చేసింది. నకిలీ వర్క్ పర్మిట్లు, జాబ్ లైసెన్స్ పత్రాలను సమర్పిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. దీనికి సంబంధించి నకిలీని సర్టిఫికెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయని కార్మిక మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే కొత్త సంవత్సరంలో నిబంధనలను కఠినతరం చేసింది. ఫేక్ సర్టిఫికెట్లు, కాపీలు లాంటి చర్యలు చట్టాలు, నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని, కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఒమన్‌లో పని అనుమతులు (వీసాలు) పునరుద్ధరించడానికి, కొత్త ఉద్యోగాలలోకి ప్రవేశించడానికి, సంబంధిత రంగాలలో వృత్తిపరమైన వర్గీకరణ సర్టిఫికెట్లు, వృత్తిపరమైన అభ్యాస లైసెన్స్‌లను సమర్థ అధికారుల (సెక్టోరల్ స్కిల్స్ యూనిట్లు) నుండి పొందాలని స్పష్టం చేసింది.అదే సమయంలో, అన్ని ఉద్యోగులు, కంపెనీలు ఈ పత్రాలు జారీ చేసే క్రమంలో వాటి ప్రామాణికతను ధృవీకరించాల్సిన బాధ్యత ఉందని తెలిపింది. ఏదైనా అనధికార పత్రాలను ఉపయోగించకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ప్రొఫెషనల్ వర్గీకరణ సర్టిఫికేట్ , వృత్తిని అభ్యసించడానికి లైసెన్స్ ముఖ్యమైనవి. ఉద్దేశించిన వృత్తికి సంబంధిత వ్యక్తి సుముఖత , అర్హతను ధృవీకరించడం, వృత్తిపరమైన సామర్థ్యం , పనితీరు ప్రమాణాలను నిర్ధారించడం, కార్మిక మార్కెట్‌ను నియంత్రించడం వృత్తిపరమైన ప్రమాణాలను నిర్ధారించడమే దీని లక్ష్యంమని పేర్కొంది. నకిలీ లేదా తప్పుడు పత్రాన్ని సృష్టించడం నేరస్థుడిపై చట్టపరమైన చర్యలకు దారితీసుకుంటామని హెచ్చరించింది. చట్టాలని లోబడి జరిమానా, ఇతర చర్యలుంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.


