Tarique Rahman
-
బంగ్లాలో యూనస్ ఔట్.. భారత్ కీలక నిర్ణయం!
ఢాకా: బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తారిక్ రెహ్మాన్ ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య మళ్లీ సంబంధాలు మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా వీసా సేవలు త్వరలోనే పునరుద్దరించే అవకాశం ఉంది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ వీసాల మంజూరు ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు సమాచారం.భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు గత రెండేళ్లలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. 2024 జూలై–ఆగస్టు ఉద్యమాల తర్వాత షేక్ హసీనా పదవి నుంచి తప్పుకోవడం, ఆమె భారత్‌కు వెళ్లిపోవడం, ఆ తర్వాత మధ్యంతర ప్రభుత్వంలో భారత్ వ్యతిరేక శక్తులు బలపడటం వల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ క్రమంలో ఆగస్టు 2024 బంగ్లాదేశ్‌లో అశాంతి కారణంగా భారత్ తొలిసారి అన్ని వీసా సేవలను నిలిపివేసింది. అలాగే, డిసెంబర్ 2025లో ఉస్మాన్ హాది మరణం తర్వాత జరిగిన భారత్ వ్యతిరేక నిరసనల కారణంగా ఢాకా, చిట్టగాంగ్, ఖుల్నా, రాజ్షాహి వీసా కేంద్రాలు మూసివేయబడ్డాయి. ఇందుకు ప్రతిగా బంగ్లాదేశ్ కూడా తన కాన్సులేట్లలో వీసా సేవలను నిలిపివేసింది.అయితే, ప్రస్తుతం యూనస్ ప్రభుత్వం దిగిపోవడం.. తారిక్ రెహ్మాన్ ప్రభుత్వం కొలువుదీరడంతో వీసాల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా సిల్హెట్‌లోని భారత సీనియర్ కాన్సులర్ అధికారి అనిరుద్ధ దాస్ స్పందిస్తూ.. ‘భారత్ త్వరలోనే అన్ని వీసా సేవలను పునరుద్ధరించనుంది. ప్రస్తుతం మెడికల్, డబుల్-ఎంట్రీ వీసాలు ఇస్తున్నారు. త్వరలో ట్రావెల్ వీసాలు సహా అన్నింటిని తిరిగి ప్రారంభించనున్నారు. భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు పరస్పర గౌరవం, సాంస్కృతిక బంధంతో నడుస్తాయి. రెండు దేశాల ప్రజలే ఈ స్థిరమైన, సానుకూల సంబంధాల ప్రధాన భాగస్వాములు’ అని పేర్కొన్నారు.కాగా, ఈ పరిణామం వీసా విధానాలకే పరిమితం కాదు. ఇది రెండు దేశాల మధ్య నమ్మకాన్ని తిరిగి నిర్మించే ప్రయత్నం. సాధారణ ప్రజలకు వైద్య, వ్యాపార, సాంస్కృతిక ప్రయాణాలు సులభం అవుతాయి. ఇదిలా ఉండగా.. షేక్ హసీనా (2009–2024) కాలంలో భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు మెరుగైన స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. -
‘బంగ్లా’కు సహకరిస్తాం.. భారత్‌కు రండి’
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తారిఖ్ రెహ్మాన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మోదీ ఆయనను భారత్‌కు ఆహ్వానించారు. మంగళవారం ఢాకాలో తారిఖ్ రెహ్మాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. భారత ప్రభుత్వ ప్రతినిధిగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. షేక్ హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యయుతంగా కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సందర్భంగా ఓం బిర్లా నూతన ప్రధానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిన వ్యక్తిగత లేఖను ఆయనకు స్వయంగా అందజేశారు.పొరుగు దేశంతో సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా భారత్ ఈ కీలక అడుగు వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ తన లేఖ ద్వారా తారిఖ్ రెహ్మాన్ భారతదేశ పర్యటనకు రావాలని సాదరంగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని ఓం బిర్లా తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొంటూ ‘ప్రధాని మోదీ పంపిన లేఖను రెహ్మాన్‌కు అందజేశాను. బంగ్లాదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇరు దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని పునరుద్ఘాటించాను’ అని తెలిపారు. కాగా ఫిబ్రవరి 13నే మోదీ ఫోన్ ద్వారా రెహ్మాన్‌ను అభినందించారు. తాజా లేఖలో బంగ్లాదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో భారత్ పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నట్లు సమాచారం. Just concluded a constructive meeting with Prime Minister of Bangladesh @trahmanbnpI handed over a personal letter from Prime Minister @narendramodi conveying his wishes to PM Rahman and inviting him to visit India at the earliest convenience.I extended warm congratulations… pic.twitter.com/gFNqLmnxsT— Om Birla (@ombirlakota) February 17, 2026ఫిబ్రవరి 12న జరిగిన సాధారణ ఎన్నికల్లో తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) మూడింట రెండొంతుల మెజారిటీతో ఘనవిజయం సాధించింది. సుమారు 17 ఏళ్ల పాటు లండన్‌లో ప్రవాస జీవితం గడిపిన రెహమాన్, ఎన్నికలకు ముందు స్వదేశానికి తిరిగి వచ్చి తన పార్టీని విజయపథంలో నడిపారు. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఏర్పడిన ఆందోళనకర పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంలో ఈ ఎన్నికల విజయం కీలకంగా నిలిచింది. ప్రస్తుతం షేక్ హసీనా భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు.భారత్‌తో సంబంధాల విషయంలో తారిఖ్ రెహ్మాన్ స్పందించారు. తమ విదేశాంగ విధానం పూర్తిగా ‘బంగ్లాదేశ్ ఫస్ట్’ ఎజెండాపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలే తమకు అత్యున్నతమని, దాని ప్రకారమే పొరుగు దేశాలతో సంబంధాలు ఉంటాయని పేర్కొన్నారు. కాగా చారిత్రక, సాంస్కృతిక బంధాలు కలిగిన రెండు దేశాలు కలిసి పనిచేస్తే, ప్రాంతీయ సుస్థిరత సాధ్యమవుతుందని భారత్ ఆశిస్తోంది.ఇది కూడా చదవండి: కమల్ హాసన్‌కు ‘టార్చ్ లైట్’.. ‘ఎంఎన్ఎం’లో ఉత్సాహం ఉరకలు -
బంగ్లాదేశ్‌లో మంత్రిగా హిందూ నేత.. ఎవరీ నితాయ్ రాయ్ చౌదరి?
బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రిగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ఛైర్మన్ తారిఖ్ రెహమాన్‌తో పాటు మంత్రులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఢాకాలోని జాతీయ పార్లమెంట్ దక్షిణ ప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమం జరిగింది.అయితే కొత్త ప్రభుత్వ కేబినెట్లో హిందూ మైనారిటీ వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు నితాయ్ రాయ్ చౌదరికి చోటు దక్కడం విశేషం. ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ నియమించిన 25 మంది క్యాబినెట్ మంత్రులలో నితాయ్ రాయ్ చౌదరి ఒకరు. ఆయనకు సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధ్యతలు కేటాయించనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.నితాయ్ రాయ్ ఫిబ్రవరి 12న జరిగిన జాతీయ పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన మగురా-2 నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించారు. తన ప్రత్యర్థి అయిన జమాత్-ఏ-ఇస్లామీ అభ్యర్థిని భారీ మెజారిటీతో ఓడించారుఎవరీ నితాయ్ రాయ్ చౌదరి?77 ఏళ్ల నితాయ్ రాయ్ చౌదరి 1949లో బంగ్లాదేశ్‌లోని మగురా జిల్లాలో జన్మించారు. ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. తన ప్రాథమిక విద్యను మగురా గవర్నమెంట్ కాలేజీలో పూర్తి చేశారు. అనంతరం ఢాకా విశ్వవిద్యాలయం నుండి లా (న్యాయశాస్త్రం) పట్టా పొందారు. ఢాకా యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్నప్పుడే ఆయన రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు.అక్కడే ఆయన రాజకీయ జీవితానికి పునాది పడింది. 1988లో మగురా-2 నియోజకవర్గం నుండి తొలిసారిగా జాతీయ పార్లమెంట్‌కు నితాయ్ రాయ్ ఎన్నికయ్యార. ఆయన ప్రస్తుతం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వైస్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. గతంలో ఆయన విద్య, యువజన, క్రీడల శాఖల మంత్రిగా కూడా పనిచేశారు. నితాయ్ రాయ్ కుమార్తె నిపుణ్ రాయ్ చౌదరి కూడా బీఎన్పీలో అత్యంత క్రియాశీలక నాయకురాలగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. -
రాజీనామా చేసిన బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత
బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొత్త శకం మొదలు కానుంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఛైర్మన్ తారిఖ్ రెహమాన్ ఆ దేశ ప్రధానిగా మంగళవారం ప్రమాణం చేయనున్నారు. ఈ క్రమంలో మధ్యంతర ప్రభుత్వ సారథి ముహమ్మద్ యూనస్ తన పదవికి రాజీనామా చేశారు. 2024లో దేశంలో ఏర్పడిన రాజకీయ అస్థిరత తర్వాత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం దాదాపు రెండేళ్ల పాటు పాలన చేపట్టింది. అయితే కొత్త సర్కార్ కొలువు దీరనుండడంతో ఆయన తన పదవి నుంచి తప్పుకొన్నారు. సోమవారం దేశ ప్రజలను ఉద్దేశించి టెలివిజన్ ద్వారా ప్రసంగించిన యూనస్.. తన రాజీనామాను అధికారికంగా ప్రకటించారు. "ఈ రోజుతో తాత్కాలిక ప్రభుత్వం పాలన ముగిసింది. దేశంలో కొత్తగా మొదలైన వాక్ స్వాతంత్ర్యం, ప్రాథమిక హక్కుల సాధన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోకూడదు" అని ఆయన పేర్కొన్నారు. -
తారిఖ్ రెహ్మాన్.. ఈ సవాళ్లకు జవాబేది?
సుదీర్ఘ ప్రవాసం, అలుపెరగని పోరాటం, చివరకు ప్రజాక్షేత్రంలో తిరుగులేని విజయం.. బంగ్లాదేశ్ నూతన సారథిగా తారిఖ్ రెహ్మాన్ పగ్గాలు చేపట్టబోతున్నారు. అయితే రెహ్మాన్‌కు ఈ విజయం పూలబాట కాదు. ఒకవైపు ఏళ్ల నాటి పాత గాయాలు, మరోవైపు రాజకీయ శత్రువుల అణచివేత.. వీటన్నింటి మధ్య తారిఖ్ ఇచ్చే ‘చట్టబద్ధ పాలన’ హామీ దేశాన్ని ఏ దిశగా నడిపించబోతోంది? ఆయన అడుగులు ప్రతీకారం వైపా లేక పరివర్తన వైపా? అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.ప్రతీకారేచ్ఛను పక్కన పెడతారా?జియావుర్ రెహ్మాన్ వారసుడిగా, ఖలీదా జియా తనయుడిగా తారిఖ్ రెహ్మాన్‌కు అధికారం కొత్త కాకపోవచ్చు, కానీ ఈసారి బాధ్యత అత్యంత భారంగా మారింది. అవామీ లీగ్ పతనం తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని భర్తీ చేయడం ఆయన ముందున్న మొదటి సవాల్. గత ప్రభుత్వ హయాంలో అతనిపై మోపిన అక్రమ కేసులు, జైలు శిక్షలు, ప్రవాస జీవితం ఆయన మనసులో ప్రతీకారేచ్ఛను రగిలిస్తాయా? లేక ఒక పరిణతి చెందిన నాయకుడిగా మారుస్తాయా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.‘చట్టబద్ధ పాలన’ అతి పెద్ద పరీక్షతాజాగా విలేకరుల సమావేశంలో తారిఖ్ చెప్పిన చట్టబద్ధ పాలన అనే మాట ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అవామీ లీగ్ మద్దతుదారులు ప్రాణభయంతో తలదాచుకుంటున్న వేళ, ఆయన ఇచ్చిన ఈ భరోసా ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందన్నది సందేహమే. కిందిస్థాయి కార్యకర్తల్లో ఉన్న ఆగ్రహాన్ని అదుపు చేస్తూ, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకుండా యంత్రాంగాన్ని నడిపించడం అనేది ఆయన ముందున్న పెద్ద పరీక్ష.అందరి ఆమోదం సాధ్యమేనా?షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత అనాథలుగా మారిన అవామీ లీగ్ ఓటర్లు ఈ ఎన్నికల్లో మౌనంగా బీఎన్పీకి జై కొట్టారు. ఇది బీఎన్పీపై ఉన్న ప్రేమ కంటే, జమాత్ ఈ ఇస్లామీ లాంటి శక్తులు అధికారంలోకి రాకూడదనే భయం వల్ల జరిగిన మార్పు. ఈ విధంగా వచ్చిన ఓటు బ్యాంకును శాశ్వతంగా నిలబెట్టుకోవాలంటే తారిఖ్ రెహ్మాన్ తన పాలనలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.మతవాదం వెర్సస్ జాతీయవాదం?బంగ్లాదేశ్ అంటేనే లౌకికవాదం- ఇస్లామిక్ విలువల కలయిక. జమాత్ ఈ ఇస్లామీ ప్రభావం పెరగకుండా చూస్తూనే, మెజారిటీ ముస్లిం ఓటర్లను సంతృప్తి పరచడం తారిఖ్ ముందున్న కత్తిమీద సాము లాంటి వ్యవహారం. గతంలో పాకిస్తాన్ అనుకూల ముద్ర ఉన్న శక్తులతో దూరం పాటిస్తూ, బంగ్లాదేశ్ జాతీయ అస్తిత్వాన్ని కాపాడతామని ఆయన చేసిన వాగ్దానం మైనారిటీలలో ముఖ్యంగా హిందువులలో కొత్త ఆశలు రేకెత్తించింది.మహిళా ఓటర్ల మద్దతు కొనసాగేనా?షరియా చట్టం, మహిళల విషయంలో కఠిన నిబంధనలు విధిస్తామన్న జమాత్ వ్యాఖ్యలు మహిళా ఓటర్లను బీఎన్పీ వైపు మళ్లించాయి. షేక్ హసీనా హయాంలో మహిళా సాధికారత కొంతవరకు మెరుగ్గా ఉండేది. ఇప్పుడు తారిఖ్ రెహ్మాన్ ఆ పురోగతిని కొనసాగిస్తారా? లేక సంప్రదాయవాదుల ఒత్తిడికి తలొగ్గుతారా? అన్నది వేచి చూడాలి. మహిళల భద్రత, ఉద్యోగ అవకాశాల విషయంలో ఆయన తీసుకునే నిర్ణయాలే ఆయన భవిష్యత్తును నిర్ణయిస్తాయి.అంతర్జాతీయ సవాళ్లుబంగ్లాదేశ్ రాజకీయాల్లో భారత్, చైనా, అమెరికా వంటి దేశాల ప్రమేయం ఎప్పుడూ ఉంటుంది. అవామీ లీగ్ నిషేధం వెనుక విదేశీ హస్తం ఉందన్న ప్రచారం మధ్య, తారిఖ్ తన విదేశాంగ విధానాన్ని ఎలా మలుచుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడటం అనేది ఆయన పరిపాలనా దక్షతకు గీటురాయి కానుంది.ఆర్థిక సంక్షోభాన్ని గట్టెక్కిస్తారా?రాజకీయ సవాళ్లు ఒకెత్తయితే, కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం మరో ఎత్తు. నిత్యావసర ధరల పెరుగుదల, నిరుద్యోగంతో దేశ యువత రగిలిపోతోంది. 2024, జూలై నాటి నిరసనలకు కారణమైన సమస్యలను పరిష్కరించకపోతే, ప్రజా ఆగ్రహం తనపైకి మళ్లడానికి ఎంతో సమయం పట్టదని తారిఖ్‌కు తెలుసు. అందుకే, ఆయన తక్షణ ప్రాధాన్యత ఆర్థిక సంస్కరణలవైపు ఉండాలి.దేశాన్ని సుస్థిరత వైపు నడిపిస్తారా ? తారిఖ్ రెహమాన్ ముందు రెండు దారులు ఉన్నాయి. ఒకటి గతంలోని తప్పులను పునరావృతం చేస్తూ ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవడం, రెండు.. అందరినీ కలుపుకుపోయే ప్రజాస్వామ్యవాదిగా చరిత్రలో నిలిచిపోవడం. ఆయన ఎంచుకునే ‘చట్టబద్ధ పాలన’ అనే మార్గం బంగ్లాదేశ్‌ను సుస్థిరత వైపు నడిపిస్తుందా లేక మరో రాజకీయ అనిశ్చితికి దారితీస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి. ఇది కూడా చదవండి: ‘బంగ్లా’లో తారిఖ్ ప్రభుత్వం.. పాక్‌లో ఏం జరగనుంది? -
బంగ్లా ప్రధానిగా రేపు రహ్మాన్ ప్రమాణం
ఢాకా: బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తారిఖ్ రహ్మాన్ సారథ్యంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ప్రభుత్వం మంగళవారం కొలువుతీరనుంది. రహ్మాన్ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపడతారు. అధ్యక్షుడు మొహమ్మెద్ షాహబుద్దీన్ ఆయనతో ప్రమాణం చేయిస్తారు. షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలాక ఆమెతో పాటు స్పీకర్ కూడా దేశం వీడి అజ్ఞాతంలోకి వెళ్లగా డిప్యూటీ స్పీకర్ జైళ్లో ఉన్నారు. దాంతో రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్ ప్రకారం నూతన పార్లమెంట్ సభ్యులతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నజీరుద్దీన్ ప్రమాణం చేయించనున్నారు. రహ్మాన్ తండ్రి జియావుర్ రహ్మాన్ దేశాధ్యక్షునిగా, తల్లి బేగం ఖలీదా ప్రధానిగా పనిచేశారు. ఆ కుటుంబం నుంచి అత్యున్నత పదవులను అధిరోహించిన మూడో వ్యక్తిగా రహ్మాన్ నిలవనున్నారు. తాజా ఎన్నికల్లో 297 స్థానాలకుగాను బీఎన్పీ 209 చోట్ల గెలిచింది. అతివాద జమాతే ఇస్లామీ కేవలం 68 సీట్లకు పరిమితమైంది. జూలై ఉద్యమానికి నేతృత్వం వహించిన విద్యార్థి సంఘాలు ఏర్పాటుచేసిన నేషనల్ సిటిజెన్ పార్టీ కొత్తగా షాడో కేబినెట్‌ను ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వ పనితీరును ఎప్పటికప్పుడు విమర్శించడమే లక్ష్యంగా ఈ షాడో కేబినెట్‌ను ఏర్పాటుచేస్తున్నారు. భారత్ తరఫున ఓం బిర్లా ప్రధానిగా తారిఖ్ రెహ్మాన్ ప్రమాణస్వీకారోత్సవానికి భారత్ తరఫున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరుకానున్నారు. ఢాకాలో జరిగే కార్యక్రమానికి రావాలని ప్రధాని మోదీని బంగ్లాదేశ్ ఆహా్వనించగా ఆయన తరఫున భారత్ నుంచి బిర్లా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని భారత విదేశాంగ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
Bangladesh: తారిఖ్ రెహ్మాన్ ప్రమాణానికి ప్రధాని మోదీకి ఆహ్వానం
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో ఈ నెల 17వ తేదీన ఒక కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఛైర్మన్ తారిఖ్ రెహ్మాన్ నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ ఈ వేడుకను అంతర్జాతీయ వేదికగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా భారత్, చైనా, సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ, యూఏఈ సహా మొత్తం 13 దేశాల ప్రభుత్వాధినేతలకు అధికారికంగా ఆహ్వానాలు పంపారు.భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న ప్రత్యేక దౌత్య సంబంధాల దృష్ట్యా భారత ప్రధాని నరేంద్ర మోదీకి అందిన ఆహ్వానం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఫిబ్రవరి 17న ముంబైలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొనాల్సి ఉంది. ఈ నేపధ్యంలో ప్రధాని ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయనకు బదులుగా భారత ప్రభుత్వం తరపున విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ లేదా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ బంగ్లాదేశ్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.బంగ్లాదేశ్‌లో బీఎన్పీ పార్టీ అధికారికంగా మళ్లీ అధికార పీఠాన్ని అధిరోహించబోతోంది. బంగ్లాదేశ్ పార్లమెంట్ హౌస్‌లోని సదరన్ ప్లాజాలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. అదే రోజు ఉదయం నూతనంగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ప్రమాణం చేయనుండగా, అనంతరం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏఎంఎం నాసిర్ ఉద్దీన్.. తారిఖ్ రెహమాన్ చేత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.దక్షిణాసియాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ కార్యక్రమానికి శ్రీలంక, నేపాల్, మాల్దీవులు, భూటాన్ తదితర పొరుగు దేశాల ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. కాగా బంగ్లాదేశ్‌లో బీఎన్పీ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం కొలువుదీరుతున్న వేళ, భారత్‌తో ఆ దేశ సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో బీఎన్పీ హయాంలో భారత్‌తో సంబంధాలు ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, ప్రస్తుత నాయకత్వం ప్రాంతీయ సహకారం, వాణిజ్యం, స్థిరత్వంపై సానుకూల ప్రకటనలు చేసింది. -
శాంతిభద్రతలను పరిరక్షిస్తా
ఢాకా: దాదాపు 18 నెలలుగా కొనసాగుతున్న అరాచకత్వ, అనిశ్చితికి చరమగీతం పాడుతూ ఇకపై తమ పరిపాలనలో శాంతిభద్రతకు పెద్దపీట వేస్తామని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్మన్ తారిఖ్ రెహ్మాన్ ప్రకటించారు. తాజాగా జరిగిన బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మూడింట రెండొంతుల స్థానాలను కైవసంచేసుకుని ఘనవిజయం సాధించిన బీఎన్పీ పార్టీ త్వరలోనే అధికార పగ్గాలు చేపట్టనున్న నేపథ్యంలో రెహ్మాన్ శనివారం ఢాకాలో తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ‘‘దేశంలో శాంతిభద్రతల స్థాపన కోసం ఎందాకైనా వెళ్తాం. ఇందుకోసం ప్రతి ఒక్కరి సహకారం మాకు కావాలి. అప్పుడే మేం సురక్షితమైన, మానవీయ బంగ్లాదేశ్‌ను సాకారంచేయగలం. ఎంతటి భారీమూల్యం చెల్లించైనాసరే శాంతిభద్రతలను పరిరక్షిస్తాం. అందరి భాగస్వామ్యంతో ఫాసిజంరహిత దేశ ప్రగతి ప్రయాణం ఆరంభమైంది. దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరి అభిప్రాయానికి విలువనిస్తాం. సుస్థిర బంగ్లాదేశ్‌ను నిర్మిస్తాం’’అని అన్నారు.4 రోజుల్లో ప్రమాణస్వీకారంప్రధానిగా తారిఖ్‌తో పాటు కేబినెట్ మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం మరో నాలుగు రోజుల్లో జరగే అవకాశం ఉందని బీఎన్పీ నేత మొహమ్మద్ షాహబుద్దీన్ చెప్పారు. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్(బంగభవన్)లో తారిఖ్ ప్రమాణస్వీకారోత్సవం ఉంటుందని కేబినెట్ కార్యదర్శి షేక్ అబ్దుర్ రషీద్ చెప్పారు. ఫిబ్రవరి 16 లేదా 17వ తేదీన ప్రమాణస్వీకారం ఉండొచ్చని బీఎన్పీ సీనియర్ నేత ఒకరు అన్నారు. భారత్‌తో బంధంపై.. తారిఖ్ తల్లి, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కాలంలో భారత్, బంగ్లాదేశ్ సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండేవి. ఈ నేపథ్యంలో త్వరలో ప్రధాని హోదాలో ఆయన భారత్‌లో ఎలా మెలగాలనుకుంటున్నారని మీడియా ప్రశ్నించింది. ‘‘మా దేశ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూనే భారత్‌తో విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తాం. దక్షిణాసియాలో అతిపెద్ద శక్తులైన భారత్, చైనా, పాకిస్తాన్లతో సమస్థాయిలో ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగిస్తాం. వీటిల్లో ఏ ఒక్క దేశాన్ని మాకు గురువుగా పరిగణించబోం. దేశ అత్యుత్తమ ప్రయోజనాలు, దేశ ప్రజల మార్గదర్శకత్వంలోనే మా విదేశాంగ విధానం రూపుదిద్దుకోబోతోంది’’అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఢిల్లీలో తలదాచుకున్న మా దేశ మాజీ మహిళా ప్రధాని షేక్ హసీనాను తిరిగి అప్పగించడం అనేది చట్టపరమైన ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. సార్క్ పునరుజ్జీవానికి కృషి చేస్తా’’ అని అన్నారు. ప్రధాని మోదీకి ఆహ్వానం!భారత్, బంగ్లా సంబంధాల మెరుగుదల కోసం బీఎన్పీ ప్రయత్నిస్తోంది. ఇందుకు తారిఖ్ ప్రమాణస్వీకారోత్సవ సందర్భాన్ని సది్వనియోగం చేసుకోవాలని భావిస్తోంది. ప్రధానిగా తారిఖ్ ప్రమాణస్వీకారోత్సవానికి భారత ప్రధాని మోదీని ఆహ్వానించాలని బీఎన్పీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చైనా, పాకిస్తాన్ అగ్రనేతలకూ ఆహ్వానాలు పంపాలని పార్టీ ఉన్నత వర్గాలు యోచిస్తున్నాయి. షేక్ హసీనా కాలంలో భారత్–బంగ్లాదేశ్ బంధం బలంగా ఉండేది. ఆ బంధం చిరకాలం పటిష్టంగా కొనసాగాలంటే తారిఖ్ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని మోదీ హాజరు కావడమే ఉత్తమమనే మాటా వినవస్తోంది. -
బంగ్లాకు కాబోయే ప్రధాని: ప్రజలకు ఇచ్చిన తొలి పిలుపు ఇదే..!
ఢాకా: గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్‌లో అరాచకమే చూస్తూ వస్తున్నాం. బంగ్లా అంతటా విధ్వంస చాయలే కనిపించాయి. షేక్ హసీనా బంగ్లా ప్రధానిగా వైదొలిగిన క్రమం నుంచి మహ్మద్ యూనస్ తాత్కాలిక బాధ్యతల్లో ప్రభుత్వం నడిచిన తీరును గమనిస్తే ఆ దేశంలో ఐక్యతా చాయలు సన్నగిల్లడమే కనబడింది. మన రెండు రోజుల్లో బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న బీఎన్పీ అధినేత తారిఖ్ రెహ్మాన్.. పార్టీ అతిపెద్ద విజయం సాధించిన తర్వాత దేశ ప్రజలకు ఐక్యతా పిలుపే ఆయన తొలి పిలుపు అయ్యింది.బంగ్లాదేశ్‌లోని పరిస్థితులను గత కొంతకాలం నుంచి నిశితంగా గమినిస్తున్న తారిఖ్ రెహ్మాన్.. ఐక్యతకు పిలుపునిచ్చారు. దేశంలొ ప్రజాస్వామ్యం నెలకొనడానికి త్యాగం చేసిన వారికి ఈ విజయం అంకితం ఇస్తున్నట్లు రెహ్మాన్ ప్రకటించారు. “మీ స్వచ్ఛంద భాగస్వామ్యంతో, దాదాపు పదిన్నర సంవత్సరాల తర్వాత, ప్రజలకు నేరుగా ఓటు ద్వారా బాధ్యత వహించే పార్లమెంట్, ప్రభుత్వం దేశంలో తిరిగి స్థాపించబడుతున్నాయి,” అని రహ్మాన్ అన్నారు. ఆయన ప్రజలను ఐక్యంగా నిలబడమని కోరుతూ, ఏ దుష్ట శక్తి దేశంలో మళ్లీ నియంతృత్వాన్ని స్థాపించకుండా, దేశం బానిస రాష్ట్రంగా మారకుండా చూసుకోవాలి’ అని పిలుపునిచ్చారు.ఇదీ చదవండి:తారిఖ్ రహ్మాన్ రాక..భారత్‌కు బంగ్లాకు టెన్షన్! -
తారిఖ్ రహ్మాన్ రాక.. భారత్‌కు బంగ్లా టెన్షన్!
తారిఖ్ రహ్మాన్.. బంగ్లా ప్రధాని కాబోతున్న నాయకుడు. ‘డార్క్ ప్రిన్స్’గా ఇంటాబయటా అప్రతిష్టపాలైన నేపథ్యం నుంచి ప్రధాని పీఠాన్ని అందిపుచ్చుకునే దాకా 60 ఏళ్ల రహ్మాన్ ప్రస్థానం బంగ్లాదేశ్ సరికొత్త రాజకీయానికి నాంది పలికింది. ఆయనపై లెక్కకు మించి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక కేసులో రహ్మాన్ అరెస్టయ్యారు. అమెరికా కూడా రహ్మాన్‌ను ‘డార్క్ ప్రిన్స్’గా అభివర్ణించింది. బెయిల్‌పై విడుదలైన అనంతరం వైద్యచికిత్స పేరుతో 2008లో లండన్ వెళ్లారు. నాటి నుంచీ కుటుంబంతో పాటు అక్కడే ప్రవాసంలో గడుపుతూ వచ్చారు. లండన్ నుంచే పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించారు.గతేడాది డిసెంబరులో తల్లి ఖాలిదా జియా అనారోగ్యానికి గురి కావడంతో 17 ఏళ్ల తర్వాత మళ్లీ సొంతగడ్డపై అడుగుపెట్టారు. తల్లి మరణానంతరం పార్టీ పగ్గాలు అందుకున్నారు. నిరసనలు, హింసాత్మక ఘటనలతో అస్థిరంగా మారిన దేశంలో మళ్లీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తీసుకొచ్చే దిశగా విస్తృత ప్రచారం చేపట్టారు. ‘బంగ్లా ఫస్ట్’ నినాదంతో యువతను ఆకర్షించారు. కట్ చేస్తే 2026 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మరి ఆయన గెలుపు భారత్‌కు లాభమేనా? రహ్మాన్ రాక మనకు ఏ మేరకు ఉపయోగపడనుంది?బంగ్లాదేశ్ ఎన్నికలను భారత్ ముందు నుంచీ నిశితంగా గమనించింది. ఇదే సమయంలో భారత్ ప్రయోజనాలను గౌరవిస్తామని స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను ‘రీసెట్’ కోరుకుంటున్నానని, అయితే, అది రెండు దేశాల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. అలాగే, ఉగ్రవాదంపై భారత్ పోరుకు సహకరిస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. తీస్థా నదీజలాల విషయంలో నెలకొన్న వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటామని చెప్పారు. హిందూ మైనార్టీలకు రక్షణ కల్పిస్తామని ఎన్నికల ముందు ఆయన హామీ ఇచ్చారు. భారత్, బంగ్లా సంబంధాలు మెరుగుపడే దిశగా ఇవన్నీ సానుకూల సంకేతాలేనని భావిస్తున్నారు. దీనికితోడు 2001–06 మధ్య బీఎన్పీతో అధికారాన్ని పంచుకున్న రాడికల్ పార్టీ జమాతే ఇస్లామీని ఈసారి రహ్మాన్ దూరం పెట్టారు. ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధించారు. ఇది కూడా భారత్‌కు కలిసొచ్చే అంశమే. ఆయన పగ్గాలు చేపట్టాక ఇరుదేశాల నడుమ వాణిజ్యంతో పాటు అన్ని రంగాల్లోనూ సంబంధాలు మెరుగవుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇరు దేశాల వాణిజ్యం ఇలా.. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఏటా 14 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతోంది. అయితే, ఇందులో దాదాపు 10 బిలియన్ డాలర్ల వరకు మనకు వాణిజ్య మిగులే ఉంటోంది. మన దేశం నుంచి బంగ్లాదేశ్ టీ, కాఫీ, ఆటో విడిభాగాలు, విద్యుత్, ఉక్కు, స్టీల్, ప్లాస్టిక్, పత్తి వంటివి దిగుమతి చేసుకుంటోంది. బంగ్లా పత్తి దిగుమతుల్లో 80శాతం మన దేశం నుంచే వెళ్తోంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. కాబట్టి దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భారత్‌తో రహ్మాన్ దౌత్య సంబంధాలు నెరిపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సరిహద్దు భద్రత.. అయితే, సరిహద్దు నియంత్రణ విషయంలో రహ్మాన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై భారత్ దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, పశ్చిమబెంగాల్, అస్సాంలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో అక్రమ వలసదారుల అంశమే ఎన్నికల్లో కీలకంగా మారింది. భారత్, బంగ్లాదేశ్ 4,100 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్నాయి. 2024 జూన్ తర్వాత నుంచి దాదాపు 1000కి పైగా చొరబాటు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు చొరబాట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో తెలియాల్సి ఉంది.తీస్తా నది జలాల సమస్య.. తీస్తా నది సిక్కిం నుంచి ఉద్భవించి పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహించి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. మొత్తం పొడవు సుమారు 414 కిలోమీటర్లు. ఉత్తర బంగ్లాదేశ్‌లో వ్యవసాయం, సాగు నీటి అవసరాలకు ఇది కీలకంగా ఉంది. అయితే, తీస్తా నదీ జలాలను భారత్ ఎక్కువగా వినియోగిస్తోందని బంగ్లా ఆరోపిస్తోంది. బంగ్లాదేశ్‌కి తక్కువ వాటా రావడం వల్ల అక్కడి రైతులు, పంటలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని చెబుతోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఎక్కువ వాటా కోరుతోంది. కానీ, భారత్ (ప్రత్యేకంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం) దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.ఒప్పందం ఇలా.. 2011లో తీస్తా జలాలపై ఒప్పందం కుదరబోతుందని భావించారు. కానీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వ్యతిరేకించింది. అప్పటి నుంచి ఒప్పందం నిలిచిపోయింది. 2025లో నాటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ పర్యటన సందర్బంగా ఈ అంశం మళ్లీ చర్చకు వచ్చింది. భారత్ టెక్నికల్ టీమ్‌ను పంపి నది నిర్వహణపై చర్చిస్తామని తెలిపింది. కానీ, తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో చర్చలు జరగలేదు. మరోవైపు.. తాత్కాలిక యూనస్ ప్రభుత్వం ఇలా పద్మానదిపై ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో పద్మానది ప్రాజెక్ట్‌పై రెహ్మాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కీలకంగా మారనుంది.భారత్ ముందున్న సవాళ్లు.. తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం బంగ్లాదేశ్‌లో అధికారంలోకి రావడం భారత్‌కి కొత్త అవకాశాలు, అలాగే కొన్ని సవాళ్లను తెస్తోంది. రెహ్మాన్ ప్రభుత్వం కనుక చైనాతో సంబంధాలను బలోపేతం చేసుకుంటే భారత్ మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు. కాబట్టి కొత్త ప్రభుత్వంతో భారత్ వెంటనే ఉన్నత స్థాయి చర్చలు ప్రారంభించడం మంచిదని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, భారత్ విషయంలో చైనా ఎప్పుడూ కయ్యానికి దిగే తరహాలోనే వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో బంగ్లా ప్రభుత్వంతో చైనా వ్యూహరచన చేస్తుందోననే టెన్షన్ కూడా భారత్‌కు ఉన్నట్టు సమాచారం. -
‘డార్క్ ప్రిన్స్’ నుంచి... ప్రధాని పీఠం దాకా!
తారిఖ్ రహ్మాన్. 19 ఏళ్ల ప్రవాసం వీడి తిరిగొచ్చిన నెలన్నర వ్యవధిలోనే బంగ్లా ప్రధాని కాబోతున్న నాయకుడు. ‘డార్క్ ప్రిన్స్’గా ఇంటాబయటా అప్రతిష్టపాలైన నేపథ్యం నుంచి ప్రధాని పీఠాన్ని అందిపుచ్చుకునే దాకా 60 ఏళ్ల రహ్మాన్ది నిజంగా ఆసక్తికర ప్రస్థానమే. ఆయన తండ్రి దివంగత ముజిబుర్ రహ్మాన్ దేశాధ్యక్షునిగా పని చేశారు. ఇక తల్లి బేగం ఖలీదా జియా ప్రధానిగా కొనసాగారు. 2001 నుంచి 2006 మధ్య ఆమె హయాంలో రహ్మాన్ రెండో అధికార కేంద్రంగా మారారన్న చెడ్డపేరు మూటగట్టుకున్నారు. పాలనతో సహా అన్ని వ్యవహారాలనూ తన కనుసన్నల్లో శాసించారంటారు. దాంతో విపక్షాలు, సొంత పార్టీలోని అసమ్మతివాదులే గాక అమెరికా కూడా రహ్మాన్‌ను ‘డార్క్ ప్రిన్స్’గా అభివర్ణించాయి. అంతేగాక ఆ సమయంలో ఆయనపై లెక్కకు మించి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన అవామీ లీగ్ సారథి షేక్ హసీనా వాటిపై విచారణకు ఆదేశించారు. ఒక కేసులో రహ్మాన్ అరెస్టయ్యారు కూడా. బెయిల్‌పై విడుదలైన అనంతరం వైద్యచికిత్స పేరుతో 2008లో లండన్ వెళ్లారు. నాటినుంచీ కుటుంబంతో పాటు అక్కడే ప్రవాసంలో గడుపుతూ వచ్చారు. లండన్ నుంచే పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ వచ్చారు. అస్థిరతే అదనుగా... 2024 ఆగస్టులో విద్యార్థి ఆందోళనల ముసుగులో చెలరేగిన దేశవ్యాప్త అల్లర్లతో నాటి ప్రధాని హసీనా గద్దె దిగాల్సి వచ్చింది. అంతేగాక రాత్రికి రాత్రే ఆమె దేశం వీడి భారత్ చేరుకున్నారు. అనంతరం బంగ్లాలో అల్లకల్లోలం, అస్థిరత నెలకొన్నాయి. ఎటుచూసినా హింసాకాండ పెచ్చరిల్లింది. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనుస్ సారథ్యంలో ఏర్పడ్డ మధ్యంతర సర్కారు వాటికి అడ్డుకట్ట వేయడంలో పూర్తి విఫలమైంది. పరిస్థితులు పెనం నుంచి పొయ్యిలోకి జారి రాజకీయ శూన్యం నెలకొన్న తరుణంలో గత డిసెంబర్ 25న రహ్మాన్ ప్రవాసం వీడి సొంతగడ్డపై అడుగుపెట్టారు. బీఎన్పీ కార్యకర్తలతో పాటు అభిమానులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. తల్లి వయోభారం, అనారోగ్యం నేపథ్యంలో పార్టీని అన్నీ తానై నడిపించారు. జియా మరణానంతరం పార్టీ పగ్గాలు చేపట్టి ఎన్నికల రంగంలోకి దూకారు. బంగ్లా ఫస్ట్ నినాదంతో యువతతో పాటు వృద్ధులనూ ఆకట్టుకున్నారు. బీఎన్పీకి మూడింట రెండొంతుల మెజారిటీ సాధించి పెట్టి దేశంలోకి అడుగు పెట్టిన నెలన్నర లోపే ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టనున్నారు! అయితే కోరలు చాస్తున్న మత వైషమ్యాలకు అడ్డుకట్ట వేయడం, ముఖ్యంగా అరాచక శక్తులకు ముకుతాడు వేయడం, దేశాన్ని ప్రగతి వైపు నడపడం ఆయనకు కఠిన పరీక్షే కానుంది. రహ్మాన్ భార్య డాక్టర్ జుబైదా బంగ్లా నేవీ మాజీ చీఫ్ కూతురు. వారికి కూతురు జైమా జర్నాజ్ ఉన్నారు. భారత్ పట్ల సానుకూలతే! షేక్ హసీనా పూర్తిగా భారత అనుకూల నేతగా పేరుపడగా ఖలీదా జియాది మాత్రం పూర్తిగా భిన్న వైఖరి. భారత్‌తో ఆమె ఎప్పుడూ అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో జియా కుమారునిగా రహ్మాన్ తీరు ఎలా ఉంటుందోనని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా హసీనా పదవీచ్యుతి అనంతరం గత ఏడాదిన్నరగా బంగ్లాలో భారత వ్యతిరేకత భావజాలం పరాకాష్టకు చేరింది. దానికి యూనుస్ సర్కారుకూడా పరక్షంగా దన్నుగా నిలిచింది. వీలు దొరికినప్పుడల్లా భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేయడమే గాక క్రమంగా మన దాయాది పాకిస్తాన్‌కు దగ్గరవుతూ వచ్చింది. ఇదే అదనుగా బంగ్లాలో మతోన్మాద మూకలు కొన్నాళ్లుగా రెచ్చిపోతున్నాయి. మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై దమనకాండకు దిగుతున్నాయి. ఆ క్రమంలో హిందువుల హత్యలతో బంగ్లా అట్టుడుకుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లాలో అడుగుపెట్టిన రహ్మాన్, తనది మాత్రం భారత వైఖరి అనుకూల వైఖరేనని ఆదినుంచీ స్పష్టమైన సంకేతాలిస్తూ వచ్చారు. ఉగ్రవాదంపై భారత్ పోరుకు సహకరిస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. తీస్థా నదీజలాల విషయంలో నెలకొన్న వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటామని చెప్పారు. భారత్, బంగ్లా సంబంధాలు మెరుగుపడే దిశగా ఇవన్నీ సానుకూల సంకేతాలేనని భావిస్తున్నారు. దీనికితోడు 2001–06 మధ్య బీఎన్పీతో అధికారాన్ని పంచుకున్న రాడికల్ పార్టీ జమాతే ఇస్లామీని ఈసారి రహ్మాన్ దూరం పెట్టారు. ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధించారు. ఇది కూడా భారత్‌కు కలిసొచ్చే అంశమే. ఆయన పగ్గాలు చేపట్టాక ఇరుదేశాల నడుమ వాణిజ్యంతో పాటు అన్ని రంగాల్లోనూ సంబంధాలు మెరుగవుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. -
బంగ్లా బీఎన్‌పీదే
