మాలలు తీసేందుకు వెళ్తే.. అప్పికొండ శివాలయానికి తాళం! | Shiva Devotees Protest After Temple Authorities Lock Doors And Denied Access For Rituals At Appikonda, More Details | Sakshi
Sakshi News home page

మాలలు తీసేందుకు వెళ్తే.. అప్పికొండ శివాలయానికి తాళం!

Feb 16 2026 4:22 PM | Updated on Feb 16 2026 4:47 PM

Lock on Appikonda Shiva Temple Leaves Devotees Disheartened

విశాఖ : మాలలు తీసేందుకు అప్పికొండ శివాలయానికి వెళ్లిన శివస్వాములకు చేదు అనుభవం ఎదురైంది. శివస్వాములు మాలలు తీసేందుకు కనీస ఏర్పాట్లు చేయడాన్ని పక్కకు పెట్టిన అధికారులు.. ఏకంగా ఆలయానికే తాళాలు వేశారు. 41 రోజుల దీక్ష అనంతరం అప్పికొండ దేవాలయంలో మాలలు తీయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే శివ స్వాములు మాలలు తీయడానికి వెళ్తే ఆలయ అధికారులు శివాలయానికి తాళం వేసేశారు. 

దాంతో అధికారులు, పోలీసుల తీరుపై శివస్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాములకు కనీస సౌకర్యాలను కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని శివస్వాములు మండిపడుతున్నారు. ఆచారం ప్రకారం పూజలు చేసుకోనివ్వడం లేదని, దేవాదయ, పోలీస్‌ శాఖ వారు దుర్మార్గంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  అక్కడ ఏ అధికారి పర్యవేక్షిస్తున్నారో కూడా తెలియదని, ఈ విధంగా వ్యవహరించడం దారుణమని అధికారుల తీరును తప్పుబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement