బంగ్లాకు కాబోయే ప్రధాని: ప్రజలకు ఇచ్చిన తొలి పిలుపు ఇదే..! | Tarique Rahman Urges National Unity As BNP Prepares To Take Charge In Bangladesh, More Details Inside | Sakshi
Sakshi News home page

బంగ్లాకు కాబోయే ప్రధాని: ప్రజలకు ఇచ్చిన తొలి పిలుపు ఇదే..!

Feb 14 2026 5:15 PM | Updated on Feb 14 2026 5:25 PM

Tarique Rahman calls for unity in first address after BNPs win

ఢాకా:  గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్‌లో అరాచకమే చూస్తూ వస్తున్నాం.  బంగ్లా అంతటా విధ్వంస చాయలే కనిపించాయి. షేక్‌ హసీనా బంగ్లా ప్రధానిగా వైదొలిగిన క్రమం నుంచి మహ్మద్‌ యూనస్‌ తాత్కాలిక బాధ్యతల్లో ప్రభుత్వం నడిచిన తీరును గమనిస్తే ఆ దేశంలో ఐక్యతా చాయలు సన్నగిల్లడమే కనబడింది. మన రెండు రోజుల్లో బంగ్లాదేశ్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న బీఎన్‌పీ అధినేత తారిఖ్‌ రెహ్మాన్‌.. పార్టీ అతిపెద్ద విజయం సాధించిన తర్వాత దేశ ప్రజలకు ఐక్యతా పిలుపే ఆయన తొలి పిలుపు అయ్యింది.

బంగ్లాదేశ్‌లోని పరిస్థితులను గత కొంతకాలం నుంచి నిశితంగా గమినిస్తున్న తారిఖ్‌ రెహ్మాన్‌.. ఐక్యతకు పిలుపునిచ్చారు. దేశంలొ ప్రజాస్వామ్యం నెలకొనడానికి త్యాగం చేసిన వారికి ఈ విజయం అంకితం ఇస్తున్నట్లు రెహ్మాన్‌ ప్రకటించారు. 

“మీ స్వచ్ఛంద భాగస్వామ్యంతో, దాదాపు పదిన్నర సంవత్సరాల తర్వాత, ప్రజలకు నేరుగా ఓటు ద్వారా బాధ్యత వహించే పార్లమెంట్, ప్రభుత్వం దేశంలో తిరిగి స్థాపించబడుతున్నాయి,” అని రహ్మాన్ అన్నారు. ఆయన ప్రజలను ఐక్యంగా నిలబడమని కోరుతూ,  ఏ దుష్ట శక్తి దేశంలో మళ్లీ నియంతృత్వాన్ని స్థాపించకుండా, దేశం బానిస రాష్ట్రంగా మారకుండా చూసుకోవాలి’ అని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

తారిఖ్‌ రహ్మాన్‌ రాక..భారత్‌కు బంగ్లాకు టెన్షన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement