చీర చూపించి పెళ్లి ఆహ్వానించిన ప్రియురాలు.. తట్టుకోలేక ప్రియుడి ఆత్మహత్య | Bodybuilder Dies After Girlfriend Engagement | Sakshi
Sakshi News home page

చీర చూపించి పెళ్లి ఆహ్వానించిన ప్రియురాలు.. తట్టుకోలేక ప్రియుడి ఆత్మహత్య

Feb 8 2026 5:51 PM | Updated on Feb 8 2026 5:58 PM

Bodybuilder Dies After Girlfriend Engagement

బెంగళూరు: వాళ్లిద్దరూ ప్రేమికులు. గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. త్వరలో ప్రేమికుల రోజుని ఘనంగా సెలబ్రేట్‌ చేసుకోవాలని అనుకున్నారు. ఇందుకోసం అబ్బాయి.. తన ప్రియురాలి కోసం ఖరీదైన గిఫ్ట్‌లు సైతం కొనుగోలు చేశాడు. కానీ అనూహ్యంగా అమ్మాయి వేరే యువకుడితో పెళ్లి సంబంధం కుదుర్చుకుంది. ‘త్వరలోనే నా పెళ్లి. నా పెళ్లికి నువ్వు రావాలి. ఇదిగో చూడు నా పెళ్లి నగలు, పెళ్లి చీర చూపించింది. ఆ పెళ్లి చీర చూసి తట్టుకోలేని ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పోలీసుల వివరాల మేరకు.. బెంగళూరులో కిరణ్‌ అనే యువకుడు బిల్డర్‌,జిమ్‌ ట్రైనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కిరణ్‌..ఓ యువతిని మూడేళ్లుగా ప్రేమిస్తున్నాడు. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోవాలని ప్లాన్‌ చేసుకున్నారు.

ఉన్నట్లుండి ఏమైందో ఏమో.. ఆ యువతి మరో యువకుడితో వివాహం చేసుకునేందుకు సిద్ధమైంది. ఆ విషయం తెలిసిన కిరణ్‌కు గుండె పగిలింది. తానెంతో గాఢంగా ప్రేమిస్తున్న యువతి మరో వ్యక్తిని వివాహం చేసుకుంటుందని తెలిసి తట్టుకోలేకపోయాడు. గత రెండు వారాలుగా మనిషి మనిషిలా లేడు. ఉల్లాసంగా,ఉత్సాహం ఉండే కిరణ్‌లో డిప్రెషన్‌ పెరిగింది.

ఈ క్రమంలో శనివారం రాత్రి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఆత్మహత్యకు ముందు పేపర్‌,పెన్ను కావాలని తల్లిని అడగ్గా.. ఎందుకు అని అనుమానంగా అడిగింది. ఆర్ధిక వివరాలు రాయాలని,పెన్ను,పేపర్‌ అడిగి తీసుకున్నాడు. అనంతరం ఇంటి గదిలోకి వెళ్లి సూసైడ్‌ లెటర్‌ రాశాడు. ప్రాణం తీసుకున్నాడు. గదిలోకి వెళ్లిన కిరణ్‌ ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది.

డోర్లు బలవంతంగా ఓపెన్‌ చేసి చూడగా.. తాడుకు వేలాడుతూ నిర్జీవంగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సూసైడ్‌ నోటీను స్వాధీనం చేసుకున్నారు.

అందులో తన చావుకు తాను ప్రేమించిన అమ్మాయి, ఆమె తల్లే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా యువతిని గాఢంగా ప్రేమిస్తున్నానని, ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. తనని సైతం పెళ్లికి  రావాలని, ఇందుకోసం కొనుగోలు చేసిన నగదు,దుస్తులు కిరణ్‌కి చూపించడంతో తట్టుకోలేని ప్రాణం తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement