చెన్నైలోనూ వైఎస్ జగన్ ప్రభంజనం | Ys Jagan Craze In Chennai | Sakshi
Sakshi News home page

చెన్నైలోనూ వైఎస్ జగన్ ప్రభంజనం

Feb 7 2026 5:55 PM | Updated on Feb 7 2026 7:24 PM

Ys Jagan Craze In Chennai

చెన్నై: చెన్నైలోనూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్రేజ్‌ మాములుగా లేదు. తన బంధువు కుమారుడి  వివాహ వేడుకలో పాల్గొనేందుకు వైఎస్‌ జగన్‌ చెన్నై వెళ్లారు. వైఎస్‌ అనిల్‌రెడ్డి (వైఎస్‌ జగన్‌ పెదనాన్న వైఎస్‌ జార్జిరెడ్డి కుమారుడు) కుమారుడు సాహిల్ వివాహం సందర్భంగా జరుగుతున్న వేడుకలో పాల్గొనేందుకు వైఎస్‌ జగన్‌ చెన్నై వచ్చారు.

రేపు ( ఫిబ్రవరి 8, ఆదివారం) ఉదయం సాహిల్‌, వేదికల వివాహం జరగనుంది. ఇంజంబాక్కం విజిపీ లేఅవుట్‌లో వైఎస్‌ జగన్‌ను కలిసేందుకు పెద్ద ఎత్తున వచ్చిన అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. వారికి వైఎస్‌ జగన్‌ అభివాదం చేశారు.

రాజు ఎక్కడున్నా రాజే.. చెన్నైలో వైఎస్ జగన్ ప్రభంజనం

Advertisement
 
Advertisement
Advertisement