breaking news
New Year 2026
-
మై సౌత్ దివా 9వ ఎడిషన్ క్యాలెండర్ లాంచ్ లో మెరిసిన అందాల భామలు (ఫొటోలు)
-
ఇంకా ఆ దేశం 2018లోనే ఉంది.. ఎందుకలా!
ప్రపంచ దేశాలన్నీ జనవరి ఒకటిన 2026 కొత్త ఏడాదికి స్వాగతం పలికితే ఒక దేశం మాత్రం ఇంకా 2018 సంవత్సరంలోనే కొనసాగుతోంది! అదే ఆఫ్రికా దేశమైన ఇథియోపియా. ఒక దేశం ఇంకా భూతకాలంలోనే ఉండటమేంటని ఆశ్చర్యపోతున్నారా? ప్రపంచవ్యాప్తంగా గ్రెగేరియన్ కేలండర్ విస్తృతంగా వాడకంలో ఉండగా ఇథియోపియా మాత్రం శతాబ్దాల నాటి సౌర కేలండర్ ‘గీజ్’ను అనుసరిస్తుండటమే ఈ మిస్టరీకి కారణం.ప్రాచీన ఈజిప్టు కాప్టిక్ కేలండర్ ఆధారంగా ఇథియోపియా కేలండర్ (Ethiopia Calendar) అయిన గీజ్ రూపొందింది. గ్రెగేరియన్ కేలండర్‌తో పోలిస్తే గీజ్ కేలండర్ 7–8 ఏళ్లు వెనుకబడి ఉంటుంది. ఏసుక్రీస్తు జన్మ సంవత్సర లెక్కల్లో తేడాల వల్ల ఈ అంతరం ఏర్పడింది. గ్రెగేరియన్ కేలండర్‌ను యూరొప్ 1582లో వాడుకలోకి తెచ్చుకొనేటప్పుడు దియోనిసియస్ ఎక్సిగస్ అనే సాధువు ఏసుక్రీస్తు పుట్టుక గురించి వేసిన లెక్కలపై ఆధారపడింది. ఈ లెక్కల ప్రకారం అది తొలి సంవత్సరం అయింది. కానీ అదే సమయంలో ఇథియోపియా, ఈజిప్టులోని చర్చీలు మాత్రం అలెగ్జాండ్రియన్ క్రైస్తవ లెక్కలను అనుసరించాయి.వాటి ప్రకారం క్రీస్తు పుట్టుక కొన్నేళ్ల తర్వాత జరిగింది. అందుకే ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇథియోపియా ఇంకా 2018లోనే కొనసాగుతోంది. పైగా గీజ్ కేలండర్లో 12కు బదులు 13 నెలలు ఉంటాయి. 30 రోజుల చొప్పున 12 నెలలతోపాటు 13వ నెలలో ఐదు రోజులు (లీప్ ఇయర్లో ఆరు రోజులు) ఉంటాయి. పైగా ఇథియోపియా నూతన సంవత్సరం (New Year) మిగతా దేశాల్లోలాగా జనవరితో ప్రారంభం కాదు.. అది సెపె్టంబర్ నెలతో మొదలవుతుంది. ఈ లెక్కన మనకు 2025 సెప్టెంబర్ నాటికి ఇథియోపియా 2018 సెపె్టంబర్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిందన్నమాట. – సాక్షి, సెంట్రల్ డెస్క్చదవండి: బంగారం పేపర్లతో భగవద్గీత! -
కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఏడాదంతా అన్లిమిటెడ్ కాల్స్
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) కూడా అదే బాటలో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఉప్పుడు తాజాగా 365 రోజుల ప్లాన్ ప్రకటించింది.బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన 365 రోజుల ప్లాన్ కోసం.. యూజర్లు 2799 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. న్యూ ఇయర్ సందర్భంగా కంపెనీ ఈ లేటెస్ట్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇతర టెలికామ్ కంపెనీల వార్షిక ప్లాన్లతో పోలిస్తే.. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్లాన్ చాలా తక్కువే.బీఎస్ఎన్ఎల్ యూజర్లు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 3జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజులు 100 ఎస్ఎమ్ఎస్లను పొందవచ్చు. అంటే రూ. 2799తో రీఛార్జ్ చేసుకుంటే.. ఏడాది మొత్తం అపరిమిత కాల్స్ మాట్లాడుకోవచ్చన్నమాట.Start the New Year the smart way with #BSNL.Enjoy 365 days of worry-free connectivity at just ₹2799.Wherever the journey takes you, BSNL keeps you connected with 3GB/day data, unlimited calls, and reliable coverage all year long.Recharge smart via #BReX 👉… pic.twitter.com/T6at7LDTUU— BSNL India (@BSNLCorporate) January 4, 2026 -
కొత్త ఏడాదిని హెల్దీ న్యూ ఇయర్‌గా మార్చేద్దాం ఇలా..!
పేరుకు న్యూ ఇయరే గానీ తెల్లారిలేస్తే మళ్లీ అదే తిండి. అవే సరదాలు. అవే సినిమాలు. అందుకే దాదాపుగా అందరికీ తెలిసినవే అయినా అవే ఆరోగ్య సూత్రాల్ని మళ్లీ మళ్లీ చెబుతున్నారు. అవే జాగ్రత్తల్ని చెబుతూ హెచ్చరిస్తున్నారు. కొత్త ఏడాది వచ్చినప్పుడల్లా ఎప్పట్లాగే రెజల్యూషన్స్ తీసుకుంటూ మనం మాత్రం మళ్లీ వాటిని మరుసటి ఏడాదికి వాయిదా వేయడం లేదా? కాకపోతే ఒకసారి చెబితే కొందరైనా సీరియస్‌గా తీసుకుని ఆచరిస్తారనీ, దాంతో వాళ్లు ఆరోగ్యంగా, ఫిట్‌గా, ఆయుర్దాయం మరింతగా పెంచుకుని హెల్దీగా మారకపోతారా... కొత్త ఏడాదిని హెల్దీ న్యూ ఇయర్‌గా మార్చుకోకపోతారా అనే ఆకాంక్షతో ప్రముఖ హాస్పిటళ్లకు చెందిన పెద్ద డాక్టర్లంతా మరోమారు మనకు సుద్దులు చెబుతున్నారు. కొందరైనా ఆచరించి ఆరోగ్యాన్ని అందిపుచ్చుకుంటే... ఈ ఏడాదికి ఈ ఆరోగ్యవచనాల లక్ష్యాలూ, ప్రయోజనాలూ నెరవేరినట్టే! ఐదు ప్రముఖ హాస్పిటల్స్ నుంచి ఐదుగురు పెద్ద డాక్టర్లతో కొత్త ఏడాదిని హెల్దీగా మార్చుకునేందుకు సూచనలతో ప్రత్యేక కథనం...ఆహార పరమైన సూచనలు...వేళకు తినండి. ఆహారం తక్కువ మోతాదుల్లో తీసుకుంటూ రోజులో ఎక్కువసార్లు తినండి. దీనివల్ల జీర్ణవ్యవస్థపై భారం పడదు. దాంతో అది చాలాకాలం ఆరోగ్యంగా ఉంటుంది. రాత్రి భోజనం మితంగా ఉండాలి. ఓ ఆంగ్ల నానుడి ప్రకారం ఉదయం భోజనం రాజభోజనంలా, మధ్యానం మధ్యస్తంగా, రాత్రిభోజనం పేదవాడి భోజనంలా ఉండాలన్నది ఒక సూక్తి. తినే సమయంలో మీ బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ)ని పరిగణనలోకి తీసుకోండి. బీఎమ్ఐ అంటే ఒకరి బరువు డివైడెడ్ బై వాళ్ల ఎత్తు స్క్వేర్ అని అర్థం. అంటే ఒక వ్యక్తి బరువు 80 కిలోలు అనుకుందాం. అతడి ఎత్తు 1.8 మీటర్లు అయితే 80 డివైడెడ్ బై 1.8 స్క్వేర్. ఫలితంగా దాదాపు 24.69గా వచ్చే ఆ విలువను బీఎమ్ఐ పట్టికతో సరి΄ోల్చుకుని ఎవరికి వారు తాము ఏ స్థూలకాయం పరిధిలో ఉన్నరన్నది తెలుసుకోవచ్చు. ఒకవేళ తమ బీఎమ్ఐ ప్రకారం ఎక్కువ ఊబకాయ పరిధిలోకి వచ్చేవారు బరువు తగ్గాలనుకున్నవారు డాక్టర్ సలహా మేరకు ఎలాంటి జీవనశైలి నియమాలు పాటించాలో, బరువు తగ్గడానికి ఏయే ఆరోగ్యకరమైన పద్ధతులు అవలంబించాలో తెలుసుకోవచ్చు. ఎందుకంటే అదనపు బరువు ఉన్నవారు తమ కండరాలను (మజిల్ మాస్‌ను) కాకుండా అదనపు కొవ్వును మాత్రమే కరిగించుకునేలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. శాకాహారం తీసుకునేవారు అన్ని రకాల తాజా ఆకుకూరలూ, కాయగూరల వెరైటీలు తీసుకోవాలి. అదే మాంసాహారం తినేవారైతే రెడ్‌మీట్‌కు బదులు... ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే చేపలు తీసుకోవడం మంచిది. వాటితోపాటు తాజా పండ్లూ తీసుకోవాలి.డాక్టర్ సోనిక రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ఒత్తిడి నియంత్రణ కోసం... తీవ్రమైన ఒత్తిడితో పోలిస్తే పరిమితమైన ఒత్తిడి వల్ల పనులు సమయానికి పూర్తయ్యేలా చేయడం వల్ల కాస్తంత ప్రయోజనం ఉంటుంది. కానీ మితిమీరిన ఒత్తిడి ఆరోగ్యానికి ఎప్పటికీ హానిచేసేదే. మానసిక ఒత్తిడి పురుషుల కంటే మహిళలకే ప్రమాదకరం. ఒత్తిడి విషయానికి వస్తే పని ప్రదేశంలో ఒత్తిడి ఎదురైనప్పుడు మనం తప్ప ఇతరులైతే అంత పర్ఫెక్ట్గా చేయలేరనే భావనను వదిలిపెట్టి కొలీగ్స్‌తో పని షేర్ చేసుకుని ఓ టీమ్‌వర్క్‌లా చేసే పని ఒత్తిడిని తగ్గిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. పెంపుడు జంతువులో ఆడుకునేవారికీ, అక్వేరియమ్‌లో చేపలను చూస్తూ ఉండేవారికి, ప్రకృతిని ఆస్వాదిస్తూ నడుస్తుండేవారికి ఒత్తిడి తగ్గి, గుండెజబ్బులూ నివారితమవుతాయని అనేక అధ్యయనాల్లో తేలింది. ప్రకృతిసిద్ధమైన నీటి ప్రవాహం వంటి ధ్వనులూ... సంగీతం వంటివి ఒత్తిడిని తగ్గించే స్వాభావికమైన మందులు అనుకోవచ్చు. కోపం, విచారం వంటి ఫీలింగ్స్‌ను అణిచేయకుండా ఇతరులను ఆటంకపరచని రీతిలో వ్యక్తం చేయడమే మంచిది. మీ వల్ల ఏదైనా తప్పు జరిగితే వెంటనే ఒప్పుకోవడం మంచిది. ఈగో కారణంగా ఒప్పుకోలేక΄ోతే అది మరింత ఒత్తిడి పెంచుతుంది. ఇంకా హాని చేస్తుంది. చక్కటి హాస్యంతో కూడిన సినిమాలు చూస్తూ, ఎప్పుడూ నవ్వుతూ ఆహ్లాదంగా ఉండేవారికి రక్తపోటు, గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి జబ్బులు రావడం తక్కువ. తమ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కారణంగా ఇలాంటివారిలో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. కాబట్టి మంచి ఆరోగ్యకరమైన హాస్యానురక్తిని పెంచుకోండి.డాక్టర్ మంజుల రావు, సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్చెడు అలవాట్లకు దూరంగా...సిగరెట్, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. సిగరెట్ పొగలో కనీసం 6000 హానికరమైన వ్యర్థ పదార్థాలుంటాయి. అందులో క్యాన్సర్‌కు కారణమయ్యేవి కనీసం 60 పదార్థాలుంటాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 సెకండ్ల వ్యవధిలో ఒకరు సిగరెట్ కారణంగానే ్ర΄ాణాలు వదులుతున్నారని అంచనా. గుండెకు సంబంధించిన వ్యాధులతో చని΄ోయేవారిని పరిశీలించినప్పుడు వారిలో కనీసం 40 శాతం మంది తమ పొగతాగే అలవాటు కారణంగా తమ గుండెకు చేటు తెచ్చుకున్నవారేనని చాలా అధ్యయనాల్లో తేలింది. అలాగే ఊపిరితిత్తులు, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు వచ్చినవారిలో దాదాపు 80 శాతం మంది తమ పొగతాగడం అలవాటు కారణంగా ప్రాణాంతకమైన ఆ జబ్బును తమ చేజేతులారా తెచ్చుకున్నవారే. పొగతాగే అలవాటు వల్ల రక్త΄ోటు పెరుగుతుంది. అది గుండెజబ్బులకు దారితీస్తుంది. ఇక ఈ సిగరెట్ పొగవల్ల దేహంలో పేరుకునే కార్బన్ మోనాక్సైడ్ వల్ల దేహం తనకు ఉపయోగపడే మంచి కొలెస్ట్రాల్‌ను అంతగా తీసుకోలేక΄ోవడం, ఫలితంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం జరుగుతాయి.ఇవన్నీ ఆరోగ్యానికి చేటు చేసే పరిణామాలే. పరిమితంగా రెడ్ వైన్ వంటి మద్యం తీసుకుంటే అది గుండెకు మేలు చేస్తుందనీ, రెండు పెగ్గులకు మించకుండా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదనే మాటలన్నీ కేవలం అ΄ోహ మాత్రమే. ఎంత పరిమితంగా తీసుకున్నా మద్యం చేసే చేటు మాత్రం అపరిమితం. కాలేయం మొదలుకొని, రక్తనాళాలూ, రక్తప్రసరణ వ్యవస్థ, గుండె, కిడ్నీలు... అన్నిటికంటే ముఖ్యంగా కీలకమైన మెదడు... ఇలా దేహంలోని అన్ని అవయవాలనూ, సంబంధిత వ్యవస్థలను మద్యం దెబ్బతీస్తుంది. పైన పేర్కొన్న కారణాల నేపథ్యంలో పొగతాగడం, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆ అలవాట్లు ఉన్నవారు క్రమక్రమంగా కాదు... తక్షణం వాటిని మానేయాలి. మంచి ఆరోగ్యం కోసం ఇలా మానేయడం అవసరం కూడా.డాక్టర్ పి. కిరణ్మయి, సీనియర్ ఫిజీషియన్, డయాబెటాలజీ అండ్ థైరాయిడ్ స్పెషలిస్ట్ వ్యాయామం తప్పనిసరి... ఒకేచోట కదలకుండా చాలాసేపు కుదురుగా కూర్చొని ఉండటం గానీ, ఏ పనీ చేకుండా బద్ధకంగా కాలం గడపడం గానీ దేహానికి చేటు చేస్తాయని చాలా అధ్యయనాల్లో తేలిన విషయమే. పొగతాగే అలవాటు వల్ల దేహానికీ, దేహంలోని అవయవాలూ, వాటి వ్యవస్థలకు ఎలాంటి హాని చేకూరుతుందో, శారీరక శ్రమలేకుండా ఉండటం, వ్యాయామం లేకపోవడం వల్ల కూడా అలాంటి అనర్థాలే వస్తాయంటూ అనేక అధ్యయన ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం... క్రమం తప్పకుండా చేసే వ్యాయామం వల్ల గుండె బలంగా తయారవుతుంది. దాంతో రక్తపోటు అదుపులో ఉండటం, రక్తప్రసరణ వ్యవస్థ మెరుగ్గా ఉండటంతో ప్రతి కణానికీ తగినంత ఆహారం, ఆక్సిజన్ అందడం, గుండె కొట్టుకునే లయ (రిథమ్) క్రమం తప్పకుండా కొనసాగడం, ఎముకలకు తగిన న్యూట్రిషన్ అందడం, కండరాలు బలిష్టంగా ఉండటం, వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో కొలాజెన్ తగ్గడం వల్ల చర్మం వదులవుతూ వృద్ధాప్యం తాలూకు చిహ్నాలు కనిపించడంవంటి ఏజింగ్ అనర్థాలు నివారితమై చాలాకాలం పాటు యౌవనంగా ఉండటం వంటి అనేక ప్రయోజనాలూ చేకూరతాయి. నడక లేదా ఇతరత్రా తేలికపాటి వ్యాయామాల వల్ల ఒత్తిడి తగ్గడం, నిద్రలేమి వంటివి నివారితం కావడం, ఫలితంగా మంచి గాఢమైన నిద్రపట్టడం, రోజంతా ఉల్లాసంగా చురుగ్గా ఉండటం సాధ్యమవుతుంది. వ్యాయామం చేయడం అన్నది బోరుగా అనిపిస్తే ఆరుబయట ఉల్లాసంగా ఆటలాడటం, ఈదడం, ఫ్రెండ్స్‌తో ముచ్చట్లు చెప్పుకుండా నడవడం వంటి ప్రక్రియల ద్వారా దేహానికి వ్యాయామాన్ని సమకూర్చడం చాలా ఆహ్లాదకరమైన, సంతోషదాయకమైన మార్గాలు. దేహానికి ఆహారం ఎంత అవసరమయో, వ్యాయామమూ అంతే అవసరమని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అందుకే జిమ్‌లో చేరేందుకూ.. కుదరక΄ోతే కనీసం ఆటలాడేందుకైనా షూలేస్‌లు కట్టుకోవడం మొదలుపెట్టండి.డాక్టర్ ఆరతీ బెల్లారీ,సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్రిలాక్సేషన్, విశ్రాంతి, నిద్ర విషయంలో... రోజంతా పని చేస్తూనే ఉండకుండా, మధ్యమధ్య చిన్న చిన్న విరామాలు తీసుకోవడం అవసరం.ఇలా విశ్రాంతి తీసుకోవడం వల్ల మానసిక అలసట తగ్గి, పని మీద ఏకాగ్రత, సామర్థ్యం మెరుగవుతాయి.వారంలో కనీసం ఒక రోజు పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యానికి ముఖ్యం. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌తో సమయం గడపడం మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రకృతిలో నడక, తోటలో గడపడం, పనుల్లో బాగా బిజీగా ఉండేవారు... ఒకవేళ వాళ్లు మంచి యుక్తవయసులో ఉన్న యువత అయితే ట్రెక్కింగ్ లేదా హైకింగ్ వంటివి తమ ఒత్తిడిని తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. వీళ్లంతా ఒక స్నేహబృందంగా ఏర్పడి వెళ్లడం ఒత్తిడిని తగ్గించి మంచి ప్రయోజనాన్నిస్తుంది. శరీరానికి తగినంత నిద్ర తప్పనిసరి. ఎలాంటి అంతరాయం లేని 6 నుంచి 8 గంటల రాత్రి నిద్ర అవసరం. నిద్ర అనేది శరీరంలో, మెదడులో, కండరాల్లో పునరుత్తేజం తెచ్చే సహజ ప్రక్రియ.నిద్రలోనే మన రోగనిరోధక శక్తి బలపడుతుంది. తగినంత నిద్రలేక΄ోతే ఇన్ఫెక్షన్లూ, దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు ఉంటాయని ఎన్నో అధ్యయనాలలో తేలింది. తగిన నిద్ర వలన జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యం మెరుగవుతాయి.తక్కువగా నిద్ర ΄ోయేవారిలో రక్త΄ోటు, షుగర్, ఊబకాయం, గుండె జబ్బులు, మైగ్రేన్ వంటి ఆరోగ్య సమస్యల ముప్పు పెరుగుతుందని వైద్య అధ్యయనాలు చెబుతున్నాయి.ప్రతిరోజూ రాత్రిఒకే సమయానికి పడుకోవడం (సాధారణంగా రాత్రి 9 తర్వాత), ఉదయం ఒకే సమయానికి (సాధారణంగా ఉదయం 6 గంటలకు) నిద్రలేవడం చాలా ముఖ్యం. దీనివల్ల మన శరీర గడియారం (సర్కేడియన్ రిథమ్) సరిగ్గా పనిచేస్తుంది, నిద్ర నాణ్యత మెరుగవుతుంది.చాలా తక్కువ నిద్ర (నాలుగు గంటల వ్యవధి కంటే తక్కువ నిద్రించడం) కూడా మంచిది కాదు, అలాగే అవసరానికి మించిన నిద్ర (ఎనిమిది గంటల కంటే ఎక్కువగా నిద్ర΄ోవడం) కూడా సమస్యలకు సంకేతం కావచ్చు. కొన్ని సందర్భాల్లో అధిక నిద్రకు డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో సంబంధం ఉండవచ్చు.ప్రతి వ్యక్తికి అవసరమైన నిద్ర కొంత భిన్నంగా ఉండవచ్చు. అయితే సాధారణంగా పెద్దలలో రోజుకు 7–9 గంటల నిద్ర ఆరోగ్యానికి అవసరమని నిద్ర వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మీ శరీరం సూచించే అవసరాన్ని గమనిస్తూ, క్రమబద్ధమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడమే మంచి ఆరోగ్యానికి మార్గం. డాక్టర్ ఎల్.సునందిని, సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ (చదవండి: ఆ కారణంగానే శాకాహారిగా మారా..!: నటి జెనీలియా) -
జిమ్స్ జామ్ : న్యూ ఇయర్ జోష్...కసరత్తుల కళకళ
ఎప్పటి మాదిరిగానే కొత్త ఏడాది సందర్భంగా ఆరోగ్యార్థుల తీర్మానాల ఫలితంగా నగరంలోని జిమ్ సబ్స్క్రిప్షన్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. దీంతో జిమ్ములు కసరత్తులు చేసే వారితో కళకళలాడాయి. నగరంతో పాటు దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ ఉన్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా గత యేడాదితో పోలిస్తే ఈ సంవత్సరంలో 14% జిమ్ సభ్యత్వాలు పెరిగాయని, నగరంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇక గత డిసెంబర్‌తో పోలిస్తే 20–25% పెరుగుదల కనిపించినట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ తీర్మానాలతో పాటు భారీ డిస్కౌంట్ ఆఫర్లు కూడా దీనికి కారణమని స్పష్టమవుతోంది. – సాక్షి, సిటీబ్యూరో కొత్త సంవత్సరం ఆరోగ్యార్థులతో జిమ్స్ కళకళలాడాయి. ముఖ్యంగా మధ్య వయసు్కల సందడి అధికంగా కనిపించింది. న్యూ ఇయర్ తీర్మానాల్లో భాగంగా రికార్డు స్థాయిలో కొత్త సభ్యత్వాలు నమోదుకాగా.. దీనికి న్యూ ఇయర్ డిస్కౌంట్లు, ఆఫర్లు కూడా కారణమేనని తెలుస్తోంది. అయితే ఎప్పటి మాదిరిగానే మొదటి నెలలోనో.. లేదా రెండు నెలల తర్వాతనో వదిలేస్తే.. అది ఆరంభ శూరత్వంగా మారుతుందని ట్రైనర్లు చెబుతున్నారు. ఒక్కసారిగా భారీ స్థాయిలో కసరత్తులు చేసి.. ఆ వెంటనే వదిలేయడం సరికాదని, రోజుకు కొంత సమయం అనుకుని ఆ మేరకు క్రమంగా పెంచుకుంటూ వెళితే మంచి ఫలితాలు సాధించవచ్చని ట్రైనర్లు సూచిస్తున్నారు. తీర్మానాల ఫలం.. జిమ్‌కు బలం.. సాధారణ బరువు తగ్గించే లక్ష్యాలు మొదలుకుని.. పలు రకాల వ్యాధులకు చికిత్సగా వ్యాయామాలను సూచిస్తున్నారు నిపుణులు.. దీంతో ముందస్తు నివారణే ముఖ్యమనే ఆలోచనతో అనేక మంది జిమ్స్‌లో చేరుతున్నట్లు ట్రైనర్లు చెబుతున్నారు. నిశ్చల ఆధునిక జీవనశైలి కారణంగానే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయనే అవగాహన అనేక మందిలో కలుగు తుండడంతో వాయిదా వేస్తూ వచి్చన వ్యాయామ కార్యాచరణను కొత్త ఏడాది సందర్భంగా అమలులోకి తీసుకొచ్చారు. జనవరి నెలలో యేటా ఈ పెరుగుదల ఉంటుందనేది ముందే తెలుసు కాబట్టి, పేరొందిన బ్రాండెడ్ జిమ్స్.. సభ్యత్వ రుసుములపై 30 నుంచి 50 శాతం వరకూ డిస్కౌంట్స్ ప్రకటించడం ఈ సారి మరింత ఊపుని అందించింది. ఇంట్లోనే వర్కవుట్స్.. ‘ఇంట్లోనే వ్యాయామం చేయాలని, హోమ్ జిమ్స్ ఏర్పాటు చేసుకోవాలని ఆశించే వారి సంఖ్య కూడా ఈ సారి భారీగానే పెరిగింది. ఇంట్లోనే వర్కవుట్ చేసుకునేందుకు వీలైన పరికరాలను ఎంచుకునే వారు పెరగడంతో మేము ‘గెట్ ఫిట్ డేస్’ పేరిట ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించాం’ అంటూ ఆన్లైన్ విపణి అమెజాన్ బజార్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ మేరకు డిసెంబర్ నెలాఖరులో భారీగా జిమ్ ఎక్విప్మెంట్ అమ్ముడుపోయినట్లు వివరించారు. మధ్య వయసువారే అధికం.. ఈ ఏడాది కొత్తగా జిమ్స్ సభ్యత్వాలు తీసుకున్నవారిలో మధ్య వయస్కులు అధికంగా ఉండడం విశేషం అని నగరంలోని ఓ జిమ్ నిర్వాహకులు త్రినేత్ర తెలిపారు. తాము అందుకున్న సభ్యత్వాల్లో దాదాపు 54 శాతం మిడిల్ ఏజ్డ్ వాళ్లవే కాగా 40 శాతం యువత, మిగిలిన వారు ఉన్నారని, యువతుల సంఖ్య కూడా భారీగానే పెరిగిందని ఆయన వివరించారు. డయాబెటిస్, బీపీ తదితర దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ కోసం మందులపై ఆధారపడే పరిస్థితిని తగ్గించే శక్తి వ్యాయామానికి ఉందనే అవగాహన పెరగడమే దీనికి కారణమని వ్యాయామ శిక్షకుడు విజయ్ గంధం తెలిపారు. చదవండి: కర్ణాటకలో అద్భుతం : ఇది ‘మామూలు చిరుత’ కాదుస్లో.. స్టడీ.. విన్.. అయితే సభ్యత్వ రుసుములు చెల్లించి జిమ్‌లో, ఫిట్నెస్ స్టూడియోల్లో చేరినంత సులభంగా వ్యాయామాన్ని క్రమబద్ధంగా కొనసాగించడం కష్టమని ప్రముఖ సెలబ్రిటీ ట్రైనర్ కరణ్ చెబుతున్నారు. జనవరిలో పెరిగినట్టు కనిపించిన సభ్యత్వాల సంఖ్య కేవలం ఫిబ్రవరి కల్లా 20 శాతానికి అలాగే మార్చి నెల వచ్చే సరికి 35 శాతానికి పైగా తగ్గిపోతున్నట్లు పాత గణాంకాలు వెల్లడిస్తున్నాయన్నారు. కాబట్టి త్వరిత ఫలితాల కోసం ఆధారపడకుండా, సహేతుకమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. కొత్తగా వ్యాయామం ప్రారంభించినప్పుడు వచ్చే ఒళ్లునొప్పులు, శారీరక సమస్యల విషయంలో గాభరా పడకుండా నిత్యం శిక్షకులు, వైద్యుల సూచనలను అనుసరిస్తూ ఫిట్నెస్ రొటీన్ కొనసాగించాలని, అదే విధంగా డైట్లోనూ తగిన మార్పులు, చేర్పులు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: రూ. 25 వేలకే అమ్మాయిలు : మంత్రి భర్త వ్యాఖ్యలు వీడియో వైరల్ -
హైదరాబాద్ : ఎమ్మెల్యే & ఎంపీల కాలనీలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
-
నేడు మరో నూతన సంవత్సరం.. కోలాహలానికి భిన్నంగా..
క్యాలెండర్లో పేజీలు మారడం అనేది కేవలం కాలగమన సూచిక మాత్రమే కాదు.. అది మనిషి తనను తాను పునరావిష్కరించుకునేందుకు ఏర్పడిన ఒక అద్భుత అవకాశం. దానిని గుర్తు చేసేదే ‘మహాయాన నూతన సంవత్సరం’ నేడు(జనవరి 3) ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది బౌద్ధ అనుచరులు ‘మహాయాన నూతన సంవత్సరం’ జరుపుకుంటున్నారు. ఈ రోజున వారంతా అంతర్గత మౌనం, ఆత్మపరిశీలనకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటూ, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా శాంతిని, కరుణను బోధించే మహాయాన బౌద్ధులు నూతన సంవత్సర వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 2026, జనవరి 3వ తేదీన చైనా, జపాన్, టిబెట్, కొరియా తదితర దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహాయాన బౌద్ధులు ఆధ్యాత్మిక వెలుగుల మధ్య ఈ పర్వదినాన్ని చేసుకుంటున్నారు.'మహాయాన'.. అందరికీ విముక్తి మార్గంసంస్కృతంలో ‘మహాయాన’ అంటే ‘గొప్ప వాహనం’ అని అర్థం. కేవలం కొద్దిమందికే పరిమితం కాకుండా, సమాజంలోని ప్రతి ఒక్కరికీ జ్ఞానోదయం పొందే అవకాశం ఉందని ‘మహాయాన’ సిద్ధాంతం బలంగా నమ్ముతుంది. సన్యాసులతో పాటు సామాన్య గృహస్థులు కూడా తమ దైనందిన జీవితంలోనే నిర్వాణాన్ని సాధించవచ్చని మహాయానశాఖ బోధిస్తుంది.ఆత్మపరిశీలనతో..బౌద్ధ నూతన సంవత్సరం అంటే కేవలం బాహ్య సంబరాలకు మాత్రమే పరిమితం కాదు. ఇది అంతర్గత శుద్ధికి ప్రతీక. గత ఏడాది చేసిన పొరపాట్లన్నింటినీ సమీక్షించుకుంటూ, కొత్త సంవత్సరంలో మరింత ఉత్తమమైన వ్యక్తిగా ఎదగాలని సంకల్పించడం ఈ రోజు చేయాల్సిన ముఖ్యమైన పని. తనను తాను తెలుసుకోవడమే నిజమైన విజయమని చెప్పిన బుద్ధుని బోధనలను అతని అనుచరులు ఈ సందర్భంగా స్మరించుకుంటారు.బౌద్ధ విహారాల్లో ఆధ్యాత్మిక కోలాహలంఈ పర్వదినాన బౌద్ధ విహారాలు భక్తులతో నిండిపోతాయి. దేవతామూర్తుల విగ్రహాలకు పవిత్ర జలాలతో అభిషేకం చేయడం, సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయించడం ఒక ముఖ్యమైన ఆచారంగా వస్తోంది. కొవ్వొత్తుల వెలుగులో ఆధ్యాత్మిక గీతాలను ఆలపిస్తూ, లోకంలోని అజ్ఞాన చీకట్లు తొలగిపోవాలని భక్తులు ప్రార్థిస్తారు.అదృష్టానికి చిహ్నంగా గృహాలంకరణమహాయాన నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ బౌద్ధులు తమ ఇళ్లను శుభ్రం చేసి, రంగురంగుల దీపాలతో, అలంకరణలతో ముస్తాబు చేస్తారు. ఇది ఇంటిలోని ప్రతికూల శక్తిని తొలగించి, సానుకూలతను ఆహ్వానిస్తుందని వారు నమ్ముతారు. స్నేహితులు, బంధువులు కానుకలను ఇచ్చిపుచ్చుకుంటారు. తద్వారా తమలోని ప్రేమను, ఐక్యతను చాటుకుంటారు.సంప్రదాయ విందులు ఈ పండుగలో భక్తితో పాటు వినోదం కూడా తోడవుతుంది. బౌద్ధ అనుచరులు రాత్రి వేళ కుటుంబ సభ్యులందరితో కలిసి విందు భోజనాలు ఆరగిస్తారు. అర్ధరాత్రి వేళ ఆకాశంలో బాణసంచా వెలుగులు విరజిమ్ముతుండగా, సంతోషంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు.చారిత్రక వారసత్వంక్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో లుంబినిలో సిద్ధార్థుడు జన్మించాడు. క్రీ.పూ. 528లో బోధగయలో జ్ఞానోదయం పొందిన ఆయన ‘బుద్ధుడు’గా అవతరించాడు. అశోక చక్రవర్తి హయాంలో ఆసియా ఖండమంతటా విస్తరించిన బౌద్ధ జీవన విధానం.. నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి శాంతిని అందించే మార్గదర్శిగా నిలిచింది.మతం కాదు.. జీవన విధానంప్రస్తుత ఆధునిక కాలంలో బౌద్ధాన్ని ఒక మతంగా కంటే ఒక సైకాలజీగా (మనస్తత్వ శాస్త్రం) ప్రపంచం గుర్తిస్తోంది. ఆడంబరాలకు దూరంగా, కేవలం మానసిక ప్రశాంతత, అహింస, కరుణ ప్రాతిపదికన ఈ పండుగ చేసుకుంటారు. ఏ దేశానికి ఉన్న ఆచారాల ప్రకారం వారు ఈ ఉత్సవాన్ని జరుపుకున్నా, దాని పరమార్థం మాత్రం ఒక్కటే.. అదే శాంతియుత జీవనం విధానం.శాంతి మంత్రమే రక్షప్రపంచవ్యాప్తంగా అశాంతి నెలకొన్న నేటి తరుణంలో, మహాయాన నూతన సంవత్సరం శాంతి సందేశాన్ని అందరికీ అందిస్తోంది. ‘అప్పో దీపో భవ’ (నీకు నీవే కాంతివి కావాలి) అన్న బుద్ధుడి మాటలను స్మరించుకుంటూ, ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ జ్ఞానమనే జ్యోతిని తమలో వెలిగించుకోవాలని బౌద్ధ మతం మనకు చెబుతోంది.ఇది కూడా చదవండి: తొలి గ్రీటింగ్ అలా..‘ఆర్చీస్’ సామ్రాజ్యం ఇలా.. -
ప్రపంచ నాయకుడు.. పగటి పూటే పిడుగు పడి చనిపోతారట! ఎవరంటే?
సోఫియా: బల్గేరియాకు చెందిన ప్రసిద్ధ జ్యోతిష్క రాలు బాబా వాంగా చేసిన 2026 సంవత్సరానికి సంబంధించిన జోస్యం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు, రాజకీయ కల్లోలాలు, ఆర్థిక సంక్షోభాలు, సాంకేతిక పరిణామాలు వంటి అంశాలపై ఆమె చేసిన సూచనలు ప్రజల్లో ఆసక్తి రేపుతున్నాయి.2026లో ప్రపంచ వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటాయని ఆమె పేర్కొన్నారు. తుఫానులు, వరదలు, భూకంపాలు మరింత తీవ్రంగా ఉంటాయని అంచనా. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుందని హెచ్చరించారు. కొన్ని దేశాల్లో పెద్ద రాజకీయ కల్లోలాలు సంభవిస్తాయని ఆమె ప్రవచించారు. అంతర్జాతీయ స్థాయిలో పవర్ బ్యాలెన్స్ మార్పులు చోటు చేసుకుంటాయని సూచించారు. కొత్త కూటములు ఏర్పడి, పాత కూటములు కూలిపోతాయని అంచనా.ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర క్షీణత సంభవిస్తుందని ఆమె చెప్పారు. కొన్ని దేశాల్లో కరెన్సీ విలువలు పడిపోవడం, మార్కెట్లలో అస్థిరత పెరగడం జరుగుతుందని అంచనా. 2026లో కొత్త సాంకేతిక ఆవిష్కరణలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాయని ఆమె పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు(AI), బయోటెక్నాలజీ రంగాల్లో పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయని అంచనా.బాబా వాంగా ప్రవచనాలు ఎప్పుడూ ఆసక్తి రేపుతాయి. అయితే, ఇవి శాస్త్రీయ ఆధారాలు లేని ఊహాగానాలు మాత్రమే. వాతావరణ మార్పులు, ఆర్థిక సంక్షోభాలు, రాజకీయ కల్లోలాలు వంటి అంశాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశాలుగా ఉన్నందున, ఆమె ప్రవచనాలు ప్రజలలో మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి. అంతేకాదు ప్రపంచంలో ఓ ప్రముఖ వ్యక్తి మీద పగటి పూట పిడుగు పడి చనిపోతాడు. ఆ వ్యక్తి రాజకీయ వర్గానికి, కళారంగానికి చెందిన వారేనా లేదా అనేది తెలియాల్సి ఉంది. 2026లో ప్రపంచం ఎదుర్కొనే సవాళ్లపై బాబా వాంగా ప్రవచనాలు ఒక హెచ్చరికలా వినిపిస్తున్నాయి. వాతావరణ మార్పులు, ఆర్థిక అస్థిరత, రాజకీయ కల్లోలాలు, ఇవన్నీ మనం అప్రమత్తంగా ఉండాల్సిన అంశాలుగా గుర్తించబడుతున్నాయి. -
ఆమెను ఎక్కడో చూసినట్టుగా అనిపించి..
సికింద్రాబాద్ (రాంగోపాల్‌పేట): ఎటు చూసినా పండుటాకులే.. ఒక్కొక్కరిని కలుస్తూ ఆయన అలా ముందుకుపోతున్నారు.. మిఠాయిలు, పండ్లు అందిస్తున్నారు.. బాగున్నారా.. అంటూ పలకరిస్తున్నారు.. ఒక వృద్ధురాలి దగ్గరికి వచ్చేసరికి ఆమెను ఎక్కడో చూసినట్టుగా అనిపించి ఒక్క క్షణం ఆగారు. గుర్తుపట్టి ‘బాగున్నారా.. శ్యామల గారూ!’ అంటూ నమస్కరించారు. ఇదీ కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమం, హెల్త్ కేర్ సెంటర్లో గురువారం కనిపించిన సన్నివేశం.హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ (VC Sajjanar) న్యూ ఇయర్ వేడుకలకు ఆత్మీయంగా జరుపుకున్నారు. ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమం, హెల్త్ కేర్ సెంటర్లో చికిత్స పొందుతున్నవారిని సజ్జనర్ పరామర్శించడంతోపాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నిరాడంబరంగా న్యూ ఇయర్ డే వేడుకలు నిర్వహించారు. ఆశ్రయం పొందుతున్న 48 మందికి స్థానిక అధికారులతో కలిసి పండ్లు, మిఠాయిలు పంచిపెట్టారు. కేక్ కట్ చేసి పంపిణీ చేశారు.అనారోగ్యంతో బాధపడుతున్న పావలా శ్యామలను (Pavala Shyamala) నెలరోజుల క్రితం తిరుమలగిరి ఏసీపీ రమేశ్ చొరవ తీసుకుని ఆర్కే ఫౌండేషన్ హెల్త్‌కేర్ సెంటర్లో చేర్పించారు. విషయం తెలుసుకున్న సీపీ సజ్జనార్.. మానవతా దృక్పథంతో స్పందించిన ఏసీపీ రమేశ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. మిగిలినవారూ రమేశ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.ఆర్కే ఫౌండేషన్ ద్వారా 18 ఏళ్లుగా దాదాపు 15 వేల మంది వృద్ధులకు ఆశ్రయంతోపాటు వైద్యం అందిస్తున్న డాక్టర్ రామకృష్ణ సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. కన్నవారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత పిల్లలదేనని ఈతరానికి సూచించారు. కార్యక్రమంలో నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్, అదనపు డీసీపీ అశోక్, తిరుమలగిరి ఏసీపీ రమేశ్, కార్ఖానా ఇన్స్పెక్టర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.చదవండి: 'గుండెలకు హత్తుకోవాల్సిన వారే ఊపిరి తీశారు' -
రిఫ్రిజిరేటర్లు, ఏసీల ధరలకు రెక్కలు!
న్యూఢిల్లీ: కూలింగ్ ఉత్పత్తులైన ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ధరలు 5-10 శాతం మధ్య పెరగనున్నాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ) సవరించిన స్టార్ రేటింగ్ నిబంధనలు అమల్లోకి రానుండడంతో ఈ పరిణామం చోటుచేసుకోనుంది. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో సెప్టెంబర్ 22 నుంచి ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ధరలు 10 శాతం వరకు తగ్గగా.. ఇప్పుడు స్టార్ రేటింగ్ ప్రమాణాల కారణంగా ఆ ప్రయోజనం మొత్తం కనుమరుగు కానుంది.మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం, కాపర్ ధరలు పెరిగిన కారణంగా ఏసీలు, రిఫ్రిజిరేటర్ల తయారీ సంస్థలు వ్యయ భారాన్ని ఎదుర్కొంటున్నాయి. దీంతో ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడినట్టు చెబుతున్నాయి. అయితే ఈ చర్య కర్బన ఉద్గారాల తగ్గింపునకు మేలు చేస్తుందని వోల్టాస్, డైకిన్, బ్లూస్టార్, గోద్రేజ్ అప్లయెన్సెస్ పేర్కొన్నాయి.కరెంటు ఆదా..సవరించిన బీఈఈ నిబంధనల కింద.. కొత్త 5 స్టార్ రేటింగ్ ఏసీలు 10 శాతం మరింద ఇంధనాన్ని ఆదా చేయనున్నాయని, అదే సమయంలో ఉత్పత్తుల ధరలు 10 శాతం పెరగనున్నాయని బ్లూస్టార్ ఎండీ బి.త్యాగరాజన్ తెలిపారు. కొత్త 5 స్టార్ అన్నది ప్రస్తుత ఉత్పత్తుల కోణంలో నుంచి చూస్తే 6-7 స్టార్ ఇంధన సామర్థ్యానికి సమానంగా ఉంటుందన్నారు. ఇప్పుడున్న 5 స్టార్ ఏసీ, రిఫ్రిజిటేటర్ జనవరి 1 తర్వాత 4 స్టార్‌కు తగ్గిపోనున్నాయి. ఇలా ప్రస్తుత ప్రమాణాల ప్రకారం తయారైన ప్రతీ ఉత్పత్తికి సంబంధించి స్టార్ రేటింగ్ ఒక మెట్టు కిందకు వెళ్లిపోనుంది.ఇంధన రేటింగ్ మార్పు కారణంగా ఏసీల ధరలు 5-7 శాతం మేర, రిఫ్రిజిరేటర్ల ధరలు 3-5 శాతం మేర పెరుగుతాయని గోద్రేజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ బిజినెస్ హెడ్ కమల్ నంది తెలిపారు. కరెన్సీ విలువ క్షీణత, కమోడిటీ ధరల పెరుగుదలతో వ్యయాల భారాన్ని కంపెనీలు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. కొత్త ఇంధన ప్రమాణాలు అమల్లోకి రానుండడంతో డిమాండ్ ఊపందుకుంటుందని వోల్టాస్ సీనియర్ బిజినెస్ లీడర్ జయంత్ బలాన్ అంచనా వేశారు. ధరల పెరుగుదలకు ముందుగానే డీలర్లు, వినియోగదారులు ఆర్డర్లు పెట్టేందుకు ఆసక్తి చూపించొచ్చన్నారు.ఇతర ఉత్పత్తులకూ కొత్త ప్రమాణాలుఏసీలు, రిఫ్రిజిరేట్లతోపాటు.. టెలివిజన్లు, ఎల్పీజీ గ్యాస్ స్టవ్‌లు, కూలింగ్ టవర్లు, చిల్లర్లకు సైతం కొత్త బీఈఈ స్టార్ రేటింగ్ ప్రమాణాలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
కొత్త సంవత్సరం.. రెండో రోజు
నిన్నటి రోజు ‘హ్యాపీ న్యూ ఇయర్’ మెసేజ్‌లు, పలకరింపులతోనే గడిచిపోయి ఉంటుంది. కాస్త నిదానంగా ఆలోచించడానికి ఇదే సరిౖయెన రోజు. ఈరోజు మనపై మనం స్టడీ నిర్వహించుకుందాం. ముందుగా ఒక వైట్ పేపర్ తీసుకోండి.⇒ గత సంవత్సరం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన అంశాలు ఏమిటి?⇒ ఎందుకు ఇబ్బందిగా అనిపించింది?⇒ గత సంవత్సరం నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఏమిటి?⇒ ‘కొత్త సంవత్సరం.. కొత్త విద్య’ అనే కాన్సెప్ట్‌లో భాగంగా ఈ సంవత్సరం నేర్చుకోవాలనుకుంటున్నది ఏమిటి?⇒ ఆరోగ్యానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?.... 360 డిగ్రీల కోణంలో ప్రశ్నలు, వాటికి జవాబులు రాసుకోండి. ప్రతి నెల వాటిని సమీక్షించుకుంటూ ఉండండి. ఫలితం చూడండి!చదవండి: కొత్త సంవత్సరం, కొత్త ఆశలు.. ఆశయాలు ఇంగ్లీష్ ఇడియమ్స్ఫ్లాష్ ఇన్ ది పాన్: కొన్ని విజయాలు ఒకేసారి వీలవుతాయి, రిపీట్ చేయడానికి కుదరదు...ఇలాంటి నేపథ్యంలో ఉపయోగించే మాట... ఫ్లాష్ ఇన్ ది పాన్ ఉదా: శాడ్లీ, దెయిర్ సక్సెస్ వజ్ జస్ట్ ఏ ఫ్లాష్ ఇన్ ది పాన్టాక్ త్రూ యువర్ హ్యాట్: ఏమీ తెలియకుండా, అర్థం చేసుకోకుండా ఎవరైనా అజ్ఞానంతో మాట్లాడే సందర్భంలో వాడే మాట... టాక్ త్రూ యువర్ హ్యాట్స్విమ్ విత్ ది ఫిషెస్: ‘హత్యకు గురయ్యాడు’ అని చెప్పడానికి సంబంధించి వాడే మాట.. స్విమ్ విత్ ది ఫిషెస్ లేదా స్లీప్ విత్ ది ఫిషెస్, హాలివుడ్ సినిమా ‘గాడ్‌ఫాదర్’తో స్విమ్ విత్ ది ఫిషెస్ పాపులర్ అయింది.టిప్పింగ్ పాయింట్: చిన్న చిన్న మార్పులే పెద్ద మార్పు, కీలక మార్పుకు కారణం అవుతాయని చెప్పే సందర్భంలో వాడే మాట... టిప్పింగ్ పాయింట్. భారీ మార్పుకు కారణమయ్యే కీలక పరిణామాన్ని గురించి చెప్పే సమయంలో కూడా ఈ మాటను వాడుతారు. -
కొత్త ఏడాది జోష్..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)
-
కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్ (ఫోటోలు)
-
పర్యాటకంతో కొత్త ఏడాదికి స్వాగతం
న్యూఢిల్లీ: కొంగొత్త ఆశలను మోసుకొచ్చే నూతన ఏడాదికి భారతీయులు తమదైన శైలికి స్వాగతం పలికారు. పలు రకాల సాంస్కృతిక, విభిన్న కార్యక్రమాలతో సర్వాంగ సుందరంగా సిద్ధమైన రిసార్ట్లు, మాల్స్‌లో నృత్యాలు చేసి లక్షలాది మంది స్వాగతం పలికితే కోట్లాది మంది తమ ఇష్ట దైవాన్ని ప్రార్థించేందుకు ఆలయాల వద్ద బారులుతీరారు. కొత్త ప్రదేశంలో సరికొత్తగా న్యూఇయర్‌కు స్వాగతం పలికాలనే ఉద్దేశంతో చాలా మంది పర్యాటక ప్రదేశాలకు పొలోమంటూ వెళ్లారు. దీంతో దేశవ్యాప్తంగా పర్యాటక ప్రదేశాలన్నీ కిక్కిరిసిపోయాయి. నేతల శుభాకాంక్షలు..కొత్త ఏడాదిని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రతి ఒక్కరికీ 2026 ఏడాది అ ద్భుతంగా గడవాలి. అందరికీ మంచి ఆయు రారోగ్యాలు ప్రాప్తించాలి. లక్ష్యాల సాధనకు మీరు చేసే కృషి ఫలించాలి. సమాజంలో శాంతి సంతోషాలు వెల్లివిరియాలని ప్రార్థిస్తున్నా’’ అని మోదీ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘ ఆనందాల నూతన సంవత్సరంలో అందరికీ నా హృదయపూర్వక కొత్త ఏడాది శుభాకాంక్షలు. దేశ,విదేశాల్లోని భారతీయులందరికీ ఈ ఏడాది శుభం కలగాలి’’ అని రాష్ట్రపతి ముర్ము ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘‘కొత్త ఏడాది వేళ జనులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గౌరవప్రదంగా జీవించేందుకు, పనిచేసేందుకు, ఓటేసేందుకు అనువైన సమాజం కోసం ఉద్యమించాల్సిన తరుణమిది’’ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు.వేడుకల్లోనూ రాజధానేదేశరాజధానిగానే కాదు వేడుకలకూ ఢిల్లీ గురువారం రాజధానిగా మారింది. నగరంలోని ప్రతి ఒక్క పర్యాటక ప్రాంతంలో జనం లెక్కలుమిక్కిలి చేరుకుని సరదాగా గడిపారు. వేగంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఢిల్లీ మెట్రోను ఆశ్రయించారు. దీంతో మెట్రో స్టేషన్ల లోపల నుంచి బయటి దాకా చాలా దూరం వరకు క్యూ లైన్లు దర్శనమిచ్చాయి. ఇండియా గేట్, సమీప ప్రాంతాలను చుట్టేసేందుకు వచ్చిన జనంతో సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్లో ఇసకేస్తే రాలనంత జనం పోగయ్యారు. గోవాలో గోలగోలసాధారణంగానే పర్యాటకానికి చిరునామాగా నిలిచే గోవా ఈసారి సైతం నూతన సంవత్సర సంబరాలకు సరికొత్తగా ముస్తాబైంది. దీంతో పలు రాష్ట్రాల జనం జనం పెద్దసంఖ్యలో గోవాకు చేరుకుని ఆనందంగా గడిపారు. బీచ్‌లు, రెస్టారెంట్లు, పబ్‌లు, బార్లు, నైట్‌క్లబ్‌లు, రోడ్డ మీద ఎక్కడ చూసినా జనమే కన్పించారు. మ్యూజిక్నైట్ పార్టీలు, బాణసంచా వెలుగులు, సంగీత విభావరులు, డ్యాన్స్ కార్యక్రమాలతో ఉత్తర గోవా హోరెత్తిపోయింది. అన్ని రాష్ట్రాల్లో అందటా సందడే..క్రైస్తవులు అత్యధికంగా ఉండే మిజోరంలో ప్రజలు చర్చిల్లో ప్రార్థనలతో నూతన ఏడాదికి స్వాగతం పలికారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. న్యూఇయర్ వేడుకలను ఈ రాష్ట్రంలో రెండ్రోజులపాటు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గురువారం ఉదయం వర్షం ముంబై వాసులకు కొత్త ఏడాదిలోకి వెల్కమ్ చెప్పింది. ఉత్తరప్రదేశ్‌లో ఆలయాల్లో భక్తుల రద్దీ మునుపెన్నడూ లేనంతగా కన్పించింది. ప్రయాగ్‌రాజ్‌లో భక్తులు తెల్లవారుజామునే గజగజ వణికించే చలిలోనూ త్రివేణి సంగమ స్థలిలో పుణ్యస్నానాలు చేసి ఆలయాలను దర్శించుకున్నారు. అయోధ్యలోని బాలరా మాలయం భక్తులతో కిటకిటలాడింది. వీఐపీ దర్శన పాస్‌లు హాట్‌కేకులుగా మారాయి. అనూహ్య రద్దీతో ఆలయ కమిటీ స్థానిక భక్తులను మరోరోజు దర్శనానికి రావాలని బ్రతిమాలింది. సుదూరాల నుంచి వచ్చిన భిన్న రాష్ట్రాల భక్తులకు దర్శనభాగ్యం దక్కే అవకాశం ఇవ్వాలని కోరింది. ఒడిశాలో పూరీ జగన్నాథస్వామి ఆలయంలోనూ ఇదే పరిస్థితి కన్పించింది. బిహార్, రాజస్థాన్‌లోనూ ఇవే దృశ్యాలు పునరావృతమయ్యాయి. బెంగాల్లో భిన్నంగా..బెంగాల్లో పర్యాటక ప్రదేశాలు సందర్శకులతో నిండిపోయాయి. అలిపోర్ జూ, ఎకో పార్క్, ఇక్కో పార్క్, విక్టోరియా మెమోరియల్ సహా కోల్‌కతాలోని ప్రతి ప్రాంతంలో జనం గుమిగూడి కొత్త సంవత్సరాన్ని వేడుకలా ఆరంభించారు. -
అణు వసతులు.. ఖైదీల జాబితా
న్యూఢిల్లీ: నూతన సంవత్సరం మొదటి రోజైన గురువారం భారత్, పాకిస్తాన్‌లు తమ అణు వసతులు, ఖైదీల వివరాలను పరస్పరం ఇచ్చి పుచ్చుకున్నాయి. 35 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని ఇరు దేశాలు కొనసాగిస్తున్నాయి. భారత్–పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పటికీ అణు వసతులపై పరస్పరం దాడులకు పాల్పడరాదన్న ఒప్పందం 1988లో కుదిరింది. 1991 జనవరి 27వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచి్చంది. దీని ప్రకారం మొదటిసారిగా 1992 జనవరి ఒకటో తేదీన అణు వసతులు వివరాలు మార్చుకున్నాయి. ఇస్లామాబాద్‌లోని భారత దౌత్యాధికారికి పాక్, ఢిల్లీలోని పాక్ దౌత్యాధికారికి భారత్ ఈ మేరకు సమాచారం అందించాల్సి ఉంటుంది. అలా, వరుసగా 35వ సారి గురువారం ఈ మేరకు వివరాలను అందజేసుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఈ ఏడాది మేలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం తెల్సిందే. ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా క్షీణించినప్పటికీ రెండు దేశాలు ఈ ఒప్పందాన్ని ఏళ్ల తరబడి నిరాటంకంగా కొనసాగించడం విశేషం. వారికి వెంటనే విముక్తి కల్పించాలి: భారత్ భారత్–పాక్‌లు గురువారం తమ దేశాల్లో ఉంటున్న ఖైదీల జాబితాను మార్పిండి చేసుకున్నాయి. పాక్ జైళ్లలో శిక్షాకాలాన్ని ముగించుకున్న 167 మంది భారతీయ మత్స్యకారులు, పౌర ఖైదీల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా భారత్ కోరింది. అదే విధంగా, పాక్ కస్టడీలో ఉన్న 35 పౌర ఖైదీలు, మత్స్యకారులను కాన్సులేట్ అధికారులు కలుసుకునేలా వెసులుబాటు కలి్పంచాలని అడిగింది. ప్రస్తుతం భారత్ జైళ్లలో పాక్ పౌరులు 391 మంది, మత్స్యకారులు 33 మంది ఉండగా, పాక్ జైళ్లలో 58 మంది భారత పౌరులు, 199 మంది మత్స్యకారులు మగ్గుతున్నారు. -
కొత్త ఏడాదిలో పొలిటికల్ హీట్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో మరో మహా సంగ్రామానికి తెరలేచింది. 2025లో ఢిల్లీ, బిహార్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన కిక్ నుంచి రాజకీయ పార్టీలు తేరుకోకముందే 2026 రూపంలో మరో సవాల్ ముందుకొచ్చింది. కొత్త సంవత్సరం సాక్షిగా ఐదు రాష్ట్రాల్లో మోగనున్న ఎన్నికల నగారా జాతీయ రాజకీయాల్లో పెను మార్పులకు తెర తీయనుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలతోపాటు పార్లమెంటులో కీలకమైన రాజ్యసభ సీట్ల భర్తీ ఈ ఏడాదే జరగనుండటంతో ఢిల్లీ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికలు కేవలం అధికార మారి్పడి కోసమే కాదు 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందస్తు హెచ్చరికలుగా, సెమీఫైనల్స్‌గా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. బెంగాల్ రణరంగం: మమత కోటలో కమలం వికసించేనా? దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న పోరు పశ్చిమ బెంగాల్లోనే జరగనుంది. పశ్చిమ బెంగాల్లో రాజకీయ వాతావరణం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. వరుసగా హ్యాట్రిక్ విజయాలతో తిరుగులేని నేతగా ఎదిగిన మమకు ఈసారి సొంతగూటి నుంచే అసమ్మతి సెగలు తగులుతున్నాయి. సందేశ్‌ఖాలీ ఘటనలు, రేషన్, విద్యాశాఖ కుంభకోణాలు తృణమూల్ కాంగ్రెస్ ప్రతిష్టను మసకబారేలా చేశాయి. అయితే‘లక్ష్మీర్ భండార్’ వంటి పథకాలతో మహిళా ఓటు బ్యాంకును మమత పదిలపరుచుకున్నారు. గత ఎన్నికల్లో 77 సీట్లతో సత్తా చాటిన బీజేపీ ఈసారి ఎలాగైనా మమతను గద్దె దించి కాషాయ జెండా ఎగురవేయాలని ఉవి్వళ్లూరుతోంది. ముక్కోణపు పోటీలో కాంగ్రెస్–లెఫ్ట్ కూటమి ఓట్లు చీలితే అది అంతిమంగా ఎవరికి లాభం చేకూరుస్తుందన్నదే ఇక్కడ ఆసక్తికరమైన అంశం. ద్రవిడ గడ్డపై ‘సినిమా’ చూపించేదెవరు? తమిళనాట రాజకీయాలు ఎప్పుడూ డీఎంకే, అన్నాడీఎంకే చుట్టూనే తిరిగేవి. కానీ, ఈసారి తమిళగ వెట్రి కజగం(టీవీకే) అధినేత, నటుడు విజయ్ రూపంలో సరికొత్త శక్తి దూసుకొచ్చింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) తన సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష అని నమ్ముతుంటే అన్నాడీఎంకే పూర్వ వైభవం కోసం పాకులాడుతోంది. యువతలో పిచ్చ క్రేజ్ ఉన్న విజయ్ ఎవరి ఓట్లకు గండి కొడతారన్నదే అసలు సిసలు ట్విస్ట్. విజయ్ చీల్చే ప్రతి ఓటు అధికార డీఎంకేకు నష్టమా? లేక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం వల్ల స్టాలిన్‌కే లాభమా? అన్నది ఆసక్తి రేపుతోంది. అన్నామలై సారథ్యంలో బీజేపీ తమిళనాట పాగా వేయాలని వ్యూహాలు రచిస్తోంది. కేరళలో సంప్రదాయం.. అస్సాంలో హిందుత్వ అజెండాసాధారణంగా కేరళలో ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారే ఆనవాయితీ ఉంది. దాన్ని 2021లో బ్రేక్ చేసిన పినరయి విజయన్ (pinarayi vijayan) ఈసారి ఆర్థిక సంక్షోభం, సహకార బ్యాంకుల కుంభకోణాల రూపంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ కూటమి (యూడీఎఫ్) అధికారం చేపట్టాలని చూస్తుండగా బీజేపీ క్రైస్తవ వర్గాలను ఆకట్టుకునే పనిలో పడింది. అటు ఈశాన్య రాష్ట్రం అస్సాంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ‘హిందుత్వ’ అజెండా, నియోజకవర్గాల పునర్విభజన బీజేపీకి కలిసొచ్చే అంశాలుగా మారే అవకాశాలున్నాయి. ఇక్కడ మతపరమైన ఓట్ల చీలికే గెలుపోటములను శాసించనుంది.ఢిల్లీలో పైచేయి కోసం రాజ్యసభ ఫైట్ కేవలం అసెంబ్లీలే కాదు దేశ చట్టసభల్లో ఎగువ సభ అయిన రాజ్యసభలోనూ ఈ ఏడాది భారీ మార్పులు జరగనున్నాయి. ఏకంగా 73 మంది ఎంపీల పదవీకాలం ముగియనుంది. ఈ సీట్లను దక్కించుకోవడం కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌కు అనివార్యంగా మారింది. వక్ఫ్ సవరణ బిల్లు, ఉమ్మడి పౌరస్మృతి వంటి కీలక బిల్లులు రాజ్యసభలో గట్టెక్కాలంటే బీజేపీకి మెజారిటీ అత్యవసరం. అందుకే, ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాజ్యసభ గణితాన్ని, తద్వారా దేశ పరిపాలనా విధానాన్ని ప్రభావితం చేయనున్నాయి.ఫలితాలను తారుమారు చేసే పంచ సూత్రాలు ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఐదు అంశాలు గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. మొదటిది మహిళా ఓటర్లు; బెంగాల్, తమిళనాడులో మహిళలే నిర్ణయాత్మక శక్తి. రెండోది యువత; ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత ఆగ్రహం ప్రభుత్వాలను మార్చే శక్తి కలిగి ఉంది. మూడోది కుల, మత సమీకరణాలు; ముఖ్యంగా అస్సాం, బెంగాల్లో ఇది కీలకం. నాలుగోది అధికార వ్యతిరేకత; ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న పార్టీలపై ప్రజల్లో ఉండే అసహనం. ఐదోది పొత్తులు; విపక్షాల అనైక్యత అధికార పార్టీలకు వరంగా మారుతోంది. మొత్తానికి 2026 ఎన్నికలు 2029 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా నిలువనున్నాయనడంలో సందేహం లేదు. మరి ఓటరు ప్రాంతీయ అస్తిత్వానికి పట్టం కడతారా? జాతీయ భావజాలానికి జై కొడతారా? అనేది కాలమే నిర్ణయించాలి. -
కొత్త జోష్ అదిరింది
తెలుగు చిత్ర పరిశ్రమలో 2026 ఆరంభం కొత్త జోష్‌ను తీసుకొచ్చింది. నూతన సంవత్సరం సందర్భంగా తమ సినిమాల ప్రకటనలు, కొత్త అప్డేట్స్ను పంచుకున్నారు మేకర్స్. ఆ విశేషాలేంటో ఓ సారి చూద్దాం. ⇒ గన్ పట్టుకుని మాస్ లుక్‌తో కనిపించారు చిరంజీవి. ఆయన నటించిన తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. నయనతార హీరో యిన్ గా నటించిన ఈ చిత్రంలో వెంకటేశ్ కీలకపాత్ర పోషించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ⇒ రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న రిలీజ్ కానుంది. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది యూనిట్. ⇒ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘స్పిరిట్’. భూషణ్ కుమార్, క్రిషణ్‌కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన మరో సినిమా ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ⇒ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లు. ఎస్. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమా కొత్త స్టిల్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే పవన్ కల్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించనున్న మూవీని ప్రకటించారు. ⇒ ‘దసరా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ‘ది ఫ్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 26న రిలీజ్ కానుంది. ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ⇒ శర్వానంద్ హీరోగా, సంయుక్త– సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించిన సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమా కొత్త స్టిల్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ⇒ సుమంత్ హీరోగా నటించిన సినిమా ‘మహేంద్రగిరి వారాహి’. రాజ శ్యామల ఎంటర్టైన్మెంట్పై జాగర్లపూడి సంతోష్ దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానున్నట్లు మేకర్స్ తెలిపారు. ⇒ అఖిల్ నటిస్తున్న చిత్రం ‘లెనిన్ ’. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని తొలిపాటని ఈ నెల 5న, మూవీని వేసవిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించి, పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ⇒ నవీన్ పొలిశెట్టి, మీనాక్షీ చౌదరి జంటగా నటించిన సినిమా ‘అనగనగా ఒక రాజు’. మారి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా కొత్త స్టిల్‌ను రిలీజ్ చేసింది యూనిట్. ⇒ విశ్వక్సేన్ హీరోగా సాయి కిరణ్ రెడ్డి దైదా దర్శకత్వం వహిస్తున్న పొలిటికల్ డ్రామాకి ‘లెగసీ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఏక్తా రాథోడ్ హీరోయిన్ . యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదా నిర్మిస్తున్న ఈ సినిమా అనౌన్్సమెంట్ టీజర్‌ను గురువారం విడుదల చేశారు. ⇒ కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటిస్తున్న సినిమా ‘చెన్నై లవ్‌స్టోరీ’. రవి నంబూరి దర్శకత్వంలో సాయి రాజేశ్, ఎస్కేఎన్ నిర్మిస్తున్న ఈ సినిమాని వేసవిలో రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది చిత్రయూనిట్. ⇒ నవీన్ చంద్ర, దివ్య పిళ్లై జోడీగా నటిస్తున్న చిత్రం ‘హనీ’. కరుణ కుమార్ దర్శకత్వంలో ఓవీఏ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకాలజీ వంటి అంశాలతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాని ఫిబ్రవరి 6న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు మేకర్స్. ⇒ హీరోయిన్ సంయుక్త నటిస్తున్న సినిమా ‘ది బ్లాక్ గోల్డ్’. కేఎమ్‌సీ యోగేష్ దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ 75శాతం పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించి, సంయుక్త లుక్‌ని విడుదల చేశారు. ⇒ సుహాస్, శివానీ నాగారం జోడీగా నటించిన సినిమా ‘హే భగవాన్ ’. గోపీ అచ్చర దర్శకత్వంలో బి. నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు మేకర్స్ తెలిపారు. ⇒ నిరంజన్, గ్రీష్మ నేత్రికా, ప్రియాంక, దీప్తి శ్రీరంగం ముఖ్య తారలుగా సింహాచలం గుడుపూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రుక్ష్మిణి’. నేలబల్లి కుమారి సమర్పణలో జి సినిమా బ్యానర్‌పై నేలబల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, కట్టా గంగాధర రావు నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ని నటుడు రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు. ⇒ అంకిత్ కొయ్య, మానసా చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ జాతర’. ‘సమ్మతమే’ మూవీ ఫేమ్ గోపీనాథ్ రెడ్డి దర్శకుడు. యూజీ క్రియేషన్ ్సపై కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. పైన పేర్కొన్న చిత్రాలతోపాటుగా మరికొన్ని సినిమాల అప్డేట్స్ని న్యూ ఇయర్ సందర్భంగా ఆయా చిత్రాల మేకర్స్ వెల్లడించారు. -
కొత్త సంవత్సరం .. కొత్త ఆశలు..ఆశయాలు
మనిషి ఆలోచించటం మొదలుపెట్టినప్పటి నుండి లెక్కించటం కూడా ప్రారంభించాడు. ప్రకృతిలో వస్తున్న మార్పులని పరిశీలించి, తదనుగుణంగా ఉండటం కోసం కాలాన్ని కూడా గణించటం ప్రారంభించాడు. కాలగణనకి ప్రమాణం ప్రకృతిలో జరిగే పరిణామాలే. కొద్దికాలం జరిగిన తరవాత మళ్ళీ ఇంతకుముందు ఉన్నట్టే ప్రకృతి కనపడితే ఈ క్రమం ఏమిటి? అన్నది అర్థం చేసుకునే ప్రయత్నంలోనే మనిషి కాలాన్ని లెక్కపెట్టటం జరిగింది. ఒక్కొక్క ప్రాంతం వారు వారికి అనుకూలంగా ఉన్న సమయం నుండి లెక్కపెట్టటం మొదలు పెట్టారు. కాలక్రమంలో దానిలో ఒక హేతుబద్ధతని అవలంబించారు. ప్రకృతి ఆహ్లాదకరంగా ఉండే సమయాన్ని కాలగణనకు మొదలుగా తీసుకున్నారు. పాశ్చాత్యులకి ఆహ్లాదకరంగా ఉండే వసంతం (స్ప్రింగ్)మార్చ్, ఏప్రిల్ నెలలు. మార్చ్ 23ని సంవత్సర మానానికి ఆదిగా పరిగణించేవారు. తరువాత నెల మధ్యలో ఎందుకని ఏప్రిల్ 1 ని సంవత్సరాదిగా జరుపుకునే వారు. కొన్ని రాజకీయ కారణాల వల్ల అది జనవరి 1కి మారింది. మార్చ్ మొదటి నెల కనుక డిసెంబర్ 10 వ నెల, నవంబర్ 9 వ నెల, అక్టోబర్ 8 వ నెల, సెప్టెంబర్ 7 వ నెల అయ్యాయి. ఆ పేర్లే నెలల సంఖ్యని తెలియ చేస్తున్నాయి. ఈ కాలెండర్ ని గ్రెగేరియన్ కాలెండర్ అంటారు. అందరికీ తమ కాలెండర్ ఉన్నా, ఇప్పుడు ప్రపంచం అంతా ఈ కాలెండర్ నే అనుసరిస్తోంది.ఈ కాలెండర్ ప్రకారం జనవరి ఒకటో తారీకుతో కొత్త సంవత్సరం మొదలు అవుతుంది. సౌరమానాన్ని అనుసరించి ఒక సంవత్సరంలో 365 1/3 రోజులు ఉంటాయి. అందుకని నాలుగు సంవత్సరాలకి ఒక మారు లీప్ సంవత్సరం అని ఒకరోజు అధికంగా వస్తుంది. ఆ రోజు తక్కువ రోజులు ఉండే ఫిబ్రవరికి వెడుతుంది. అయితే ఆనందోత్సాహాలు ఎందుకు? ఇంతకాలం జీవితాన్ని ఆనందంగా గడిపినందుకు. ఆ విధంగా గడిపే అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు. సంవత్సరంలో మొదటిరోజు ఏ విధంగా గడిపితే సంవత్సరం అంతా అదేవిధంగా ఉంటుందని అందరి విశ్వాసం. రెండువేల ఇరవై ఆరవ సంవత్సరం అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలని ఆనందాన్ని ఇతోధికంగా ఇవ్వాలని, ప్రపంచంలో శాంతి నెలకొనాలని ఒకరికొకరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుందాం.కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఇళ్ళని, వీధులని, నగరాలని అలంకరిస్తారు. అలంకారాలు, దీపాలు, టపాకాయలు, కొత్తబట్టలు, మిఠాయిలు పంచుకోవటాలు, విందులు, వినోదాలు, శుభాకాంక్షలు. అంటే రాబోయే కాలం ఆనందదాయకంగా ఉండాలనే ఆకాంక్ష, ఉంటుందనే విశ్వాసం వ్యక్తం చేయటమే వీటిలోని అసలు అర్థం. కాని, అనుభవజ్ఞులైన పెద్దలు చేసే సూచన ఏమంటే జరిగిపోయిన సంవత్సరంలో ఏం చేశాము అని సమీక్షించుకుని, గెలుపోటములని, మానావమానాలని, బేరీజు వేసుకుని, తమ లక్ష్యాలని, లక్ష్యసాధన మార్గాలని నిర్ధారించుకుని, పనికిరాని వాటిని పక్కకి పెట్టి, అవసరమైన వాటిని చేపట్టటానికి నిర్ణయించుకోవలసిన సమయం ఇది అని. తమ ఆయుర్దాయంలో మరొక సంవత్సరం గడిచిపోయింది, చేయవలసిన పనులు త్వరగా చేయాలి అని తమని తాము హెచ్చరించుకోవాలి. అందుకే ఎంతో మంది ఒక చెడు అలవాటుని మానుతామనో, కొత్త పని ఏదైనా మొదలు పెడతామనో అని నూతన సంవత్సర నిర్ణయాలని ప్రకటిస్తూ ఉంటారు. (చదవండి: 52 ఏళ్ల మహిళ యూట్యూబ్ రీల్స్‌తో మొదటి సంపాదన..!) -
బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
మారిన రూల్స్: పాన్-ఆధార్ లింక్ నుంచి క్రెడిట్ స్కోర్ వరకు..
2025 ముగియడంతో.. 2026 ప్రారంభం నుంచి అనేక మార్పులు అమలులోకి వచ్చాయి. ఇందులో ముఖ్యంగా బ్యాంకింగ్ నిబంధనలు, ఇంధన ధరలు, వివిధ ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. ఇవి జీతం పొందే వారిని, యువత, సాధారణ ప్రజలను ప్రభావితం చేస్తాయి. కొత్తగా వచ్చిన రూల్స్ గురించి వివరంగా..పాన్ కార్డుకు ఆధార్ లింక్పాన్ కార్డును.. ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి 2025 డిసెంబర్ 31న చివరి తేదీగా ప్రకటించారు. ఈ గడువును పెంచుతున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించలేదు. కాబట్టి నేటి నుంచి పాన్ - ఆధార్ లింక్ చేయడం కుదరదు. దీనివల్ల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్‌ను ఫైల్ చేయలేరు. ట్యాక్స్ రిఫండ్‌ను అందుకోలేరు. అలాగే ఇతర బ్యాంకింగ్, షేర్ మార్కెట్ ట్రేడింగ్, ఇతర ఆర్థిక కార్యకలాపాల్లోనూ ఇబ్బందులు తప్పవు.క్రెడిట్ స్కోర్ అప్డేట్ఇప్పటివరకు బ్యాంకులు ప్రతి 15 రోజులకు ఒకసారి సిబిల్ స్కోర్ అప్డేట్ చేసేవి. ఇప్పుడు క్రెడిట్ బ్యూరోలు ఇప్పుడు ప్రతి వారం కస్టమర్ డేటాను రిఫ్రెష్ చేస్తాయి. అంటే.. లోన్ చెల్లింపులు లేదా డిఫాల్ట్‌లు మీ క్రెడిట్ స్కోర్‌లో చాలా వేగంగా ప్రతిబింబిస్తాయి.ఎల్పీజీ సిలిండర్ ధరలు2026 సంవత్సరం మొదటి రోజు నుంచి ఎల్పీజీ కమర్షియల్ గ్యాస్ ధర రూ.111 పెరిగింది. తాజా సవరణతో.. దేశ రాజధానిలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.1,691.50కి (గతంలో రూ. 1,580.50 గా ఉండేది) పెరిగింది. కొత్త ధరలు ఈ రోజు నుంచే అమలులోకి వస్తాయి.మెరుగైన డిజిటల్ చెల్లింపు భద్రతమోసాలను అరికట్టడానికి బ్యాంకులు UPI లావాదేవీలపై కఠినమైన తనిఖీలను, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌లకు మరింత బలమైన సిమ్ ధృవీకరణ నిబంధనలను అమలు చేస్తాయి.పిఎం కిసాన్ గుర్తింపు కార్డులుభారత ప్రభుత్వం PM-Kisan పథకం కోసం కొత్త రైతు ఐడీ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ డిజిటల్ ఐడీకి.. రైతుల భూమి రికార్డులు, పంట సమాచారం, ఆధార్ & బ్యాంక్ వివరాలు అనుసంధానించబడి ఉంటాయి. -
800 KG కేక్ కట్టింగ్.. జగన్ ఆశీస్సులతో మనదే విజయం
-
తెలంగాణలో మద్యం విక్రయాల సునామీ!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో న్యూఇయర్ వేడుకల్లో మద్యం ఏరులై పారింది. ఫలితంగా న్యూఇయర్ వేడుకల సందర్భంగా మద్యం విక్రయాలు కొత్త రికార్డులు సృష్టించాయి. ఈ నెల 25వ తేదీ నుంచి నిన్నటి వరకు మద్యం అమ్మకాల విలువ రూ.1350 కోట్లకు చేరింది. ముఖ్యంగా డిసెంబర్ 29, 30, 31 తేదీల్లోనే దాదాపు రూ.1000 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు సమాచారం. 29వ తేదీ రూ.280 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా..30వ తేదీన రూ.380 కోట్లు,31వ తేదీన రూ.315 కోట్ల అమ్మకాలతో.. మొత్తం మూడు రోజుల్లోనే 8.30 లక్షల కేసుల లిక్కర్, 7.78 లక్షల కేసుల బీరు విక్రయాలు జరిగాయి. రాష్ట్రంలో న్యూఇయర్ వేడుకల సందర్భంగా మద్యం వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా హోటళ్లు, పబ్‌లు, రెస్టారెంట్లు, పార్టీలు, వ్యక్తిగత వేడుకల్లో మద్యం వినియోగం అధికంగా కనిపించింది. మద్యం విక్రయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభించింది. ఎక్సైజ్ శాఖ గణాంకాల ప్రకారం, ఈ మూడు రోజుల్లోనే వందల కోట్ల రూపాయల పన్ను ఆదాయం రాష్ట్ర ఖజానాకు చేరింది.ప్రతి సంవత్సరం డిసెంబర్ చివరి వారంలో మద్యం అమ్మకాలు పెరగడం సాధారణమే. అయితే ఈసారి రికార్డు స్థాయిలో అమ్మకాలు జరగడం గమనార్హం. ఇది ప్రజల వినియోగ ధోరణిని, వినోదం పట్ల ఉన్న ఆసక్తిని ప్రతిబింబిస్తోంది. -
భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
2026 సంవత్సరం మొదటి రోజు భారతదేశం అంతటా.. హోటళ్ళు, రెస్టారెంట్లు, సర్వీస్ ఆపరేటర్లకు షాక్ తగిలింది. ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.. ఎల్పీజీ కమర్షియల్ గ్యాస్ ధరను రూ.111 పెంచాయి. తాజా సవరణతో.. దేశ రాజధానిలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.1,691.50కి (గతంలో రూ. 1,580.50 గా ఉండేది) పెరిగింది.ముంబైలో కూడా ఇదే విధంగా రూ.1,531.50 నుంచి రూ.1,642.50కి పెరిగింది. కోల్‌కతాలో ధర రూ.1,684 నుంచి రూ.1,795కి పెరిగింది. చెన్నైలో అత్యధిక ధరలు (రూ.1,739.50 నుంచి రూ.1,849.50కి) నమోదయ్యాయి. ధరలు పెరగడం వల్ల.. రోజువారీ కార్యకలాపాలకు గ్యాస్‌పై ఎక్కువగా ఆధారపడే వ్యాపారాలకు నిర్వహణ ఖర్చులను గణనీయంగా పెంచే అవకాశం ఉంది. అయితే గృహ వినియోగం కోసం ఉపయోగించే 14.2 కేజీల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.Oil marketing companies have increased the prices of commercial LPG gas cylinders. The rate of the 19 KG commercial LPG gas cylinder has been increased by Rs 111, effective from today, 1st January.In Delhi, the retail sale price of 19kg commercial LPG cylinder is now Rs 1691.50…— ANI (@ANI) January 1, 2026 -
31st నైట్ బిర్యానీ తిని వ్యక్తి మృతి.. ఆసుపత్రిలో 16 మంది !
-
న్యూ ఇయర్ హ్యాంగోవర్: ఇలా చేస్తే క్షణాల్లో రిలీఫ్..!
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో రాత్రంత ఆడిపాడి ఎంజాయ్ చేయడం కామన్. ముఖ్యంగా బిర్యానీలు, కూల్‌డ్రింక్స్‌తో చిల్ అవ్వుతూ..తెలియకుండానే ఎక్కువగా లాగించేస్తాం. దానికి తోడు లేటుగా ఏ అర్థరాత్రో బాగా పొద్దుపోయాక పడుకోవడంతో..తిన్న ఆహారమంతా అరగక పొద్దున్నంతా నరకరం చూస్తాం. తలంత పట్టేసి..అబ్బా చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలామందికి. ఆ హ్యాంగోవర్‌ని వదులించుకోవడం అంత ఈజీ కాదు కూడా. అలాంటి సమస్యను ఈ రిఫ్రెషింగ్ డిటాక్స్ పానీయాలతో సులభంగా చెక్ పెట్టేయొచ్చని చెబుతున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందామా..!.రాత్రిపూట..అందులోనూ బాగా లేట్‌నైట్ వేపుళ్లు, అధిక నూనెతో కూడిన పదార్థాలు తినడం కారణంగా జీర్ణక్రియ మందగిస్తుంది. ముఖ్యంగా తలనొప్పి, వికారం, పొట్ట ఉబ్బరం, అలసట, పార్టీ హ్యాంగోవర్ వంటి సమస్యలతో సతమతమవుతుంటారు. అలాంటి వాళ్లు ఈ సమస్య నుంచి తర్విరతగతిన రిలీఫ్ పొందాలంటే సరైన డిటాక్స్ పానీయాలను తీసుకుంటే చాలు అని చెబుతున్నారు. ఇవి హైడ్రేటెడ్‌గా ఉండేలా చేసి, కాలేయ పనితీరు, జీర్ణక్రియకు మద్దతిస్తాయి. శరీరం వేగంగా కోలుకోవడానికి సహాయపడతాయట. ముఖ్యంగా మద్యం సేవించినవారికి ఇవి మరింత హెల్ప్ అవుతాయని చెబుతున్నారు. ఇవి ఇంట్లోనే సులభంగా తయరు చేసుకోవచ్చట కూడా. గోరువెచ్చని నీళ్లు నిమ్మకాయ..ఇది హ్యాంగోవర్‌కు చాలా ప్రయోజనకరమైనది. గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు హైడ్రేటెడ్‌గా ఉండేలా చేసి, జీర్ణక్రియను ప్రేరేపిస్తుందట. విటమిన సీ మోతాదు..కాలేయ ఎంజైమ్‌లకు మద్దతిస్తుందట. వికారం, పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. చిటికెడు ఉప్పు, కొబ్బరి నీరు.. కొబ్బరి నీరు, ఉప్పు శరీరాన్ని తిరిగా ఉత్సాహభరితంగా ఉండేలా చేస్తుంది. ఇందులోని పొటాషియం, సహజ ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది హైడ్రేషన్‌కి అనువైనది. అలాగే శరీరంలోని సోడియం స్థాయిలను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. కడుపుని తేలికగా చేస్తుంది. తలతిరగడం, నోరు పొడిబారడం, వంటి సాధారణ హ్యాంగోవర్ లక్షణాలను తగ్గిస్తుంది. అల్లం, తేనె నీరుఅల్లం, తేనె నీరు అనేది హ్యాంగోవర్‌ను సులభంగా నయం చేసే అద్భుతమై డీటాక్స్ వాటర్. అల్లం జీర్ణవ్యవస్థను శాంతపరచడానికి సహాయపడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యను నివారిస్తుంది. వికారం తగ్గడమే కాకుండా ఇందులోని తేనే సహజ గ్లూకోజ్‌ని అందిస్తుంది.దోసకాయ, పుదీనా, నిమ్మకాయ డిటాక్స్ వాటర్ఇది పొట్ట ఉబ్బరాన్ని తగ్గించి, హైడ్రేషన్‌కు మద్దతిస్తుంది. ముక్కలు చేసిన దోసకాయ, పుదీనా ఆకులు, నిమ్మకాయ ఒక బాటిల్ వాటర్‌లో వేసి రోజంతా త్రాగండి. దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పుదీనా జీర్ణక్రియకు మద్దతిస్తుంది. నిమ్మకాయ కాలేయ పనితీరుకు మద్దతిస్తుంది.ఉసిరి నీళ్లు..శీతాకాలంలో ఉసిరిని చేర్చుకోవడం ఎంతో మంచిది. ఆమ్లాలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయ ఆరోగ్యానికి మద్దతిస్తాయి. ఆల్కహాల్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. అల్లం జీర్ణవ్యవస్థను శాంతపరచడానికి సహాయపడుతుంది. హ్యాంగోవర్ తర్వాత అద్భుతమైన రికవరీ పానీయంగా మారుతుంది. అలాగే జీర్ణక్రియకు, శక్తి స్థాయిలను మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది,జీరా (జీలకర్ర) నీరుజీరా కలిపిన నీరు మీ మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా నూతన సంవత్సరానంతర హ్యాంగోవర్‌ను నయం చేయడానికి కూడా గొప్ప నివారణి కూడా. జీరా నీటి ఆమ్లత్వం పొట్ట ఉబ్బరం నుంచి బయటపడేలా చేస్తుంది. బరువు, మలబద్దకం, కడుపు అసౌకర్యం వంటి వాటి నుంచి బయటపడేలా చేస్తుంది.నివారించాల్సినవి:హ్యాంగోవర్ సమయంలో వీటికి మాత్రం దూరంగా ఉండాలికాఫీ తీసుకోకుంటేనే మంచిది. ఆ సమయంలో కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఎనర్జీ డ్రింక్‌లు రక్తంలోని చక్కెరను పెంచుతాయి, అలాగే కాలేయంపై మరింత ఒత్తిడి ఏర్పడేలా చేస్తుంది. నొప్పి నివారణ మందులు దరిచేరనివ్వకుండా ఉండటం.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: గాంధీ కుటుంబం మెచ్చే రణతంబోర్ నేషనల్ పార్క్..! అక్కడ న్యూ ఇయర్‌కి..) -
తొలి గ్రీటింగ్ అలా..‘ఆర్చీస్’ సామ్రాజ్యం ఇలా..
ఒకప్పుడు నూతన సంవత్సరం వేళ ప్రతి ఇంట్లోనూ సందడి చేసిన గ్రీటింగ్ కార్డ్స్ ఇప్పుడు కనుమరుగయ్యాయి. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే.. 80, 90వ దశకాల్లో గ్రీటింగ్ కార్డ్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పండుగలు, పుట్టినరోజులు, ముఖ్యంగా కొత్త సంవత్సరం వేడుకల సమయంలో ఒకరికొకరు కార్డులు ఇచ్చిపుచ్చుకోవడం ఒక గొప్ప అనుభూతిగా ఉండేది. ఈ గ్రీటింగ్ కార్డుల విప్లవం వెనుక ఒక ఆసక్తికర కథ ఉంది. రోడ్డు పక్కన పోస్టర్లు అమ్ముకునే ఒక సామాన్య యువకుడు.. కేవలం ఐదు వేల రూపాయల అప్పుతో భారతదేశంలో గ్రీటింగ్ కార్డుల విస్తృత వినియోగానికి నాంది పలికాడు. తద్వారా వందల కోట్ల కంపెనీని కూడా నెలకొల్పాడు.గ్రీటింగ్ కార్డ్ పుట్టుక.. లండన్ నుండి భారత్‌కు..గ్రీటింగ్ కార్డుల చరిత్ర 182 ఏళ్ల నాటిది. 1843లో లండన్‌కు చెందిన ప్రభుత్వ అధికారి సర్ హెన్రీ కోల్.. క్రిస్మస్ సందర్భంగా తనకు వచ్చే వందలాది లేఖలకు సమాధానం ఇవ్వలేక ఒక కొత్త ఆలోచన చేశారు. తన స్నేహితుడు, ఆర్టిస్ట్ జాన్ కాల్కాట్ హార్స్లీచేత ఒక చిత్రాన్ని గీయించి, దానిపై ‘క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని రాయించారు. ఇదే ప్రపంచంలో మొట్టమొదటి కమర్షియల్ గ్రీటింగ్ కార్డ్. బ్రిటీష్‌వారు భారత్‌ను పరిపాలిస్తున్న సమయంలో గ్రీటింగ్ సంస్కృతి భారత్‌లో ప్రవేశించింది. 1979లో అనిల్ మూల్చందాని అనే యువకుడు ‘ఆర్చీస్’ (Archies) సంస్థ ద్వారా గ్రీటింగ్ కార్డులను సామాన్యులకు చేరువ చేశారు.అప్పుతో మొదలైన ‘ఆర్చీస్’ ప్రస్థానంఢిల్లీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయిన అనిల్ మూల్చందాని, ఒకవైపు తన తండ్రికి చీరల దుకాణంలో సాయం చేస్తూనే, మరోవైపు పోస్టర్లు అమ్మేవారు. 1981లో ఆయన ఢిల్లీలోని కమలా నగర్లో కేవలం రూ. ఐదు వేల పెట్టుబడితో ఒక చిన్న దుకాణాన్ని ప్రారంభించారు. అనిల్ అమోఘ కృషితో ‘ఆర్చీస్’ బ్రాండ్ దేశవ్యాప్తంగా విస్తరించింది. గ్రీటింగ్ కార్డులు ప్రతి మధ్యతరగతి ఇంటికీ చేరాయి. ఒకానొక దశలో ఈ కంపెనీ విలువ రూ.100 కోట్లకు చేరింది. నేటి సోషల్ మీడియా యుగంలోనూ ఈ సంస్థ సుమారు రూ. 70 కోట్ల విలువతో తన ఉనికిని చాటుకుంటోంది.డిజిటల్ యుగంలోనూ జ్ఞాపకాలుప్రస్తుత స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా కాలంలో వాట్సాప్ సందేశాలు ప్రాచుర్యం పొందినప్పటికీ, గ్రీటింగ్ కార్డుల ప్రాముఖ్యత పూర్తిగా తగ్గిపోలేదు. ఆన్లైన్ గిఫ్టింగ్ పోర్టల్స్ ద్వారా నేటికీ కార్డుల అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. చేతితో చక్కగా రాసిన సందేశం అందించే ఆత్మీయత డిజిటల్ మెసేజ్‌లలో కనిపించదని కొందరు నమ్ముతుంటారు. వారు ఇప్పటికీ శుభాకాంక్షలను తెలిపేందుకు గ్రీటింగ్ కార్డులనే ఎంచుకుంటున్నారు. అందుకే గ్రీటింగ్ కార్డుల యుగం ముగిసిందని చెప్పలేం.. అది కేవలం తన రూపాన్ని మార్చుకున్నదని మాత్రమే అనగలం.ఇది కూడా చదవండి: ఆ దేశాల్లో కానరాని సంబరాలు.. కారణమిదే.. -
ఆ దేశాల్లో కానరాని సంబరాలు.. కారణమిదే..
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాల్లోని ప్రజలు జనవరి ఒకటవ తేదీన నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటారు. ఆరోజు విందు వినోదాలతో వేడుకలు చేసుకుంటారు. అయితే అన్ని దేశాల్లోనూ జనవరి ఒకటి నూతన సంవత్సర ఆరంభం కాదు. కొన్ని దేశాల్లో తమ సంస్కృతులు, ప్రాచీన క్యాలెండర్లు, చంద్రుని గమనం (లూనార్ సైకిల్స్) ఆధారంగా వేర్వేరు తేదీలలో కొత్త ఏడాదిని స్వాగతిస్తారు. నూతన సంవత్సర వేడుకలు వందల ఏళ్ల నాటి సంప్రదాయాలకు ప్రతిరూపాలు.డ్రాగన్ డ్యాన్స్‌ల హోరుచైనీస్ నూతన సంవత్సరం సాధారణంగా ఫిబ్రవరి 17 నుండి మార్చి 3 మధ్య వస్తుంది. ఏకంగా 15 రోజుల పాటు వేడుకలు జరుగుతాయి. ఆ రోజుల్లో డ్రాగన్ డ్యాన్స్‌లు, ఎరుపు రంగు లాంతర్లు, కుటుంబ విందులతో చైనా కళకళలాడుతుంది. ప్రతి ఏటా ఒక జంతువును ‘రాశి’ (Zodiac Animal) గా పరిగణించడం వీరి ప్రత్యేకత.రైస్ కేక్ సూప్ తింటే..కొరియాలో 'సోల్లాల్' (Seollal) పేరుతో మూడు రోజుల పాటు నూతన సంవత్సర వేడుక నిర్వహిస్తారు. 2026, ఫిబ్రవరి 17న ఇది మొదలుకానుంది. ఈ సందర్భంగా అక్కడి వారంతా ‘టెక్గుక్’ (tteokguk) అనే రైస్ కేక్ సూప్‌ను సేవిస్తారు. ఇది తింటే వయస్సు ఒక ఏడాది పెరుగుతుందని వారు నమ్ముతారు.దేశవ్యాప్తంగా వాటర్ ఫైట్థాయిలాండ్లో ఏప్రిల్ 13 నుండి 15 వరకు 'సోంగ్క్రాన్' (Songkran) పేరిట నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటారు. దేశవ్యాప్తంగా వాటర్ ఫైట్ నిర్వహిస్తారు. ఇది చెడును కడిగివేస్తుందని వారు భావిస్తారు.నిశ్శబ్ధ స్వాగతంబాలిలో 'న్యేపి' (Nyepi) అనే నిశ్శబ్ద వేడుక జరుగుతుంది. 2026 మార్చి 19న జరగబోయే ఈ వేడుకలో భాగంగా 24 గంటల పాటు ద్వీపం మొత్తం నిశ్శబ్ధంగా మారుతుంది. విమానాలు, ట్రాఫిక్, లైట్లు, శబ్దం ఏమీ ఉండవు. ప్రజలంతా ప్రశాంతంగా మెలుగుతూ ధ్యానంలో కాలం గడుపుతారు.ఇస్లామిక్ నూతన సంవత్సరం (హిజ్రీ)ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరం ప్రతి ఏటా మారుతూ ఉంటుంది (2026లో జూన్ 16-17 తేదీలలో రావచ్చు). చంద్రుని గమనం ఆధారంగా ఏటా సుమారు 11 రోజులు ముందుకు జరుగుతుంది. ఇతర దేశాల్లో ఉండే అట్టహాసాలు, పార్టీలకు భిన్నంగా ఇక్కడ ఆ రోజున ప్రశాంతత పాటిస్తూ, ప్రార్థనలు, ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతారు. ఇది కూడా చదవండి: New Year 2026: రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ శుభాకాంక్షలు -
నూతన సంవత్సరంలో తొలి సన్ రైజ్ ను చూడటానికి పొటెత్తిన టూరిస్టులు
-
న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన సినీ సెలబ్రిటీలు (ఫోటోలు)
-
న్యూ ఇయర్ రెజల్యూషనా?.. ఛా అవతలికి పో!
కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం. సాధారణంగానే.. ఈ టైంలో ‘రెజల్యూషన్స్’ తెరపైకి రావాలి. కానీ, ఈసారి ఎందుకనో ఆ హడావిడి లేదు. ఇటు సోషల్ మీడియాలో ఆ పదం ఎక్కడో అరుదుగా కనిపిస్తోంది. ఎవరినైనా మైక్ పెట్టి కదిలిస్తే దాంతోనే కొట్టేలా కనిపిస్తున్నారు. అదే సమయంలో.. నెట్టింట వైరల్ అవుతున్న ఓ పాత వీడియో గురించి చర్చించుకుంటున్నారు. న్యూఇయర్ అనగానే కొత్తగా ‘రెజల్యూషన్స్’ షురూ అవుతాయి. అప్పుడైతే ఉత్సాహం టన్నులకొద్దీ ఉంటుంది. మంచి అలవాట్లు మొదలుపెట్టి.. పాడు పద్ధతులను పాతరేయాలనుకుంటారు. నాలుగు రోజులు గడిచాయా.. ఉత్సాహం ఉసూరుమంటుంది. నెల తిరిగేసరికల్లా ‘ఇక మనవల్ల కాదులే’ అని చేతులెత్తేస్తారు.. మోటివేషన్ సూత్రాలు ఇక్కడ ఏమాత్రం పని చేయవు. ఒకప్పుడు.. కనిపించిన దృశ్యాలివి. 1997లో శేఖర్ సుమన్ లేట్‌నైట్ టాక్ షో Movers and Shakers కోసం ప్రజల వద్దకు వెళ్లి వారి న్యూఇయర్ రెజల్యూషన్స్ అడిగారు. వారు నిర్మోహమాటంగా చెప్పిన సమాధానాలు ఇప్పటికీ గుర్తుండిపోయేలా ఉన్నాయి. చాలామంది “స్ట్రిక్ డైట్ పాటిస్తాం” అన్నారు. ఒక యువతి “ఎక్కువ మంది బాయ్‌ఫ్రెండ్స్ సంపాదించుకుంటా” అని చెప్పగా, ఇంకో యువకుడు “నెలకో గర్ల్‌ఫ్రెండ్ మార్చేస్తా” అంటూ సరదాగా స్పందించాడు.“ఈ ఏడాదిలో అయినా జీన్స్, టీషర్ట్స్ కొనుక్కుంటా” అని ఓ యువకుడు, “ఈ ఏడాదిలోనైనా బడికి బండెడు పుస్తకాలు మోయకూడదనుకుంటున్నా” అంటూ ఓ పిలగాడు ఇచ్చిన సమాధానాలు చిరునవ్వు తెప్పించాయి. ఎలాగైనా ఖర్చులు తగ్గించుకుంటాం అంటూ చెప్పిన సమాధానాలు ఇప్పుడు చాలామందికి కనెక్ట్ అవుతున్నాయి. నిజాయితీతో కూడిన ఆ సమాధానాలు నేటి నెటిజన్లను కూడా ఆకట్టుకుంటున్నాయి. View this post on Instagram A post shared by The90sIndia🤩 (@the90sindia)మరి ఇప్పుడో.. గత కొన్నేళ్లుగా కొత్త ఏడాది తీర్మానాలు (Ne Year Resolutions) విషయంలో మునుపటి ఉత్సాహం కనిపించడం లేదు. డిజిటల్ ఎరాలో డైరీల్లో రాసుకోవడం, బొమ్మలు గీసుకుని గోడలకు తగిలించుకోవడం నామోషీ అయిపోయింది. మొదలు పెట్టిన జోష్‌ను పాత అలవాట్లు మింగేయడం.. బిజీ లైఫ్‌స్టైల్‌తో కొన్ని వారాలకే మరిచిపోవడం.. సాధ్యం కాని పెద్ద ప్లాన్లు పెట్టుకోవడం వాటిని మధ్యలోనే వదిలేసేలా చేస్తున్నాయి. ఆఖరికి.. ఆరోగ్యంగా ఉండాలి అనే ఆర్డినరీ రెజల్యూషన్‌ను కూడా పక్కన పెట్టాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటప్పుడు మీ న్యూఇయర్ రెజల్యూషన్స్ ఏది? అని అడిగితే.. ఛా అవతలికి పో అనే సమాధానం ఎక్కువగా వినిపించదంటారా? ఆరోజుల్లో.. సాధారణంగా వినిపించిన రెజల్యూషన్స్బరువు తగ్గాలిజిమ్కి క్రమం తప్పకుండా వెళ్లాలిడైట్ పాటించాలి (స్ట్రిక్ డైట్ చాలా పాపులర్)పొగ తాగడం మానేయాలిచదువు & కెరీర్పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలికొత్త స్కిల్ నేర్చుకోవాలిఉద్యోగంలో కష్టపడి ప్రమోషన్ పొందాలిమంచి స్నేహితులు సంపాదించుకోవాలిసరైన బాయ్‌ఫ్రెండ్/గర్ల్‌ఫ్రెండ్ సంపాదించుకోవాలికుటుంబంతో ఎక్కువ సమయం గడపాలిఖర్చు తగ్గించుకోవాలిపొదుపు చేయాలిఅప్పులు తీర్చేయాలిమద్యం తగ్గించుకోవాలికొత్త పుస్తకాలు చదవాలికొత్త ప్రదేశాలు చూడాలికొత్త హాబీ మొదలుపెట్టాలి (ఫోటోగ్రఫీ, మ్యూజిక్ వంటివి)ఆరోజుల్లో.. రెజల్యూషన్స్ ఎక్కువగా వ్యక్తిగత ఆరోగ్యం, చదువు, సంబంధాలు, డబ్బు చుట్టూ తిరిగేవి. అప్పట్లో సోషల్ మీడియా లేకపోవడం వల్ల ప్రజలు తమ రెజల్యూషన్స్‌ను నేరుగా చెప్పేవారు, టీవీ షోలు, పత్రికలు, డైరీల్లో రాసుకునేవారు. సోషల్ మీడియా వాడకం పెరిగాక.. పోస్టులు కూడా చేసి చాటి చెప్పుకునేవారు. మరి ఇప్పుడో.. ఈ డిజిటల్ యుగంలో ప్రైవేట్‌గా ఉంచుకోవడమో లేదంటే అసలు పెట్టుకోవడమే బెస్ట్‌గా ఫీలవుతున్నారు. -
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
-
న్యూ ఇయర్.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
-
2026: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న కోహ్లి పోస్ట్
సరికొత్త ఆశలతో మానవాళి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టింది. నవ్వులతో నవ వసంతానికి నాంది పలుకుతూ నూతన ఏడాది ఆగమనాన్ని వేడుకగా జరుపుకొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా నిండిపోయింది.ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. వ్యక్తిగత జీవితానికి సంబంధించి కోహ్లి గతేడాది సెప్టెంబరులో చివరగా ఓ ఫొటో షేర్ చేశాడు. తన సతీమణి అనుష్క శర్మ (Anushka Sharma)తో కలిసి దిగిన చిత్రాన్ని పంచుకుంటూ.. చాన్నాళ్ల తర్వాత ఇలా అంటూ అభిమానులను పలకరించాడు.లైట్ ఆఫ్ మై లైఫ్ఆ తర్వాత చాలాకాలానికి తాజాగా కోహ్లి న్యూ ఇయర్ సందర్భంగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాడు. ‘‘నా జీవితాన్ని కాంతులతో నింపే అత్యంత ముఖ్యమైన, విలువైన వ్యక్తితో కలిసి 2026లోకి అడుగుపెడుతున్నాను’’ అంటూ అనుష్క శర్మతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. భార్యపై ప్రేమను చాటుకున్నాడు. ఈ పోస్టు నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. పది మిలియన్లకు పైగా దూసుకుపోతూ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. లండన్లోనేకాగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించిన కోహ్లి.. 2017లో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం. పిల్లలను సెలబ్రిటీ లైఫ్ నుంచి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో విరుష్క జోడీ ఎక్కువగా లండన్‌లోనే నివాసం ఉంటోంది. ఇంతవరకు వారి ఫొటోలను కూడా రివీల్ చేయకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇక ఈ జంట ఇటీవలే ఎనిమిదో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొంది.టెస్టులకు బైబైఇదిలా ఉంటే.. కోహ్లికి 2025 మిశ్రమంగా గడిచింది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో అతడు వరుసగా విఫలమై విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ క్రమంలో అనూహ్య రీతిలో మే నెలలో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. సంప్రదాయ ఫార్మాట్లో పదివేల పరుగులు చేయకుండానే ‘టెస్టు కింగ్’ నిష్క్రమించడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే, వన్డేల్లో మాత్రం కోహ్లి మరోసారి సత్తా చాటాడు.వన్డే రారాజుగానే..రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్‌ను భారత్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించిన కోహ్లి.. ఆసీస్ టూర్లో మాత్రం వరుస మ్యాచ్‌లలో డకౌట్ అయ్యాడు. అయితే, అదే పర్యటనలో మూడో వన్డేతో ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి.. ఇటీవల స్వదేశంలో సౌతాఫ్రికాతో సిరీస్‌లో వరుస శతకాలతో చెలరేగాడు. తద్వారా 53వ వన్డే సెంచరీ నమోదు చేసి అత్యధిక సెంచరీల వీరుడిగా తన రికార్డు తానే సవరించాడు. ఇక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ బ్యాటర్.. ఇక్కడా శతక్కొట్టాడు. కాగా ఐపీఎల్ టైటిల్ గెలవాలనే కోహ్లి చిరకాల కోరిక గతేడాది నెరవేరినా.. ఆర్సీబీ విజయోత్సవాలకు వచ్చిన అభిమానులు తొక్కిసలాటలో మృతి చెందడంతో విషాదం నెలకొంది. చదవండి: 2026లో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌లు ఇవే..! View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
New Year 2026: రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 2026 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో సుఖశాంతులను, అభివృద్ధిని నింపాలని వారు ఆకాంక్షించారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వారు ప్రత్యేక సందేశాలను అందించారు. नव वर्ष के उल्लासपूर्ण अवसर पर, मैं देश और विदेश में बसे सभी भारतीयों को हार्दिक बधाई और शुभकामनाएं देती हूं। pic.twitter.com/GEj29ZxOxd— President of India (@rashtrapatibhvn) January 1, 2026అభివృద్ధి దిశగా అడుగులు: రాష్ట్రపతి ముర్మురాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సందేశంలో 2026 సంవత్సరం సానుకూలతకు, నూతన శక్తికి చిహ్నమని పేర్కొన్నారు. ఈ ఏడాది దేశానికి మరిన్ని గొప్ప అవకాశాలను అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మనం మన దేశం, సమాజ శ్రేయస్సు, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండాలి. 2026 అందరి జీవితాల్లో శ్రేయస్సును తీసుకురావాలని కోరుకుంటున్నాను. అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో మనమందరం భాగస్వాములం అవుదాం’ అని ఆమె పిలుపునిచ్చారు.Wishing everyone a wonderful 2026!May the year ahead bring good health and prosperity, with success in your efforts and fulfilment in all that you do. Praying for peace and happiness in our society.— Narendra Modi (@narendramodi) January 1, 2026ఆరోగ్యం, విజయం సిద్ధించాలి: ప్రధాని మోదీ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే ఏడాది అందరికీ మంచి ఆరోగ్యాన్ని, శ్రేయస్సును అందించాలని ఆయన ప్రార్థించారు. ‘ప్రతి ఒక్కరికీ విజయం లభించాలని, వారు చేసే పనుల్లో సంతృప్తి కలగాలని కోరుకుంటున్నాను. మన సమాజంలో శాంతి, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ప్రధాని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.As we welcome 2026, may this year deepen India’s collective resolve and renew our commitment to nation-building. Guided by our timeless civilisational values and driven by innovation, self-reliance and unity, let us work together to strengthen India’s security, prosperity and…— Rajnath Singh (@rajnathsingh) January 1, 2026రైతు సంక్షేమమే లక్ష్యం: కేంద్ర మంత్రులురక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన ట్వీట్లో.. 2026వ సంవత్సరం ప్రగతి, సామరస్యం, అచంచలమైన జాతీయ భావనలతో నిండి ఉండాలని ఆశించారు. ఆవిష్కరణలు, స్వావలంబన ద్వారా భారతదేశ భద్రతను మరిత బలోపేతం చేయడానికి అందరూ కలిసి పనిచేయాలని ఆయన కోరారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. అందరికీ శాంతి, పురోగతి కలగాలని ఆకాంక్షించగా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రతి రైతు ఇల్లు, వాకిలి.. సంపద, ధాన్యాలతో కళకళలాడాలని, అందరి జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.ఇది కూడా చదవండి: 2026లో తొలి సూర్యోదయం.. ఢిల్లీ నుంచి పూరీ వరకూ.. -
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
2026లో తొలి సూర్యోదయం.. ఢిల్లీ నుంచి పూరీ వరకూ..
న్యూఢిల్లీ: దేశంలోని ప్రజలంతా సరికొత్త ఆశలు, ఉత్సాహం, భక్తి భావాల మధ్య 2026కు ఘనంగా స్వాగతం పలికారు. దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. అస్సాంలోని గౌహతిలో ఆవిష్కృతమైన ఈ ఏడాది తొలి సూర్యోదయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెల్లవారుజామున ఆకాశంలో పరుచుకున్న తొలి కిరణాలు ఒక సరికొత్త ఆరంభానికి ప్రతీకగా నిలిచాయి. దీనికి సంబంధించిన విజువల్స్‌ను ఏఎన్ఐ (ఏఎన్ఐ) షేర్ చేసింది. ఆధ్యాత్మిక ప్రార్థనలు, వేడుకల కోలాహలం మధ్య దేశ ప్రజలు నూతన ప్రయాణాన్ని అత్యంత ఉత్సాహంగా ప్రారంభించారు. ఏ ప్రాంతంలో వేడుకలు ఎలా జరిగాయనే వివరాల్లోకి వెళితే.. #WATCH | Assam | First sunrise of 2026 as seen from Guwahati pic.twitter.com/43vidO5R46— ANI (@ANI) January 1, 2026దేశ రాజధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత మధ్య వేడుకలు జరుగుతున్నాయి. దాదాపు 20,000 మంది పోలీసుల పహారా కొనసాగుతోంది. నిఘాను మరింతగా పెంచి, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలను పోలీసులు అరికట్టారు. మంచు కురుస్తున్న కశ్మీర్ లోయలో పర్యాటకుల సందడి నెలకొంది. గుల్మార్గ్, పహల్గామ్ వంటి ప్రాంతాలు పర్యాటకులతో నిండిపోయాయి. శ్రీనగర్‌లోని చారిత్రాత్మక లాల్ చౌక్ క్లాక్ టవర్ వద్ద జరిగిన వేడుకలు కొత్త ఏడాదికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.#WATCH | Odisha | First sunrise of 2026 as seen from Puri pic.twitter.com/zjbIPss7FY— ANI (@ANI) January 1, 2026దేశంలోని మెట్రో నగరాల్లో పటిష్టమైన నిఘా నీడలో వేడుకలు జరిగాయి. ముంబై మహానగరంలో మెరైన్ డ్రైవ్, జుహు బీచ్ వంటి ప్రాంతాల్లో 17,000 మందికి పైగా సిబ్బంది భద్రతను పర్యవేక్షించారు. మహిళలు, పిల్లల రక్షణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. బెంగళూరులో కూడా 20,000 మంది పోలీసుల కాపలా మధ్య నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. పౌరులు సంయమనం పాటిస్తూ, ఉత్సవాల్లో పాల్గొనేలా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు.#WATCH | Fireworks illuminate the night sky in Goa and people welcome #NewYear2026 pic.twitter.com/ZToByiyYxM— ANI (@ANI) December 31, 2025ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలో కొత్త ఏడాది వేడుకలు భక్తి భావంతో మొదలయ్యాయి. ప్రసిద్ధ దశాశ్వమేధ ఘాట్‌లో 1,001 దీపాలను వెలిగించి, నిర్వహించిన గంగా హారతి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కాశీ విశ్వనాథుని దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. ప్రయాగ్‌రాజ్, అయోధ్య వంటి పుణ్యక్షేత్రాలలో కూడా వేలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, పూజలు నిర్వహించి నూతన ఏడాదిని ప్రారంభించారు.తూర్పు తీరాన ఉన్న పూరీ క్షేత్రం భక్త జన సంద్రంలా మారింది. జగన్నాథుని ఆశీస్సుల కోసం దాదాపు 3.5 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ఎస్పీ ప్రతీక్ సింగ్ నేతృత్వంలో 2,100 మంది సిబ్బందితో కూడిన 70 ప్లాటూన్ల బలగాలను ఆలయ పరిసరాల్లో మోహరించారు. 300కు పైగా సీసీటీవీ కెమెరాలతో నిఘా ఉంచడమే కాకుండా, సముద్ర తీరంలో భక్తుల రక్షణ కోసం 300 మంది లైఫ్‌గార్డులను ఏర్పాటు చేశారు. ఇది కూడా చదవండి: ‘ఆర్డర్ల’ సునామీ.. బిర్యానీలే కాదు, ఐఫోన్లు, బంగారు నాణేలు కూడా.. #WATCH | Dubai, UAE | Mesmerising fireworks, and a light and sound show illuminate the Burj Khalifa as the world rings in #NewYear2026 Source: Emaar pic.twitter.com/ir9rJHlp4k— ANI (@ANI) December 31, 2025 #WATCH | Varanasi, UP | Morning prayers being performed at Kashi Vishwanath Temple on the first day of #NewYear2026 Source: Kashi Vishwanath Temple Trust pic.twitter.com/q42QbqIlht— ANI (@ANI) January 1, 2026 -
హైటెక్ సిటీలో ఉత్సాహంగా న్యూ ఇయర్ వేడుకలు (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు (ఫొటోలు)
-
‘ఆర్డర్ల’ సునామీ.. బిర్యానీలే కాదు, ఐఫోన్లు, బంగారు నాణేలు కూడా..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రజలు 2026 నూతన సంవత్సర సంబరాల్లో మునిగితేలుతున్నారు. నిన్న అర్థరాత్రి కొత్త సంవత్సరాన్ని స్వాగతించిన జనం డెలివరీ యాప్ స్విగ్గీ (Swiggy)కి కాసుల వర్షం కురిపించాయి. డిసెంబర్ 31 రాత్రి భారతీయులు పీక్ స్టేజ్‌లో ఫుడ్ ఆర్డర్లు చేస్తూ రికార్డులు సృష్టించారు. అయితే కేవలం ఆహార పదార్థాలే కాకుండా, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులను కూడా భారీగా ఆర్డర్ చేయడం గమనార్హం.డిసెంబర్ 31 రాత్రి వేళ తమకు వచ్చిన ఆర్డర్ల గురించి స్విగ్గీ సీఈఓ రోహిత్ కపూర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న వివరాలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకల్లో ఎప్పటిలానే బిర్యానీ అగ్రస్థానంలో నిలిచింది. స్విగ్గీ నిమిషానికి వందల సంఖ్యలో బిర్యానీ ఆర్డర్లను డెలివరీ చేసింది. అయితే ఈసారి ప్రజలు కేవలం ఆహారానికే పరిమితం కాకుండా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా ఖరీదైన వస్తువులను కూడా కొనుగోలు చేశారు. వేడుకల సమయంలో పలువురు ఏకంగా ఐఫోన్లను, బంగారు నాణేలను, స్మార్ట్ వాచ్‌లను కూడా ఆర్డర్ ఇచ్చారు. ఒకే రోజులో ఇన్ని రకాల విభిన్న వస్తువుల ఆర్డర్లు రావడం ఆశ్చర్యపరిచేదిగా మారింది. abhi 7:30 bhi nahi baje hai aur 2,18,993 biryanis order ho chuki hai. king fr 👑— Swiggy Food (@Swiggy) December 31, 2025గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆర్డర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. రాత్రి 8 గంటల సమయానికే స్విగ్గీ ప్లాట్‌ఫారమ్ ట్రాఫిక్ గరిష్ట స్థాయికి చేరింది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ తదితరత నగరాల్లో ఆర్డర్లు వెల్లువెత్తాయి. ముఖ్యంగా కండోమ్స్, పార్టీ స్నాక్స్, కూల్ డ్రింక్స్, పూల అమ్మకాలు కూడా రికార్డు స్థాయిలో జరిగాయి. డెలివరీ బాయ్స్ విరామం లేకుండా పనిచేస్తూ వేల సంఖ్యలో ఆర్డర్లను వినియోగదారులకు అందించారు.వినియోగదారుల నుండి వచ్చిన ఈ భారీ డిమాండ్‌ను తట్టుకునేందుకు స్విగ్గీ ముందస్తుగానే తగిన ఏర్పాట్లు చేసుకుంది. యాప్ క్రాష్ కాకుండా సంస్థ సాంకేతిక బృందాలు నిరంతరం పర్యవేక్షించాయి. అత్యధిక రద్దీ ఉన్న సమయాల్లో కూడా డెలివరీ ఆలస్యం కాకుండా అదనపు సిబ్బందిని రంగంలోకి దించారు. వేడుకల సమయాల్లో కస్టమర్ల అవసరాలను తీర్చడంలో.. క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ఎలా ఉపయోగపడుతున్నాయో ఈ నూతన సంవత్సర ఆర్డర్లు నిరూపించాయి.ఆశ్చర్యపరిచే ఆర్డర్లు2026 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా చాలామంది క్విక్-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను ఆశ్రయించారు. ‘స్విగ్గీ’కి రాత్రి 7:30 గంటలకే రికార్డు స్థాయిలో 2,18,993 బిర్యానీలు ఆర్డర్ అయ్యాయి. రాత్రి 9:30 గంటల సమయానికి 90,000 కంటే ఎక్కువ బర్గర్లు, 7,573 గజర్ కా హల్వా ఆర్డర్లు అందాయి. ఆరోగ్యకరమైన ఆహారం వైపు మొగ్గు చూపుతూ, 4,244 మంది ఉప్మాను, బెంగళూరులో 1,927 మంది సలాడ్లను, 9,410 మంది కిచిడీని ఆర్డర్ చేశారు. బెంగళూరులో ఒక వినియోగదారుడు ₹1.8 లక్షల విలువైన రెండు ఐఫోన్లను, ముంబైలో మరొకరు ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా బంగారాన్ని కొనుగోలు చేశారు.ఇది కూడా చదవండి: సోషల్ మీడియాలో ‘ఫైనల్ ఇమేజ్- 2025’ హంగామా -
2026కు ఘన స్వాగతం పలికిన విశ్వమానవాళి... ఆనందోత్సాహాల నడుమ న్యూ ఇయర్ వేడుకలు
-
బ్రహ్మపుత్రపై డ్యామ్‌కు రూ. 15.27 లక్షల కోట్లు!
బీజింగ్: భారత్‌కు అత్యంత ముప్పుగా చెబుతున్న బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యామ్ నిర్మాణానికి ఏకంగా దాదాపు రూ.15.27 లక్షల కోట్లు(170 బిలియన్ డాలర్లు) కేటాయిస్తున్నట్టు అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ప్రకటించారు. బుధవారం నూతన సంవత్సర ప్రసంగంలో ఆయన ఈ మేరకు వెల్లడించారు. విద్యుదుత్పత్తి సాకుతో అరుణాచల్ ప్రదేశ్ కు అతి సమీపంగా టిబెట్ భూభాగంలో ఈ భారీ డ్యామ్ నిర్మాణాన్ని చైనా తలపెట్టడం తెలిసిందే. దీనివల్ల ఈశాన్య రాష్ట్రాలకు వరద ముప్పు పెరుగుతుందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక వైషమ్యాలు పెచ్చరిల్లిన వేళ ప్రా జెక్టులోని జలరాశిని మనపైకి జలఖడ్గంలా చైనా వాడే ప్రమాదం కూడా ఉందని వారంటున్నారు. అలాంటి డ్యామ్ విషయంలో దూకుడుగా ముందుకు వెళ్లేందుకే చైనా నిర్ణయించుకుందని జిన్ పింగ్ ప్రకటన తేటతెల్లం చేసింది. తైవాన్‌కు వార్నింగ్ తైవాన్ను ఎప్పటికైనా చైనాలో విలీనం చేసుకుని తీరతామని జిన్ పింగ్ పునరుద్ఘాటించారు. దీన్ని ఎవరూ ఆపలేరని కూడా అన్నారు. తద్వారా తైవాన్ కు మద్దతు పలుకుతున్న అమెరికా వంటి దేశాలను అన్యాపదేశంగా ఆయన హెచ్చరించారు. తైవాన్ చుట్టూ సైనిక కసరత్తులను కొద్ది రోజులుగా చైనా మరింత ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. -
'గ్రీటింగ్'.. 'చీటింగ్'
శ్రీకాకుళం క్రైమ్ : ఏడాది మారుతోంది. డిసెంబర్ 31 మొదలుకుని జనవరి 1 వరకు లెక్కలేనన్ని మెసేజీలు సెల్‌ను తాకుతాయి. న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పేరిట ఎస్ఎంఎస్లు, వాట్సాప్‌ల ద్వారా సందేశాలు వస్తా యి. వీటితోనే ప్రమాదం పొంచి ఉంది తెలియని సైట్లపై ఏమరపాటుగా క్లిక్ చేసినా మన అకౌంట్లలో నగదు క్షణాల్లో మాయమవుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. చీటింగ్ ఇలా..న్యూ ఇయర్ సందర్భంగా మొబైల్లో వచ్చే రకరకాల చిత్రాలు, సందేశాల పేర్లతో సహా తయారుచేసుకుని మెజేస్ పంపుతారు. మీకు నచ్చేవిధంగా మీ పేరుతో గ్రీటింగ్స్, సందేశాలను పంపుకోవచ్చని, ఫలానా లింక్‌పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే చాలని అంటారు. మన మొబైల్లో టెలిగ్రామ్, వాట్సాప్‌లను ఏపీకే (ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్) ఫైల్స్ రూపంలో మె సేజ్లను పంపిస్తారు. పొరపాటున ఆ లింక్‌ను క్లిక్ చేస్తే అంతే సంగతులు. మన ఫోన్లో సమాచారమంతా వారికి పోతుంది. కాంటాక్ట్ నంబర్లు, ఫొటో లు, వీడియోలు, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలే కాక డాక్యుమెంట్ ఫైళ్లు సైతం వీరికి చేరిపోతాయి. వెరిఫై చేసుకోవాలి.. రకరకాల గిఫ్ట్ ఓచర్లు, గ్రీటింగ్స్, ట్రావెల్, గాడ్జెట్స్, ఫ్యాషన్లపై ఇచ్చే డిస్కౌంట్లను ఒకటికి రెండుసార్లు నమ్మదగినవా కాదా అన్నది వెరిఫై చేసుకోవాలి. వాటి రివ్యూస్ చూస్తూ వెరిఫైడ్, అథెంటిక్ వెబ్సైట్లోకి వెళ్లి ఆఫర్లను తెలుసుకునేందుకు ప్రయతి్నంచాలి. కొత్త బృందాలు ఏర్పాటుశ్రీకాకుళం జిల్లాలో 2025లో వైట్ కాలర్ నేరాలు 171 నమోదయ్యాయి. సైబర్ నేరాల్లో బాధితులకు అందించే రికవరీ సొమ్ము రాబట్టుకునేలా ఇక కృషి చేస్తాం. ఆన్లైన్ నేరాలను ఛేదించేందుకు ఇప్పటికే కొత్త బృందాలను ఏర్పాటు చేశాం. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, సైబర్ క్రైమ్ సెల్‌తో సమన్వయం చేసుకుని 1930హెల్ప్‌లైన్ ఆన్లైన్ పోర్టల్ నిర్వహిస్తాం. విద్యాసంస్థల్లో, గ్రామాల్లో అవగాహన కల్పిస్తాం. – శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి జాగ్రత్తలు తప్పనిసరి.. » అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఏపీకే ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయరాదు. » ఫోన్లోని సెట్టింగ్‌లో ఇన్స్టాల్ ఫ్రం అన్నోన్ సోర్సెస్ అనే ఆప్షన్‌ను డిసేబుల్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనకు తెలియకుండా యాప్స్ ఇన్స్టాల్ కావు. » మొబైల్ సెట్టింగ్‌లో ఫోన్ నంబర్లను యాక్సిస్ చేసే అనుమతి ఇవ్వరాదు. » తెలియని ఏపీకే ఫైల్స్, మాల్వేర్స్ ఇన్స్టాల్ అయితే ఫోన్‌ను రీసెట్ చేయాలి. » ఈ–మెయిల్స్, టెక్ట్స్æ, ఇతర సోషల్ మీడియా యాప్‌ల ద్వారా నకిలీ లింక్స్‌ను గుర్తించాలి. వాటిని క్లిక్ చేయకుండా జాగ్రత్త పడాలి. » గివ్ అవేస్ పోటీల ద్వారా వినియోగదారులను ట్రాప్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని దోచేస్తారు. మన వివరాలను సేకరించి డార్క్‌వెబ్‌కు అమ్మేస్తారు. » మన మొబైల్, ల్యాప్‌టాప్ (కంప్యూటర్)లలో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్, యాంటీ వైరస్ ప్రోగ్రామ్, అధికారిక యాప్‌లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. -
మద్యం అమ్మకాలపై ‘న్యూ ఇయర్ సెస్’.. ‘పచ్చ’ సిండికేట్‌కి కిక్కే కిక్కు
సాక్షి, అమరావతి: మద్యం అమ్మకాలపై ‘న్యూ ఇయర్ సెస్’ వసూళ్లకు సర్కారు అనధికారిక అనుమతులు ఇచ్చేసింది. ఈ కానుకతో కొత్త సంవత్సరంతో ‘కిక్కే.. కిక్కు’ అంటోంది టీడీపీ మద్యం సిండికేట్. రాష్ట్రంలో మద్యం విక్రయాల వ్యవస్థను గుప్పెట పట్టిన టీడీపీ సిండికేట్ నూతన సంవత్సర వేడుకలను అవకాశంగా చేసుకుని మరింత దోపిడీకి తెగబడింది. అదనపు విక్రయ సమయాలకు ప్రభుత్వం అధికారికంగా పచ్చజెండా ఊపగా.. అనధికారిక వసూళ్లకు కూడా సై అంది. తద్వారా రెండ్రోజుల్లోనే రూ.500 కోట్ల మద్యం అమ్మకాలు, అనధికారికంగా మరో రూ.100 కోట్లు కొల్లగొట్టేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కరకట్ట బంగ్లా కనుసన్నల్లో రాష్ట్రంలో సాగుతున్న మద్యం దోపిడీ విధానంలో కొత్త అంకానికి తెరలేచింది. ఇకపై ఏ పండుగ వచ్చినా ఇదే విధానమని స్పష్టమైన సంకేతాలిచ్చింది. క్వార్టర్ బాటిల్‌పై రూ.50 బాదుడు కొత్త ఏడాది వేడుకలను టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి మరో అవకాశంగా చంద్రబాబు ప్రభుత్వం మార్చేసింది. అందుకోసమే బుధ, గురువారాల్లో ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు, అర్ధరాత్రి ఒంటిగంట వరకు బార్లలో మద్యం విక్రయాలకు అధికారికంగా అనుమతి ఇచ్చింది. ఎందుకంటే రాష్ట్రంలోని 3,336 మద్యం దుకాణాలు, 540 బార్లు టీడీపీ సిండికేటే ఏకపక్షంగా దక్కించుకుంది. దాదాపు 75 వేల బెల్ట్ దుకాణాలను అనధికారికంగా ఏర్పాటు చేసి ఊరూ వాడా మద్యం ఏరులై పారిస్తోంది. అంటే మొత్తం మద్యం వ్యవస్థ అంతా టీడీపీ సిండికేట్ గుప్పెట్లోనే ఉంది. ఇప్పటికే బాటిల్‌పై ఎంఆర్పీ ధర కంటే రూ.10 చొప్పున అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇక కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా బుధ, గురువారాల్లో మద్యం ధరలను అనధికారికంగా అమాంతం పెంచేశారు. ‘న్యూ ఇయర్ సెస్’ అంటూ అనధికారికంగా క్వార్టర్ బాటిల్‌పై రూ.50 అదనంగా వసూలు చేయాలని సిండికేట్ నిర్ణయించింది. అంటే ఫుల్ బాటిల్‌పై రూ.200 ధర పెంచేసినట్టే. ఇక బీర్ బాటిల్‌పై కూడా రూ.50 అనధికారికంగా పెంచేశారు. ఆ ప్రకారమే బుధవారం ఉదయం నుంచే మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి వరకు ఈ న్యూ ఇయర్ హంగామా దోపిడీ కొనసాగనుంది. రెండ్రోజుల్లో రూ.500 కోట్ల అమ్మకాలే లక్ష్యంబుధ, గురువారాల్లో మద్యం విక్రయాలు ఎంతగా పెరిగితే.. అంతగా దోపిడీ చేయవచ్చని టీడీపీ సిండికేట్ గుర్తించింది. అందుకే మద్యం విక్రయాల సమయాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఇక సాధారణ రోజుల్లో ఎంఆర్పీ ధరల ప్రకారం రాష్ట్రంలో రోజుకు దాదాపు రూ.90 కోట్ల మేర మద్యం విక్రయాలు సాగుతున్నాయి. 2025 జనవరి 1న రూ.147 కోట్ల మద్యం, 2025 సంక్రాంతి రోజున రూ.225 కోట్ల మద్యం విక్రయించారు. ఇప్పుడు ఆ రికార్డులను తిరగ రాయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. డిసెంబర్ 31న అంటే బుధవారం ఒక్క రోజే రూ.300 కోట్ల మార్కు దాటించాలని స్పష్టం చేసింది. జనవరి 1న విక్రయాలు కలిపి రూ.500 కోట్ల మద్యం విక్రయించాలని ఎక్సైజ్ అధికారులకు అనధికారికంగా టార్గెట్ ఇచ్చింది. వారం రోజులుగా ఎక్సైజ్ శాఖ మొత్తం అదే పనిలో నిమగ్నమైంది. ఎంత వీలైతే అంతగా తాగించేందుకు ఏమేం చేయాలో అన్నీ చేస్తోంది. రాష్ట్రంలోని బీచ్లలోని కూల్‌డ్రింక్స్ షాపులు, పల్లెలు, పట్టణాల్లోని కిళ్లీ కొట్లు, కిరాణా కొట్లను కూడా బెల్ట్ దుకాణాలుగా చేసేసుకోవాలని సిండికేట్‌కు పచ్చ జెండా ఊపింది. సూర్యలంక బీచ్‌లో కూల్‌డ్రింక్ దుకాణాల్లో బహిరంగంగానే మద్యం విక్రయిస్తుండటం గమనార్హం. రాష్ట్రం అంతా అదే పరిస్థితి నెలకొంది. కాగా న్యూ ఇయర్ స్పెషల్‌గా క్వార్టర్ బాటిల్‌పై రూ.50, బీరు బాటిల్‌పై రూ.50 అదనపు దోపిడీ ద్వారా మరో రూ.100 కోట్లు కొల్లగొడతారని అంచనా. తద్వారా మద్యం విక్రయాల అసలు విలువ రూ.600 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు.కరకట్ట బంగ్లా కనుసన్నల్లోనే..రాష్ట్రంలో టీడీపీ మద్యం సిండికేట్ అంతా కరకట్ట బంగ్లా కనుసన్నల్లోనే సాగుతోందన్నది బహిరంగ రహస్యం. అందుకోసమే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. ఆ స్థానంలో ఏర్పాటు చేసిన రాష్ట్రంలోని మొత్తం 3,336 మద్యం దుకాణాలు, 540 బార్ల లైసెన్సులను టీడీపీ సిండికేట్‌కు ఏకపక్షంగా కేటాయించింది. రాష్ట్రంలో విక్రయిస్తున్న ప్రతి మద్యం బాటిల్‌పై రూ.5 చొప్పున కరకట్ట బంగ్లాకు చేరుతోంది. అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.35వేల కోట్ల మద్యం విక్రయాలను ప్రభుత్వం ఎక్సైజ్ శాఖకు లక్ష్యం నిర్దేశించింది. ఇందుకు కొత్త సంవత్సరం, సంక్రాంతి, ఇతర పండుగల సీజన్‌ను వాడుకోవాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. -
ఇలా ఉంటే చాలు
2026 జనవరి 1.. కొత్త ఏడాది వచ్చేసింది. ‘న్యూ’ ఇయర్లో మనకు నిజంగా కిక్ ఇచ్చేదేమిటి? ‘‘జన వరి 1 నుండి ఇలా ఉండాలి’’ అని గట్టిగా ఒట్టేసు కోవటమే కదా! కానీ ఏమౌతుంది? ఫిబ్రవరి రాగానే.. మాట మీద నిలబడలేక నీరసించి పోతాం. అలాంటి నీరసాలు రాకుండా ఉండాలంటే.. కాస్తంటే కాస్తంత ప్రాక్టికల్‌గా ఉండే చాలు. మీ జీవితంలో ఇది నిజంగానే ‘న్యూ ఇయర్’ అవుతుంది. – సాక్షి, స్పెషల్ డెస్క్జీవితం సినిమా కాదుజనవరి 1 నుంచి.. ఎవ్వరూ పూర్తిగా వేరే మనిషి అయిపోరు. లైఫ్ అంటే సినిమా కాదు, స్క్రీన్ ప్లే ప్రకారం మొదలవ్వడానికి! ఒక్క అడుగు ముందుకు పడినా అది విజయమే. సౌండ్ స్లీప్నిద్ర అంటే కష్టపడి పనిచేశాక, అలసిపోయి తీసుకునే విశ్రాంతి కాదు. బాడీ, మైండ్ అన్నింటికీ అదే ఆధారం. ఉదయం లేవగానే.. ఒక చాట్‌జీపీటీ లేదా జెమినై పనిచేసినట్టు చురుగ్గా పనిచేయాలంటే సౌండ్ స్లీప్ అవసరం. రాత్రి ప్రశాంతంగా పడుకోండి.. ఉదయాన్నే ఫ్రెష్‌గా నిద్ర లేవండి. ‘జలయజ్ఞం’ ఎందుకు?యాప్‌లతో కొలుచుకుంటూ, అదో ‘జలయజ్ఞం’లా నీళ్లు తాగకండి. స్విచ్చేస్తేనే పని చేస్తాం అన్నట్టు మనం మరీ యంత్రాల్లా తయారైపోతే ఎలా? పక్కనే ఒక వాటర్ బాటిల్లో ఉంచుకొని ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఒక సిప్ వేయండి చాలు.కదలిక సరిపోతుందిమిమ్మల్ని జిమ్‌కి వెళ్లి బరువులు ఎత్తమని ఎవరన్నారు? ఎవరో జిమ్ చేసేస్తున్నారని మీరు ఫీలైతే ఎవరిది తప్పు? కాసేపు నడవండి. కాస్త ఒళ్లు విరుచుకోండి. ఓ 10 నిమిషాలు ఏదో ఒక పని చేయండి. నిన్నటి కంటే ఈరోజు కాస్త ఎక్కువ కదిలినా అదే పెద్ద సక్సెస్!వివరణల పురాణంఎవరికైనా, ఎందుకైనా ‘నో’ చెప్పటానికి వెయ్యి పురాణాల వివరణ ఇవ్వక్కర్లేదు. సోషల్ మీడియాలో లైకో షేరో కొట్టినంత ఈజీగా ‘నో’ చెప్పేయండి. మొదట ‘గిల్టీ’గా అనిపించినా, ఒకసారి ‘నో’ చెప్పేశాక చాలా ప్రశాంతంగా ఉంటుంది.ఆన్లైన్ యుద్ధాలేల?!సోషల్ మీడియా యుద్ధాలను ఆపేయండి. ట్రెండింగ్ పోస్టు వైరల్ అయినంత వేగంగా బీపీ పెరగటం తప్ప, అక్కడ గెలిస్తే మీకేమీ ‘ఆస్కార్’ రాదు. కనిపించే ప్రతి పోస్ట్‌కీ, కామెంట్‌కీ సమాధానం చెప్పి మీ టైమ్‌నీ, ఎనర్జీనీ వేస్ట్ చేసుకోకండి.బండి ‘స్టార్ట్’ చేయండికాన్ఫిడెన్స్ వచ్చాకే మొదలుపెడదాం అని వెయిట్ చేయకండి! ఏదైనా పని మొదలుపెట్టిన తర్వాతే ధైర్యం వస్తుంది. అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాకే అడుగు వేస్తాను అనుకుంటే, ఉన్నచోటే ఉండిపోతారు.‘క్యాష్’ ఫీలింగ్మీరు సంపాదించే ప్రతి రూపాయీ జాగ్రత్త. అలాగని.. తినే తిండిని, ఎంజాయ్మెంట్నీ కట్ చేయకండి. మీ జేబులోంచి రూపాయి ఎక్కడికి, ఎందుకు వెళ్తుందో గమనించండి. ఆ మాత్రం ‘క్యాష్’ ఫీలింగ్ ఉండాలి.ఒకటైనా ఫర్ఫెక్ట్గా..ఏ పనైనా స్టార్ట్ చేసిన తర్వాత వర్కవుట్ అవ్వట్లేదనిపిస్తే, దాన్ని అక్కడితో వదిలేసి ప్రశాంతంగా ఉండండి. సగం సగం వదిలేసిన పది పనుల కంటే, పర్ఫెక్ట్గా పూర్తి చేసిన ఒక్క పని మీకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది.రక్త పిశాచులకు దూరం!మీ ఎనర్జీని పీల్చేసే రక్త పిశాచులకు కాస్త దూరంగా ఉండండి! మీ మనశ్శాంతిని మీరు కాపాడుకోవడం స్వార్థం ఏమీ కాదు, అది ఒక ‘లైఫ్ సేవింగ్’ టెక్నిక్. వారానికో ఆశమన సంతోషాన్ని మనమే షెడ్యూల్ చేసుకోవాలి. ఒక ప్లాన్ ఉందంటే, ‘ఆహా, ఈ సండే ఎంజాయ్ చేయొచ్చు’ అనే ఆశ ఉంటుంది. ఆ అనుభవం మధురానుభూతిగా మిగులుతుంది. లేదంటే ప్రతి వారం ఒకేలా చప్పగా ఉంటుంది.వదిలేసి చూద్దురూ..!పాత పగల్ని, కక్షల్ని, కోపాల్ని పట్టుకుని వేలాడకండి. అవి అనవసర రోగాలు తీసుకొచ్చి ఆసుపత్రులను పోషించడానికి తప్ప ఎందుకూ పనికిరావు. ఒకసారి పగలూ, కోపాలూ ప్రతీకారాలూ వదిలేసి చూడండి, సోషల్ మీడియా కాసేపు స్తంభించిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత హాయిగా ఉంటుంది.మీకు మీరే సపోర్ట్ఎప్పుడూ మిమ్మల్ని మీరే తిట్టుకుంటూ, తక్కువ చేసుకుంటూ ఉంటే.. మీ పతనానికి బయట శత్రువులు అవసరమే లేదు. మీకు మీరే సపోర్టింగ్ పిల్లర్. ప్రాంప్ట్ ఇస్తేనే పనిచేసే ఏఐ చాట్‌బాట్‌లా ఉండకండి.కొత్తగా ఏదైనా..కొత్త లాంగ్వేజ్ లేదా ఒక కొత్త సాఫ్ట్వేర్ లేదా మ్యూజిక్.. ఇలా మీకు నచ్చింది, కొత్తది ఏదో ఒకటి నేర్చుకోండి. టార్గెట్లు అవీ పెట్టేసుకుని.. ఒక్కరోజులోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయాల్సిన టాస్క్‌లా ఫీల వకండి. మెల్లగా నేర్చుకున్నా సరే, అది నేర్చుకోవడమే.చెప్పుకొంటే తప్పేంటిమీకు సలహా కావాలన్నా, కాస్త సపోర్ట్ కావాలన్నా, లేదంటే మీ గోడు వినే మనిషి కావాలన్నా.. మీ సర్కిల్లో ఎవరో ఒకర్ని ఎంచుకోండి. మీ బాధలు చెప్పే క్రమంలో.. తనను హింసించకండి. తను కూడా మీలాంటి మనిషే అని గుర్తుంచుకోండి.మారటం మంచిదేఈ ఏడాది మీ ఇష్టాలు మారొచ్చు, కొన్ని లక్ష్యాలు మీకు పనికిరావు అనిపించవచ్చు. అది ఫెయిల్యూర్ కాదు, మీ ఎదుగుదల! పరిస్థితులకు తగ్గట్టుగా ప్లాన్స్ మార్చుకోవడం కూడా అప్డేట్ అవటమే.ఇల్లు ‘షోరూమ్’ కాదుమీ ఇల్లేమీ షోరూమ్ కాదు.. తళతళలాడుతూ ఉండాల్సిన అవసరమే లేదు. ఒకే రోజు ఇల్లంతా ఊడ్చి, తుడిచి, సర్ది నడుము విరగ్గొట్టుకోవడం కంటే.. రోజుకి కొంచెంగా క్లీన్ చేసుకోండి. అలాగే మెంటెయిన్ చేయండి చాలు!క్యాచ్ ద సిగ్నల్స్మీ బాడీ ఇచ్చే ‘సిగ్నల్స్’ని గమనించండి. అలసట, నొప్పులు.. ఊరికే రావు. అలాగని అన్నింటికీ భయాలూ పెంచుకోకండి. ఓ వయసు దాటాక అవసరమైన టెస్టులు చేయించుకోవ డం.. అత్యవ సరమైతే డాక్టర్లని సంప్రదించడం సర్వ సాధారణం అన్న విషయాన్ని మనసుకు సర్దిచెప్పండి.సిలబస్ ‘బుక్’ కాదుమంచి పుస్తకాల్ని చదవడం మంచిదే. కానీ అదేదో ఎగ్జామ్లానో సిలబస్ లానో ఫీల్ అవ్వకండి! ఎవరో చదువుతున్నారని మీరు కూడా ఏదో పుస్తకాన్ని కొని.. పట్టుకుని వేలాడాల్సిన అవసరం లేదు.అంతిమంగా..2026లో మీరు ఒక ‘పర్ఫెక్ట్ బొమ్మ’లా ఉండక్కర్లేదు. తప్పులు జరిగితే సరిచేసుకునే.. అలసిపోతే రెస్ట్ తీసుకునే.. మళ్లీ మళ్లీ ప్రయత్నించే ఒక ‘నిజమైన’ మనిషిగా ఉంటే చాలు. ఒకవేళ మధ్యలో ఎక్కడైనా తడబడినా.. సో వాట్? తిరిగి కొత్తగా మొదలుపెట్టండి. దాని కోసం మళ్లీ జనవరి 1 దాకా ఆగక్కర్లేదు. ఏదో ఒక మామూలు గురువారం (ఇది మీ ఇష్టం) మధ్యాహ్నం (ఇది కూడా..) 3 గంటలకు (ఇది.. కూడా) మీ లైఫ్‌ని మీరు రీస్టార్ట్ చేయొచ్చు!మీ లైఫ్.. మీ ఇష్టం.. దాన్ని బాగుచేసుకునేందుకు అది మీరు పడే కష్టం. ఆ కష్టం ఎవ్వరూ పడరు.. మీకు కష్టమొస్తే ఎవ్వరూ తీర్చరు. మైండిట్!హ్యాపీ న్యూ ఇయర్.. -
కొత్త ఏడాదిలో ప్రజలకు సుఖసంతోషాలు కలగాలి
సాక్షి, తాడేపల్లి: తెలుగు ప్రజలకు వైఎస్సార్సీపీ అధ్యక్షడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2026 సంవత్సరంలో ప్రజలకు సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారాయన.అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం.. ప్రతీ ఒక్కరి జీవితాలలో ఆరోగ్యం, ఆనందం, సంతృప్తి నింపే సంవత్సరం కావాలి. మీరు, మీ కుటుంబ సభ్యులు వెలుగుతో, నవ్వులతో నిండిన ఏడాది గడపాలని కోరుకుంటున్నా’’ అంటూ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారాయన. Happy New Year to all! May 2026 be a year of good health and deep fulfillment. Wishing you and your loved ones a year filled with light and laughter!#HappyNewYear2026— YS Jagan Mohan Reddy (@ysjagan) January 1, 2026అంతకు ముందు న్యూఇయర్ సందేశాన్ని విడుదల చేసిన ఆయన.. 2026లో ప్రతి ఇంటా సుఖ శాంతలు వెల్లివిరియాలని, ఈ ఏడాది ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందం నింపాలన్నారు. అందరు ఆరోగ్యంగా ఉండాలని.. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికీ దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని ఆకాక్షించారు. -
కొత్త ఏడాదిలో అవన్నీ సాగవు : గుర్తిస్తే కఠిన చర్యలు
మస్కట్: వర్క్ పర్మిట్లు, వృత్తిపరమైన లైసెన్స్, సర్టిఫికెట్లపై ఒమన్ దేశం కీలక హెచ్చరికలు జారీ చేసింది. నకిలీ వర్క్ పర్మిట్లు, జాబ్ లైసెన్స్ పత్రాలను సమర్పిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. దీనికి సంబంధించి నకిలీని సర్టిఫికెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయని కార్మిక మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే కొత్త సంవత్సరంలో నిబంధనలను కఠినతరం చేసింది. ఫేక్ సర్టిఫికెట్లు, కాపీలు లాంటి చర్యలు చట్టాలు, నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని, కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఒమన్‌లో పని అనుమతులు (వీసాలు) పునరుద్ధరించడానికి, కొత్త ఉద్యోగాలలోకి ప్రవేశించడానికి, సంబంధిత రంగాలలో వృత్తిపరమైన వర్గీకరణ సర్టిఫికెట్లు, వృత్తిపరమైన అభ్యాస లైసెన్స్‌లను సమర్థ అధికారుల (సెక్టోరల్ స్కిల్స్ యూనిట్లు) నుండి పొందాలని స్పష్టం చేసింది.అదే సమయంలో, అన్ని ఉద్యోగులు, కంపెనీలు ఈ పత్రాలు జారీ చేసే క్రమంలో వాటి ప్రామాణికతను ధృవీకరించాల్సిన బాధ్యత ఉందని తెలిపింది. ఏదైనా అనధికార పత్రాలను ఉపయోగించకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రొఫెషనల్ వర్గీకరణ సర్టిఫికేట్ , వృత్తిని అభ్యసించడానికి లైసెన్స్ ముఖ్యమైనవి. ఉద్దేశించిన వృత్తికి సంబంధిత వ్యక్తి సుముఖత , అర్హతను ధృవీకరించడం, వృత్తిపరమైన సామర్థ్యం , పనితీరు ప్రమాణాలను నిర్ధారించడం, కార్మిక మార్కెట్‌ను నియంత్రించడం వృత్తిపరమైన ప్రమాణాలను నిర్ధారించడమే దీని లక్ష్యంమని పేర్కొంది. నకిలీ లేదా తప్పుడు పత్రాన్ని సృష్టించడం నేరస్థుడిపై చట్టపరమైన చర్యలకు దారితీసుకుంటామని హెచ్చరించింది. చట్టాలని లోబడి జరిమానా, ఇతర చర్యలుంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. -
ఆ గ్రామంలో న్యూ ఇయర్ వేడుకలు ఎలా జరుగుతాయంటే..!
కొద్దిసేపటిలో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ తరుణంలో నగరాలు, పట్టణాలు ఏ రేంజ్లో సందడిగా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. ఎటు చూసిన ఆధునిక హంగులతో, డీజే మోతలతో అదరహో అనిపించే రేంజ్లో దద్దరిల్లిపోతాయి. అయితే ఈ గ్రామంలోని న్యూ ఇయర్ వేడుకలు నాటి కాలంలోకి, మరుపురాని జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లిపోయేలా అత్యంత సంప్రదాయబద్ధంగా జరుపుకుంటోంది. ఏఐ టెక్నాలజీతో దూసుకుపోతున్న ఈ కాలంలో ఇలా న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవడం అస్సలు చూసుండరు. ముఖ్యంగా పర్యాటకులను సైతం ఆకర్షించేలా న్యూ ఇయర్ వేడుకలుకు అత్యంత ముగ్ధమనోహరంగా సిద్ధమైంది ఆ గ్రామం.ఆ గ్రామమే మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లా దేవ్‌గఢ్ గ్రామం ప్రత్యేక గ్రామీణ నేపథ్యంతో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉంది. అక్కడ మధ్యప్రదేశ్ పర్యాటక బోర్డు పర్యాటకుల్ని ఆకర్షించేలా ఇలా విన్నూతన మార్గంలో నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. అక్కడ మూడురోజులు పాటు న్యూ ఇయర్ వేడుకలు అత్యంత సంప్రదాయబద్ధంగా అంగరంగ వైభవంగా జరగనున్నాయిఆ మూడు రోజుల కార్యక్రమాల్లో గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించడమే ధ్యేయంగా సంప్రదాయ భారతీయ ఆటలు, విందు వినోదాలను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా నాటి అనుభవాలను పునరుద్ధరించడమే లక్ష్యంగా ఇలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది.ఎలా జరుగుతాయంటే..సందర్శకులు గాలిపటం ఎగరవేయడం, స్కిప్పింగ్(తాడాట), కర్రబిళ్ల, పిట్టు, గోళీలు, లట్టు, ఎద్దుల బండి సవారీలు, వంటి నాటి జ్ఞాపకాలు గుర్తుకుతెచ్చేలా సాంస్కృతిక కార్యకలాపాలతో అలరించనుంది. అక్కడ సుందరమైన పరిసరాల మధ్య ఈ ఏర్పాట్లు చేశారు పర్యాటక నిర్వాహకులు. ముఖ్యంగా నారింజ తోటలలో టీ ఆస్వాదిస్తూ..ఈ ఆటపాటల్లో ఆడిపాడి సందడి చేయొచ్చు. అయితే ఈ ఆటల్లో పాల్గొనడం, ఎంజాయ్ చేయడం అన్ని ఉచితమేనట. ఇది కేవలం సందర్శకులకు గ్రామీణ జీవితాన్ని పరిచయం చేస్తూ..అందులో లీనమయ్యేలా చేయడమే లక్ష్యంగా ఈ న్యూ ఇయర్‌ని వేడుకలను ఇలా అసాధారణమైన రీతిలో జరుపుతోంది అక్కడి ప్రభుత్వం. దీన్ని అక్కడి పర్యాటక బోర్డు, జిల్లా పురావస్తు పర్యాటక శాఖ, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా సాంస్కృతిక ప్రదర్శనలు, స్థానిక క్రీడా పోటీలను పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం 2026ని స్వాగతించడానికి అసాధారణమైన సాంస్కృతిక మార్గాన్ని ఎంచుకుని పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షించనుంది.చరిత్రకు, ప్రకృతికి నెలవైన గ్రామందేవ్గఢ్ ఒకప్పుడు 18వ శతాబ్దంలో గోండ్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఈ ప్రాంతంలో ఇప్పటికీ పురాతన దేవాలయాలు, కోటలు, సుందరమైన బెత్వా నది ఉన్నాయ. ఇవి చారిత్రక సహజ సౌందర్యాన్ని అందిస్తాయి. పర్యాటకులకు సాంప్రదాయ ఆతిథ్యంతో స్వాగతం పలుకుతూ..దీనిని ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక విహార కేంద్రంగా మార్చే యోచనలో ఉండి అయక్కడ యంత్రాంగం. (చదవండి: గాంధీ కుటుంబం మెచ్చే రణతంబోర్ నేషనల్ పార్క్..! అక్కడ న్యూ ఇయర్‌కి..) -
దుబాయ్‌లో ఉంటున్నారా..? అయితే ఇది మీకోసమే?
న్యూ ఇయర్- 2026 దుబాయ్‌లో ఉండే వారికి షాక్ ఇవ్వనుంది. ప్రపంచ వ్యాప్తంగా దుబాయ్ వచ్చే వారి సంఖ్య విపరీతంగా పెరిగడంతో అక్కడ అద్దెలు ఈ ఏడాది గరిష్ఠంగా పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాటితో పాటు విల్లాలు, ప్లాట్ల రేట్లు కూడా అధికంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. దుబాయ్ అంటే కాస్లీ లైఫ్‌కు పెట్టింది పేరు. ఆ నగరం కేవలం టూరిస్ట్ స్పాట్‌గానే కాకుండా షాపింగ్ కాంప్లెక్స్‌లు, సాంస్కృతిక వైభవం, సైక్యూరిటీ తదితర కారణాల రీత్యా దుబాయ్‌కి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు క్యూ కడుతుంటారు. ఈ నేపథ్యంలో 2026లో అక్కడి భవనాల అద్దెరెట్లు దాదాపు ఆరుశాతం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. పామ్ జుమేరా, దుబాయ్ హిల్స్, డౌన్‌టౌన్, దుబాయ్ మెరీనా వంటి ప్రాంతాలలో నివసించడానికి విదేశీయులు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారని అందుచేత అక్కడ అద్దెలు ఈ ఏడాది మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. వీటితో పాటు సాధారణ ప్రాంతాలలో అద్దెలు సైతం గణనీయంగా పెరుగుతుండడంతో ఆ ప్రాంతంలో నివసిస్తున్న మధ్యతరగతి ప్రజలకు వీటిని చెల్లించడం అధిక భారంగా ఉండనున్నట్లు పేర్కొన్నారు.వీటితో పాటు గోల్డెన్ వీసా హోల్డర్లు, విదేశీ నిపుణుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో పాట్లు, విల్లాల అమ్మకాలకు అధిక డిమాండ్ ఏర్పడనున్నట్లు తెలిపారు. -
ఫుల్ ఫోకస్ లో ఉన్నాం ఏం చేయాలో అది చేస్తాం..
-
సోషల్ మీడియాలో ‘ఫైనల్ ఇమేజ్- 2025’ హంగామా
ఈ రోజు(డిసెంబర్ 31, బుధవారం)తో 2025 ముగియబోతోంది. దీంతో ఈ ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలికే క్రమంలో, సోషల్ మీడియా వేదికలలో కొత్త ఉత్సాహం పెల్లుబుకుతోంది. ప్రతి ఏటా జనవరి ఒకటిన శుభాకాంక్షలు చెప్పుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి నెటిజన్లు ఒక వినూత్నమైన ట్రెండ్‌ను తెరపైకి తెచ్చారు. అదే ‘ఫైనల్ ఇమేజ్ ఆఫ్ 2025’ (2025 చివరి చిత్రం). పాత జ్ఞాపకాలను పదిలపరుచుకుంటూ, ఈ ఏడాదిలో తాము దిగిన ఆఖరి ఫోటోను షేర్ చేస్తూ, నెటిజన్లు సందడి చేస్తున్నారు.ఈ వైరల్ ట్రెండ్ ప్రధానంగా ‘ఎక్స్’, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తదితర ప్లాట్‌ఫారమ్‌లలో విరివిగా కనిపిస్తోంది. యూజర్స్ తమ వ్యక్తిగత ఫోటోలు, కుటుంబ సభ్యులతో దిగిన చిత్రాలు లేదా ప్రకృతి దృశ్యాలను ‘My Final Image of 2025’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పలువురు ఈ ట్రెండ్‌లో భాగస్వాములవుతున్నారు. గడిచిన ఏడాదిలో తాము సాధించిన విజయాలను, ఎదుర్కొన్న సవాళ్లను గుర్తు చేసుకుంటూ ఈ ఫోటోలను షేర్ చేయడం విశేషం.ఈ ట్రెండ్ కేవలం ఫోటోల షేరింగ్‌కే పరిమితం కాలేదు. ఇది నెటిజన్లలో ఒక రకమైన భావోద్వేగ అనుబంధాన్ని పెంచుతోంది. ఒక వైపు ఈ ఏడాది ముగిసిపోతున్నదనే బాధ, మరోవైపు కొత్త ఏడాదిపై ఉన్న ఆశలు.. ఈ పోస్ట్‌లలో ప్రతిబింబిస్తున్నాయి. లక్షలాది మంది ఈ ట్రెండ్‌ను అనుసరించడంతో సోషల్ మీడియా సర్వర్లు బిజీగా మారాయి. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, భవిష్యత్తుపై సానుకూల దృక్పథాన్ని నింపడంలో ఈ చిన్న ప్రయత్నం పెద్ద ప్రభావాన్నే చూపుతోంది.ఇలాంటి ట్రెండ్స్ సోషల్ మీడియాలో సరదాను నింపుతున్నప్పటికీ, వ్యక్తిగత గోప్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫోటోలను షేర్ చేసేటప్పుడు లొకేషన్ వివరాలు లేదా సున్నితమైన సమాచారం బయటపడకుండా చూసుకోవడం ముఖ్యం. ఏదిఏమైనప్పటికీ 2026 నూతన సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పేందుకు ప్రపంచమంతా సిద్ధమైంది.ఇది కూడా చదవండి: ఎయిర్వేస్లో జాత్యహంకారం? .. ప్రయాణికురాలి మండిపాటు -
2025కి గుడ్‌బై.. 2026కి హెల్తీ వెల్కమ్
2025కు గుడ్‌బై పలికేశారా? కొత్త ఏడాదికి స్వాగతం అనేస్తున్నారా?. ఓకే.. గుడ్. 2026లో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారా?.. అయితే ఈ ఈజీ టిప్స్ మీకోసమే. 2025లో శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితాలివి! ఆలస్యమెందుకు?.. చదివేయండి.. తెలివిగా తినండి.. గుండె ఆరోగ్యంతోపాటు మన జీర్ణక్రియ సక్రమంగా ఉండేందుకు, నిద్ర, మూడ్ సమస్యలు అధిగమించేందుకు, రకరకాల నొప్పుల నుంచి ఉపశమనం కోసం కొంచెం తెలివిగా తినాలని, తాగాలని 2025లో జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ తినడం ఎలా ఉండాలంటే.. ➡️వారంలో ఒకటి నుంచి ఆరు వరకూ కోడిగుడ్లు తినడం గుండెజబ్బులతో చచ్చిపోయే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వారికీ కూడా ఇది వర్తిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగని అతిగా తినడం మంచిది కాదు.➡️అధిక రక్తపోటు నుంచి తప్పించుకునేందుకు ఉప్పు తినడం తగ్గించడం కాకుండా.. ఆహారంలో మరింత పొటాషియం ఉండేలా చూసుకోవడం మేలు. అరటిపండ్లు, ఆప్రికాట్స్, చిలగడదుంపల్లో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది.పొటాషియం అధికంగా ఉండేవి.. • అరటిపండ్లు• ఆప్రికాట్స్ (జారదాలు)• చిలగడదుంపలు (Sweet potatoes)• పాలకూర, గోంగూర, కూరగాయలు• బీన్స్, పప్పులు• కొబ్బరి నీరు• కలబంద (Avocado)గమనిక.. కిడ్నీ సమస్యలు ఉన్నవారు అధిక పొటాషియం తీసుకోవడం ప్రమాదకరం కావొచ్చు. కాబట్టి, నిపుణుల సలహా తీసుకుని ఆహారంలో పొటాషియం బ్యాలెన్స్ తప్పకుండా చూసుకోవాలి➡️రోజంతా కూర్చునే ఉంటున్నారా? అయితే మీ రక్తనాళాలను కాపాడుకోవాలంటే... కోకోలోని ఫ్లేవనాల్స్ బాగా ఉపయోగపడతాయి. ఇవి ‘సిట్టింగ్ డిసీజ్’తో వచ్చే సమస్యల తీవ్రతను తగ్గిస్తాయి. పరిశోధనల ప్రకారం.. రోజుకు కోకో పౌడర్ లేదా డార్క్ చాక్లెట్ (70% పైగా కోకో ఉన్నది) తీసుకోవడం రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఫ్లేవనాల్స్ రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచి, రక్తనాళాలను సడలిస్తాయి. దీని వల్ల రక్తప్రవాహం పెరుగుతుంది, గుండెజబ్బుల ప్రమాదం తగ్గుతుంది.ఎలా తీసుకోవాలంటే.. డార్క్ చాక్లెట్ (చక్కెర తక్కువగా ఉండే)కోకో పౌడర్ (unsweetened)కాకా నిబ్స్కోకో డ్రింక్స్ (చక్కెర లేకుండా)అధిక చక్కెర, పాలు కలిపిన చాక్లెట్ తీసుకుంటే ప్రయోజనం తగ్గిపోతుంది.మితంగా తీసుకోవాలి (రోజుకు 10–20 గ్రాముల డార్క్ చాక్లెట్ సరిపోతుంది).కొన్ని రకాల కొవ్వులు కేన్సర్ కణితులతో మన రోగ నిరోధక వ్యవస్థ పోరాడే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అయితే మొక్కల ఆధారిత కొవ్వులు (plant-based fats) అలాంటి ప్రతికూల ప్రభావం చూపవు. మంచి కొవ్వులు• ఆలివ్ ఆయిల్• కొబ్బరి నూనె• పామ్ ఆయిల్ (మితంగా)• అవకాడో, డ్రైఫ్రూట్స్👆 ఇవి ఇమ్యూన్ సిస్టమ్‌ను దెబ్బతీయవు. కొన్ని సందర్భాల్లో యాంటీ-ఇన్ఫ్లమేటరీ ప్రభావం చూపుతాయి.➡️మలబద్ధకాన్ని తొలగించేందుకు పీచు పదార్థం ఎక్కువగా ఉన్న పండ్లు ఉపయోగపడతాయి. అయితే కీవీ పండ్లు ఈ జాబితాలో తొలిస్థానంలో ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.➡️ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులతోపాటు, శాఖాహార ప్రధానమైన మెడిటరేనియన్ ఆహారం ఐబీఎస్ (ఇరిటెబుల్ బౌల్ సిండ్రోమ్) సమస్యను తగ్గిస్తుంది.➡️అరటి పండు స్మూతీల్లో వాడే పదార్థాల్లోని మంచి పోషకాలు సరిగ్గా జీర్ణం కానివ్వదు. అరటిలో సహజంగా ఉన్న పోషకాలు, ఇతర పదార్థాల కలయిక వల్ల శరీరానికి పూర్తిగా అందకపోవచ్చు. కాబట్టి.. అరటితో పాలు / బాదం పాలు(ప్రోటీన్, కాల్షియం అందిస్తాయి), పీనట్ బట్టర్ / బాదం బట్టర్ (ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ అందిస్తుంది), ఓట్స్ (ఫైబర్, శక్తినిస్తుంది), కాకా పొడి (unsweetened cocoa) యాంటీఆక్సిడెంట్లు, చియా సీడ్స్ / ఫ్లాక్స్ సీడ్స్ (ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు), బెర్రీలు (స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ) (విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు), తేనె / ఖర్జూరం (సహజమైన తీపి) అందిస్తాయి. అలాగే.. అరటితో కలపకూడనివి కొన్ని ఉన్నాయి. సిట్రస్ ఫలాలు (కమలపండు, మొసంబి, నిమ్మ) వీటివల్ల ఆమ్లత్వం(యాసిడిటీ) పెరిగి అరటిలోని పోషకాలు శోషణ తగ్గుతుంది. అధిక చక్కెర / ఐస్‌క్రీమ్ వల్ల ఫైబర్ దక్కకపోగా.. విటమిన్ ప్రయోజనం తగ్గిపోతుంది.ప్రాసెస్డ్ ప్రోటీన్ పౌడర్ల వల్ల కొన్ని సందర్భాల్లో జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. చాక్లెట్ సిరప్ (అధిక చక్కెర) సహజంగానే పోషకాలను తగ్గిస్తుంది. కాఫీ / టీ పొడి చేరిస్తే.. ఐరన్, కాల్షియం శోషణకు ఆటంకం కలుగుతుంది. ➡️చక్కెరల కంటే కృత్రిమ చక్కెరలతో కూడిన పానీయాలు మధుమేహం వచ్చే అవకాశాలను ఎక్కువ చేస్తాయి. కాబట్టి ఆ రకమైన పానీయాలు తీసుకోకపోవడం మేలు.పునరుత్తేజానికి వ్యాయామం..సరైన నిద్ర + సరైన వ్యాయామం= ఆరోగ్యం. అయితే హై-ఇంపాక్ట్ వ్యాయామాలు (జంపింగ్, రన్నింగ్) కీళ్ల సమస్యలు పెంచే అవకాశం ఉంది. కాబట్టి నడక, సైక్లింగ్, ఈత వంటివి మేలు. సుఖ నిద్రతో మన వ్యాయామ అలవాట్లు మెరుగవుతాయి. అయితే.. సాయంత్రాలు వ్యాయామం చేయడం అంత మంచిదేం కాదు. హృదయ స్పందన, శరీర ఉష్ణోగ్రత పెరిగి నిద్రకు భంగం కలగొచ్చు. నిద్రను నిర్లక్ష్యం చేస్తే వ్యాయామం ప్రయోజనం తగ్గిపోతుంది. కాబట్టి.. నిద్రకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. ఒకవేళ సాయంత్రమే చేసే వీలుంటే గనుక.. తేలికపాటి వ్యాయాయాలు (నడక, యోగా, స్ట్రెచింగ్) చేసుకోవచ్చు. ఇవి నిద్రకు ఆటంకం కలిగించవు.మానసిక సంతోషానికి.. జీవనశైలిలోని చిన్న చిన్న అలవాట్లు మన మానసిక ఆరోగ్యంపై, పనితీరుపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. తాజా పరిశోధనలు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తెచ్చాయి.క్రియాటిన్ సాధారణంగా కండరాల శక్తి పెంపు కోసం ఉపయోగించే పోషక పదార్థం. కానీ, ఇది మెదడు శక్తి వినియోగాన్ని మెరుగుపరచడంతో పాటు డిప్రెషన్ (మనోవ్యాకులత) చికిత్సలో సహాయక పాత్ర పోషిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అదెలాగంటే.. క్రియాటిన్ తీసుకోవడం వల్ల మెదడు కణాలు శక్తిని సమర్థవంతంగా వినియోగించుకుంటాయి, ఫలితంగా మూడ్ స్థిరంగా ఉండేలా చేసి చికిత్సలో మెరుగైన ఫలితాన్ని చూపిస్తుంది. తిట్టుకోవడం.. పనితీరు పెంపుతిట్టుకోవడం అనేది.. ప్రతికూలంగా భావించే అంశమే. కానీ.. శాస్త్రవేత్తలు చెబుతున్నది ఏమిటంటే తీవ్ర ఒత్తిడి లేదంటే కష్టమైన పనిలో మనల్ని మనం కాస్త ఘాటు పదాలతో తిట్టుకోవడం వల్ల శరీరం ఎక్కువ శక్తి ఇస్తుంది. ఇది నొప్పి తట్టుకునే సామర్థ్యాన్ని పెంచి.. పనితీరు మెరుగుపరుస్తుంది. క్రీడల్లో, కఠినమైన వ్యాయామాల్లో ఇది సహజ రీతిలో కనిపించే అంశమే.ఉదయాన్నే కాఫీ.. మూడ్ మెరుగుదలకాఫీలోని కెఫిన్ మెదడులో డోపమైన్, సెరోటోనిన్ వంటి రసాయనాల స్థాయిని పెంచుతుంది. ఫలితంగా, రోజంతా ఉత్సాహం, ఏకాగ్రత, మూడ్ మెరుగుపడతాయి. ఉదయం ఒక కప్పు కాఫీ తాగడం వల్ల పనితీరు పెరిగి, జీవనశైలి ఉల్లాసంగా ఉంటుంది. ఇది మేం చెబుతున్నమాట కాదు.. పరిశోధనల్లో తేలిన అంశమే.


