ఢిల్లీ: ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ‘కీ స్పీకర్స్’ జాబితా నుంచి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ పేరును కేంద్రం తొలగించినట్లు సమాచారం. బాధితుల పక్షాన నిలబడేందుకే బిల్ గేట్స్‌కు నో ఎంట్రీ అంటూ కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బిల్ గేట్స్‌పై ఆరోపణల నేపథ్యంలో ఆహ్వానంపై కేంద్ర ప్రభుత్వం పునస్:సమీక్ష జరిపినట్లు సమాచారం. బిల్ గేట్స్ వివాహేతర సంబంధాలకు ఎప్‌స్టీన్ సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి.
డ్రగ్స్, చిన్నారులు, వివాహితులపై లైంగిక సంబంధాలు పెట్టుకున్నారని బిల్‌గేట్స్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, బిల్‌గేట్స్‌పై ఏఐ ఇంపాక్ట్ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుంది. ఎక్స్‌లో ప్రముఖ జర్నలిస్ట్ సుహాసిని హైదర్ పలు సందేహాలు లెవనెత్తారు. మరోవైపు, ఎప్‌స్టీన్ ఫైల్స్ వివాదంలో చిక్కుకున్న బిల్ గేట్స్‌కు బిల్ గేట్స్‌కు చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్ ఎదురెళ్లి స్వాగతం పలకడం ప్రజల నుంచి ఆగ్రహ వ్యక్తమవుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన బిల్‌గేట్స్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కూటమి పాలకుల తీరుపై కూడా నెటిజన్లు పంచ్‌లు వేస్తున్నారు. చిన్నారులను లైంగికంగా వాడుకున్నారన్న కేసులో దోషిగా ఎప్‌స్టీన్ ఉన్నారు. రష్యన్ గర్ల్సతో బిల్‌గేట్స్ లైంగిక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు నేపథ్యంలో బిల్‌గేట్స్‌కు మిలిండా గేట్స్ విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. బిల్‌గేట్స్ తన పొడ్రక్ట్స్‌కు భారత్ ల్యాబ్‌గా వాడుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఇదీ చదవండి: ట్రెండింగ్‌లో బిల్‌గేట్స్ క్విట్ ఇండియా హ్యాష్‌టాగ్
లైంగిక నేరాల కేసులో దోషిగా తేలిన లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ కుంభకోణానికి సంబంధించిన తాజా ఫైల్స్‌లో అనేక ప్రముఖుల పేర్లు ఉండటం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఎప్‌స్టీన్ ఫైల్స్ పేరుతో 2,000 వీడియోలు, 1,80,000 చిత్రాలతో సహా 30 లక్షలకు పైగా పేజీల పత్రాలను ఆమెరికా న్యాయ శాఖ విడుదల చేసింది. బిల్ గేట్స్‌పై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.