ఢాకా: బంగ్లాదేశ్ సాధారణ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) దుమ్మురేపింది. శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో ఏకంగా మూడింట రెండొంతులకు పైగా మెజారిటీతో ఘనవిజయం సాధించింది. మొత్తం 300 స్థానాలకు గాను 297 చోట్ల ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. వాటిలో బీఎన్పీ 209 సీట్లు గెలుచుకుంది! కరడుగట్టిన భారత వ్యతిరేకిగా, పాక్ తాబేదారుగా ముద్రపడ్డ జమాతే ఇస్లామీ పార్టీ 68 సీట్లకు పరిమితమైంది. దానితో జట్టుకట్టిన 10 ఇతర పారీ్టలు దాదాపుగా మట్టికరిచాయి. 2024 ఆందోళనల అనంతరం విద్యార్థుల ఆధ్వర్యంలో పుట్టుకొచ్చిన జమాతే సంకీర్ణ భాగస్వామి నేషనల్ సిటిజన్ పార్టీ కేవలం 6 స్థానాల్లో నెగ్గగా 7 చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు. ప్రధాన ప్రతిపక్షమైన షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడం తెలిసిందే. రెండు పార్లమెంటు స్థానాల్లో ఫలితాల వెల్లడిపై హైకోర్టు నిషేధం విధించగా అభ్యర్థి మృతి కారణంగా ఒక స్థానంలో ఎన్నిక వాయిదా పడింది. ఓట్ల లెక్కింపులో భారీ అక్రమాలు జరిగినట్టు జమాతే ఆరోపించింది. ఫలితాలను బీఎన్పీకి అనుకూలంగా మార్చేందుకు వాటి వెల్లడిని ఈసీ ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేసిందని మండిపడింది. 20 ఏళ్ల తర్వాత అధికారం ఎన్నికల్లో ఘనవిజయం నేపథ్యంలో బీఎన్పీ చైర్మన్ తారిఖ్ రహ్మాన్ (60) తొలిసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఆదివారం ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. బీఎన్పీ ఏకంగా 20 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం అధికార పగ్గాలు చేపట్టనుండటం విశేషం. ఎన్నికల విజయంపై రహ్మాన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ఫలితాలపై స్పందించిన తొలి దేశాధినేత ఆయనే కావడం విశేషం. ఇందుకు మోదీకి బీఎన్పీ కృతజ్ఞతలు తెలిపింది. బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియావుర్ రహ్మాన్, మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడైన రహ్మాన్ 19 ఏళ్ల ప్రవాసం నుంచి ఇటీవలే బంగ్లాకు తిరిగి రావడం విశేషం. షేక్ హసీనా సర్కారును కుప్పకూల్చిన దేశవ్యాప్త ఆందోళనల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ఏడాదిన్నరకు పైగా కొనసాగుతున్న కల్లోలం బీఎన్పీ విజయంతో సద్దుమణిగి రాజకీయ స్థిరత్వం నెలకొంటుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా గురువారం జరిగిన ఎన్నికల్లో 59.44 శాతం పోలింగ్ నమోదైంది. బంగ్లాలో ఇవి 13వ సాధారణ ఎన్నికలు. విద్యార్థుల ముసుగులో 2024 ఆగస్టులో పెచ్చరిల్లిన ఆందోళనలు హసీనా 15 ఏళ్ల పాలనకు తెరదించడం, ఆమె ఉన్నపళంగా దేశం వీడి భారత్‌లో ఆశ్రయం పొందుతుండటం తెలిసిందే. నాటినుంచీ ఒకరకంగా బంగ్లాలో రాజకీయ శూన్యమే నెలకొంది. దేశ పాలన వ్యవహారాలను ఏడాదిన్నరకు పైగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనుస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వమే చూస్తూ వస్తోంది. అయితే దేశంలో అస్థిరతకు చెక్ పెట్టడంలో, ముఖ్యంగా హిందువులు తదితర మైనారిటీలపై దేశవ్యాప్తంగా పెచ్చరిల్లుతున్న దాడులను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైందన్న చెడ్డపేరు మూటగట్టుకుంది. సంస్కరణలకు ‘జై’బంగ్లాదేశ్‌లో భారీ ప్రజాస్వామిక సంస్కరణలకు ప్రజలు జైకొట్టారు. ఇందుకోసం సాధారణ ఎన్నికలతో పాటుగా నిర్వహించిన రెఫరెండానికి అనుకూలంగా తీరి్పచ్చారు. రెఫరెండంలో భాగంగా ప్రతిపాదించిన సంస్కరణల ప్యాకేజీకి మద్దతు పలికారు. రెఫరెండానికి అనుకూలంగా ఏకంగా 60.26 శాతం ఓట్లు పడ్డట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. 4.81 కోట్ల మంది ‘అవును’అని ఓటేయగా 2.26 కోట్ల మంది ‘కాదు’బటన్ నొక్కినట్టు తెలిపింది. హసీనా పదవీచ్యుతి అనంతరం తాత్కాలికంగా పాలన పగ్గాలు చేపట్టిన యూనుస్ గతేడాది ఈ సంస్కరణలను ప్రతిపాదించారు.ఏడుగురుమహిళల విజయం బంగ్లా పార్లమెంటు ఎన్నికల్లో ఏడుగురు మహిళా అభ్యర్థులు విజయం సాధించారు. వారిలో ఆరుగురు అధికార పగ్గాలు చేపట్టబోతున్న బీఎన్పీ నుంచే నెగ్గారు. మరొకరు స్వతంత్ర అభ్యరి్థగా గెలిచారు. బీఎన్పీ ఈసారి మొత్తం 10 మంది మహిళలకు టికెట్లిచ్చింది. ముగ్గురు హిందువుల విజయం! బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో ముగ్గురు హిందూ అభ్యర్థులు గెలుపొందడం విశేషం! పైగా వారంతా బీఎన్పీ టికెట్‌పై పోటీ చేసినవారే! సీనియర్ నాయకుడు జ్ఞానేశ్వర్ చంద్ర రాయ్ ఢాకా–3 నియోజకవర్గం నుంచి ఏకంగా 99,163 ఓట్లు సాధించి జమాతే ఇస్లామీ అభ్యర్థి మహ్మద్ షహీనుర్ ఇస్లాంపై విజయఢంకా మోగించారు. బీఎన్పీ ఉపాధ్యక్షుడు నితాయ్ రాయ్ చౌధురి మగురా–2 నుంచి, దీపేన్ దివాన్ రంగమతి నుంచి గెలుపొందారు. జమాతే తరఫున ఏకైక హిందూ అభ్యర్థి కృష్ణ నంది ఓటమి చవిచూశారు.దశాబ్దాల అనంతరంమహిళా సారథులు లేకుండా బంగ్లాలో దశాబ్దాల విరామం తర్వాత ప్రధాన పారీ్టలకు మహిళా సారథులు లేకుండా జరిగిన తొలి ఎన్నికలు ఇవే కావడం విశేషం. గత 30 ఏళ్లకు పైగా షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్, బేగం ఖలీదా జియా సారథ్యంలోని బీఎన్పీ ప్రధాన పారీ్టలుగా తలపడుతూ వస్తున్నాయి. జియా అనారోగ్యంతో గత డిసెంబర్లో కన్నుమూయడం తెలిసిందే. -
‘బంగ్లా’లో తారిఖ్ ప్రభుత్వం.. పాక్‌లో ఏం జరగనుంది?
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి, దేశాన్ని విడిచి వెళ్లిన తర్వాత, ఆ దేశ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరిగాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) తాత్కాలిక ఛైర్మన్ తారిఖ్ రెహ్మాన్ ఎన్నికల్లో విజయం సాధించి, తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ పరిణామం కేవలం బంగ్లాదేశ్‌లోనే కాకుండా దక్షిణాసియా రాజకీయాల్లో, ముఖ్యంగా పాకిస్తాన్‌తో ఉన్న సంబంధాలలో సరికొత్త చర్చకు దారితీసింది.బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్ రెహ్మాన్ బాధ్యతలు చేపట్టాక అది పాకిస్తాన్‌కు సానుకూల అంశంగా పరిణమించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో అవామీ లీగ్ హయాంలో షేక్ హసీనా ప్రభుత్వం భారత్‌తో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ, పాకిస్తాన్‌కు దూరం పాటిస్తూ వచ్చింది. అయితే బీఎన్పీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పాకిస్తాన్‌తో సంబంధాలు మెరుగుపడతాయని ఇస్లామాబాద్ ఆశిస్తోంది. చారిత్రక నేపథ్యం, గత అనుభవాల దృష్ట్యా తారిఖ్ రెహ్మాన్నాయకత్వం తమకు వ్యూహాత్మక ప్రయోజనాలను చేకూరుస్తుందని పాక్ అంచనా వేస్తోంది.తారిఖ్ రెహ్మాన్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు భారత్‌పై వ్యతిరేక ధోరణిని ప్రదర్శించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన హయాంలో ఈశాన్య రాష్ట్రాల్లోని వేర్పాటువాద గ్రూపులకు మద్దతు లభించిందనే మాట కూడా వినిపించింది. ఇప్పుడు ఆయన తిరిగి అధికారంలోకి వచ్చాక భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న దౌత్య, భద్రతా సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదే తరుణంలో పాకిస్తాన్ ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి.బంగ్లాదేశ్‌ను తన వైపు తిప్పుకోవడం ద్వారా భారత్‌ను దౌత్యపరంగా ఇబ్బందులకు గురిచేయవచ్చని పాక్ యోచిస్తున్నదని విశ్లేషకులు అంటున్నారు. తారిఖ్ రెహ్మాన్ ప్రధానమంత్రిగా అయ్యాక పాకిస్తాన్, చైనాల ప్రభావం బంగ్లాదేశ్‌పై పెరుగుతుందా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది భారత్‌కు వ్యూహాత్మక సవాలుగా మారే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంక్షోభం, అంతర్గత అస్థిరత నేపథ్యంలో తారిఖ్ రెహ్మాన్ ఏ దేశానికి ప్రాధాన్యత ఇస్తారు? పాకిస్థాన్‌తో ఎంతవరకు సన్నిహితంగా ఉంటారనేది వేచి చూడాల్సిందే. ఇది కూడా చదవండి: మాజీ ప్రధాని హసీనా మరణ శిక్షపై ఉత్కంఠ -
తారిఖ్ రెహ్మాన్‌కు ప్రధాని మోదీ అభినందనలు
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఏకపక్ష విజయాన్ని నమోదు చేస్తున్న నేపథ్యంలో, ఆ పార్టీ అధినేత రెహ్మాన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన మోదీ.. ఈ విజయం తారిఖ్ రెహ్మాన్ నాయకత్వంపై బంగ్లాదేశ్ ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు. పొరుగు దేశంతో ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు, ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వానికి భారత్ పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని మోదీ తన పోస్ట్‌లో స్పష్టం చేశారు. ‘ప్రగతిశీల, సమ్మిళిత బంగ్లాదేశ్‌కు భారత్ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుంది’ అని ఆయన తన సందేశంలో ఉద్ఘాటించారు. 2024లో చెలరేగిన విద్యార్థి ఉద్యమం తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం పతనమై, అనంతరం జరిగిన సాధారణ ఎన్నికలు ఇవే కావడం విశేషం. ఈ చారిత్రాత్మక మార్పు నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.బంగ్లాదేశ్‌లోని మొత్తం 299 నియోజకవర్గాలకు గాను, ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం బీఎన్పీ, దాని మిత్రపక్షాలు 177 స్థానాల్లో విజయం సాధించి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకుపోతున్నాయి. మొత్తం 237 స్థానాల లెక్కింపు పూర్తి కాగా, మిగిలిన 62 స్థానాల్లో లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఎన్నికల ద్వారా 17 ఏళ్ల ప్రవాసం తర్వాత తారిఖ్ రెహ్మాన్ తిరిగి అధికార పీఠాన్ని అధిష్టించేందుకు మార్గం సుగమమైంది. బీఎన్పీకి ప్రధాన పోటీదారుగా భావించిన జమాతే ఇస్లామీ, దాని మిత్రపక్షాలు కేవలం 53 స్థానాలకే పరిమితమయ్యాయి. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పోటీలో లేకపోవడంతో, ప్రధాన పోరు బీఎన్పీ, జమాతే ఇస్లామీ మధ్యే నెలకొంది. అయితే, బంగ్లాదేశ్ ఓటర్లు తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్పీకే పట్టం కట్టారు. I convey my warm congratulations to Mr. Tarique Rahman on leading BNP to a decisive victory in the Parliamentary elections in Bangladesh. This victory shows the trust of the people of Bangladesh in your leadership.India will continue to stand in support of a democratic,…— Narendra Modi (@narendramodi) February 13, 2026 -
Bangladesh: బీఎన్పీ క్లీన్ స్వీప్
ఢాకా: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని ఖలేదా జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) భారీ విజయం దిశగా దూసుకెళుతోంది. షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో బీఎన్పీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున వెలువడిన అనధికారిక గణాంకాల ప్రకారం 300 స్థానాలున్న పార్లమెంటులో మేజిక్ ఫిగర్ అయిన 150 మార్కును బీఎన్పీ సునాయాసంగా దాటేసింది. దాదాపు 200 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. అలాగే తారిఖ్ రెహ్మాన్ తదుపరి ప్రధానమంత్రి అవుతారని కూడా స్పష్టం చేస్తున్నాయి. బంగ్లాదేశ్ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థిగా భావించిన జమాత్-ఇ-ఇస్లామీ కేవలం 63 స్థానాలకే పరిమితమై రెండో స్థానంలో నిలిచింది. బీఎన్పీ అధినేత తారిఖ్ రెహ్మాన్ ఢాకా-17, బోగ్రా-6 నియోజకవర్గాల నుండి భారీ మెజారిటీతో విజయం సాధించి తన సత్తా చాటారు. సుదీర్ఘ కాలం పాటు ప్రవాసంలో ఉన్న ఆయన, ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చి, పార్టీని విజయపథంలో నడిపించారు. బీఎన్పీ కూటమి అధికారంలోకి వస్తే తారిఖ్ రెహ్మానే తదుపరి ప్రధానమంత్రి అవుతారని ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. 2024లో షేక్ హసీనాకు వ్యతిరేకంగా సాగిన విద్యార్థి ఉద్యమం నుండి ఉద్భవించిన నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్సీపీ) ఈ ఎన్నికల్లో తన ఉనికిని చాటుకుంది.జమాత్ కూటమితో కలిసి బరిలోకి దిగిన ఎన్సీపీ పార్టీ ఆరు నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగురవేసినట్లు ఆ పార్టీ ఎన్నికల కమిటీ ప్రతినిధి ఆసిఫ్ మహమూద్ సోషల్ మీడియాకు తెలిపారు. చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్స్లోని మూడు స్థానాలను కూడా బీఎన్పీ తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం. గత 18 నెలలుగా అధికారంలో ఉన్న మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ ఎన్నికలతో ముగియనుంది. కాగా ఎన్నికల ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోందన్న విమర్శల నేపథ్యంలో, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) ఎన్.ఎం. నాసిర్ ఉద్దీన్ స్పందించారు. ఎన్నికల ప్రక్రియలో దాచడానికి ఏమీ లేదని, పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని ఆయన తెలిపారు. మరోవైపు తమ పార్టీకి లభించిన భారీ ప్రజాదరణ నేపధ్యంలో బీఎన్పీ నేత రుహుల్ కబీర్ రిజ్వీ కీలక ప్రకటన చేశారు. పార్టీ కార్యకర్తలు విజయ సంబరాలు చేసుకుంటూ రోడ్ల మీదకు రాకుండా, శుక్రవారం జుమ్మా ప్రార్థనల అనంతరం మసీదుల్లో ప్రత్యేక కృతజ్ఞతా ప్రార్థనలు నిర్వహించాలని సూచించారు. -
17 ఏళ్ల తర్వాత ఓటరుగా..
ఢాకా/న్యూఢిల్లీ: బ్రిటన్‌లో ప్రవాసజీవితం గడుపుతున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పారీ్ట(బీఎన్పీ) తాత్కాలిక చైర్మన్, మాజీ మహిళా ప్రధాని ఖలీదా జియా తనయుడు తారిఖ్ రెహ్మాన్ పదిహేడు సంవత్సరాల తర్వాత మళ్లీ బంగ్లాదేశ్ ఓటరుగా తన పేరును నమోదుచేయించుకున్నారు. లండన్ నుంచి ఇటీవల స్వదేశానికి తిరిగొచ్చిన రెహ్మాన్ శనివారం ఓటరు జాబితాలో తన పేరును జతచేయడంతోపాటు జాతీయ గుర్తింపు(ఎన్ఐడీ) కార్డును సంపాదించినట్లు బంగ్లాదేశ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ శనివారం ఢాకాలోని ఎన్నికల సంఘం కార్యాలయానికి వచ్చిన రహ్మాన్ నుంచి అధికారులు వేలి గుర్తులు, ఐరిస్ స్కాన్ తీసుకుని ఓటర్‌గా పేరు నమోదుచేశారు. అంతకుముందే రెహ్మాన్ తన ఓటరు దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించారని ఎన్నికల కమిషన్‌లోని జాతీయ గుర్తింపు నమోదు విభాగ డైరెక్టర్ జనరల్ హుమయూన్ కబీర్ వెల్లడించారు. రెహ్మాన్‌తోపాటు ఆయన కుమార్తె జైమా సైతం ఎన్ఐడీ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2007–08 రాజకీయ సంక్షోభం తర్వాత ఫక్రుద్దీన్ అహ్మద్ సారథ్యంలోని సైనిక తాత్కాలిక ప్రభుత్వం తొలిసారిగా 2008లో బంగ్లాదేశ్‌లో ఫొటో, బయోమెట్రిక్ డేటాతో ఓటర్ జాబితాను తయారుచేయడం తెల్సిందే. ఆ కాలంలో రాజకీయ ఖైదీగా ఉన్న రెహ్మాన్‌ను జైలు నుంచి విడుదలచేయగానే ఆయన 2008 సెపె్టంబర్ 11వ తేదీన లండన్‌కు వెళ్లిపోయారు. దీంతో ఆయన పేరు ఓట్ల జాబితాలో నమోదుకాలేదు. ఆ తర్వాత వైరి వర్గానికి చెందిన షేక్ హసీనా పార్టీ అధికారంలోకి రావడంతో రెహ్మాన్ ఇంకెప్పుడూ స్వదేశానికి రాలేదు. -
సురక్షిత బంగ్లా
ఢాకా: ‘బంగ్లాదేశ్ ను సురక్షిత దేశంగా మార్చుకుందాం. స్వేచ్ఛాయుత, ప్రగతికాముక ప్రజాస్వామిక దేశంగా తీర్చిదిద్దుదాం‘ అని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎంపీ) తాత్కాలిక చైర్మన్ తారిఖ్ రెహ్మాన్ పిలుపునిచ్చారు. ఇందుకోసం దేశవాసులంతా కలసికట్టుగా ముందుకు రావాలన్నారు. ముఖ్యంగా యువత దేశ పునరి్నర్మాణంలో కీలక పాత్ర పోషించాల్సి ఉందన్నారు. దేశ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా కుమారుడైన తారిఖ్ 17 ఏళ్ల లండన్ ప్రవాసం నుంచి గురువారం తిరిగొచ్చారు. విమానాశ్రయం నుంచి నేరుగా తన రాక కోసం భారీగా గుమిగూడిన మద్దతుదారులు, అభిమానులు, పార్టీ కార్యకర్తల వద్దకు వెళ్లారు. వారినుద్దేశించి భావోద్వేగంతో ప్రసంగించారు. ‘పార్టీలు, మతాల విభేదాలకు అతీతంగా దేశ వికాసానికి పనిచేద్దాం. బంగ్లాదేశ్ ముస్లింలతో పాటు హిందువులు, సిక్కులు, క్రైస్తవులు అందరిదీ. మత విద్వేషానికి మన దేశంలో చోటు లేదు. కులమతాలు, వర్గాలకు అతీతంగా ప్రజలంతా హాయిగా జీవించే సురక్షిత బంగ్లాయే మన లక్ష్యం. ఇందుకోసం నా దగ్గర ప్రణాళిక ఉంది‘ అంటూ అమెరికా హక్కుల ఉద్యమ నేత మార్టిన్ లూథర్ కింగ్ నినాదాన్ని తలపించే వ్యాఖ్యలు చేశారు. దాని అమలుకు మీ అందరి మద్దతు కావాలి‘ అన్నారు. -
బంగ్లా డార్క్ ప్రిన్స్... పునరాగమనం
నానాటికీ పతనావస్థకు చేరుతున్న కల్లో ల బంగ్లాదేశ్ లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో ప్రధాని అభ్యరి్థగా అంతా భావిస్తున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎనీ్ప) తాత్కాలిక చైర్మన్, మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ 17 ఏళ్ల స్వీయ దేశ బహిష్కరణకు ముగింపు పలికారు. లండన్ నుంచి గురువారం స్వదేశానికి తిరిగొచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు బీఎన్పీ శ్రేణులు కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలికాయి. విమానాశ్రయానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు లక్షలాదిగా పోటెత్తారు. తారిఖ్, తారిఖ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. తల్లి హయాంలో రాజ్యాంగేతర శక్తిగా అపరిమిత అధికారాలు చెలాయించిన తారిఖ్ డార్క్ ప్రిన్స్ గా చెడ్డపేరు మూటగట్టుకున్నారు. తల్లి మాది రిగానే ఆయనకు కూడా భారత వ్యతిరేకిగా పేరుంది. ఈ నేపథ్యంలో పొరుగు దేశం బంగ్లాలో చోటుచేసుకున్న ఈ కీలక రాజకీయ పరి ణామాన్ని కేంద్రం నిశితంగా గమనిస్తోంది. বাংলাদেশের উদ্দেশ্যে রওনা দিতে লন্ডনের হিথ্রো বিমানবন্দরে তারেক রহমান, জুবাইদা রহমান এবং জাইমা রহমান।#BNP #TariqueRahman #Bangladesh pic.twitter.com/E4hBYlBdJV— Masud Rana (@MasudRana137969) December 24, 2025కాబోయే ప్రధాని! తారిఖ్ రెహా్మన్ (60). బంగ్లా అంతటా గత 17 ఏళ్లుగా ఆయన ఫోటోలు, పోస్టర్లు మాత్రమే కనిపిస్తూ వచ్చాయి. బీఎన్పీ ర్యాలీల్లో ఆయన వీడియో సందేశాలే మాట్లాడుతూ వచ్చాయి. అవినీతి కేసులు తదితర కారణాలతో 2008 నుంచీ భార్య జుబైదా, కూతురు జైమాతో పాటు తారిఖ్ లండన్ లో తలదాచుకోవడమే ఇందుకు కారణం. గురువారం భార్య, కూతురితో కలిసి ఢాకా చేరుకున్నాక, ‘6,314 సుదీర్ఘ రోజుల అనంతరం సొంత గడ్డపై అడుగుపెట్టా. నా బంగ్లా వాసులారా! ఇకనుంచీ మీ అందరితో నేరుగానే మాట్లాడతా‘ అంటూ సోషల్ మీడియాలో తారిఖ్ పెట్టిన పోస్టు దేశమంతటా వైరల్ అయింది. ఆయన తల్లి 80 ఏళ్ల ఖలీదా సుదీర్ఘ కాలంగా ఆస్పత్రిలో ఉండటంతో బీఎన్పీ పగ్గాలను తారిఖ్ పూర్తిస్థాయిలో చేపట్టడం లాంఛనమే కానుంది. బంగ్లాలో శక్తిమంతమైన నేతగా వెలుగొందిన షేక్ హసీనా గతేడాది చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో ప్రధాని పదవితో పాటు దేశాన్ని కూడా వీడి భారత్ లో తలదాచుకుంటున్నారు. ఆమె అవామీ లీగ్ పార్టీపైనా ఇప్పటికే అనర్హత వేటు పడింది. ప్రభుత్వ తాత్కాలిక సారథి, నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ కు కూడా మంచినోరే ఉన్నా ఏడాదికి పైగా అసమర్థ పాలనతో చెడ్డపేరు తెచ్చుకున్నారు. దాంతో ప్రకటించిన మేరకే వచ్చే ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికలు జరిగితే తారిఖ్ ప్రధాని పగ్గాలు చేపట్టడం దాదాపుగా ఖాయమేనంటున్నారు. జమాతేకు ముకుతాడు! భారత వ్యతిరేకే అయినా, తారిఖ్ రాక మనకు ఊరటనిచ్చే పరిణామమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బంగ్లాలో ప్రస్తుతం.నెలకొని ఉన్న తీవ్ర రాజకీయ అస్థిరతే ఇందుకు కారణం. ఏ పార్టీలోనూ పెద్దగా జనాదరణ ఉన్న నాయకుడు లేకపోవడంతో ప్రజల్లోని ఆగ్రహావేశాలను మతోన్మాద శక్తులు సొమ్ము చేసుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఐఎస్ఐ జేబు సంస్థ అయిన జమాతే ఇస్లామీ నానాటికీ కోరలు చాస్తోంది. హసీనా హయాంలో పడ్డ నిషేధాన్ని వదిలించుకుని యువత, ముఖ్యంగా విద్యార్థులను ఆకర్షిస్తోంది. రాజకీయ శక్తిగా బలపడుతోంది. ఇటీవలి ఢాకా వర్సిటీ ఎన్నికల్లో జమాతే విద్యార్థి విభాగమే ఘనవిజయం సాధించింది. ఇతర చోటామోటా పక్షాలతో కలిసి ఏకంగా అధికార పీఠంపైనే జమాతే ఇప్పుడు కన్నేసింది. ఈ పరిస్థితుల్లో దానితో పోలిస్తే ఉదారవాది అయిన తారిఖ్ రాక భారత్ కు ఊరటనిచ్చే పరిణామమే. పైగా భారత్ తో సత్సంబంధాలు కోరు కుంటున్నామన్న బీఎన్పీ ప్రకటనను విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. జమాతే వంటి మతోన్మాద శక్తికి ముకుతాడు పడటం మన జాతీయ ప్రయోజనాల రీత్యా చాలా ముఖ్యమని చెబు తున్నారు. తారిఖ్ పై ఉన్న అవినీతి, హసీనా హత్యాయత్నం తదితర కేసులన్నింటినీ కోర్టులు ఇటీవలే కొట్టేశాయి. దాంతో ఆయన ఎన్నికల పోటీకి మార్గం సుగమమైంది. – సాక్షి, నేషనల్ డెస్క్


