ఓవైపేమో తమ దేశాన్ని ఒక ప్రయోగశాలగా తమ ప్రజలని బలిపశువులుగా అభివర్ణించారని బిల్‌గేట్స్‌పై సామాజిక మాద్యమాలలో "బిల్‌గేట్స్ క్విట్ ఇండియా" అని నిరసన ప్రదర్శనలు జరుగుతుంటే.. మరోవైపేమో కూటమి ప్రభుత్వం ఆయనకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలకడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. తమ జాతిని తమ ప్రజలను అవమానించిన వారికి ఇంత రాచ మర్యాదలు చేయాల్సిన అవసరం ఏంటని సర్వత్రా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
కొంతమందికి ప్రజల ప్రాణాలన్నా..వారి మనోభావాలన్నా లెక్కే ఉండదు. వారికి కావాల్సింది సంపన్నులకు కొమ్ముకాయడం.. వారిని బుట్టలో వేసే యత్నం చేయడం అంతే.. తాజాగా కూటమి ప్రభుత్వం చేసే పని దానికే నిదర్శనంగా నిలుస్తోంది. ఓవైపేమో తమ దేశాన్ని పేద ప్రజలని అవమానించిన వ్యక్తిని.. బిల్‌గేట్స్ క్విట్ ఇండియా అని దేశంలోకి రావద్దంటూ నిరసన ప్రదర్శనలు జరుగుతుంటే.. ఆంధ్రప్రదేశ్‌లోనేమో కూటమి నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
నిరసన ఎందుకు..?
గతంలో ఓ సందర్భంలో భారత్‌పై బిల్‌గేట్స్ తీవ్ర అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ఇండియాని ఓ ప్రయోగశాలగా వాడవచ్చని అన్నారు. ఆ దేశంలో ఎటువంటి ప్రయోగాలయినా చేసుకోవచ్చని తెలిపారు. అంటే ఇక్కడి మట్టికి గానీ ప్రజలకు గానీ ఆయన విలువనివ్వలేదు. ఏటువంటి ప్రయోగాలకైనా వీరిని వాడుకోవచ్చనే ఉద్దేశంలో ఆయన మాట్లాడారు. దీంతో ఈ అంశం నెట్టింట్లో తీవ్రంగా ట్రోలయింది. బిల్‌గేట్స్ క్విట్ ఇండియా అంటూ హ్యాష్‌ట్యాగ్ ట్రెండయ్యింది.
ఐదుగురు పిల్లల మృతి
ఇదిలా ఉంచితే 2009లో మెలిండా ఫౌండేషన్ సహాకారంతో రూపొందించిన HPV వ్యాక్సిన్ వికటించి ఖమ్మంలో ఐదుగురు చిన్నారులు మృతిచెందారు. మరెంతో మంది ఇతర సమస్యలతో బాధపడ్డారు. ఇది అప్పట్లో చాలా వివాదమైంది. అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు తిరిగి ఆ వ్యాక్సిన్ ప్రయోగానికి బిల్‌గేట్స్‌కు అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పిల్లల ప్రాణాలకు ఏమవుతుందా అనే ఆందోళన నెలకొంది.
ఎప్‌స్టీన్ ఫైల్స్
అయితే ఇటీవల ప్రపంచాన్ని కుదిపేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారంలోనూ బిల్‌గేట్స్ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయన రష్యన్ అమ్మాయిలతో నిద్రపోతున్నాడని లైంగిక సంక్రమణ వ్యాధుల బారిన పడ్డారని దీంతో తన భార్య మెలిండా గేట్స్‌కు రహస్యంగా ఇవ్వగల యాంటీ బయాటక్స్ కోసం అడుగుతున్నారని ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉంది. దీంతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ అంశం హాట్‌టాఫిక్‌గా మారింది.
ప్రపంచవ్యాప్తంగా ఇంత వ్యతిరేకత ఉండి, మాతృదేశాన్ని అవమానకరంగా మాట్లాడి, ప్రజల చేతిలో నిరసనకు గురువుతున్న వ్యక్తికి.. చంద్రబాబు ఇంత హైప్ ఇవ్వడం ప్రజలను ఆవేదనకు గురిచేస్తుంది.
In 2009, five children died in Khammam district in Telangana after the administration of the HPV vaccine. Many others suffered short and long term side effects.
Now @ncbn invites the same Bill Gates to continue his experiments on Indian children #BillGates_QuitIndia pic.twitter.com/CUKxXBv02i— Dee (@DeeEternalOpt) February 15, 2026
Even after knowing about the Bill Gates - Epstein files- Pandemic Connection, how can our people allow @BillGates to dictate tech, health, agriculture and digitisation policies in India? #BillGates_QuitIndia https://t.co/xiGeciMFhr pic.twitter.com/aXlhBLeFYr
— Awaken India Movement (@awakenindiamvmt) February 14, 2026


