యూరియా కోసం రైతులు ఆందోళన | Farmers Protest Against TDP Leaders Over Urea Shortage In Srikakulam District, More Details Inside | Sakshi
Sakshi News home page

యూరియా కోసం రైతులు ఆందోళన

Feb 16 2026 4:31 PM | Updated on Feb 16 2026 4:57 PM

Farmers Protest Over Urea Shortage in Srikakulam District

శ్రీకాకుళం: యూరియా కోసం సచివాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగిన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. గ్రామానికి వచ్చిన యూరియా టీడీపీ నేతలు తీసుకుని అక్రమంగా తరలిస్తున్నారంటూ గార మండలం వమరవల్లి పంచాయతిలోని రైతులు ఆందోళన బాట పట్టారు. యూరియాను  అందరికి సమానంగా అందజేయాలని కోరుతూ  గ్రామ సచివాలయం ఎదుట  రైతులు బైఠాయించార. యూరియాను అక్రమంగా తరలిస్తూ తమకు అందకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.

‘రైతులు కాని వారికి యూరియా ఇస్తున్నారు. టీడీపీ నాయకురాలు భవాని చెప్పిన వారికి మాత్రమే యూరియా ఇస్తున్నారు. అధికారులు కూడా టిడిపి నాయకులు చెప్పిన వారికే యూరియా ఇవ్వడం దారుణం. పాస్ బుక్ ప్రకారం యూరియా ఇమ్మని అడిగితే ఇవ్వడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement