New Year 2026: రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ శుభాకాంక్షలు | President Droupadi Murmu, PM Modi And Rajnath Singh Extend New Year 2026 Greetings To The Nation, Check Posts Inside | Sakshi
Sakshi News home page

New Year 2026: రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ శుభాకాంక్షలు

Jan 1 2026 9:30 AM | Updated on Jan 1 2026 9:48 AM

President Murmu PM Modi extend greetings on New Year

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 2026 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో సుఖశాంతులను, అభివృద్ధిని నింపాలని వారు ఆకాంక్షించారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వారు ప్రత్యేక సందేశాలను అందించారు.
 

అభివృద్ధి దిశగా అడుగులు: రాష్ట్రపతి ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సందేశంలో 2026 సంవత్సరం సానుకూలతకు, నూతన శక్తికి చిహ్నమని పేర్కొన్నారు. ఈ ఏడాది దేశానికి మరిన్ని గొప్ప అవకాశాలను అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మనం మన దేశం, సమాజ శ్రేయస్సు,  పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండాలి. 2026 అందరి జీవితాల్లో శ్రేయస్సును తీసుకురావాలని కోరుకుంటున్నాను. అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో మనమందరం భాగస్వాములం అవుదాం’ అని ఆమె పిలుపునిచ్చారు.

ఆరోగ్యం, విజయం సిద్ధించాలి: ప్రధాని మోదీ 
ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే ఏడాది అందరికీ మంచి ఆరోగ్యాన్ని, శ్రేయస్సును అందించాలని ఆయన ప్రార్థించారు. ‘ప్రతి ఒక్కరికీ విజయం లభించాలని, వారు చేసే పనుల్లో సంతృప్తి కలగాలని కోరుకుంటున్నాను. మన సమాజంలో శాంతి, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ప్రధాని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

రైతు సంక్షేమమే లక్ష్యం: కేంద్ర మంత్రులు
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన ట్వీట్‌లో.. 2026వ సంవత్సరం ప్రగతి, సామరస్యం, అచంచలమైన జాతీయ భావనలతో నిండి ఉండాలని ఆశించారు. ఆవిష్కరణలు, స్వావలంబన ద్వారా భారతదేశ భద్రతను మరిత బలోపేతం చేయడానికి అందరూ కలిసి పనిచేయాలని ఆయన కోరారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. అందరికీ శాంతి, పురోగతి కలగాలని ఆకాంక్షించగా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రతి రైతు ఇల్లు, వాకిలి.. సంపద, ధాన్యాలతో కళకళలాడాలని, అందరి జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

ఇది కూడా చదవండి: 2026లో తొలి సూర్యోదయం.. ఢిల్లీ నుంచి పూరీ వరకూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement