మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. వేధింపులే కారణమా? | BJP municipal candidate commits suicide in Maktal | Sakshi
Sakshi News home page

మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. వేధింపులే కారణమా?

Feb 10 2026 9:45 AM | Updated on Feb 10 2026 10:54 AM

BJP municipal candidate commits suicide in Maktal

సాక్షి నారాయణ పేట:  మక్తల్‌లో విషాదం చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే  ఆత్మహత్యకు ప్రత్యర్థుల వేధింపులే కారణమని వారి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. మహదేవప్ప ఆరవ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. 

అయితే రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీన మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి తొమ్మిదిన సోమవారంతో ప్రచారం ముగిసింది. అయితే ప్రచారం చివరి రోజు సోమవారం ఎంపీ డీకే అరుణతో ప్రచారంలో పాల్గొన్న మహదేవ్.. అనంతరం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని ముందు నుంచే మహదేవ్‌పై ఒత్తిళ్లు ఉన్నాయని కుటుంబసభ్యులు తెలిపారు.

రేపు బుధవారం ఎలక్షన్‌ ఉండడంతో కొందరు వ్యక్తులు  బెదిరించడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. ప్రత్యర్థి అభ్యర్థుల బెదిరింపుల వల్లే ఇతను సూసైడ్‌ చేసుకున్నారా.. వేరే కారణం ఉందా అనే దానిపై దర్యాప్తు చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement