ఛత్తీస్‌గఢ్‌లో హృదయవిధారకర ఘటన జరిగింది. తాము కంటికి రెప్పలా కాపాడి నవ మాసాలు పెంచి పెద్దచేసిన కుమారుడు అనంత లోకాలకు వెళ్లిపోయాడని ఆ తల్లిదండ్రులిద్దరూ ఆవేదనతో తల్లడిల్లిపోయారు. ఎంత ప్రయత్నించినా ఆ దుఃఖం నుంచి బయిటకీ రాలేకపోయారు. కుమారున్నే తలచుకుంటూ నిద్రలేని రాత్రులు గడిపారు. పుత్ర శోకం నుంచి బయిటికి రాలేక భార్యభర్తలిద్దరూ తనువు చాలించారు.
జంజీర్ చంఫా జిల్లాకు చెందిన కృష్ణా, రమాబాయిలకు ఒకే కుమారుడు అతని పేరు ఆదిత్యపటేల్. 2024లో ఆదిత్యా దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో అప్పటి నుంచి ఆయన తల్లిదండ్రులు డిఫ్రెషన్‌లోకి వెళ్లారు. ఎంత ప్రయత్నించినా కుమారుడిని మరిచి పోలేకపోవడంతో భార్యభర్తలిద్దరూ తనువు చాలిద్దామని నిర్ణయించుకున్నారు. దీంతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
చివరిసారిగా వారు లేఖలో "మా జీవీతం. మా పునాది, మా ప్రపంచం, అతనే మా కేర్ టేకర్ నా మిత్రుడు. ఆ రోజు బయిటకి వెళ్లనని తన కుమారుడు చెబితే తానే బలవంతంగా పంపాను అదే నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు" అని లేఖలో పేర్కొన్నారు. ఆ తర్వాత అతను ప్రపంచాన్నే వదిలాడు. మేము జీవిస్తున్నాం కానీ నిజానికి అలా లేదు అని లేఖలో రాసి తమ ఇంటి పెరడిలో భార్య భర్తలిద్దరూ ఉరి వేసుకొని మరణించారు.
ఇంతకాలం బాధతో రగిలిపోయిన తన హృదయం ఇప్పుడు ప్రశాంతత వైపు వెలుతుందని దేవుడు చాలా దయగలవారని ఆయన లేఖలో పేర్కొన్నారు. అయితే తన కుమారుడి ప్రమాదానికి వచ్చే పరిహారం దయచేసి తన సోదరుడికి అందజేయాలని లేఖలో పేర్కొన్నారు. వారిద్దరి మరణంతో ఈ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్‌మార్డం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


