న్యాయమూర్తిపై కత్తి విసిరిన యువకుడు | Shocking Incident, Man Attacks Judge Inside Tamil Nadu Court After Verdict With Knife, Photo Circulating In Internet | Sakshi
Sakshi News home page

Shocking Incident: న్యాయమూర్తిపై కత్తి విసిరిన యువకుడు

Feb 17 2026 1:21 PM | Updated on Feb 17 2026 1:34 PM

Shocking! Man Attacks Judge Inside Tamil Nadu Court After Verdict

తమిళనాడు: తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారన్న ఆగ్రహంతో ఓ యువకుడు న్యాయమూర్తిపైనే కత్తి విసిరిన ఘటన తమిళనాడులో సోమవారం చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు ఆ కత్తి న్యాయమూర్తికి తగలలేదు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లా శ్రీవిల్లిపుత్తూరు సమీపంలో సెంగుళం ప్రాంతానికి చెందిన బాలమురుగన్, తంగామునీశ్వరి దంపతుల మధ్య విభేదాల కారణంగా విడాకులు కోరుతూ గత ఏడాది కోర్టును ఆశ్రయించారు. 

విచారణ పూర్తయిన నేపథ్యంలో న్యాయమూర్తి సుధాకర్‌ సోమవారం తీర్పును చదివి వినిపించారు. ఆ తర్వాత విడాకుల కేసుకు సంబంధించి భార్యకు భరణం చెల్లించాలని బాలమురుగన్‌ను ఆదేశించారు. ఇది విన్న బాలమురుగన్‌ నిరసన వ్యక్తం చేస్తూ అరిచాడు. అక్కడితో ఆగకుండా వెంట తెచ్చుకున్న కత్తిని న్యాయమూర్తిపైకి విసిరాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement