ఐఏఎస్‌ ఆఫీసర్‌... అంగన్‌ వాడి స్కూల్‌ | IAS officer Pulkit Garg sent his 3-year-old daughter to a local Anganwadi centre | Sakshi
Sakshi News home page

ఐఏఎస్‌ ఆఫీసర్‌... అంగన్‌ వాడి స్కూల్‌

Feb 6 2026 12:10 AM | Updated on Feb 6 2026 12:10 AM

 IAS officer Pulkit Garg sent his 3-year-old daughter to a local Anganwadi centre

సమ్‌థింగ్‌ స్పెషల్‌

‘ఐఏఎస్‌ ఆఫీసర్‌లు తమ పిల్లలను ఎలాంటి స్కూల్స్‌లో చదివిస్తారు?’ అనే ప్రశ్నకు సమాధానం అందరికీ తెలిసిందే. అయితే ఐఏఎస్‌ ఆఫీసర్, చిత్రకూట్‌ కలెక్టర్‌ పుల్కిత్‌ గార్గ్‌ ‘అందరు ఆఫీసర్‌లు ఒకేలా ఆలోచించరు’ అని నిరూపించారు

మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో తన మూడేళ్ల కుమార్తె సియాను ప్రభుత్వ అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పించారు. ‘ప్రభుత్వ విద్యావ్యవస్థ గతంలో మాదిరిగా లేదు. ఇప్పుడు చాలా మెరుగు పడింది. ఒక ఐఏఎస్‌ అధికారి తన బిడ్డను ప్రభుత్వ విద్యాసంస్థలలో చదివించగలిగినప్పుడు సామాన్యులెవరూ సంకోచించకూడదు. 

అంగన్‌వాడీ కేంద్రాలపై ఉన్న అభిప్రాయాలు మారాయని విశ్వసిస్తున్నాను’ అన్నారు గార్గ్‌.  ఈ సందర్భంగా బాల్యదశ అభివృద్ధి ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు, ఆరోగ్యం, పోషకాహారం... మొదలైనవి బిడ్డ ఎదుగుతున్న క్రమంలో ఎలా తీర్చిదిద్దుతాయో వివరించారు. ‘ప్రభుత్వ విద్యావ్యవస్థపై ఉన్న అపనమ్మకాన్ని వీడండి’ అని తల్లిదండ్రులను కోరారు. పుల్కిత్‌ గార్గ్‌పై సోషల్‌ మీడియాలో భిన్నాభిప్రాయాల మాట ఎలా ఉన్నా అత్యధికులు ఆయనను సమర్థించి ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement