తల్లి నగ్నచిత్రాలు ప్రియుడికి..! | Daughter accused of secretly capturing mother private photos sharing with lover | Sakshi
Sakshi News home page

తల్లి నగ్నచిత్రాలు ప్రియుడికి..!

Feb 10 2026 4:42 AM | Updated on Feb 10 2026 4:42 AM

Daughter accused of secretly capturing mother private photos sharing with lover

బెంగళూరులో ఓ కూతురు నిర్వాకం 

పోలీసులకు ఫిర్యాదు  

సాక్షి బెంగళూరు: సోషల్‌ మీడియా, ప్రేమ మోజులో పడి కొందరు విపరీతాలకు పాల్పడుతున్నారు. సొంత తల్లి, పెద్దమ్మ నగ్న ఫొటో­లను రహస్యంగా తీసి వాటిని ప్రియుడికి పంపించిందో యువతి. బెంగళూరుకు చెందిన 49 ఏళ్ల మహిళ ఇచి్చన ఫిర్యాదు మేరకు కుమార్తె, ఆమె ప్రియుడు వరుణ్‌పై బ్యాటరాయనపుర పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సదరు మహిళకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె బీబీఎం చదువుతోంది. గతేడాది ఆమెకు మొబైల్‌ కొనిచ్చారు. నెల రోజులుగా అపరిచిత యువకుడితో ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు అనుమానం వచ్చింది. 

విషయాన్ని బయట పెట్టకుండా యువతి మొబైల్‌ పాస్‌వర్డ్‌ను తెలుసుకున్నారు. తర్వాత ఆ మొబైల్‌ను పరిశీలించగా అందులో యువతి తల్లి ప్రైవేటు ఫొటోలతో పాటు ఆమె సోదరి అక్క ఫోటోలను యువకుడికి పంపినట్లు గుర్తించింది. అనంతరం కుమార్తె నిర్వాకంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుమార్తె ప్రియుడు వరుణ్‌ ఆ ఫొటోలను పంపించాలని ఒత్తిడి చేసినట్లు గుర్తించారు. కొన్ని రోజుల క్రితం పెళ్లి అంటూ చేసుకుంటే తాను ప్రేమించిన యువకుడినే చేసుకుంటా అంటూ ఇంట్లో గొడవ పడి వెళ్లినట్లు కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ప్రైవేటు ఫొటోలను ఆ యువకుడు ఇతరులకు పంపించే అవకాశం ఉందని, ఈ క్రమంలో తన కుమార్తె, ఆమె ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది.

Advertisement
 
Advertisement
Advertisement