నా చావుకు భార్య, అత్తామామలే కారణం | Software Engineer Ends Life In Hyderabad | Sakshi
Sakshi News home page

నా చావుకు భార్య, అత్తామామలే కారణం

Feb 10 2026 7:35 AM | Updated on Feb 10 2026 11:53 AM

Software Engineer Ends Life In Hyderabad

హైదరాబాద్: తన చావుకు భార్య, అత్తా, మామలే కారణమంటూ ఓ వ్యక్తి హుస్సేన్‌ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన లేక్‌పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేకరు.. మార్కాపురానికి చెందిన సీతారాంరెడ్డి (36), రేణుక దంపతులు బాచుపల్లిలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్లు. గతంలో భార్య రేణుక ఇన్‌స్ట్రాగాంలో పరిచయమైన వ్యక్తితో ఇంట్లో నుంచి వెళ్లిపోయి కొద్దిరోజుల తరువాత వచ్చింది. అప్పటి నుంచి ఆమె ఇంట్లోనే ఉంటోంది. అయితే గత జనవరి నెల 24 న మళ్లీ అదృశ్యమైంది.

భార్య కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు బాచుపల్లికి వచ్చి ఇక్కడికే ఉంటున్నారు. అత్తామామలు ఆదివారం పిల్లలను తీసుకుని సొంత ఊరు నంద్యాలకు వెళ్లిపోయారు. తీవ్ర మనస్తాపానికి గురైన సీతారాంరెడ్డి ఆదివారం సాయంత్రం హుస్సేన్‌ సాగర్‌లో దూకాడు. సోమవారం ఉదయం నుంచి హైడ్రా, లేక్‌ పోలీసులు గాలించగా సాయంత్రం మృతదేహం బయటపడింది.  తన తన చావుకు భార్య, అత్తా, మామలతో పాటు రమణారెడ్డి అనే వ్యక్తి కారణం అని ఫోన్‌లో స్టేటస్‌ పెట్టుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్ప‌త్రిలోని మార్చురీకి తరలించారు.

చ‌ద‌వండి: వాడ్ని ఊరికే వ‌దిలిపెట్ట‌కండి

Advertisement
 
Advertisement
Advertisement